సాక్షి, విశాఖపట్నం : కరోనా వైరస్ నియంత్రణపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎన్నో చూసిందని, కరోనా గురించి నైరాశ్యం వద్దని పేర్కొన్నారు. ప్రజలంతా భగవంతుడి రక్షణ కోరుకోవాలని సూచించారు. ఈ సమయంలో భగవంతుని నామస్మరణే భారతదేశానికి రక్షణ అని, లాక్ డౌన్ సమయంలో ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలన్నారు. పిల్లల్లో ఆధ్యాత్మిక చింతన పెంచాలని విజ్ఞప్తి చేశారు.
‘ప్రస్తుతం కాలసర్పదోషం ప్రపంచాన్ని వెంటాడుతోంది. గ్రహ పరిస్థితుల కారణంగా కరోనా కంట్రోల్ కావడం లేదు. ఏప్రిల్ 24 నుంచి దుష్ట గ్రహాల ప్రభావం తగ్గుముఖం పడుతుంది. మే 5 తర్వాత ఇది పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కరోనా వైరస్ ప్రమాదకరమే అయినా భగవంతుని కృపతో ఆ ప్రభావం తగ్గుతుంది. జ్యోతిష్య శాస్త్రాన్ని పరిశీలిస్తే ఈ వైరస్ ప్రభావం సంవత్సరాల తరబడి ఉండదనిపిస్తోంది. కరోనా కారణంగా భారత దేశానికి అంతగా చేటు జరగదు. విశాఖ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి ఉపాసన చేస్తున్నాం. కరోనా ప్రభావాన్ని నివారించేందుకు జపాలు, హోమాలు, యజ్ఞ యాగాదులు నిర్వహించాం’ అని స్వామి స్వరూపానందేంద్ర పేర్కొన్నారు.
మే 5 తర్వాత కరోనా తగ్గుముఖం : శారదా పీఠాధిపతి
Published Fri, Apr 17 2020 9:14 AM | Last Updated on Fri, Apr 17 2020 11:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment