
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ సీఎం అభ్యర్థిగా శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి పేరును అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఖరారు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర శివసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఏ సుదర్శన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో శివసేన పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని, మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో శివసేన అభ్యర్థులు పోటీలో ఉంటారని పేర్కొన్నారు.