Silk clothes
-
AP: అయోధ్య రామయ్యకు ‘శ్రీరామకోటి పట్టు వస్త్రం’
ధర్మవరం: అందరి బంధువు అయోధ్య రామయ్యకు ధర్మవరం నేతన్నలు అపూర్వ కానుకను అందజేసి తమ భక్తి ప్రవత్తులను చాటుకోనున్నారు. రామాయణ ప్రధాన ఘట్టాలను ప్రతిబింబిస్తూ 60 గజాల పట్టువస్త్రాన్ని.. రామాయణ మహాకావ్యాన్ని ప్రతిబింబించే చిత్రాలతో పాటు శ్రీరామ నామాలను 16 భాషల్లో డిజైన్ చేసి సమర్పించనున్నారు. ఈనెల 24వ తేదీన ఈ వస్త్రాన్ని అయోధ్యకు పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 4 నెలలు శ్రమించి.. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని నేసేపేటకు చెందిన జూజారు నాగరాజు ప్రముఖ పట్టుచీరల డిజైనర్. అయోధ్య రామాలయ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి చేనేతల తరఫున శ్రీరామునికి ఏదైనా కానుక పంపాలని ఆలోచించి ఈ మహాత్కార్యానికి పూనుకున్నాడు. పల్లా సురేంద్రనాథ్, పల్లా తేజ అనే ఇద్దరు నేత కారి్మకుల సహకారంతో 4 నెలలు శ్రమించి 60 గజాల పట్టువస్త్రాన్ని తయారు చేసి మహాయజ్ఞాన్ని పూర్తి చేశాడు. ఈ పట్టు వ్రస్తానికి ‘శ్రీరామకోటి’ పట్టు వస్త్రంగా నామకరణం చేశాడు. 60 గజాల పొడవు..16 కేజీల బరువు చేనేత మగ్గంపై 6 గజాల పట్టుచీర తయారు చేయడం సర్వ సాధారణం. అయితే శ్రీరామకోటి పట్టు వ్రస్తాన్ని ఎంతో నైపుణ్యంతో 60 గజాల పొడవు, 44 ఇంచుల వెడల్పు 16 కేజీల బరువుతో తయారు చేయడం ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. ఇందుకోసం రూ.1.50 లక్షలు ఖర్చు చేశారు. వస్త్రం తయారీకి పట్టు, నూలు, లెనిన్, బనానాయార్న్, పాలిష్టర్తో పాటు గోల్డ్, సిల్వర్, కాపర్ జరీలు, వెల్స్పన్ తదితర ముడిపదార్థాలను వాడారు. పూర్తిగా ప్రకృతి సిద్ధమైన రంగులతో ఎటువంటి కెమికల్స్ వాడకుండా వస్త్రం తయారు చేయడం ఈ వస్త్రం ప్రత్యేకత. రామాయణంలో ప్రధాన ఘట్టాలు,168 రకాల చిత్రాలు రామాయణంలోని ప్రధాన ఘట్టాలైన శ్రీరాముని జననం, విద్యాభ్యాసం, పట్టాభిõÙకం, వనవాసం, సీతాపహరణం, రావణసంహారం, హనుమంతుని సంజీవని పర్వత ఘట్టాలను తెలుపుతూ పట్టు వ్రస్తాన్ని తయారు చేశారు. మొత్తం 168 రకాల చిత్రాలను అంచుల్లో రూపొందించారు. 16 భాషల్లో శ్రీరామ నామాలు డిజైన్ పట్టు వస్త్రం మధ్య భాగంలో ఆకుపచ్చ, తెలుపు, ఆనంద, మెరూన్, పింక్, చాక్లేట్, రాయల్బ్లూ, ఆలివ్‌గ్రీన్, వైట్ తదితర రంగుల్లో శ్రీరామ నామాలను తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మళయాళం, ఒరియా, గుజరాతీ, పంజాబీ, బెంగాళీ, ఉర్దూ, ఇంగ్లిష్, అస్సాం, సింహళ (శ్రీలంక) భాషల్లో లిఖించారు. పట్టువస్త్రంపై మొత్తం 32,200 రామనామాలు పొదిగారు. నాలుగు నెలలు శ్రమించాం.. ధర్మవరం నేతన్నల తరఫున శ్రీరామకోటి పట్టు వ్రస్తాన్ని తయారు చేయడం నా పూర్వ జన్మ సుకృతం. పట్టు వ్రస్తాన్ని పంపేందుకు ఆలయ ట్రస్ట్ సభ్యులకు సమాచారం ఇచ్చాం. వారి నుంచి అనుమతి రాగానే పట్టు వ్రస్తాన్ని పంపుతాం. –జూజారు నాగరాజు, డిజైనర్, ధర్మవరం. -
విజయవాడ కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి .. ఇంకా ఇతర అప్డేట్స్
-
దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు. అనంతరం అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతీదేవిని దర్శించుకున్న సీఎంకు ఆలయ వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించారు. అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్నిసీఎంకు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అందజేశారు. తొలుత ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం జగన్‌కు పూర్ణకుంభంతో వేద పండితులు, అధికారులు స్వాగతం పలికారు. ఆలయ చిన్న రాజగోపురం వద్ద సీఎం జగన్‌కు అర్చకులు పరివేష్టం చుట్టారు. శుక్రవారం అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం కావడంతో సరస్వతీ దేవి రూపంలో అమ్మవారు భక్తులకు అనుగ్రహించారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం నాడు దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. రద్దీకి అనుగుణంగా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. -
శ్రీవారి సేవలో సీఎం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలను సమర్పించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండుసార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. రెండు రోజుల పాటు తిరుపతి, తిరుమలలో గడిపిన సీఎం జగన్ శ్రీవారి సేవలో పాల్గొనడంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తిరుపతిలో నూతనంగా నిర్మించిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్, ఎస్వీ హాస్టల్ నూతన భవనాలను ప్రారంభించడంతోపాటు టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. మంగళ వాయిద్యాల నడుమ... మొదటి రోజైన సోమవారం రాత్రి శ్రీవారికి సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు. తొలుత తిరుపతి నుంచి రోడ్డు మార్గాన తిరుమల చేరుకున్న సీఎం జగన్ భక్తుల కోసం దాతల సహకారంతో టీటీడీ నిర్మించిన రెండు విశ్రాంతి గృహాలను ప్రారంభించారు. పద్మావతి అతిథి గృహంలో కొద్దిసేపు గడిపారు. అనంతరం శ్రీవారి ఆలయానికి ఎదురుగా కొలువై ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రధాన అర్చకులు ముఖ్యమంత్రికి పరివట్టం కట్టారు. అనంతరం సీఎం జగన్ ప్రభుత్వం తరఫున తీసుకొచ్చిన పట్టువస్త్రాలను తలపైన పెట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ధ్వజ స్తంభానికి నమస్కరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళమాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు సీఎం జగన్‌ను ఆశీర్వదించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు, శ్రీవేంకటేశ్వర స్వామివారి కలంకారీ చిత్రపటాన్ని అందజేశారు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, కార్య నిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి సీఎం వెంట ఉన్నారు. మరోసారి శ్రీవారిని దర్శించుకున్న సీఎం సోమవారం రాత్రి పద్మావతి అతిథి గృహంలో బస చేసిన ముఖ్యమంత్రి జగన్ మంగళవారం ఉదయం ప్రాతః కాల సమయంలో తిరుమల శ్రీవారిని మరోసారి దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ముఖ్యమంత్రి జగన్‌కు వేదపండితులు వేదాశీర్వచనం అందచేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ముఖ్యమంత్రికి అందించారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రులు కొడాలి నాని, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్సీలు సిపాయి సుబ్రమణ్యం, భరత్, ఈవో ఏవీ ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. ప్రాచీన సంప్రదాయాన్ని పాటిస్తూ గంగమ్మకు పూజలు ముఖ్యమంత్రి జగన్ సోమవారం సాయంత్రం తిరుమలకు బయలుదేరే ముందు ప్రాచీన సంప్ర దాయాన్ని పాటిస్తూ తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి, ఆదిమూలపు సురేష్, రోజా, తుడా చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గంగమ్మను శ్రీవేంకటేశ్వరుని సోదరిగా పురాణాలు చెబుతున్నాయి. ఏటా గంగమ్మ జాతర సందర్భంగా తిరుమల శ్రీవారి తరపున సంప్రదాయంగా గంగమ్మకు సారె పంపుతారు. సీఎం తిరుమల చేరుకునే ముందు గంగమ్మను దర్శించుకునే సంప్రదాయం చాలా దశాబ్దాల తరువాత గత సంవత్సరం నుంచి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి కృషితో పునఃప్రారంభమైంది. తిరుమలలోని పద్మావతి అతిథి గృహం ప్రాంతంలో దాతలు రాజేష్‌శర్మ, నరేంద్ర చౌదరి ఇ చ్చిన విరాళాలతో టీటీడీ వేర్వేరుగా నిర్మించిన 2 అతిథి గృహాలు వకుళామాత నిలయం, రచన విశ్రాంతి గృహాలను సీఎం ప్రారంభించారు. సోమవారం రాత్రి స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ముద్రించిన 2024 డైరీలు, క్యాలెండర్లను సీఎం జగన్ ఆవిష్కరించారు. ఇవి సెప్టెంబరు 22 నుంచి తిరుమల, తిరుపతిలో అందుబాటులో ఉంటాయి. అక్టోబరు రెండో వారం నుంచి ఇతర ప్రాంతాల్లో భక్తులకు అందుబాటులో ఉంటాయి. రూ.600 కోట్లతో 7 వేల మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు అన్నింటికన్నా సంతోషించే విషయం.. టీటీడీలో పనిచేస్తున్న దాదాపు 6,700 మంది ఉద్యోగులకు కచ్చితంగా ఇళ్ల స్థలాలు ఉండాలని, వారికి మంచి చేయాలన్న తపనతో వేగంగా అడుగులు వేశాం. రూ.313 కోట్లను ఖర్చు చేసి 3,518 మందికి ఇవాళ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. మరో రూ.280 కోట్లు ఖర్చు చేసి ఇంకో 3,500 మందికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం. నెల నుంచి 45 రోజుల్లోగా ఇది కూడా పూర్తి చేస్తామని కలెక్టర్ చెప్పారు. దాదాపుగా రూ.600 కోట్లతో సుమారు 7 వేల మంది టీడీపీ ఉద్యోగులందరికీ ఇళ్ల పట్టాలిచ్చి వారి మొహల్లో సంతోషం చూసే మంచి కార్యక్రమం చేస్తున్నాం. 22 ఏ నుంచి తొలగించి పూర్తి హక్కులు తిరుపతిలో దాదాపు 8,050 మంది ఇళ్లు కట్టుకుని 22 ఏ సమస్యలో ఇరుక్కుని అమ్ముకోవాలనుకున్నా, పిల్లలకు ఇవ్వాలనుకున్నా కుదరక ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజుల కిందట వరదల సమయంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని నా దృష్టికి తెచ్చారు. ఆ సమస్యను పరిష్కరించి తిరుపతి ప్రజలకు మంచి చేస్తూ 22–ఏ నుంచి వాటిని డిలీట్ చేయించాం. చంద్రగిరిలో కూడా 2,500 మందిని 22–ఏ నుంచి డిలీట్ చేసి వారికి కూడా ఉపశమనం కలిగించాం. దేవుడి దయతో వీటన్నింటి వల్లా మంచి కోరుకుంటూ దాదాపు రూ.1,300 కోట్లకు సంబంధించిన పలు కార్యక్రమాలను ప్రారంభించుకుంటున్నాం. టెంకాయ కొట్టి వదిలేసిన టీడీపీ సర్కారు తిరుపతిలో గత ప్రభుత్వం టెంకాయ కొట్టి వదిలేసిన ప్రాజెక్టుని నాలుగేళ్లుగా చేయి పట్టుకుని నడిపిస్తూ శ్రీనివాస సేతుని పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. సోమవారం సాయంత్రం శ్రీనివాస సేతు వంతెనను ప్రారంభించిన సీఎం జగన్ ప్రజలకు అంకితం చేశారు. విద్యార్థులకు మరింత మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు నిర్మించిన శ్రీవేంకటేశ్వర కళాశాల హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. ‘శ్రీనివాస సేతు ప్రాజెక్టుకు 2019లో ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం టెంకాయ కొట్టి, జీవో ఇచ్చి వదిలేసింది. నాలుగేళ్లలో చిత్తశుద్ధితో పూర్తిచేసి ఇవాళ తిరుపతి ప్రజలకు అంకితం చేస్తున్నాం. దాదాపు రూ.650 కోట్ల వ్యయంతో నిర్మించిన 7 కి.మీ. పొడవైన ఈ ఫ్లైఓవర్‌తో భక్తులకు ఎంతో మేలు జరుగుతుంది. శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీ హాస్టళ్లకు సంబంధించి రూ.37.80 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన భవనాలను కూడా ఇవాళ ప్రారంభించుకుంటున్నాం. దీనివల్ల విద్యార్థులకు మరింత మెరుగైన వసతి అందుబాటులోకి రానుంది’ అని సీఎం పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. -
ఏపీ సర్కార్ తరుపున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి బొత్స
-
పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
-
బెజవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ ఛైర్మన్
సాక్షి, విజయవాడ: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ దుర్గమ్మకు టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు పట్టువస్త్రాలు అందజేశారు. ఈ సందర్బంగా వై.వి. సుబ్బారెడ్డి దంపతులకు ఆలయ మర్యాదలతో దుర్గగుడి ఈవో భ్రమరాంబ, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. కాగా, దసరా ఉత్సవాల్లో టీటీడీ దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. అనంతరం.. మహిషాసురమర్ధిని అలంకారంలో ఉన్న దుర్గమ్మను వారు దర్శించుకున్నారు. ఇక, దర్శనానంతరం వేద పండితులు దంపతులిద్దరికీ వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా దుర్గగుడి ఈవో భ్రమరాంబ.. సుబ్బారెడ్డి దంపతులకు అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. దర్శనం అనంతరం వై.వి. సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉంది. టీటీడీ తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాము. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతి బ్రహ్మోత్సవాల కోసం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశాము. దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కూడా చక్కని ఏర్పాట్లు చేశారు. మూలా నక్షత్రం రోజున అమ్మవారిని రెండున్నర లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. సీఎం జగన్ పాలనలో సకాలంలో వర్షాలు పడి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధించాను’ అని తెలిపారు. -
దుర్గమ్మ సేవలో సీఎం జగన్
-
ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం జగన్.. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు. ►అమ్మవారి ఆలయంలో సీఎం జగన్ ప్రత్యేక పూజలు ► సీఎం జగన్‌కు అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేసిన దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. ► అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ► ఆలయ చిన్నరాజగోపురం వద్ద సీఎం జగన్ తలకు పరివేష్టం చుట్టిన ఆలయ అర్చకులు. ► పూర్ణకుంభంలో సీఎం జగన్‌కు స్వాగతం పలికిన ఆలయ అధికారులు ► పంచెకట్టులో అమ్మవారి దర్శనానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ► ఇంద్రకీలాద్రి చేరుకున్న సీఎం జగన్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్న దుర్గమ్మ. -
దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా రేపు (02.10.2022, ఆదివారం) మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దర్శించుకోనున్నారు. అంతేకాదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఇక ఇంద్రకీలాద్రిపై దసరా శోభ కనిపిస్తోంది. దసరా నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మూలానక్షత్రం సందర్భంగా భక్తులు భారీగా పోటెత్తుతారని ఆలయ అధికారులు అంచనా వేసి.. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. -
దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ
సాక్షి, విజయవాడ: దసరా నవరాత్రుల సందర్భంగా బెజవాడ దుర్గమ్మకు టీటీడీ అర్చకులు సారె సమర్పించారు. టీటీడీ అధికారులు, అర్చకులకు దుర్గగుడి ఆలయ ఈవో భ్రమరాంబ,ఆలయ ఛైర్మన్ పైలా సోమినాయుడు,అధికారులు స్వాగతం పలికారు. దసరా ఉత్సవాల్లో టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. మహిషాసురమర్దినీదేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను టీటీడీ బోర్డు మెంబర్లు దర్శించుకున్నారు. చదవండి: ‘కట్టుకథలు.. చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య’ -
దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ ఫొటోలు
-
దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో అర్చకులు.. సీఎంకు స్వాగతం పలికారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూలానక్షత్రం సందర్భంగా మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సీఎం సమర్పించారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం అంతరాలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అందజేశారు. (చదవండి: దేవదేవుడికి సీఎం పట్టువస్త్రాల సమర్పణ) ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు సీఎంకు పరివట్టం కట్టి తలపాగా చుట్టారు. పట్టు వస్త్రాలను సీఎం తలపై పెట్టగా వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య వైఎస్ జగన్.. దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నారు. సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. సీఎం జగన్ తో పాటు దుర్గమ్మను దర్శించుకున్న వారిలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, పేర్ని నాని, కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు ఉన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని... ఎమ్మెల్యే జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కనకదుర్గమ్మకు సీఎం వైఎస్ జగన్ పట్టువస్త్రాలు సమర్పించారని తెలిపారు. దేవీ నవరాత్రుల సందర్భంగా కోటి మంది అక్కచెల్లెమ్మలకు రూ.6782 కోట్లు ఆసరా అందించారని తెలిపారు. ఎంతమంది విఘ్నాలు తలపెట్టినా.. రాక్షసుల రూపంలో అడ్డుతగిలినా కనకదుర్గమ్మ, వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు సీఎం జగన్‌పై ఉంటాయని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. చదవండి: ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు టీడీపీ కుట్ర (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
శ్రీవారి బ్రహ్మోత్సవాలు: శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
-
శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దర్శించుకున్నారు. సాంప్రదాయ పంచకట్టుతో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సీఎంకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం 2022 టీటీడీ క్యాలెండర్, డైరీ సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. అనంతరం గరుడ వాహన సేవలో సీఎం పాల్గొన్నారు. తిరుపతి, తిరుమలలో పర్యటిస్తున్న సీఎం వైఎస్ జగన్.. పలు అభివృద్ధి కార్యక్రమాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ముందుగా తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం అలిపిరి వద్దకు చేరుకున్న సీఎం జగన్.. శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి తిరుమల చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో, మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం బేడి ఆంజనేయ స్వామిని సీఎం దర్శించుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తెలంగాణకు వచ్చేసిన క్వీన్ ఆఫ్ సిల్క్స్..
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర ప్రాంతంలో ప్రాచీన కాలం నాటి చేనేతలుగా పేరొందిన పైథానీ చేనేత కళ తెలంగాణ ప్రాంతానికీ చేరువైంది. అథీకృత చేనేత సిల్క్ ఫ్యాబ్రిక్ చీరలకు ప్రసిద్ధి చెందిన ఓన్లీ పైథానీ బ్రాండ్... తెలంగాణ రాష్ట్రంలో తమ శాఖల విస్తరణ షురూ చేసింది. తాజాగా హైదరాబాద్, బంజారాహిల్స్‌లో తమ ఓన్లీ పైథానీ స్టోర్ ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ పైథానీ విశేషాలను తమ సేవల వివరాలను తెలిపారు. క్వీన్ ఆఫ్ సిల్క్స్.. క్వీన్ ఆఫ్ సిల్క్స్గా దేశవ్యాప్తంగా పేరొందిన పైథానీ నవవధువు దుస్తులకు సంప్రదాయ చిరునామాగా పేరొందింది. సహజమైన, స్వఛ్చమైన ఆర్గానిక్ ఫ్యాబ్రిక్స్‌తో రూపొందిన వస్త్రాలతో వినూత్న డిజైన్లుగా ఇవి ఇటీవలి కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చాయి. గత 11ఏళ్లుగా పైథానీ చేనేత సంప్రదాయానికి పునర్వైభవం తెచ్చేందుకు ఓన్లీ పైథానీ బ్రాండ్ సంకల్పించింది. అలాగే పల్లెలు, గ్రామీణ ప్రాంతంలో స్థానిక చేనేత కళాకారుల జీవన స్థితిగతుల బాగు కోసం కృషి చేస్తోంది. తత్ఫలితంగా పైథానీ అందిస్తున్న ప్రతీ చీరా కళాత్మకంగా తయారవడంతో పాటుగా మహారాష్ట్రకు చెందిన పైథానీ చేనేత కళాకారుల ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇప్పుడీ సంప్రదాయ వస్త్ర శోభ తెలుగు రాష్ట్రాల్లోనూ మహిళల వస్త్రధారణలో భాగం కానుంది. చదవండి: Broken Milk:పాలు విరిగాయా? వర్రీ అవద్దు.. ఇలా ఉపయోగించండి! -
కాణిపాకం వినాయకునికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి పెద్దిరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే ఎస్ బాబు, ఆలయ అధికారి వెంకటేష్.. మంత్రికి ఘన స్వాగతం పలికారు. వేదపండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాణిపాకం వినాయక ఆలయంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఇవీ చదవండి: మంచి పనులకు విఘ్నాలు తొలగాలి మహా గణపతిం మనసా స్మరామి... -
హర్ట్ చేయకండి
ఎప్పుడూ కనిపించే అమ్మాయి కూడా దుపట్టా మార్చగానే కొత్తగా కనిపిస్తుంది! దుపట్టాలోని విశేషమే అది. అయితే, మీరెంతో ఇష్టపడే దుపట్టాపై టమాటో సాసో, గ్రేవీనో, చాక్లెట్ మరకో పడితే వాటిని తేలిగ్గా తొలగించే ఉపాయాలు కూడా తెలిసుండాలి. అప్పుడే మీ దుపట్టా కొంచెం కూడా హర్ట్ అవకుండా మీరు ఆ మరకల్ని తొలగించుకోగలరు. కాటన్ దుపట్టాపై మరక పడితే: ఓ కప్పు గోరు వెచ్చని నీళ్లలో రెండు టేబుల్ స్ఫూన్ల బేకింగ్ సోడా వేసి బాగా కలియదిప్పండి. ఈ నీళ్లను దుపట్టాపై మరక పడిన చోట పోయండి. పదిహేను నిముషాలు ఆగాక చల్లటి నీటితో కడిగేయండి. అంతే. మరక మాయం! సిల్క్ దుపట్టాపై మరక పడితే: మరక పడిన చోట మొదట కొన్ని చుక్కల నీళ్లు పొయ్యండి. (చన్నీళ్లే). తర్వాత నిమ్మకాయను సగానికి కోసి, ఒక చెక్కతో మృదువుగా మరకపై రుద్దండి. తర్వాత ఎప్పటిలా ఉతికేయండి. అయితే అందుకు మీరు ఉపయోగించే బట్టల సబ్బు, లేదా పౌడర్ మరీ శక్తిమంతమైనది కాకుండా ఉండాలి. లేదా అది సిల్క్ దుస్తుల కోసమే తయారు చేసిన సబ్బు గానీ పౌడరు గానీ అయి ఉండాలి. నెట్ దుపట్టాపై మరక పడితే: ఒక పాత్రలోకి ఒక కప్పు చల్లటి నీటిని, ఒక టీ స్పూను (టేబుల్ స్పూను కాదు. గుర్తుంచుకోండి) తేలికపాటి డిటర్జెంట్ పౌడర్‌ను వేసి కలపండి. ఆ మిశ్రమాన్ని దుపట్టాపై మరకపడిన చోట పోసి, వలయాకారంలో వేళ్లతో మృదువుగా రుద్దండి. మామూలుగానే మృదువుగా రుద్దాలి. ఇది నెట్ క్లాత్ కనుక మరి కాస్త మృదువుగా రుద్దాలి. టీ మరకలను, జ్యూస్ మరకలను కూడా ఈ మిశ్రమం పోగొడుతుంది. -
వైఎస్సార్ కుటుంబానికి అరుదైన గౌరవం
టీటీడీ చరిత్రలోనే అరుదైన ఘట్టం సోమవారం ఆవిష్కృతమవుతోంది. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రికి దక్కని గౌరవం వైఎస్సార్ కుటుంబానికి దక్కబోతోంది. ముఖ్యమంత్రి హోదాలో తండ్రి, తనయులు శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పించే అద్భుత ఘట్టం. ఆ అపూర్వఘట్టం కోసం తెలుగుప్రజలంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సాక్షి, అమరావతి : టీటీడీ చరిత్రలో వైఎస్సార్ కుటుంబానికి అరుదైన గౌరవం దక్కనుంది. ఒకే కుటుంబంలో తండ్రి, తనయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఘనత వైఎస్ కుటుంబానికి దక్కనుంది. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక పర్యాయాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలేశునికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ ఏడాది అదే ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రభుత్వం తరపున వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. టీటీడీ చరిత్రలో తండ్రి, తనయులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఇంతకుముందెప్పుడు జరగలేదు. తిరుమల వెంకటేశుని ఆశీస్సులతో వైఎస్ కుటుంబానికే ఈ గౌరవం దక్కింది. శ్రీవారిపై వైఎస్సార్ కుటుంబానికి అపారమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి. తండ్రికి తగ్గ తనయుడిలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుగా శ్రీవారి ఆశీస్సులు తీసుకుంటారు. ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించడానికి ముందు, దిగ్విజయంగా పాదయాత్ర పూర్తయిన తర్వాత వెంకన్నను కాలినడకను దర్శించుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కూడా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో స్వామివారికి పట్టువస్త్రా సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు ధ్వజారోహణ కార్యక్రమం అనంతరం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీవారి ఆలయం ముందున్న బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి తలపై స్వామివారి శేషవస్ర్తంతో పరివట్టం కట్టుకుని మేళతాళాల మధ్య శ్రీవారికి పట్టు వస్ర్తాలు తీసుకెళ్తారు. ఆలయ మహాద్వారం ద్వారా ఆలయంలో ప్రవేశించి, గర్భాలయంలో మూలవిరాట్టు ముందు అర్చకులకి, అధికారులకు పట్టువస్త్రాలు అందిస్తారు. -
పట్టువస్త్రాలు సిద్ధం
అమరచింత(కొత్తకోట): నియమనిష్టలతో చేనేతమగ్గంపై కురుమూర్తిస్వామికి భక్తిశ్రద్ధలతో 15రోజులపాటు పట్టువస్త్రాలు తయారుచేశారు. 11ఏళ్ల నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలకు అమరచింత పద్మశాలి కులస్తులు పట్టువస్త్రాలు, స్వామివారితో పాటు చెన్నమ్మకు కూడా పట్టుచీరను తయారుచేసి అందించడం ఆనవాయితీ. అమ్మాపూర్ సంస్థానాదీశులు శ్రీరాంభూపాల్ ఆలయ ధర్మకర్తగా ఏటా అమరచింత పద్మశాలి కులస్తులతో బ్రహ్మోత్సవాలకు పట్టువస్త్రాలను తయారుచేయిస్తు వస్తున్నారు. అప్పట్లో నరాల సింగోటం అనే పద్మశాలి నేత కార్మికుడు బ్రహ్మోత్సవాల ముందురోజు నుంచి స్వామివారి పుష్కరిణిలోనే డ్రమ్ముల సహాయంతో కోనేరులోనే పట్టువస్త్రాలను తయారుచేసి స్వామివారికి అలంకరించేవారు. తదుపరి కోటకొండ కుర్మన్న, కొంగరి చిన్నయ్య అనంతరం 11ఏళ్లుగా అమరచింత పద్మశాలి సంఘం అధ్యక్షుడు దేవరకొండ లచ్చన్న తన స్వహస్తాలతో పట్టువస్త్రాలను తయారుచేస్తున్నారు. ఈ ఏడాది ఎంకంపల్లి శ్రీనివాసులు స్వామివారి పట్టువస్త్రాల తయారీకి శ్రీకారం చుట్టారు. అమరచింత చేనేత సహకార సంఘం, పద్మశాలి కులస్తుల సహాయ సహకారాలతో ప్రతి ఒక్కరూ పట్టువస్త్రాల తయారీకయ్యే ఖర్చును భరిస్తు బ్రహ్మోత్సవాలకు అందిస్తువస్తున్నారు. అక్టోబర్ 25న జరిగే అలంకరణోత్సవ కార్యక్రమంలో భాగంగా అమరచింత నుంచి తయారుచేసిన పట్టువస్త్రాలను భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా స్వామివారి ఆభరణాల వెంటనే వస్త్రాలను తీసుకెళ్లనున్నారు. లాటరీ పద్ధతిన ఎంపిక అలంకరణోత్సవం సందర్భంగా కురుమూర్తిస్వామికి పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని ఊరేగింపు నిర్వహిస్తారు. దీనికిగాను పద్మశాలి సోదరులు లాటరీ పద్ధతిన అందరి పేర్లను చీటీలపై రాసి వీటిలో నుంచి ముగ్గురిని ఎంపిక చేస్తారు. మార్కండేయస్వామి దేవాలయం నుంచి కొత్తబస్టాండ్ వరకు ఒకరు, ఆత్మకూర్ ఎస్బీహెచ్ నుంచి అమ్మాపురం సంస్థానం వరకు మరొకరు, అమ్మాపురం నుంచి కురుమూర్తి స్వామివారి ఆలయం వరకు ఇంకొకరు తీసుకెళ్తారు. అదృష్టంగా భావిస్తున్నా.. కురుమూర్తిస్వామి నామస్మరణ లేకుండా ఏ పని నిర్వహించలేం. స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను తయారుచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు కాలనీలోని ఎంకంపల్లి శ్రీనివాసులు చేత కురుమన్న స్వామికి పట్టువస్త్రాల తయారీలో సహాయపడుతున్నాను. – దేవరకొండ లచ్చన్న, పట్టువస్త్రాల తయారీదారుడు, అమరచింత -
నేడు దుర్గమ్మకు సీఎం పట్టువస్త్రాలు సమర్పణ
-
రాఘవేంద్రుడికి వెంకన్న పట్టువస్త్రాలు
మంత్రాలయం (కర్నూలు) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి గురు వైభవోత్సవాల్లో భాగంగా మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ నెల 10న ప్రారంభమైన గురు వైభవోత్సవాలు మంగళవారం నాటితో ముగిశాయి. చివరి రోజున టీటీడీ జేఈఈఓ శ్రీనివాసరాజు, ట్రెజరీ అధ్యక్షుడు గురురాజాచార్ పట్టువస్త్రాలను తీసుకురాగా.. శ్రీమఠం అధికారులు ప్రధాన ముఖద్వారం వద్ద పూర్ణకుంభ స్వాగతం పలికారు. శ్రీమఠం ప్రాంగణంలో పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు ఎదురేగి పట్టువస్త్రాలను స్వీకరించారు. అనంతరం రాఘవేంద్రస్వామి మూల బందావనానికి పట్టువస్త్రాలను అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డోలోత్సవ మండపంలో పీఠాధిపతి మాట్లాడుతూ.. పూర్వాశ్రమంలో రాఘవేంద్ర స్వామి నామం వెంకటనాథుడని గుర్తు చేశారు. కలియుగ దైవం వెంకటేశ్వరుడు అయితే.. జగద్గురువుగా రాఘవేంద్ర స్వామి ప్రజల హదయాల్లో కొలువై ఉన్నారన్నారు. ఇరు దైవాల అనుబంధానికి ప్రతీకగా పట్టువస్త్రాల సమర్పణ ఆనవాయితీగా వస్తోందన్నారు. కార్యక్రమంలో మఠం ఏఓ రొద్దం ప్రభాకర్, ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
బోనమెత్తిన గోల్కొండ
* ప్రారంభమైన బోనాల ఉత్సవాలు * పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు నాయిని, పద్మారావు * అమ్మవారికి కల్లుకుండతో సాక హైదరాబాద్: ‘అమ్మా బెలైల్లినాదో.. నా తల్లీ బెలైల్లినాదో..’ అంటూ గోల్కొండ జగదాంబికా అమ్మవారి బోనాల ఊరేగింపుతో తెలంగాణ బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం చారిత్రక గోల్కొండ కోటపై కొలువుదీరిన జగదాంబికా అమ్మవారికి ఆషాడమాసంలో మొదటి పూజ చేసి తొలిబోనం సమర్పించడంతో బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి. లంగర్‌హౌస్‌లో రాష్ట్రప్రభుత్వం తరఫున హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎక్సైజ్ మంత్రి పద్మారావు అమ్మవారికి అధికారిక లాంఛనాలతో పట్టువస్త్రాలు సమర్పించి రాష్ట్ర పండుగ బోనాల ఉత్సవాలను ప్రారంభించారు. పట్టువస్త్రాలతో పాటు అమ్మవారి మొదటి బోనం(నజర్ బోనం), ఒక్కొక్కటీ 15 మీటర్ల ఎత్తు ఉన్న 40 తొట్టెలను ఊరేగింపుగా కోటకు తీసుకెళ్లారు. చోటాబజార్‌లో అమ్మవారి ఉత్సవమూర్తులకు పూజారులు దిగంబరరావు ఇంట్లో పూజలు నిర్వహించి బంగారు ఆభరణాలతో అమ్మవారిని అలంకరించారు. ఆడపడుచులు బోనాలు తీసుకురాగా అక్కడి నుండి పల్లకిలో అమ్మవారిని ఊరేగిస్తూ గోల్కొండ కోటపై కొలువుదీరిన జగదాంబికా అమ్మవారి వద్దకెళ్లారు. లంగర్‌హౌస్ చౌరస్తా నుండి గోల్కొండ కోట వరకు ఆడపడుచులు అడుగడుగునా అమ్మవారికి సాక సమర్పిస్తూ స్వాగతం పలికారు. అమ్మవారి తమ్మునిగా చెప్పబడే పోతరాజుల నృత్యాలు, డప్పు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, యువకుల చిందులు ఊరేగింపులో ప్రధాన ఆకర్షణ గా నిలిచాయి. పలువురు ముస్లిం సోదరులు బోనాల ఊరేగింపునకు పూజలు నిర్వహించి ఊరేగింపులో పాల్గొని ఐకమత్యాన్ని చాటారు. ప్రభుత్వమే నిర్వహిస్తుంది: నాయిని బోనాల ఉత్సవాలను పూర్తి బాధ్యతతో ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహిస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. అమ్మవారు శాంతించి పిల్లలను, తోటి వారిని చల్లంగ చూడాలని కోరుతూ ఎన్ని కష్టాల్లో ఉన్నా అమ్మవారికి ప్రజలు సంతోషంగా బోనాలు సమర్పిస్తారని, పలు గ్రామాల నుంచి ప్రజలు నగరానికి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొంటున్నారని చెప్పారు. ముందుముందు మరింత వైభవంగా బోనాల వేడుకలు నిర్వహిస్తామన్నారు. కల్లు సాక సమర్పించిన పద్మారావు కల్లు కుండను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా తరలివచ్చి జగదాంబికా అమ్మవారికి సాక సమర్పించి అందరినీ ఆకట్టుకున్నారు ఆబ్కారీ మంత్రి పద్మారావు. అమ్మవారికి కల్లును సాక గా సమర్పించడం ఆనవాయితీ అని, అందుకే ఈసారి తాను కల్లు సాక సమర్పించానని పద్మారావు చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బోనాల వేడుకలను ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. ఇకపై సొంత రాష్ట్రంలో మన పండుగను ఎలాంటి ఆటంకాలు లేకుండా ఘనంగా నిర్వహించుకుందామన్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ ప్రధాన సభ్యులు కోయల్కర్ గోవింద్రాజ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు కావూరి వెంకటేష్, జీవన్‌సింగ్ ఈ వేడుకలను నిర్వహించారు. ప్రారంభ వేడుకల్లో బీజేపీ నేత బద్దం బాల్‌రెడ్డి, దైవజ్ఞశర్మ పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు.