కాణిపాకం వినాయకునికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి | Minister Peddireddy Present Silk Clothes To Kanipakam Vinayaka | Sakshi
Sakshi News home page

కాణిపాకం వినాయకునికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి

Published Fri, Sep 10 2021 8:48 AM | Last Updated on Fri, Sep 10 2021 10:19 AM

Minister Peddireddy Present Silk Clothes To Kanipakam Vinayaka - Sakshi

సాక్షి, చిత్తూరు: కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి పెద్దిరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే ఎస్‌ బాబు, ఆలయ అధికారి వెంకటేష్‌.. మంత్రికి  ఘన స్వాగతం పలికారు. వేదపండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాణిపాకం వినాయక ఆలయంలో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి:
మంచి పనులకు విఘ్నాలు తొలగాలి  
మహా గణపతిం మనసా స్మరామి...  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement