
పెందుర్తి: కనకదుర్గమ్మ గర్భాలయంలో తాంత్రిక పూజలు ఎవరి కోసం జరిగాయో బహిర్గతం చేయాలని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా క్షుద్ర పూజలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ ఘటన దురదృష్టకరమని, దేశానికి అరిష్టమని, భక్తులకు ప్రమాదకరమని స్వరూపానం దేంద్ర ఆందోళన వ్యక్తం చేశారు.
విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని శారదా పీఠంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దుర్గమ్మ సాత్విక శక్తులను అణచివేసేలా.. భయంకరమైన క్షుద్రశక్తులను ఆలయంలోకి రప్పిస్తారా అని స్వరూపానందేంద్ర మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.