'బీఫ్ ఫెస్టివల్ కాదు, ఫెస్టివల్ జరుపుకుందాం' | Paripoornananda swamy appeal Plese save mother cow | Sakshi
Sakshi News home page

'బీఫ్ ఫెస్టివల్ కాదు, ఫెస్టివల్ జరుపుకుందాం'

Published Sat, Dec 5 2015 5:03 PM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

Paripoornananda swamy appeal Plese save mother cow

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 10న తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్ను ఉపసంహరించుకోవాలని శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి పిలుపునిచ్చారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ కుహనావాదులు చెప్పే మాయమాటల ముసుగులో లొంగిపోవద్దని సూచించారు. బీఫ్ తింటే బుద్ధిమాంద్యం వస్తుందని అన్నారు.  పాడి ఇచ్చే ఆవు దైవంతో సమానమని పరిపూర్ణానంద స్వామి అన్నారు.

 

అందుకే బీఫ్ ఫెస్టివల్ నిర్వహించే రోజును.. తాము గోరక్ష దివాస్గా ప్రకటిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నెల 10న ప్రతి ఒక్కరూ కనిపించే గోవుకు పూజ చేసి, నమస్కరించాలని, గోవులను రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రాచీన కాలం నాటి వేదాలను ఇక్కడవాళ్లు చెబితే పట్టించుకోరని, అవే విషయాలను అమెరికా, ఇంగ్లండ్ నుంచి వచ్చినవాళ్లు చెబితే శాస్త్రీయమా అని పరిపూర్ణనంద స్వామి ప్రశ్నించారు. బీఫ్ ఫెస్టివల్ కాదు... ఫెస్టివల్ జరుపుకుందామని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement