Assailant firing
-
‘ఆ దుండగుడి లక్ష్యం ఆప్ ఎమ్మెల్యే కాదు’
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ కాన్వాయ్‌పై మంగళవారం అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనపై ఎమ్మెల్యే నరేష్ యాదవ్ సీసీటీపీ ఫుటేజ్ ద్వారా తనపై దాడికి పాల్పడిన దుండగుడిని పట్టుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. కాల్పుల ఘటనపై నైరుతి ఢిల్లీ అదనపు డీసీపీ ఇంగిత్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. ‘ దర్యాప్తులో ఇప్పటివరకు ఒక దుండగుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దుండగుడు ఆప్ ఎమ్మెల్యే నరేష్ యాదవ్‌ను లక్ష్యంగా దాడికి పాల్పడలేదు. ఈ దాడిలో మరణించిన ఆప్ కార్యకర్తను లక్ష్యంగా చేసుకొని వచ్చాడు’ అని ఆయన వెల్లడించారు. అదేవిధంగా ఘటన స్థలంలో ఆరు బుల్లెట్ క్యాప్స్ పడి ఉన్నాయిని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను పూర్తిగా దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. చదవండి: ఆప్ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పులు కాగా ఎమ్మెల్యే కాన్వాయ్‌పై ఆ దుండగుడు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నరేష్ యాదవ్ మంగళవారం అర్ధరాత్రి గుడికి వెళ్లివస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ కార్యకర్త మృతి చెందగా, మరో కార్యకర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నరేష్ యాదవ్ మెహ్రౌలీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
టొరంటోలో పాదచారులపై కాల్పులు
టొరంటో: కెనడాలోని టొరంటోలో పాదచారులపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. నిందితుడు పోలీసుల కాల్పుల్లో మరణించాడు. ముఖానికి నల్లటి ముసుగు ధరించిన ఓ వ్యక్తి టొరంటోలోని గ్రీక్టౌన్లో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ పాదచారులపై కాల్పులు జరిపాడు. దుండగుడు దాదాపు 20 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరిపి ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్పులు జరుగుతుండగానే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని దుండగుడిపై కాల్పులు జరిపారు. అయితే అక్కడి నుంచి పారిపోయిన ఆ దుండగుడు కొద్ది దూరంలో శవమై కనిపించినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరపడానికి కారణాలు ఇంకా తెలియదని, ఘటనపై విచారణ చేపడుతున్నట్లు వివరించారు. -
అమెరికా రెస్టారెంట్లో కాల్పులు
వాషింగ్టన్: అమెరికాలోని రెస్టారెంట్లోకి ఓ దుండగుడు నగ్నంగా ప్రవేశించి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అమెరికాలోని టేనస్సీ నగరంలోని వాఫెల్ హౌస్ రెస్టారెంట్లో ఆదివారం తెల్లవారుజామున 3.25 నిమిషాలకు చోటుచేసుకుంది. కారులో వచ్చిన దుండగుడు సామూహిక కాల్పులకు పాల్పడేందుకు ఉపయోగించే ఏఆర్–15 రైఫిల్‌తో కాల్పులు జరిపినట్లు సెక్యూరిటీ సిబ్బంది ఒకరు పోలీసులకు తెలిపాడు. చిన్నపాటి జుట్టుతో ఉన్న అతడు శ్వేతజాతీయుడని పేర్కొన్నాడు. నగ్నంగా రెస్టారెంట్లోకి ప్రవేశించిన అతడు కాల్పులకు తెగబడి.. అక్కడి నుంచి పారిపోయినట్లు వెల్లడించాడు. గత అక్టోబర్‌లో లాస్వేగాస్లో 58 మంది మృతిచెందిన కాల్పుల ఘటనతోపాటు ఫిబ్రవరిలో ఫ్లోరిడా స్కూల్లో 17 మంది విద్యార్థులను బలి తీసుకున్న ఘటనలోనూ ఏఆర్–15 రైఫిల్నే దుండగులు ఉపయోగించారు. వరుసగా జరుగుతున్న కాల్పుల ఘటనలకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో గన్ కల్చర్‌ను నిషేధించాలని కోరుతున్న వారి సంఖ్య 62 శాతానికి పెరిగింది. -
కాల్పుల కల్లోలం
ఓ మహిళ స్కూల్లో ఉన్న తన పిల్లలకు క్యారియర్ అందించి వస్తోంది.. ఇంతలో ఓ ద్విచక్ర వాహనం రయ్..మని ఆమె పక్కకు దూసుకొచ్చింది. వాహనంపై ఉన్న ఆగంతకుడు ఆమె మెడలోని పుస్తెలతాడు లాక్కొనేందుకు యత్నించాడు. అప్రమత్తమైన ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది.. ఆగంతకుడు రెచ్చిపోయాడు.. పిస్తోలు తీసి టప టపా కాల్పులు జరిపాడు. రెండు బుల్లెట్లు ఆమె ఎడమ కాలిలోకి దూసుకుపోయాయి.. టెక్కలి : హఠాత్తుగా వినిపించిన కాల్పుల శబ్ధం.. ఆ వెంటనే భయంతో మహిళ పెట్టిన కేకలు.. స్థానికులను భయాందోళనకు గురి చేశాయి. ఏం జరిగిందోనన్న భయంతో ఉరుకులు పరుగులతో అక్కడికి చేరుకున్నారు. జనాన్ని చూసిన ఆగంతకుడు తుపాకీతో వారిని బెదిరిస్తూ పారిపోయాడు. ఈ సంఘటన టెక్కలిలో భయానక వాతావరణం సృష్టించింది. పోలీస్ స్టేషనుకు కూతవేటు దూరంలోనే ఉన్న వెంకటేశ్వర కాలనీలో జరిగిన ఈ ఘటనలో బాధితురాలు తంగుడు స్వప్న అపస్మారక స్థితిలోకి చేరడంతో వెంటనే ఆమెను టెక్కలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ కోలుకున్న ఆనంతరం ఆమె సంఘటన వివరాలు వెల్లడించింది. ఎప్పటిలాగే తన పాఠశాలకు వెళ్లి పిల్లలకు భోజనం పెట్టి తిరిగి వస్తుండగా బైక్‌పై వచ్చిన దుండగుడు తన మెడలోని పుస్తెలతాడు లాక్కోవడానికి ప్రయత్నించగా తాను ప్రతిఘటించడంతో కాల్పులు జరిపాడని చెప్పింది. దుండగుడితో జరిగిన పెనుగులాటలో ఆమె పుస్తెలతాడు తెగి కింద పడిపోయింది. దుండగుడు వాడిని పిస్తోలు మ్యాగ్జయిన్ కూడా పోలీసులకు సంఘటన స్థలంలో లభించింది. అయితే సంఘటన స్థలానికి పోలీసులు కాస్త ఆలస్యంగా చేరుకున్నారని స్థానికులు చెబుతున్నారు. సీఐ భవానీప్రసాద్, ఎస్ఐలు రాజేష్, నర్సింహమూర్తి తమ సిబ్బందితో వచ్చి పరిసరాలను పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. వరుస ఘటనలతో బెంబేలు మూడు నెలలుగా టెక్కలిలో చోటు చేసుకుంటున్న వరుస సంఘటనలతో ప్రజలు ఇప్పటికే భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా మహిళపై జరిగిన దాడి వారిని మరింత ఆందోళనకు గురి చేసింది. వరుస సంఘటనలు చోటు చేసుకుంటున్నా శాంతిభద్రతలను కాపాడటంలో, నేరాలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారన్నా విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్య చికిత్సలో జాప్యం దుండగుడి కాల్పుల్లో గాయపడిన స్వప్నకు చికిత్స అందించడంలో ఏరియా ఆస్పత్రి సిబ్బంది అనుచిత జాప్యం చేశారు. సుమారు గంటన్నరకు పైగా ఎక్స్‌రే యూనిట్లో ఆమెను నిరీక్షించేలా చేశారు. విద్యుత్ సరఫరా లేదనే కారణంతో జాప్యం చేయడంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎస్పీ పరిశీలన ఈ ఉదంతంపై స్పందించిన జిల్లా ఎస్పీ ఎ.ఎస్.ఖాన్ వెంటనే శ్రీకాకుళం నుంచి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం ఏరియా ఆస్పత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ దురాగతానికి పాల్పడిన వ్యక్తి ఒడిశా ప్రాంతానికి చెందిన వాడు కావచ్చని అభిప్రాయపడ్డారు. వేసవిలో దొంగతనాలకు పాల్పడే సమ్మర్ గ్యాంగ్ పని కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. నిందితుడు ఉపయోగించిన పాయింట్ 22 బుల్లెట్ల వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని, కేవలం తప్పించుకునేందుకే వాటిని వినియోగించి ఉంటాడన్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ఇప్పటికే జిల్లా అంతటా పోలీసులను అప్రమత్తం చేశామన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా గత డిసెంబర్లో జరిగిన టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు కోళ్ల అప్పన్న హత్యకేసుకు సంబంధించి కొంత మందిపై రౌడీషీట్లు తెరవాలని ఆదేశించినట్లు ఎస్పీ వెల్లడించారు.