
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
నలుగురు విశ్రాంత ఉద్యోగుల దుర్మరణం.. మృతులు హైదరాబాద్ వాసులు
చాగలమర్రి: కర్నూలు జిల్లా చాగలమర్రి సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం స్కార్పియో వాహనం డివైడర్‌ను ఢీకొంది. ఘటనలో నలుగురు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యారుు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న నాగార్జున అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న విశ్రాంత ఉద్యోగులు రంగరాజు, కనకరాజు, రామకృష్ణరాజు, సుబ్బరాజులతోపాటు స్నేహితులు కృష్ణారావు వీఎన్ మూర్తిరాజు, రామ్మోహన్‌రాజు ఈనెల 11న స్కార్పియో వాహనంలో తీర్థ యాత్రలకు బయల్దేరారు.
వివిధ ప్రాంతాల్లో దర్శనాలు ముగించుకొని శ్రీశైలం మల్లన్న దర్శనార్థం తిరుగు ప్రయాణమయ్యారు. శనివారం తెల్లవారుజామున చాగలమర్రి సమీపంలో కూలూరు రస్తా వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రంగరాజు (64), కనకరాజు (72), రామకృష్ణరాజు (58), సుబ్బరాజు (60) దుర్మరణం చెందగా.. కృష్ణారావు, వీఎన్ మూర్తి, రామ్మోహన్‌రాజులకు తీవ్ర గాయాలయ్యారుు. ఆళ్లగడ్డ పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.