ముంబై: మహారాష్ట్రలో దారుణం జరిగింది. 19 ఏళ్ల యువతిపై యోగిలాల్ (52) అనే వ్యక్తి అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. నాగ్‌పూర్‌లోని పర్ది ఏరియాలో జనవరి 21న చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. యోగిలాల్ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న స్పిన్నింగ్ మిల్లులో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. ఇదే మిల్లులో యోగిలాల్, బాధిత మహిళ, ఆమె సోదరుడితోపాటు మరో బాలిక కూలీలుగా పని చేస్తున్నారు. అయితే జనవరి 21న ఆమె సోదరుడు మరో అమ్మాయి తమ సొంత గ్రామానికి వెళ్లగా.. ఆ యువతి మాత్రమే పనికి వెళ్లింది.
పని పూర్తయిన వెంటనే ఒక్కతే ఒంటరిగా ఇంటికి వెళ్లింది.ఇదే అదనుగా భావించిన యోగిలాల్.. గదిలో ఒంటరిగా ఉన్న యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అంతేగాక మహిళపై ఇనుప రాడ్లతో దాడి చేసి.. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాతి రోజు ఇంటికి చేరుకున్న సోదరుడు ఆమె దీనస్థితిని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment