సింగపూర్కు ఎటువంటి చరిత్ర లేదని, ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని చరిత్రాత్మక కళాఖండంగా తీర్చిదిద్దాలని ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానందస్వామి సూచించారు.
విజయవాడ: సింగపూర్‌కు ఎటువంటి చరిత్ర లేదని, ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని చరిత్రాత్మక కళాఖండంగా తీర్చిదిద్దాలని ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానందస్వామి సూచించారు. 13 జిల్లాల చారిత్రక నేపథ్యం ప్రతిబింభించేలా రాజధాని నిర్మాణం జరగాలని చెప్పారు.
అభివృద్ధిలో అధికారులు, ప్రజా ప్రతినిధులనే గాక ఆరు కోట్ల మంది ప్రజల్ని భాగస్వాములను చేయాలని పరిపూర్ణానందస్వామి పేర్కొన్నారు. ఇప్పటికే అవమానం పాలయ్యామని, రాష్ట్రాభివృద్ధి కోసం అన్ని పార్టీలు భాగస్వామ్యం కావాలని పరిపూర్ణానందస్వామి చెప్పారు.