
సాక్షి, హైదరాబాద్ : స్వామి పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేయడంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి తీవ్ర అభ్యంతరం తెలిపారు. గూండాల విషయంలో నగర బహిష్కరణను అమలు చేస్తారని గుర్తు చేసిన స్వామి, తన అభ్యంతరాలతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు గురువారం ఓ లేఖ రాశారు. సంఘ వ్యతిరేక, ప్రమాదకర కార్యకలాపాల చట్టం 1980లోని సెక్షన్ 3 కింద పరిపూర్ణానందపై చర్యలు తీసుకోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఆ సెక్షన్‌ను చదివితే అది గూండాల బహిష్కరణకు ఉద్దేశించిందన్న విషయం తనకు తెలిసిందన్నారు. అటువంటిది పరిపూర్ణానందపై ఈ సెక్షన్ కింద చర్యలు తీసుకోవడం ఆయనను అవమానించడం, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడమేనన్నారు. కాబట్టి వెంటనే బహిష్కరణ ఉత్తర్వుల రద్దుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో తాను న్యాయ పోరాటం చేయాల్సి ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment