Paripoornananda swamy
-
"మళ్ళీ జగనే" ఎలక్షన్ రిజల్ట్స్ పై పరిపూర్ణానంద స్వామి రియాక్షన్
-
పురందేశ్వరిపై ఫైర్ ఐన పరిపూర్ణానంద స్వామి
-
స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతా స్వామి పరిపూర్ణానంద
హిందూపురం టౌన్: ‘‘బీజేపీ టికెట్ ఇస్తే ఆ పార్టీ సింబల్‌తో పోటీలో నిలుస్తా.. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగానైనా హిందూపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తా’ అని కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిని సందర్శించారు. వార్డులు, డయాలసిస్ కేంద్రం, సీటీ స్కాన్, ఎక్సరే విభాగాలను పరిశీలించారు. పలువురు రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ... హిందూపురం అభివృద్ధికి ‘సప్తపది’ అనే నినాదంతో ముందుకు సాగుతున్నానని తెలిపారు. మొదటి అడుగుగా గణేష్ సరోవరం, రెండో అడుగుగా హిందూపురం ఆస్పత్రి అభివృద్ధికి చర్యలు తీసుకుంటానన్నారు. ప్రజలు కూడా రూ.500 నోటుకు ఆశపడకుండా ఐదేళ్ల అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. దేశంలో హిందూపురాన్ని రోల్ మోడల్‌గా చేయాలన్నదే తన సంకల్పం అన్నారు. -
ఆలయాలు రాజకీయ అడ్డాలయ్యాయి..
సాక్షి, కొత్తగూడెం: దేశవ్యాప్తంగా అన్ని హిందూ దేవాలయాలు ‘రాజకీయ’ కబంధ హస్తాల నుంచి త్వరలో బయటప డనున్నాయని శ్రీపీఠం వ్యవస్థాపకుడు స్వామి పరిపూర్ణా నంద అన్నారు. ఆదివారం ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో నిర్వహించిన లక్షదీపోత్సవానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. హిందూ దేవాలయాలు రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నప్పటికీ రాజ కీయ అడ్డాలుగా మారిపోయాయన్నారు. ఆలయాల్లో ఆధ్యాత్మిక, ధార్మిక చైతన్యం కలిగించే వాతావరణం నెలకొల్పాల్సిన అవస రముందన్నారు. ఆలయాలు హిందువుల సొత్తని.. అవి హిందువులకే ఉపయోగపడా లని పేర్కొన్నారు. దేవాలయాల్లో హిందూ భావజాలం, సంస్కృతి రూపు దిద్దుకునేలా మోదీ ప్రభుత్వం వ్యూహరచన చేసిందని చెప్పారు. హిందూ దేవాలయాల విషయమై పదేళ్లుగా తాము సుప్రీంకోర్టులో న్యాయపో రాటం చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న దేవాలయాల నిర్వహణ, విధివిధానాల రూపకల్పన తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసు కోవాలని నిర్ణయించిందన్నారు. ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. దీనిపై ఇప్పటికే బీజేపీ ఎంపీ సత్యపాల్‌సింగ్ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారని, ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉందని అన్నారు. -
కేసీఆర్ దుకాణం బంద్: పరిపూర్ణానంద
సాక్షి, నారాయణపేట: బీజేపీ స్టార్ క్యాంపెయినర్ పరిపూర్ణానందస్వామి ఉమ్మడి జిల్లాలో శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద, అచ్చంపేట, గద్వాల బీజేపీ అభ్యర్థులు రతంగ్‌పాండురెడ్డి, మల్లీశ్వర్, వెంకటాద్రిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ఓటుదెబ్బతో తెలంగాణలో కేసీఆర్ దుకాణం బంద్ కాబోతుందని బీజేపీ రాష్ట్ర నేత, శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి అన్నారు. బంగారు తెలంగాణ అంటూ జనం నోట మట్టికొడుతున్న కేసీఆర్‌ను తరిమికొట్టేందుకు సమయం ఆసన్నమైందన్నారు. శుక్రవారం దామరగిద్దలో మార్పు కోసం బీజేపీ.. బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పేట బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రతంగ్‌పాండురెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే రజాకార్ల హయాంలో పెట్టిన మహబూబ్‌నగర్ పేరును పాలమూరు జిల్లాగా మారుస్తామన్నారు. ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు గెలవడం ఖాయమన్నారు. పాలమూరుతో నాకు చాలా అనుబంధం ఉంది.. ఇక్కడే గుడిసె వేసుకొని ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తూ.. అభివృద్ధికి బాటలు వేస్తానన్నారు. జిల్లాలో పారుతున్న భీమా, కృష్ణానదుల నుంచి సాగునీరు తీసుకువచ్చి ప్రతి ఎకరాకు అందిస్తామన్నారు. అభివృద్ధి పథంలో దేశం.. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో యావత్ భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. ఉజ్వల పథకం కింద నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా సిలిండర్లు అందిస్తుంటే టీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, ప్రత్యేక తెలంగాణ టీఆర్ఎస్ పాలన చూశారు.. ఈసారి బీజేపీకి పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పేటలో రతంగ్‌పాండురెడ్డి, కొడంగల్‌లో నాగూరావు నామాజీ, మక్తల్‌లో కొండయ్యలకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. దళితుడిని సీఎంగా ప్రకటించాలి.. కేసీఆర్‌కు దమ్ముంటే దళితుడిని సీఎంగా చేస్తానని ప్రకటిస్తే ఇప్పుడే తాను పోటీలోంచి తప్పుకొంటా నని బీజేపీ రాష్ట్ర నాయకుడు, కొడంగల్ ఎమ్మెల్యే అభ్యర్థి నాగూరావు నామాజీ సవాల్ విసిరారు. జి ల్లా కావాలని పేట డివిజన్ ప్రాంత సకలజనులు ఉద్యమం చేపడితే స్పందించని కేసీఆర్.. ప్రస్తుతం ఓటమి పాలవుతామని భయపడి జిల్లా మాట ఎత్తారని, ఆయన మోసపూరిత మాటలు నమ్మే పరిస్థితుల్లో పేట ప్రజలు లేరన్నారు. ఆయా స్థానాల్లో బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ అభ్యర్థి రతంగపాండురెడ్డి, నాయకులు సత్యయాదవ్, హన్మిరెడ్డి, ప్రభాకవర్‌వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
‘శివసేన సీఎం అభ్యర్థిగా పరిపూర్ణానందస్వామి’
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ సీఎం అభ్యర్థిగా శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి పేరును అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఖరారు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర శివసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఏ సుదర్శన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో శివసేన పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని, మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో శివసేన అభ్యర్థులు పోటీలో ఉంటారని పేర్కొన్నారు. -
బీజేపీ వైపు పరిపూర్ణానంద అడుగులు!
సాక్షి, హైదరాబాద్: శ్రీ పీఠం పరిపూర్ణానంద స్వామి రాజకీయాలవైపు అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్ నగర బహిష్కరణ సమయంలో మద్దతుగా నిలవడం, తన సిద్దాంతాలకు సామీప్యం గల బీజేపీవైపు పరిపూర్ణానంద చూస్తున్నట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాదిరిగా హిందుత్వ కార్డును బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే శక్తి పరిపూర్ణానందకు ఉందని బీజేపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. అయితే ఈ అంశంపై పరిపూర్ణానంద సూటిగా స్పందించలేదు. ‘నేను ఏ పార్టీలోకి చేరతాననీ చెప్పలేదు. నా సిద్దాంతాలు, ఆలోచనలకు సామీప్యం గల పార్టీ ఉంటే చేరుతాను. నేను ఏ పార్టీ దగ్గరికి వెళ్లను.. వారి పార్టీకి అవసరం ఉంటే వారే వచ్చి అడగితే ఆలోచిస్తాను’ అంటూ పరిపూర్ణానంద పేర్కొన్నారు. అందరూ తనను యోగి ఆదిత్యనాథ్‌తో పోలుస్తున్నారని.. కేవలం వయసులో తప్పా మరొక అంశంలో ఇద్దరం సమానం కాదని వివరించారు. యోగికి రాజకీయాల్లో చాలా అనుభవం ఉందని, నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ తరుపున ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. హిందుత్వం కోసం ఎవరు పాటుపడుతారో వారికి తన మద్దతు ఉంటుందన్నారు. ‘భారత్ మాతాకి జై’ అని అనడానికి ఎవరూ ఇష్టపడటం లేదని అసదుద్దీన్ ఓవైసీ అనడం హాస్యాస్పదమన్నారు. అది చెప్పడానికి ఓవైసీ ఎవరని ప్రశ్నించారు. హిందుత్వాన్ని ఎవరు గౌరవించరో వారికి తాను వ్యతిరేకమని, వారిపై ఎంతవరకైనా పోరాడతానని పరిపూర్ణానంద పేర్కొన్నారు. -
పరిపూర్ణానందస్వామికి హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: కాకినాడలోని శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానందస్వామి నగర బహిష్కరణ ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి జారీ చేసిన మధ్యంతర ఆదేశాలను రద్దు చేసేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. సింగిల్ జడ్జి ఆదేశాల్లో జోక్యం చేసుకోవాలంటే పరిపూర్ణానందస్వామి వాదనలు కూడా తెలుసుకోవాల్సి ఉన్నందున ఈ మేరకు ఆయనకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించా లని తెలంగాణ హోం శాఖ ముఖ్యకార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లు దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాల్లో చేసిన అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనం బుధవారం తోసిపుచ్చింది. పరిపూర్ణానంద స్వామి వాదనలు వినకుండా సింగిల్ జడ్జి ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని ధర్మాసనం తేల్చి చెప్పింది. కరీంనగర్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పరిపూర్ణానందస్వామి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు ఆయనను ఆరు నెలలపాటు హైదరాబాద్ నగర బహిష్కరణ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీనిని ఆయన సవాల్ చేయడంతో వాటి అమలును సింగిల్ జడ్జి ఈ నెల 14న నిలుపుదల చేశారు. పోలీసులు చేసిన అప్పీల్లో ఇప్పటికిప్పుడే మధ్యంతర ఆదేశాలు జారీ చేయబోమని ధర్మాసనం తేల్చిచెబుతూ విచారణను వాయిదా వేసింది. -
పరిపూర్ణానంద బహిష్కరణపై హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద స్వామిని ఆరు నెలలపాటు హైదరాబాద్ నగర బహిష్కరణ చేస్తూ పోలీసులు జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపి వేస్తూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నగర బహిష్కరణ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ స్వామీజీ దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని స్వామీజీ నిరసిస్తూ చౌటుప్పల్ నుంచి యాదాద్రి వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఇందుకు అనుమతి నిరాకరించిన పోలీసులు స్వామీజీని జూబ్లీహిల్స్‌లో బస చేసిన నివాసంలోనే నిర్బంధంలో ఉంచారు. మెజార్టీ ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారంటూ కత్తి మహేశ్‌ను అప్పటికే పోలీసులు నగర బహిష్కరణ చేశారు. అనంతరం స్వామీజీని కూడా నగర బహిష్కరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లో స్వామీజీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే కారణం చూపించి ఈ బహిష్కరణ చేశారు. సంఘ వ్యతిరేక, ప్రమాదకర చర్యల నివారణ చట్టం కింద స్వామీజీని నగర బహిష్కరణ చేయడం అన్యాయమని, ఇతర జిల్లాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించడం అన్యాయమని స్వామీజీ తరఫు సీనియర్ న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. స్వామీజీ నగర బహిష్కరణ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలిచ్చారు. -
బహిష్కరణ ఎత్తివేసే వరకు ఆందోళన
నిజామాబాద్, నాగారం : పరిపూర్ణనందస్వామి బహిష్కరణను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వీహెచ్‌పీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. సోమవారం నాలుగువైపుల నుంచి కలెక్టరేట్‌కు భారీ ఎత్తున కార్యకర్తలు, హిందుత్వవాదులు, హిందువాహిణి, భజరంగ్ దళ్, ఏబీవీపీ, సాధు పరిషత్, న్యాయవాదులు, మహిళ మోర్చ, బీజేపీ నాయకులు తరలివచ్చారు. ఒక్కసారిగా కలెక్టరేట్ గేట్లను ముట్టడించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వెంటనే అప్రమత్తమై అందరిని అడ్డుకున్నారు. అయిన కొంత మంది గేటు లోపలికి చొచ్చుకొని వెళ్లిపోయారు. అక్కడే ధర్నా చేస్తూ నిరసన తెలుపుతున్న వీహెచ్‌పీ నాయకులను, బీజేపీ నాయకులను, హిందుత్వ నాయకులను అరెస్టు చేసి పోలీసుల వాహనాల్లో స్టేషన్‌కు తరలించారు. అనంతరం విడుదల చేశారు. ఎత్తివేసే వరకు ఆందోళన చేస్తాం.. హిందుసామాజాన్ని ధర్మాన్ని మార్గదర్శనం చేస్తున్న గురువులను నిర్భందించి బహిష్కరించడం సరికాదని నాయకులు అన్నారు. ఇకనైన ప్రభుత్వం పరిపూర్ణనంద స్వామి బహిష్కరణను రద్దు చేయాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్, ధన్పాల్ సూర్యనారాయణగుప్త, బస్వాలక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, నాయకులు, ప్రతినిధులు అరెస్టు అయ్యారు. వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు గంగకిషన్, పిట్ల స్వామి, అల్జాపూర్ శ్రీనివాస్, యెండల సుధాకర్, న్యాలం రాజు, రోషన్‌బోరా, యశ్వంత్, లక్ష్మీనారాయణ, సురేష్ పాల్గొన్నారు. స్వామిపై బహిష్కరణ ఎత్తివేయాలి కామారెడ్డి క్రైం: పరిపూర్ణనందస్వామిపై విధించిన నగర బహిష్కరణను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందు పరిషత్, బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయల్దేరి కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. కలెక్టరేట్ వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి మాట్లాడారు. సర్వసంగ పరిత్యాగి అయిన పరిపూర్ణనందస్వామిపై నగర బహిష్కరణ విధించడం తగదన్నారు. ఆయనపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వెంటనే పరిపూర్ణనందస్వామిని హైదరాబాద్‌కు తిరిగి తీసుకురావాలన్నారు. కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగిన బీజేపీ, వీహెచ్‌పీ నాయకులను 50 మందిని పోలీసులు అరెస్ట్ చేసి దేవునిపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. నిరసనలో బీజేపీ అభివృద్ధి కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్‌గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోతే క్రిష్ణాగౌడ్, మర్రి రాంరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం చిన్నరాజులు, నాయకులు నరేందర్, బాల్‌రాజ్, గంగారెడ్డి, వీహెచ్‌పీ కార్యకర్తలు పాల్గొన్నారు. కలెక్టరేట్‌ను ముట్టడించిన బీజేపీ సుభాష్‌నగర్(నిజామాబాద్‌అర్బన్): పరిపూర్ణానంద స్వామిపై ఉన్న నగర బహిష్కరణ ఎత్తేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు అర్వింద్ ధర్మపురి డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్‌ను బీజేపీ ఆధ్వర్యంలో ముట్టడించారు. అర్వింద్ మా ట్లాడుతూ దేశంలో 80శాతానికిపైగా ఉన్న హిందువులపై ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్న కేసీఆర్‌ని హిందూ సమాజం బహిష్కరించే రోజుదగ్గర్లోనే ఉందన్నారు. రాజకీయపార్టీల్లో విలువలు పూర్తిగా దిగజారిపోయాయన్నారు. సీఎం కేసీఆర్ సెక్రటేరియట్‌కు రా కుండా పాలన పాతబస్తీ నుంచే సాగుతోందన్నారు. రాజకీయ పార్టీలను మళ్లీ ఎన్నుకుం టే, ఈ రాష్ట్రం పాతబస్తీ కనుసగల మీద నడిచే పరిస్థితి వస్తుందన్నారు. రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లో ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులు పట్టుబడ్డారని, వీళ్లను పెంచి పోషించేది టీఆర్ఎస్, కాంగ్రెస్‌లాంటి పార్టీలేనని ఆరోపించారు. హిందూ సమాజం మేల్కొని జాగ్రత్త పడాలని, అందరికీ సమన్యాయం పంచే బీజేపీ వెంటనే నడవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
పరిపూర్ణానందపై బహిష్కరణ ఎత్తివేయాలి
-
హైకోర్టును ఆశ్రయించిన కత్తి మహేశ్
హైదరాబాద్ : సినీ విమర్శకుడు కత్తి మహేశ్ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై విధించిన నగర బహిష్కరణ ఉత్తర్వులను వెంటనే ఎత్తివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను కత్తి మహేశ్‌ను 6 నెలల పాటు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ నగర బహిష్కరణ చేసిన సంగతి తెల్సిందే. అలాగే కత్తి మహేశ్‌కు వ్యతిరేకంగా హిందువులను కూడగట్టి హైదరాబాద్‌లో ర్యాలీ తీసేందుకు ప్రయత్నించిన పరిపూర్ణానంద స్వామిని కూడా నగర పోలీసులు 6 నెలల పాటు బహిష్కరణ చేశారు. ఇద్దరూ వేర్వేరుగా తమపై విధించిన నగర బహిష్కరణ ఉత్తర్వులను వెంటనే ఎత్తివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. -
‘పరిపూర్ణానందపై బహిష్కరణ ఎత్తేయండి’
సాక్షి, హైదరాబాద్ : స్వామి పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేయడంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి తీవ్ర అభ్యంతరం తెలిపారు. గూండాల విషయంలో నగర బహిష్కరణను అమలు చేస్తారని గుర్తు చేసిన స్వామి, తన అభ్యంతరాలతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు గురువారం ఓ లేఖ రాశారు. సంఘ వ్యతిరేక, ప్రమాదకర కార్యకలాపాల చట్టం 1980లోని సెక్షన్ 3 కింద పరిపూర్ణానందపై చర్యలు తీసుకోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఆ సెక్షన్‌ను చదివితే అది గూండాల బహిష్కరణకు ఉద్దేశించిందన్న విషయం తనకు తెలిసిందన్నారు. అటువంటిది పరిపూర్ణానందపై ఈ సెక్షన్ కింద చర్యలు తీసుకోవడం ఆయనను అవమానించడం, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడమేనన్నారు. కాబట్టి వెంటనే బహిష్కరణ ఉత్తర్వుల రద్దుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో తాను న్యాయ పోరాటం చేయాల్సి ఉంటుందని తెలిపారు. -
తెలంగాణ సర్కార్‌పై సుబ్రమణ్యస్వామి ఫైర్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వంపై మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఫైర్ అయ్యారు. ఈ విషయం గురించి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. పరిపూర్ణానంద స్వామిజీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా ప్రవర్తిస్తుందని లేఖలో పేర్కొన్నారు. గూండాలపై పెట్టే కేసులు స్వామీజీపై పెడతారా అని ప్రశ్నించారు. ఒక సాధువును గూండాల ట్రీట్ చేస్తారా అని తీవ్ర స్థాయిలో సుబ్రమణ్యస్వామి మండిపడ్డారు. పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ చేయడమంటే ఆయనను తీవ్రంగా అవమానించడమేనని, అలాగే ఆయన గౌరవ మర్యాదలకు భంగం కలిగిందని లేఖలో తెలియజేశారు. నగర బహిష్కరణ వల్ల ఆయన వాక్స్వాతంత్ర్యం, ఉద్యమ స్వాతంత్ర్యం హక్కులకు భంగం కలిగిందని సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు. రాముడిపై కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పరిపూర్ణానంద స్వామి హైదరాబాద్‌లో ర్యాలీ తలపెట్టడంతో కత్తి మహేశ్‌తో పాటు పరిపూర్ణానంద స్వామిని కూడా పోలీసులు 6 నెలల పాటు నగర బహిష్కరణ చేసిన సంగతి తెల్సిందే. -
కత్తి మహేష్ ఉదంతం తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది!
సందర్భం ఈమధ్య కత్తి మహేష్ ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాలనూ కుదిపేసింది. ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం, దానిపై పరిపూర్ణానంద స్వామి తదితరులు తీవ్రంగా స్పందిం చడంతో పరిస్థితి కొంత చేయి దాటిపోయే ప్రమా దం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యూహా త్మకంగా వ్యవహరించి ప్రస్తుతానికి సమస్య సమసిపోయేటట్లుగా చర్యలు చేపట్టింది. ప్రజాస్వామ్య దేశాలలో భావ వ్యక్తీకరణ స్వాతంత్య్రం అందరికీ ఉంటుంది. కానీ ఈ స్వాతంత్య్రం కొన్ని పరిమితులకులోనై మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉంటుందనే విషయం ఎవరూ మరువరాదు. అబ్రహాం లింకన్ చెప్పినట్టు ‘నీ పిడికిలి నా ముక్కు దగ్గర ఆగిపోతుంది.‘ అంటే పక్కవారిని భౌతికంగా గానీ మానసికంగా గానీ గాయపరిచే హక్కు ఎవరికీ లేదు. ఈ సూత్రం ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకే మూలం. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను భారత రాజ్యాంగంలోని 19 (1)(ఎ) ప్రకరణలో పొందుపరచటం జరిగింది. కానీ దీనికి రాజ్యాంగబద్ధమైన పరిమితులను 19 (2)లో పొందుపరిచారు. ప్రజా నియంత్రణ, మర్యాద, నైతి కత, దేశ భద్రత వంటి మరికొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు ఈ పై స్వేచ్ఛపై సహేతుకమైన ఆంక్షలు విధించవచ్చు. కత్తి మహేష్ వ్యాఖ్యలు రాజ్యాంగబద్ధమైన భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కిందికి ఏ విధంగా పరిశీలించినా రావు. ఇక ఈయన వ్యాఖ్యలను సమర్థించేవారు రెండు అంశాలను ప్రధానంగా పేర్కొన్నారు. ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇంతకుముందు చాలా మంది నాయకులు, వ్యక్తులు చేశారు గానీ ప్రభుత్వం అప్పుడు ఈ విధంగా స్పందించలేదు. ఇతని ఒక్కని విషయంలో మాత్రం ఈ విధమైన స్పందన వివక్షా పూరితంగా ఉంది అని వీరంటున్నారు. ఇది చాలా సహేతుకమైన వాదన. రెచ్చగొట్టే ప్రసంగాలు ఎవరు చేసినా అది శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా ప్రవర్తించాల్సిన అవసరముంది. ఇక వారు ప్రస్తావించే రెండవ ప్రధాన అంశం రామాయణం లాంటి పురాణాల మీద ఇంతకు పూర్వం రంగనాయకమ్మ, రామస్వామి చౌదరి, చలం లాంటి వారు చాలా వ్యాఖ్యానాలు చేశారు. వాటిని తప్పు పట్టనప్పుడు మహేష్ చేసిన వ్యాఖ్యానాలు ఏ రకంగా తప్పు పడతారు? ఈ వాదన సరికాకపోవచ్చు. పురాణాలను విశ్లేషణాత్మకంగా పరిశీ లించి, విమర్శనాత్మక వ్యాఖ్యానం చేయటం ఒక వంతు కాగా, సభ్యసమాజం మనోభావాలు గాయపడే విధంగా విచక్షణ కోల్పోయి వ్యాఖ్యానించటం వేరొక వంతు. పైపెచ్చు ఆ వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేయటం కూడా సమర్థనీయం కాదు. అలాగే కత్తి మహేష్ కుటుంబంపై దూషణలకు దిగిన వారి చర్య కూడా గర్హనీయమైనది. హిందూ మతం ఏ ఒక్క ప్రవక్త బోధనలవల్ల ఏర్పడిన మతం కాదు. ఇది యుగాల కాలంలో పరిణతి చెందిన మత విధానం. ఆరాధనలో, నమ్మకంలో, ఆచరణలో భిన్నత్వం ఈ మత విధానానికి మూలస్థానం. ప్రకృతి ఆరాధన విధానాల నుంచి నిరాకార నిరామయ స్వరూపుడైన భగవంతుని ఆరాధించే విధానం వరకు అన్నీ ఈ మతంలో ఆరాధనా విధి విధానాలే. ఈ భిన్నత్వాన్ని గౌరవించి ప్రవర్తించాల్సిన బాధ్యత అందరిమీదా ఉంటుంది. ఇతర మత విధానాల పట్ల కూడా అదేవిధంగా మెలగాలి. ఇటువంటి వ్యాఖ్యలు గతంలో పరిమితంగా చర్చకు వచ్చేవి. కానీ ప్రస్తుతం మీడియా పుణ్యమా అని శరవేగంగా వ్యాపిస్తున్నాయి. ప్రసార మాధ్యమాలు కూడా ఇటువంటి అంశాలకు ప్రసార అవకాశం ఇవ్వకుండా వ్యవహరిస్తే మంచిది. ఈ వివాదం ఇంతటితో సమసిపోవటానికి అందరూ ముఖ్యంగా మేధావి వర్గం వారి భావజాలం ఏదైనా కానీ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడించే రుగ్మతలు ఎన్నో ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి, ఆర్థిక అసమానతలను రూపుమాపటం, నిరుద్యోగ సమస్య, పర్యావరణ పరిరక్షణ వంటి సమకాలీన అంశాలను వదిలివేసి చరిత్రను తవ్వుకుని సమస్యను సృష్టించుకోవటం వలన ప్రయోజనమేమీ ఉండదు. ఇందులో ఎంత చరిత్ర, ఎంత కవి కల్పన అనేది ఆ దేవుడికే తెలియాలి. ఎందుకంటే చర్చించే అంశాలు చరిత్రకందని కాలం నాటివి. గత శతాబ్ది కాలంలో హిందూ సమాజానికి రామానుజాచార్యులవారి స్థాయి కలిగిన మత సామాజిక సంస్కర్త లేకపోవటం ఈ మతం చేసుకున్న గొప్ప దురదృష్టం. సమకాలీన పరిస్థితులకు అనుకూలంగా మతంలో మార్పులు రాకపోతే మతానికే ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఉంటాయి. ఈ అంశంపై హైందవ సమాజం మొత్తం దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఈ-మెయిల్ : iyrk45@gmail.com -
బహిష్కరణను నిరసిస్తూ ఆందోళన
యైటింక్లయిన్‌కాలనీ: ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త పరిపూర్ణానంద స్వామిని హైదరాబాద్ నుంచి బహిష్కరించడాన్ని నిరసిస్తూ శుక్రవారం యైటింక్లయిన్‌కాలనీలో విశ్వహిందూ పరిషత్, హనుమాన్‌దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. స్థానిక తెలంగాణ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. హిందువులకు వ్యతిరేకంగా కొన్ని చానళ్లు పనికట్టుకుని ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్, బీజేపీ, ఆలయ కమిటీ సభ్యులు గోవర్ధనగిరి మధుసూధనాచార్యులు, సౌమిత్రి హేమంతాచార్యులు, శుక్లాచారి, బండారి రాయమల్లు, శ్రీనివాస్, ముత్యాల బాలయ్య, పోతు శంకరయ్య, సత్యనారాయణరెడ్డి, మూకిరి రాజు, శశికుమార్, బెల్లంకొండ భాస్కర్‌రెడ్డి, పోతు రాకేశ్, కుమార్, మారెపల్లి శ్రీనివాస్, భగవాన్‌రెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ గోదావరిఖనిటౌన్ : స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ నగర బహిష్కరణ చేసిందుకు నిరసగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ నాయకులు శుక్రవారం భారీ ర్యాలీ చేపట్టారు. స్థానిక స్వాతంత్య్ర చౌక్ నుంచి గణేశ్ చౌక్ వరకు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. హిందుత్వం, ఆలయాలు, పూజల కోసం తపించే కేసీఆర్ ప్రభుత్వం స్వామి పరిపూర్ణానందను ఎందుకు నగర బహిష్కరణ చేశారని ప్రశ్నించారు. హిందూ సమాజం కోసం నిరంతరం ఆకాంక్షించే స్వామిని నగర బహిష్కరణ చేయడం సరికాదని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్వామిజీని నగరంలోని తీసుకురావాలని వారు కోరారు. అంతకుముందు పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు వేపూరి రాములు గౌడ్, అయోధ్య రవీందర్, అడిగొప్పల రాజు, గుడికందుల ఆకాశ్ కుమార్, ముష్కె సంపత్, సుధీర్, శశికాంత్, చక్రపాణి, జిమ్ సమ్మన్న, సతీశ్, అనిల్, నరేశ్, అనిరుద్, అజేయ్, పెండ్యా మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కత్తి మహేష్ శ్లోకం.. పరిపూర్ణానంద కామెంట్స్!
సాక్షి, విజయవాడ : కత్తి మహేష్ పాడిన శ్రీరామనామంపై శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి స్పందించారు. శ్రీరాముడిపై కత్తి మహేష్, తాను చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాప పడ్డానని పరిపూర్ణానంద స్వామి తెలిపారు. ఆయన శుక్రవారం కనకదుర్గ అమ్మవారిని దర్శంచుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో స్వామిజీకి అధికారులు స్వాగతం పలికారు. అంతేకాక స్వామిజీ దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ.. రామనామంను కీర్తించడం ద్వారా కత్తి మహేష్‌లో పరివర్తన ఏర్పడుతోందని చెప్పారు. ఇటీవల కత్తి మహేష్ రామనామంను పలికిన విషయం విదితమే. అతి త్వరలోనే రామనామం గొప్పతనాన్ని కత్తి మహేష్ గుర్తిస్తారని స్వామిజీ పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిని విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉందన్నారు. మత ధర్మాలను హాయిగా ఆచరించే చట్టాలు తేవాలని పరిపూర్ణానంద స్వామి తెలిపారు. హైదరాబాద్ నగర పోలీసులు కత్తి మహేష్, పరిపూర్ణానంద స్వామిలను ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధించిన విషయం తెలిసిందే. -
పరిపూర్ణానందస్వామి అరెస్ట్ సరికాదు
యాదగిరిగుట్ట (ఆలేరు) : శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిని అరెస్ట్, నగర బహిష్కరణ చేయడం బాధకరమని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కట్టెగొమ్ముల రవీందర్‌రెడ్డి, హిందూవాహిని జిల్లా అధ్యక్షుడు పుల్ల శివ, విశ్వహిందూపరిషత్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి తోట భానుప్రసాద్ అన్నారు. స్వామీజీని వెంటనే విడుదల చేసి, ఎక్కడ ఉన్నారో చెప్పాలని కోరుతూ బుధవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భువనగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రకు యాదగిరిగుట్టలో బీజేపీ, హెచ్‌డీపీఎస్ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. శాంతియుతంగా చేపట్టిన ధర్మాగ్రహయాత్రను అడ్డుకొని, స్వామీజీని ఎవరికి తెలియని ప్రదేశానికి తీసుకెళ్లడం శోచనీయమన్నారు. హిందూ దేవుళ్లను, ఆచారాలను గౌరవించే స్వామీజీలను అరెస్ట్ చేస్తే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదన్నారు. స్వామీజీకి ప్రభుత్వం రక్షణ కల్పించి, పాదయాత్ర సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీశైలం, మండల అధ్యక్షుడు రచ్చ శ్రీనివాస్, హెచ్‌డీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రె పవీణ్, నవీన్ ఠాగూర్, నర్సింహారావు, లెంకలపల్లి శ్రీనివాస్ ఉన్నారు. -
అలజడి.. ఆందోళన
సాక్షి, కొత్తగూడెం: రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన పరిపూర్ణానంద స్వామి హైదరాబాద్ బహిష్కరణ అంశం తరువాత చోటుచేసుకున్న పరిణామాలు బుధవారం జిల్లాలోనూ కలకలం రేపింది. చివరకు జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం పట్టణాల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు, రాస్తారోకోలు చేశారు. శ్రీరాముడి విషయమై ఇటీవల కత్తి మహేష్ అనే సినీ క్రిటిక్ అనుచిత వ్యాఖ్యలు చేశాడని వివాదం చెలరేగడంతో కత్తి మహేష్‌ను హైదరాబాద్ నగర బహిష్కరణ చేసి అతని సొంత జిల్లా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు తెలంగాణ పోలీసులు తరలించారు. ఈ క్రమంలో గత 6నెలల క్రితం పరిపూర్ణానంద స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన విమర్శల నేపథ్యంలో స్వామీజీని సైతం హైదరాబాద్ నగర బహిష్కరణ చేశారు. ఈ క్రమంలో పరిపూర్ణానంద స్వామిని కాకినాడకు తరలించేందుకు రాష్ట్ర పోలీసులు ప్రయత్నించగా, స్వామి మాత్రం భద్రాచలం సీతారామచంద్రస్వామి దర్శనం చేసుకునంటానని కోరారు. ఈ క్రమంలో పోలీసులు దారి మార్చి అశ్వారావుపేట మీదుగా నేరుగా కాకనాడకు స్వామీజీని తరలిస్తుండడంతో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు, రాస్తారోకోలు చేశారు. భద్రాచలం వంతెనపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేయడంతో సమస్య ఏర్పడింది. దీంతో పోలీసులు ప్రభాకర్‌రెడ్డితో పాటు మరో 8 మంది నాయకులను అరెస్టు చేసి తరువాత విడుదల చేశారు. ఈ సందర్భంగా బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కేవలం హైదరాబాద్ నగర బహిష్కరణ మాత్రమే చేసిన పోలీసులు, స్వామీజీని భద్రాచలం పంపుతామని చెప్పి ఇలా దారిమళ్లించడం సరికాదని అన్నారు. ఇలా ఏకపక్షంగా రాష్ట్రం దాటించడం ఏమిటని ప్రశ్నించారు. -
హక్కులను కాలరాస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: శాంతియుతంగా ధర్మాగ్రహ యాత్ర నిర్వహించాలని సిద్ధపడ్డ పరిపూర్ణానంద స్వామిని బహిష్కరించడం ద్వారా రాజ్యాంగం కల్పించిన ప్రాథమికహక్కును రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ అంశంపై గవర్నర్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో బీజేపీ నేతలు బుధవారం కలసి ఫిర్యాదు చేశారు. కేంద్ర మాజీమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు, నేతలు ప్రేమేందర్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, దాసరి మల్లేశం తదితరులు గవర్నర్‌ను కలిశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టాలని నోటికొచ్చినట్లు మాట్లాడిన ఎంఐఎం నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, హిందూ ప్రజల మనోభావాల గురించి ప్రశ్నిస్తున్న వారిపైనే చర్యలు తీసుకోవడం శోచనీయమన్నారు. రాష్ట్రప్రభుత్వం పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేసి, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ పరిపూర్ణానందను అకారణంగా బహిష్కరించారని మండిపడ్డారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. లక్షలాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అధికార దుర్వినియోగం చేస్తూ పరిపూర్ణానందను గృహ నిర్బంధం చేశారని.. ఆయనను ఎందుకలా గృహ నిర్బంధం చేయాల్సి వచ్చిందో చెప్పాలని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. నగర బహిష్కరణ అని, రాష్ట్రం నుంచి ఎలా బహిష్కరిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదేమైనా నిజాం పాలనా అని ప్రశ్నించారు. విభజన చట్టానికి విరుద్ధంగా రాష్ట్ర పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి హిందువులపై అనుచితంగా, మనోభావాలను కించపరుస్తూ మాట్లాడుతున్నా ఎందుకు చర్యలను తీసుకోవట్లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్న ఎంఐఎం నేతలపై ఎందుకు చర్యలను తీసుకోవట్లేదని ప్రశ్నించారు. బహిష్కరణ దారుణం: లక్ష్మణ్ స్వామి పరిపూర్ణానందపై బహిష్కరణ నిర్ణయం అప్రజాస్వామికం, దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దేవుడిని దూషించి, మెజారిటీ ప్రజల మనోభావాలను గాయపర్చిన వారిపై కఠినంగా వ్యవహరించకుండా పరిపూర్ణానంద పై బహిష్కరణ వేటు వేయడం ప్రభుత్వ దుర్మార్గ చర్యలకు పరాకాష్ట అని విమర్శించారు. పరిపూర్ణానంద స్వామిని నిర్బంధించడం, నగర బహిష్కరణ చేయడం ఏమిటని ప్రశ్నించారు. పరిపూర్ణానంద బహిష్కరణ అంశంపై ప్రభుత్వం, పోలీసులు పునరాలోచించాలని కోరారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఎంఐఎం నేతలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిపూర్ణానంద స్వామిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. -
పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ‘ధర్మాగ్రహ యాత్ర’చేపడతానని ప్రకటించిన ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానందను నగరం నుంచి బహిష్కరిస్తూ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆయనకు నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా ఆరు నెలల పాటు హైదరాబాద్‌లో అడుగు పెట్టొద్దని, నోటీసులు అందుకున్న 24 గంటల్లో నగరాన్ని విడిచిపెట్టాలని అందులో పేర్కొన్నారు. బుధవారం తెల్లవారుజామున స్వామిని అదుపులోకి తీసుకున్న ప్రత్యేక బృందాలు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని శ్రీపీఠానికి తరలించాయి. గత రెండు రోజులుగా ఆయన హౌస్ అరెస్ట్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ తరహాలో ‘శాంతిభద్రతల సమస్య’పేరుతో నగర బహిష్కరణకు గురైన రెండో వ్యక్తి స్వామి పరిపూర్ణానంద. సోమవారం సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ను నగరం నుంచి బహిష్కరించడం, ఆ విషయాన్ని స్వయంగా రాష్ట్ర డీజీపీ ప్రకటించడం తెలిసిందే. నగర పోలీసు చరిత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలకు సంబంధించిన కారణాలతో నగర బహిష్కరణ చేయడం ఇదే తొలిసారి. రానున్న ఎన్నికల సీజన్ నేపథ్యంలో ఈ విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏడాది క్రితం నాటి అంశాలను ప్రస్తావిస్తూ.. ఓ టీవీ చానల్ కార్యక్రమంలో రాముడిని ఉద్దేశించి కత్తి మహేశ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం, దానికి నిరసనగా స్వామి పరిపూర్ణానంద యాత్రకు సిద్ధం కావడం తెలిసిందే. హైదరాబాద్ పోలీసులు పరిపూర్ణానందకు జారీ చేసిన ఐదు పేజీల నోటీసులు ఏడాది క్రితం నాటి అంశాలను ప్రస్తావించారు. గతేడాది నవంబర్‌లో మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో జరిగిన సభలో రాష్ట్రీయ హిందూ సేన ఆవిర్భావ ప్రకటన చేసిన స్వామి పవిత్ర యాత్రకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. డిసెంబర్లో కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లిలోనూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, మార్చిలో కరీంనగర్లో నిర్వహించిన బహిరంగ సభలోనూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. పది రోజులుగా కత్తి మహేశ్, స్వామి పరిపూర్ణానంద చేస్తున్న వ్యాఖ్యలు ఉద్రిక్తతలకు కారణమయ్యేలా, అభ్యంతరకరంగా ఉన్నాయంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ‘ధర్మాగ్రహ యాత్ర’పేరుతో స్వామి చేపట్టదలచిన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ ఆదివారం విలేకరులతో మాట్లాడిన స్వామి యాత్ర కొనసాగిస్తానని ప్రకటించారని, ఇది శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఆస్కారం ఉందని పోలీసులు నోటీసుల్లో స్పష్టం చేశారు. కాకినాడకు చెందిన పరిపూర్ణానంద తరచుగా హైదరాబాద్ వచ్చి ఉంటున్నారని, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారని, ఇవి రెచ్చగొట్టేవిగా ఉంటున్నాయని, ఈ పరిణామాల నేపథ్యంలో ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధిస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే 15 రోజుల్లో ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చని పోలీసు కమిషనర్ సూచించారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ‘తడిపార్’ ఇలా నగర బహిష్కరణ విధించడాన్ని తడిపార్ అంటారు. మాజీ డీజీపీ ఎంవీ భాస్కర్‌రావు నగర పోలీసు కమిషనర్‌గా ఉండగా దీన్ని ఎక్కువగా వినియోగించారు. ఆపై బి.ప్రసాదరావు కొత్వాల్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2008 నుంచి అనేక మందిని నగరం నుంచి బహిష్కరించారు. 2014లో చాదర్‌ఘాట్‌కు చెందిన హిస్టరీ షీటర్ మహ్మద్ జాబ్రీపై పడిన తడిపార్ వేటే ఆఖరిది. అంతకు ముందు రౌడీషీటర్లు జంగ్లీ యూసుఫ్, ఖైసర్, లేడీ డాన్ ఫర్హాఖాన్.. ఇలా ఎంతో మందిని నగరం నుంచి బహిష్కరించారు. అయితే నగర పోలీసు కమిషనరేట్ చరిత్రలో ఇప్పటి వరకు రౌడీషీటర్లు, కరడుగట్టిన నేరగాళ్లను మాత్రమే బహిష్కరించే వారు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో, శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం పేరుతో తడిపార్ చేయడం ఇదే తొలిసారి. సిటీలో గతంలోనూ అనేక మంది రాజకీయ నాయకులు, పెద్దలు కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వారిపై ఇలాంటి నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవు. -
కత్తి, పరిపూర్ణానంద ఎపిసోడ్: కన్నా ట్వీట్
సాక్షి, హైదరాబాద్ : లక్షలాది మంది హిందూవులు ఆరాధించే పరిపూర్ణానంద స్వామిని హౌజ్ అరెస్టు చేయడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. పరిపూర్ణానంద హౌజ్ అరెస్టు అయిన జులై 9ను బ్లాక్ డేగా అభివర్ణించారు. కాగా, రాముడిని దూషిస్తూ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పాదయాత్ర చేపడుతున్న పరిపూర్ణనంద స్వామిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏ మతానికి చెందిన దేవుడిని లేక దేవతను ఉద్దేశించి తప్పుగా మాట్లాడేవారికి కఠిన శిక్షలు విధించేలా చట్టాన్ని తేవాలనే సదుద్దేశంతోనే స్వామి పాదయాత్ర తలపెట్టారన్నారు. ఇదేమైనా నేరమా అని ప్రశ్నించారు. మన పాలన ఇలా ఉందంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి స్వామీజీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. July 9 was another black day in democracy as a Hindu sanyasi, Paripoornananda Swamiji, adored by lakhs of Hindus in Telugu States, was detained at his camp in Hyderabad by State police preventing from taking a paadayaatra. (1/2) — Kanna Lakshmi Narayana (@klnbjp) July 10, 2018 His crime was that he sought a legislation to be brought in facilitating "severe punishment for defaming or decrying Gods or Goddesses of any religion." What a great Governance we have ! Let wisdom dawn on Government and Swamiji be released (2/2) — Kanna Lakshmi Narayana (@klnbjp) July 10, 2018 -
‘ఆయన లోకల్ నాయకుడిగా కూడా పనికిరారు’
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌పై శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదగడానికి హిందువులను దుయ్యబడితేనే నాయకులు అవుతారా అంటూ కమల్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ కమల్ లోకనాయకుడు కాదు...లోకల్ నాయకుడిగా కూడా పనికిరారు. మీరు కమల్‌హాసన్ కాదు. ఉగ్రవాది కమల్‌హాసన్. హిందువులను విమర్శిస్తే రాజకీయ నేతగా ఎదుగుతారా?. హిందువులను తీవ్రవాదులన్నవారు కచ్చితంగా ఉగ్రవాదులే. హిందు ధర్మాన్ని కించపరిచి కమల్ ధర్మద్రోహిగా మారారు. తీసిన సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో కమల్‌కు పిచ్చి పట్టింది. హిందుమతంపై వ్యాఖ్యలు ఉపసంహరించుకోకుంటే వచ్చే ఎన్నికల్లో సంహార ప్రక్రియను కమల్ చూస్తారు. కమల్ వేషం వెనుక విషం ఉంది.’ అని నిప్పులు చెరిగారు. సినిమాలు తీసేటప్పుడు హిందువులు కావాల్సి వచ్చిందని, ఇపుడు హిందూ మతాన్ని కించపరిచే కమల్ ధర్మద్రోహిగా ఎదిగాడని పరిపూర్ణానంద స్వామి అన్నారు. కట్టిన బట్ట, నివాసం, సుఖభోగాలతో కూడుకున్న జీవన విధానం హిందూ సమాజానిది కాదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ లాంటి మహా నటుడు రాజకీయాల్లోకొచ్చినా హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ ఇతర మతాలను గౌరవించారంటూ రాజకీయాల్లోకి రావాలనుకున్న నటులు ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు. హిందూమతంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే ఓటమిని చవిచూస్తారని పరిపూర్ణానందస్వామి హెచ్చరించారు. -
నలుగురిని కనండి..
ఒకరిని దేశానికి ఇవ్వండి- పరిపూర్ణానంద స్వామీజీ కదిరి: ‘దేశ జనాభా పెరిగిపోతోందన్న బెంగ అక్కర్లేదు. ప్రతి ఒక్కరూ నలుగుర్ని కనండి. వారిలో ఒకరిని దేశసేవ కోసం పంపండి. ఇంకొకరు తల్లిదండ్రులను చూసుకుంటారు. మిగిలిన ఇద్దరూ సంపాదించడానికి సరిపోతారు’ అని శ్రీపీఠం నిర్వాహకులు పరిపూర్ణానంద స్వామీజీ అన్నారు. శుక్రవారం ఆయన అనంతపురం జిల్లా కదిరిలో బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సోమగుట్ట విష్ణువర్ధన్‌రెడ్డి నూతన గృహ ప్రవేశానికి విచ్చేశారు. ఈ సందర్భంగా అక్కడికొచ్చిన భక్తులనుద్దేశించి ప్రసంగించారు. దేవుణ్ని కొలిచేందుకు ఆలయానికి వెళ్లేందుకు తనకు సమయం సరిపోవడం లేదని కొందరు చెబుతుంటారని, ఇది సరికాదన్నారు. భగవంతుణ్ని స్మరించడానికి రోజులో అరగంట కేటాయించాలని సూచించారు. ప్రతి ఇంట్లో పూజ గది ఉంటుందని, అది దేవుడి కోసం కాదని.. ఆయన్ను స్మరించుకోవడానికి నీవు కేటాయించుకున్న గది అని ఉద్బోధించారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుమార్తె దీప వెంకట్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, జెడ్పీ చైర్మన్ చమన్, ప్రముఖులు హాజరయ్యారు. -
గో పూజ నిర్వహించిన స్వామి పరిపూర్ణానంద
హైదరాబాద్: లోయర్ ట్యాంక్ బండ్ భాగ్యనగర్ గోశాలలో గురువారం శ్రీపీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామిజీ గో పూజను నిర్వహించారు. గోవులను పూజించడం సనాతన ధర్మమని...బీఫ్ ఫెస్టివల్ నిర్వహించాలన్న ఆలోచన రావడం దౌర్భాగ్యమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి డిసెంబర్ 10వ తేదీని గోరక్ష దివస్‌గా నిర్వహించాలని స్వామిజీ సూచించారు. గో ఆధారిత వ్యవసాయంతోనే రైతుల ఆత్మహత్యలను నివారించవచ్చునని... తెలుగు రాష్ట్రాల్లో గోరక్ష క్రాంతి ఫథకం కింద రైతులకు ఆవులను పంపిణీ చేయాలని ప్రభుత్వాలను కోరారు. ఆవును ప్రజలు పశువుగా, జంతువుగా చూడకూడదని... ఆవు పాలు తాగితే మంచిదని...దీనిపై విస్తృత ప్రచారం జరగాలని స్వామిజీ సూచించారు. గోవధ అనే మాట పలకడమే పెద్ద నేరమని, దానికి 6 నెలల శిక్ష కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా చట్టాలను కఠినంగా అమలు చేయాలని పరిపూర్ణానంద స్వామిజీ ప్రభుత్వాలను కోరారు.