![Minister Vellampalli Srinivas About CM YS Jagan Vijayawada Dussehra Brahmotsavam - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/11/Minister-Vellampalli-Srinivas.jpg.webp?itok=oQiu6OOf)
వెల్లంపల్లి శ్రీనివాస్(ఫైల్ ఫోటో)
సాక్షి, విజయవాడ: అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం దుర్గమ్మను దర్శించికుని.. మధ్యాహ్నం 3 గంటలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆదివారం 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం మూలా నక్షత్రం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు పక్కాగా చేశాం. దీనికి భక్తులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అన్నారు.
ఇంద్రకీలాద్రి: నేడు రెండు అవతారలలో దుర్గమ్మ దర్శనం..
ఇంద్రకీలాద్రిపై దసరామహోత్సవాల్లో నేడు ఐదవరోజు ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇక నేడు రెండు అవతారాలలో దుర్గమ్మ దర్శనమిస్తుంది. పంచమి, షష్టి తిథులు ఏకమవ్వడంతో అమ్మవారికి రెండు అలంకారాలు చేస్తారు. ఉదయం అన్నపూర్ణా దేవిగా దర్శనమిస్తుండగా.. మధ్యాహ్నం 12 గంటల నుంచి మహాలక్ష్మీ దేవిగా భక్తులకు అమ్మవారి దర్శనం లభిస్తుంది. సోమవారం ఉదయం 4 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి.
(చదవండి: దుర్గమ్మ దర్శనానికి.. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తప్పనిసరి)
తిరుమల: మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు..
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్స మండపంలో శ్రీమలయప్పస్వామివారు మోహినీ రూపంలో దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చాడు.రాత్రి 7 గంటలకు విశేషమైన గరుడవాహన సేవ ఉంటుంది.
చదవండి: టీటీడీ చరిత్రలో అరుదైన దృశ్యం..
Comments
Please login to add a commentAdd a comment