ఇస్తాంబుల్లో కారు బాంబు పేలుడు | Eleven killed in Istanbul car bomb explosion | Sakshi
Sakshi News home page

ఇస్తాంబుల్లో కారు బాంబు పేలుడు

Published Tue, Jun 7 2016 1:28 PM | Last Updated on Sun, Mar 10 2019 8:23 PM

ఇస్తాంబుల్లో కారు బాంబు పేలుడు - Sakshi

ఇస్తాంబుల్లో కారు బాంబు పేలుడు

ఇస్తాంబుల్: ఇస్తాంబుల్లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ఓ కారుబాంబు పేల్చడంతో 11మంది అక్కడికక్కడే ప్రాణాలుకోల్పోయారు. 36మంది గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

పేలుడు చోటుచేసుకున్న ప్రాంతం రక్తపు మరకలతో భీతావాహంగా మారింది. ఒక పోలీసు బస్సును లక్ష్యంగా ఎంచుకొని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు ఇస్తాంబుల్ గవర్నర్ వాసిప్ సాహిన్ విలేకరులకు చెప్పారు. అయితే, ఈ దాడికి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ తన బాధ్యత ప్రకటించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement