![The Petition Regarding City Expulsion Filed In The High Court By Kathi Mahesh - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/25/kat.jpg.webp?itok=fZQNXJzW)
కత్తి మహేశ్(పాత చిత్రం)
హైదరాబాద్ : సినీ విమర్శకుడు కత్తి మహేశ్ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై విధించిన నగర బహిష్కరణ ఉత్తర్వులను వెంటనే ఎత్తివేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.
రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను కత్తి మహేశ్‌ను 6 నెలల పాటు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ నగర బహిష్కరణ చేసిన సంగతి తెల్సిందే. అలాగే కత్తి మహేశ్‌కు వ్యతిరేకంగా హిందువులను కూడగట్టి హైదరాబాద్‌లో ర్యాలీ తీసేందుకు ప్రయత్నించిన పరిపూర్ణానంద స్వామిని కూడా నగర పోలీసులు 6 నెలల పాటు బహిష్కరణ చేశారు. ఇద్దరూ వేర్వేరుగా తమపై విధించిన నగర బహిష్కరణ ఉత్తర్వులను వెంటనే ఎత్తివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment