గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వ ఘోర వైఫ్యలంపై, టీడీపీ దాడుల పర్వంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి స్పందించారు. తాజాగా ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్పలపై పుంగనూరులో టీడీపీ శ్రేణులు దాడి చేయడాన్ని ఆయన ఖండించారు.
‘‘ఎంపీ పీవీ మిధున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్పపై టీడీపీ కార్యకర్తల దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. వినుకొండలో రషీద్‌ను హతమార్చిన 24 గంటల్లోనే ఈ దాడి జరగటం దారుణం. అధికారంలోకి వచ్చినప్పటి టీడీపీ కార్యకర్తలు యధేచ్చగా దాడులు చేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో కొత్త ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ అరాచకాలకు సీఎం చంద్రబాబే బాధ్యత వహించాలి అని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన.
I strongly condemn the attack on @YSRCParty Lok Sabha MP PV Midhun Reddy garu and former MP Reddeppa garu by those associated with @JaiTDP.
This incident comes just 24 hours after the brutal murder of Rashid in Vinukonda by a TDP goon. Since coming to power, the new regime has…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 18, 2024
వైఎస్సార్‌సీపీ అత్యవసర సమావేశం
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీని లక్ష్యంగా చేసుకుని టీడీపీ చేస్తున్న దాడులు, పాల్పడుతున్న హింసాత్మక ఘటనలపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. బెంగళూరు పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని తాడేపల్లికి వచ్చిన ఆయన.. గురువారం సాయంత్రం అందుబాటులో ఉన్న నేతలతో తన నివాసంలో భేటీ అయ్యారు.
గన్నవరం ఎయిర్‌పోర్టు బయట అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తున్న జగన్
పల్నాడు జిల్లా వినుకొండలో పార్టీ కార్యకర్త రషీద్ ఒళ్లు గగుర్పొడిచే రీతిలో హత్యకు గురవ్వడం, ఇవాళ చిత్తూరు పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి జరగడం తెలిసిందే. ఈ రెండు ఘటనలపై ఆయన పార్టీ నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక.. రేపు వినుకొండకు వెళ్లనున్న జగన్.. హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చనున్నారు. పార్టీ తరఫున ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన ప్రకటించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో రాక్షస పాలన.. చంద్రబాబుకి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment