గణపవరంలో వైఎస్, రంగా విగ్రహాల ఆవిష్కరణ | ganapavaram YS Rajasekhara Reddy,Ranga statues innovation | Sakshi
Sakshi News home page

గణపవరంలో వైఎస్, రంగా విగ్రహాల ఆవిష్కరణ

Published Thu, Jan 30 2014 1:11 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

ganapavaram YS Rajasekhara Reddy,Ranga statues innovation

గణపవరం(నాదెండ్ల),న్యూస్‌లైన్: గణపవరంలోని పోలేరమ్మ గుడి సెంటర్‌లో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌రాజశేఖరరెడ్డి, వంగవీటి మోహనరంగా విగ్రహాలను వైఎస్సార్ సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త, మోహనరంగా తనయుడు వంగవీటి రాధాకృష్ట, గుంటూరు, కృష్ణా జిల్లాల సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) బుధవారం రాత్రి ఆవిష్కరించారు. దీనికి ముందు  పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
 
 జాతీయ రహదారి నుంచి గ్రామంలోని పోలేరమ్మ గుడి సెంటర్ వరకు పార్టీ నాయకులు,కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ, తీన్‌మార్ డప్పులతో సందడి చేస్తూ భారీ ప్రదర్శనగా తరలివచ్చారు. అనంతరం జరిగిన సభలో పార్టీ రాష్ట్రఅధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ మోహనరంగా హత్యతో అధికారంలో వచ్చిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన కుటుంబ సభ్యులను పట్టించుకోలేదన్నారు. వైఎస్సార్, వంగవీటి మోహనరంగా స్నేహానికి గుర్తుగా గణపవరంలో వారి విగ్రహాలను ఏర్పాటు చేయ టం అభినందనీయమన్నారు.  కాపులను బీసీల్లో చేర్చే దమ్మున్న ఏకైక పార్టీ వైఎ స్సార్ కాంగ్రెస్ అని తెలిపారు.
 
 వంగవీటి మోహనరంగా తనయుడు రాధాకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబాన్ని వంచించిందని, గాంధీభవన్‌లో  రంగా చిత్రపటాన్ని కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. తన తండ్రి బతికినంత కాలం పేదల పెన్నిధిగా ఉన్నారని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వకుండా కుట్ర పన్నిప్పుడు వైఎస్  ఆదుకొని టికెట్ ఇప్పించారని గుర్తు చేశారు. గుంటూరు, కృష్ణాజిల్లాల సమన్వయ కర్త ఆర్కే మాట్లాడుతూ పేద ప్రజలకోసం పరితపించిన మహానాయకులు వైఎస్సార్, వంగవీటి రంగా అని కొనియాడారు. వారి స్పూర్తితో ప్రజాసేవలో ఉన్న వారి వారసులను ఆదరించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో రెండు జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించబోతున్నదని తెలిపారు. 
 
 జిల్లా కన్వీనర్ మర్రిరాజశేఖర్ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగాకు చిలకలూరిపేటతో అవినాభావ సంబంధం ఉందని తెలిపారు. రంగా అభిమానులు వైఎస్సార్ సీపీకి మద్దతు పలకాలని విజ్ఙప్తి చేశారు. సభకు రిటైర్డ్ ఉపాధ్యాయడు గాలి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా సభలో గుంటూరు నగర పార్టీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, పెదకూరపాడు సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు, గుంటూరు తూర్పు సమన్వయ కర్త షేక్ షౌకత్, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు, పార్టీ నాయకులు చిన్నపురెడ్డి, బెనర్జీ, మాజీ ఎంపీపీ వీరారెడ్డి, గ్రామపార్టీ అధ్యక్షులు కాట్రు రమేష్, పట్టణ, వివిధ మండలాల కన్వీనర్లు ఏవీఎం సుభానీ, కాట్రగడ్డమస్తాన్‌రావు, చల్లా యజ్ఞేశ్వరరావు, చాపలమడుగు గోవర్ధన్, సర్పంచ్‌లు, వివిధ అనుబంధ సంఘాల కన్వీనర్లు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement