వాళ్లక‍్కడ నుంచి కదలరు ... వదలరు | Irregularities in employee transfers at Vijayawada Kanakadurgamma Temple | Sakshi
Sakshi News home page

కదలరు... వదలరు

Published Mon, Oct 28 2019 7:56 AM | Last Updated on Mon, Oct 28 2019 11:07 AM

Irregularities in employee transfers at Vijayawada Kanakadurgamma Temple - Sakshi

దుర్గగుడిలో కొందరు ఉద్యోగులు పాతుకుపోయి చక్రం తిప్పుతున్నారు. దేవస్థానం గురించి క్షుణంగా తెలియడంతో ఇక్కడ నుంచి వేరే దేవాలయాలకు వెళ్లడానికి గానీ, కనీసం దుర్గగుడిలో ఇతర  విభాగాలకు వెళ్లడానికి కూడా వీరు ఇష్టపడటం లేదు. తాము  పనిచేసే విభాగంపై పట్టుబిగించి అందినకాడికి దండుకుంటున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి.  దుర్గగుడికి ఈవోలు    మారతారు గానీ.. వీరు మాత్రం మారనని దేవస్థానంలో ప్రచారం జరుగుతోంది. దుర్గగుడి అంతరాయలంలో సూపరింటెండెంట్‌గా  ఒక ఉద్యోగి దీర్ఘకాలంగా ఉన్నారు. ఆయనకు అమ్మవారి ఆలయంలో తప్పా మరెక్కడా డ్యూటీలు వేయరు. మరో సూపరింటెండెంట్‌ లడ్డూ తయారీ విభాగంలో సీటు కదలడు. ఇంకో సూపరింటెండెంట్‌ పరిపాలన విభాగంలో సెటిల్‌ అయిపోయారు. కేవలం పురుషులే కాదు స్టోర్స్, అకౌంట్స్, అన్నదానంలో పనిచేసే మహిళా జూనియర్‌ అసిస్టెంట్‌లు నాలుగైదేళ్లయినా ఆయా విభాగాలను వదలడం లేదు.

సాక్షి, విజయవాడ: దుర్గగుడిలో కొంతమంది ఉద్యోగస్తులు దీర్ఘకాలంగా పాతుకుపోయారు. దేవస్థానం గురించి క్షుణ్ణంగా తెలియడంతో ఇక్కడ నుంచి వేరే దేవాలయాలకు వెళ్లడానికి గానీ, కనీసం దుర్గగుడిలో ఇతర విభాగాలకు వెళ్లడానికి కూడా వీరు ఇష్టపడటం లేదు. తాము పనిచేసే విభాగంపై పట్టుబిగించి అందినకాడికి దండుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. దుర్గగుడికి ఈవోలు మారతారు గానీ, వీరు మాత్రం మారనని దేవస్థానంలో ప్రచారం జరుగుతోంది. 

సూపరింటెండెంట్లదే హవా !  
దుర్గగుడి అంతరాలయంలో సూపరింటెండెంట్‌గా ఒక ఉద్యోగి దీర్ఘకాలంగా ఉన్నారు. ఆయన అమ్మవారి ఆలయం తప్పా మరెక్కడా డ్యూటీలు వేయరు.  మరో సూపరింటెండెంట్‌ లడ్డూ తయారీ విభాగంలో తిష్ట వేశారు. ఇంకొక సూపరింటెండెంట్‌ పరిపాలన విభాగంలో సెటిల్‌ అయిపోయారు. సూర్యకుమారి, పద్మ, కోటేశ్వరమ్మ ఈవోలుగా మారిన తరువాత సురేష్‌ ఈవోగా వచ్చారు. అయినా సరే వీరు ఆయా విభాగాల్ని మాత్రం వదలకుండా వేళ్లాడుతున్నారు. వీరిని వేరే విభాగానికి బదిలీ చేసే పది రోజుల్లో తిరిగి అదే విభాగానికి వచ్చే విధంగా పావులు కదుపుతారని ఇంద్రకీలాద్రి వర్గాలు చెబుతున్నాయి. ఇక పులిహోర తయారీ విభాగంలో  ఒక కేర్‌టేకర్‌ 2008 నుంచి పాతుకుపోయారు. ఆయన్ను కదిలించే సాహనం ఏ అధికారీ చేయలేదు. దాంతో ఆ విభాగంలో ఆయన హవా పూర్తిస్థాయిలో కొనసాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. దేవస్థానం భూములు విభాగంలో దీర్షకాలంగా సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఒక ఉద్యోగికి అనారోగ్య కారణంగా వేరే విభాగానికి మార్చమని కోరినా ఆయనకు ఆ విభాగం పై పట్టు ఉండటంతో మార్చడం లేదు. దాంతో ఆయన అక్కడే కొనసాగాలి వస్తోంది. 

మహిళలూ మినహాయింపు కాదు....
ఒకే విభాగం వదలకుండా దీర్ఘకాలం పనిచేయడం కేవలం పురుషులే అనుకుంటే పొరపాటే. స్టోర్స్, అకౌంట్స్, అన్నదానంలో పనిచేసే మహిళా జూనియర్‌ అసిస్టెంట్‌ నాలుగైదు ఏళ్ల నుంచి ఆయా విభాగాలను వదలడం లేదు. పరిపాలన విభాగంలో పనిచేసే మరోక మహిళా ఉద్యోగి తీరు అదే విధంగా ఉంది.  బదిలీలు అనగానే వీరు మందు జాగ్రత్త పడిపోవడం, తమకు ఎసరు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం సర్వసాధారణమని తెలిసింది. 

పైరవీల్లో దిట్టలు 
దీర్ఘకాలంగా ఆయా విభాగాల్లో  పాతుకుపోవడం వెనుక వారు పైరవీల్లో నిష్టాతులు కావడమేనని చెబుతున్నారు. ఈవోతో సఖ్యతగా ఉంటూ తమ విభాగం మార్చకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ప్రస్తుత ఈవో అయినా దేవస్థానం ఉద్యోగులను సమూలంగా మార్పులు చేర్పులు చేసి దేవస్థానాన్ని ప్రక్షాళన చేస్తారేమో వేచి 
చూడాల్సిందే ! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement