
శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి
సాక్షి, విజయవాడ : కత్తి మహేష్ పాడిన శ్రీరామనామంపై శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి స్పందించారు. శ్రీరాముడిపై కత్తి మహేష్, తాను చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాప పడ్డానని పరిపూర్ణానంద స్వామి తెలిపారు. ఆయన శుక్రవారం కనకదుర్గ అమ్మవారిని దర్శంచుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో స్వామిజీకి అధికారులు స్వాగతం పలికారు. అంతేకాక స్వామిజీ దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ.. రామనామంను కీర్తించడం ద్వారా కత్తి మహేష్‌లో పరివర్తన ఏర్పడుతోందని చెప్పారు. ఇటీవల కత్తి మహేష్ రామనామంను పలికిన విషయం విదితమే. అతి త్వరలోనే రామనామం గొప్పతనాన్ని కత్తి మహేష్ గుర్తిస్తారని స్వామిజీ పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిని విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉందన్నారు. మత ధర్మాలను హాయిగా ఆచరించే చట్టాలు తేవాలని పరిపూర్ణానంద స్వామి తెలిపారు. హైదరాబాద్ నగర పోలీసులు కత్తి మహేష్, పరిపూర్ణానంద స్వామిలను ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment