సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో అర్చకులు.. సీఎంకు స్వాగతం పలికారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూలానక్షత్రం సందర్భంగా మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సీఎం సమర్పించారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం అంతరాలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అందజేశారు. (చదవండి: దేవదేవుడికి సీఎం పట్టువస్త్రాల సమర్పణ)
ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు సీఎంకు పరివట్టం కట్టి తలపాగా చుట్టారు. పట్టు వస్త్రాలను సీఎం తలపై పెట్టగా వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య వైఎస్ జగన్.. దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నారు. సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. సీఎం జగన్ తో పాటు దుర్గమ్మను దర్శించుకున్న వారిలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, పేర్ని నాని, కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు ఉన్నారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని...
ఎమ్మెల్యే జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కనకదుర్గమ్మకు సీఎం వైఎస్ జగన్ పట్టువస్త్రాలు సమర్పించారని తెలిపారు. దేవీ నవరాత్రుల సందర్భంగా కోటి మంది అక్కచెల్లెమ్మలకు రూ.6782 కోట్లు ఆసరా అందించారని తెలిపారు. ఎంతమంది విఘ్నాలు తలపెట్టినా.. రాక్షసుల రూపంలో అడ్డుతగిలినా కనకదుర్గమ్మ, వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు సీఎం జగన్‌పై ఉంటాయని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు.
చదవండి:
ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు టీడీపీ కుట్ర
Comments
Please login to add a commentAdd a comment