Swarupananda Swamiji
-
పీఠమంటే అర్చనలు పూజలు కాదు : స్వరూపానందేంద్ర స్వామి
-
మే 5 తర్వాత కరోనా తగ్గుముఖం : శారదా పీఠాధిపతి
సాక్షి, విశాఖపట్నం : కరోనా వైరస్ నియంత్రణపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎన్నో చూసిందని, కరోనా గురించి నైరాశ్యం వద్దని పేర్కొన్నారు. ప్రజలంతా భగవంతుడి రక్షణ కోరుకోవాలని సూచించారు. ఈ సమయంలో భగవంతుని నామస్మరణే భారతదేశానికి రక్షణ అని, లాక్ డౌన్ సమయంలో ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలన్నారు. పిల్లల్లో ఆధ్యాత్మిక చింతన పెంచాలని విజ్ఞప్తి చేశారు. ‘ప్రస్తుతం కాలసర్పదోషం ప్రపంచాన్ని వెంటాడుతోంది. గ్రహ పరిస్థితుల కారణంగా కరోనా కంట్రోల్ కావడం లేదు. ఏప్రిల్ 24 నుంచి దుష్ట గ్రహాల ప్రభావం తగ్గుముఖం పడుతుంది. మే 5 తర్వాత ఇది పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కరోనా వైరస్ ప్రమాదకరమే అయినా భగవంతుని కృపతో ఆ ప్రభావం తగ్గుతుంది. జ్యోతిష్య శాస్త్రాన్ని పరిశీలిస్తే ఈ వైరస్ ప్రభావం సంవత్సరాల తరబడి ఉండదనిపిస్తోంది. కరోనా కారణంగా భారత దేశానికి అంతగా చేటు జరగదు. విశాఖ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి ఉపాసన చేస్తున్నాం. కరోనా ప్రభావాన్ని నివారించేందుకు జపాలు, హోమాలు, యజ్ఞ యాగాదులు నిర్వహించాం’ అని స్వామి స్వరూపానందేంద్ర పేర్కొన్నారు. -
మే 5 తర్వాత కరోనా తగ్గుముఖం
-
శారదా పీఠంలో సీఎం వైఎస్ జగన్
-
స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్న సీఎం జగన్
-
తొలిసారి విశాఖకు సీఎం వైఎస్ జగన్
-
స్వామివారి ఆశీస్సులు తీసుకున్న సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చినముషిడివాడలోని శారదా పీఠానికి చేరుకున్నారు. పూర్ణకుంభంతో వేదపండితులు ఆయనకు స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తులు ధరించిన సీఎం వైఎస్ జగన్ స్వరూపానందేంద్ర స్వామివారికి ఫలాలు సమర్పించారు. అనంతరం ఆయన ఆశీస్సులు తీసుకుని.. రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. మరికాసేపట్లో సీఎం తిరుగుపయనమవుతారు. పాదయాత్రలో ఇచ్చిన హామీమేరకు ఆశ వర్కర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.3 వేల నుంచి 10 వేలకు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై హర్షం వ్యక్తం చేసిన ఆశా వర్కర్లు.. శారదా పీఠాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి శారదా పీఠం నుంచి గన్నవరం విమానాశ్రయానికి, అక్కడ నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి ముఖ్యమంత్రి వెళ్తారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు సజ్జల రామకృష్ణా రెడ్డి, తలశిల రఘురాంతో పాటు మరో ఏడుగురు వైఎస్సార్సీపీ నేతలు ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విశాఖ ఎయిర్ పోర్టు నుంచి చినముషిడివాడ శారదా పీఠం వరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 14 కిలోమీటర్లు అడుగడుగునా పోలీసుల పహారా నెలకొని ఉంది. శారదా పీఠం పరిసర ప్రాంతాలను పోలీసులు పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఇక సీఎం రానుండటంతో ఎన్ఏడీ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో అభిమానులు భారీగా ఆయన స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం హోదాలో వైఎస్ జగన్ తొలిసారి విశాఖ వచ్చిన నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో అదనపు భద్రతా చర్యలు చేపట్టారు. సాధారణ ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా మరోమార్గం గుండా సీఎం రాకకు ఎయిర్‌పోర్టు అధికారులు ఏర్పాట్లు చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తాంత్రిక పూజలు ఎవరి కోసం?
పెందుర్తి: కనకదుర్గమ్మ గర్భాలయంలో తాంత్రిక పూజలు ఎవరి కోసం జరిగాయో బహిర్గతం చేయాలని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా క్షుద్ర పూజలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ ఘటన దురదృష్టకరమని, దేశానికి అరిష్టమని, భక్తులకు ప్రమాదకరమని స్వరూపానం దేంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని శారదా పీఠంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దుర్గమ్మ సాత్విక శక్తులను అణచివేసేలా.. భయంకరమైన క్షుద్రశక్తులను ఆలయంలోకి రప్పిస్తారా అని స్వరూపానందేంద్ర మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. -
దేవాలయాల పవిత్రను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే
-
స్వరూపానంద స్వామితో ఎంపీ
యూనివర్సిటీ క్యాంపస్: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీని కలిశారు. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి తిరుపతిలో నివాసం ఉంటున్న కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎ.చంద్రశేఖర్‌రెడ్డి నివాసానికి ఆదివారం సాయంత్రం వచ్చారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలసి ఆశీస్సులు తీసుకున్నారు.