
సాక్షి, గణపవరం (పశ్చిమగోదావరి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 16వ తేదీన గణపవరం రానున్నారు. రైతుభరోసా పథకం కింద రైతులకు చెక్కులు పంపిణీ చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు బుధవారం ఉదయం 9.30 గంటలకు ముఖ్యమంత్రి కార్యక్రమాల కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ గణపవరం రానున్నట్టు ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు మంగళవారం తెలిపారు. సభాస్థలి, హెలీప్యాడ్, ముఖ్యమంత్రి ప్రయాణించే రోడ్డు మార్గాలని వారు పరిశీలిస్తారని చెప్పారు.