అమెరికా రెస్టారెంట్‌లో కాల్పులు | Gunman on run after shooting at Tennessee restaurant | Sakshi
Sakshi News home page

అమెరికా రెస్టారెంట్‌లో కాల్పులు

Published Mon, Apr 23 2018 2:40 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Gunman on run after shooting at Tennessee restaurant - Sakshi

నిందితుడిగా భావిస్తున్న ట్రావిస్‌ రెన్‌కింగ్‌

వాషింగ్టన్‌: అమెరికాలోని రెస్టారెంట్‌లోకి ఓ దుండగుడు నగ్నంగా ప్రవేశించి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అమెరికాలోని టేనస్సీ నగరంలోని వాఫెల్‌ హౌస్‌ రెస్టారెంట్‌లో ఆదివారం తెల్లవారుజామున 3.25 నిమిషాలకు చోటుచేసుకుంది. కారులో వచ్చిన దుండగుడు సామూహిక కాల్పులకు పాల్పడేందుకు ఉపయోగించే ఏఆర్‌–15 రైఫిల్‌తో కాల్పులు జరిపినట్లు సెక్యూరిటీ సిబ్బంది ఒకరు పోలీసులకు తెలిపాడు.

చిన్నపాటి జుట్టుతో ఉన్న అతడు శ్వేతజాతీయుడని పేర్కొన్నాడు. నగ్నంగా రెస్టారెంట్‌లోకి ప్రవేశించిన అతడు కాల్పులకు తెగబడి.. అక్కడి నుంచి పారిపోయినట్లు వెల్లడించాడు. గత అక్టోబర్‌లో లాస్‌వేగాస్‌లో 58 మంది మృతిచెందిన కాల్పుల ఘటనతోపాటు ఫిబ్రవరిలో ఫ్లోరిడా స్కూల్‌లో 17 మంది విద్యార్థులను బలి తీసుకున్న ఘటనలోనూ ఏఆర్‌–15 రైఫిల్‌నే దుండగులు ఉపయోగించారు. వరుసగా జరుగుతున్న కాల్పుల ఘటనలకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో గన్‌ కల్చర్‌ను        నిషేధించాలని కోరుతున్న వారి సంఖ్య       62 శాతానికి పెరిగింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement