విజయవాడను కమ్మేసిన పొగమంచు | foggy weather in vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడను కమ్మేసిన పొగమంచు

Published Sat, Dec 23 2017 8:06 AM | Last Updated on Sat, Dec 23 2017 8:06 AM

సాక్షి, విజయవాడ: విజయవాడ నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. కనకదుర్గమ్మ ఆలయ పరిసరాలతో పాటు, కృష్ణా నది, ప్రకాశం బ్యారేజి తదితర ప్రాంతాల్లో పొగమంచు ఆవరించింది. ఉదయం 8 గంటలకు కూడా వాహనాలు మంచు కారణంగా హెడ్ లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు రోజులుగా ఉదయం వేళల్లో పొగమంచు దట్టంగా కురుస్తుండటంతో జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలు కూడా తక్కువ వేగంతో వెళుతున్నాయి. మరో వైపు పొగమంచు కారణంగా ఉదయం వేళల్లో ఏర్పడిన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నగర వాసులు ఎంజాయ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement