
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె మహోత్సవం ప్రారంభమైంది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి తొలి ఆషాడమాస సారెను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆషాడ మాస సారెను దేవస్థానం తరపున అందజేయటం ఆనందంగా ఉందన్నారు. ఆషాఢంలో ప్రతి ఏడాది పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి సారె సమర్పిస్తారన్నారు. కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటించాలని భక్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
వచ్చే నెల 20 వరకు సారె మహోత్సవం..
వచ్చే నెల 20వ తేదీ వరకు ఆషాఢ సారె మహోత్సవం కొనసాగుతుందని దుర్గ గుడి ఈవో సురేష్‌బాబు తెలిపారు. సారె సమర్పించడానికి వచ్చే భక్తులు ముందుగా ఆన్‌లైన్లలో బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు మాత్రమే అమ్మవారికి సారె సమర్పించాలని వెల్లడించారు. భక్తులు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించి, మాస్క్‌లు ధరించాలని కోరారు. గుంపులు గుంపులుగా రావొద్దని భక్తులకు ఈవో సురేష్‌బాబు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment