కాల్పులు జరిగిన ఘటన స్థలం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ కాన్వాయ్‌పై మంగళవారం అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనపై ఎమ్మెల్యే నరేష్ యాదవ్ సీసీటీపీ ఫుటేజ్ ద్వారా తనపై దాడికి పాల్పడిన దుండగుడిని పట్టుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. కాల్పుల ఘటనపై నైరుతి ఢిల్లీ అదనపు డీసీపీ ఇంగిత్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. ‘ దర్యాప్తులో ఇప్పటివరకు ఒక దుండగుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దుండగుడు ఆప్ ఎమ్మెల్యే నరేష్ యాదవ్‌ను లక్ష్యంగా దాడికి పాల్పడలేదు. ఈ దాడిలో మరణించిన ఆప్ కార్యకర్తను లక్ష్యంగా చేసుకొని వచ్చాడు’ అని ఆయన వెల్లడించారు. అదేవిధంగా ఘటన స్థలంలో ఆరు బుల్లెట్ క్యాప్స్ పడి ఉన్నాయిని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను పూర్తిగా దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
చదవండి: ఆప్ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పులు
కాగా ఎమ్మెల్యే కాన్వాయ్‌పై ఆ దుండగుడు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నరేష్ యాదవ్ మంగళవారం అర్ధరాత్రి గుడికి వెళ్లివస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ కార్యకర్త మృతి చెందగా, మరో కార్యకర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నరేష్ యాదవ్ మెహ్‌రౌలీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment