
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలో జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫోన్‌లో సమీక్షించారు. రేపు(బధవారం) ఇంద్రకీలాద్రికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రానున్న సందర్భంగా మంగళవారం మంత్రి ఏర్పాట్లను సమీక్షించారు. దసరా ప్రారంభమై గత మూడు రోజులుగా చేసిన ఏర్పాట్లను భక్తుల విషయంలో తీసుకున్న జాగ్రత్తల గురించి అధికారులను అడిగి తెలుసుకుని, పలు సూచనలు చేశారు. మంత్రితోపాటు ఈవో సురేష్ బాబు ఇతర అధికారులు ఉత్సవాల ఏర్పాట్లను సమీక్షించారు.
ముఖ్యమంత్రి పర్యటన వివరాలు:
రేపు(బుధవారం) మూల నక్షత్రం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అమ్మవారికి పట్టు వస్త్తాలు సమర్పించనున్నారు. ఇందుకోసం సీఎం వైఎస్ జగన్ రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు ఇంటి నుంచి బయలుదేరన్నారు. మధ్యాహ్నం 3:40 గంటలకు దుర్గగుడికి చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం 4 గంటలకు తిరిగి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.