
స్వరూపానంద స్వామితో ఎంపీ
యూనివర్సిటీ క్యాంపస్: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీని కలిశారు. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి తిరుపతిలో నివాసం ఉంటున్న కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎ.చంద్రశేఖర్‌రెడ్డి నివాసానికి ఆదివారం సాయంత్రం వచ్చారు.
ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలసి ఆశీస్సులు తీసుకున్నారు.