present
-
వర్తమానమే... నిజం!
అరణ్యంలో ఉన్న ఓ జ్ఞాని దగ్గరకు వెళ్లిన ఒక యువకుడు తనకు నిజమంటే ఏమిటో చెప్పాలని కోరాడు. వెంటనే జ్ఞాని ‘నిజం సంగతి ఇప్పటికి పక్కనపెట్టు. నేనడిగిన దానికి జవాబు చెప్పు. మీ ఊళ్ళో బియ్యం ధర ఎంతో చెప్పు’ అన్నాడు. అందుకు యువకుడు వినమ్రంగా ‘స్వామీ! నన్ను మన్నించండి. మర్యాద మరచి మాట్లాడుతున్నానని అనుకోకండి. ఇటువంటి ప్రశ్నలు ఇక మీదట నన్ను అడక్కండి. ఎందుకంటే నేను గతకాలపు దారులు మరచిపోయాను. గతానికి సంబంధించినంత వరకు నేను ఇప్పుడు మరణించాను. ఇదిగో ఇప్పుడు నడిచొ చ్చిన మార్గాన్ని కూడా నేను మరచిపోయాను’ అన్నాడు. ‘నువ్వు గత కాలపు భారాన్ని ఇంకా మోస్తున్నావా... లేదా అనేది తెలుసుకోవడానికే బియ్యం ధర ఎంతని అడిగాను. నువ్వు దానికి జవాబు చెప్పి ఉంటే వెంటనే నిన్ను ఇక్కడినుంచి పంపించేసేవాడిని. నిజం గురించి మాట్లాడటానికి తిరస్కరించే వాడిని’ అన్నాడు. ‘అయితే ఇపుడు చెప్పండి నిజమంటే ఏమిటో’ అని అడిగాడు యువకుడు.‘వర్తమానంలో బతకడం తెలీని మనిషిని ఓ తోటలోకి తీసుకు వెళ్ళి ఓ గులాబీ పువ్వుని అతనికి చూపించు. ఈ గులాబీ ఎంత అందమైనదో అని అతనితో అను. వెంటనే అతను దీని వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు. సాయంత్రంలోపు వాడి రాలిపోతుంది అంటాడు. యవ్వనం ఎంతటి సుఖమైనదో చెప్పమని అడిగితే అది నిజమే కావచ్చు కానీ ముసలితనం త్వరగా వచ్చేస్తుందిగా అంటాడు. సంతోషం గురించి మాట్లాడితే అదంతా వట్టి మాయ అంటాడు. కానీ వర్తమానంలో బతకడం తెలిసిన వ్యక్తిని ఓ ఉద్యానంలోకి తీసుకు వెళ్తే అక్కడి రంగు రంగుల పువ్వులను చూపిస్తే వాటిని చూసి అతనెంతగా ఆనందిస్తాడో తెలుసా... ఎన్ని కబుర్లు చెప్తాడో తెలుసా! ఇవి చూడటానికి వచ్చిన దారులను గురించి ఆలోచించవలసిన అవసరమేముందంటాడు.రాలిపోయే పువ్వులైనా సరే ఇప్పుడు ఎంత ఆందంగా ఉన్నాయో అంటాడు. వికసించే పువ్వులు అందమైనవా... రాలిపోయే పువ్వులు అందమైనవా అని అడిగితే గతించిన కాలాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే వర్తమానంలోని నిజాన్ని గ్రహించలేమంటాడు. అది నిజం. ఏది నిజమో అది ఈ క్షణంలో ఉంది. నిజమనేది గతించిన, రానున్న కాలాలకు సంబంధించినది కాదు. వర్తమానమే నిజమైన కాలం’ అని చెప్పాడు జ్ఞాని. యువకుడికి విషయం అర్థమైంది. ఆనందంగా వెనుతిరిగాడు. – యామిజాల జగదీశ్ -
Alia Ranbir Daughter Raha Photos: ఏడాది తర్వాత కూతురి ముఖం చూపించిన రణ్‌బీర్-ఆలియా (ఫోటోలు)
-
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ విజేతలు ఏం చేస్తున్నారు?
టీవీ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో పాల్గొన్న పలువురు పోటీదారులు తమ పరిజ్ఞానం ఆధారంగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా కోటీశ్వరులుగా మారారు. ఈ షో గత రెండు దశాబ్దాలుగా ప్రసారమవుతోంది. శతాబ్దపు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్టింగ్ అన్ని వయసుల ప్రేక్షకులను కట్టిపడేస్తుంటుంది. ఈ షోలో పాల్గొనేందుకు దేశంలోని నలుమూలల నుంచి పలువురు వస్తుంటారు. ప్రస్తుతం ఈ షో సీజన్ 15.. 2023 ఆగస్టు 14 నుండి ప్రారంభమై, విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఈ షోలో కోటీశ్వరులుగా మారిన వారు ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. మొదటి పార్టిసిపెంట్ హర్షవర్ధన్ నవాతే(మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో ఉద్యోగం) ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో కోటి రూపాయలు గెలుచుకున్న మొదటి పార్టిసిపెంట్ హర్షవర్ధన్ నవాతే. అతను 2000 సంవత్సరంలో కేబీసీ మొదటి సీజన్‌కు వచ్చినప్పుడు, ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్నారు. కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్న తర్వాత, అతను యూపీఎస్సీ ప్రిపరేషన్ నుంచి తప్పుకున్నారు. దీని తర్వాత నవాతే ఎబీఏ డిగ్రీ చేసేందుకు బ్రిటన్‌లోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయానికి వెళ్లారు. ప్రస్తుతం హర్షవర్థన్ నవాతే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో పనిచేస్తున్నారు. రవిమోహన్ సైనీ (ఐపీఎస్ అధికారి) ‘కేబీసీ జూనియర్’ 2001లో ప్రసారమయ్యింది. ఇందులో 11వ తరగతి విద్యార్థి రవిమోహన్ సైనీ కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఆ తర్వాత ఆయన ఎంబీబీఎస్ చేశారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గుజరాత్ కేడర్‌లో ఐపీఎస్ అధికారి అయ్యారు. రవి మోహన్ యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. అనిల్ కుమార్ (కేబీసీ ట్రైనర్) కేబీసీలో అనిల్ కుమార్ సిన్హా కోటి రూపాయల మొత్తాన్ని గెలుచుకున్నారు. అనిల్ వృత్తిరీత్యా బ్యాంకు ఉద్యోగి. ప్రస్తుతం అనిల్ యూట్యూబ్‌లో సొంత ఛానల్ నడుపుతున్నారు. ఈ ఛానల్ ద్వారా కౌన్ బనేగా కరోడ్‌పతి కోసం సిద్ధం అవుతున్న ఔత్సాహికులకు సాయం చేస్తున్నారు. రహత్ తస్లీమ్(బోటిక్ నిర్వాహకురాలు) బ్రజేష్ ద్వివేది, మనోజ్ కుమార్ 2005లో కేబీసీలో ఒక్కొక్కరు కోటి రూపాయలు గెలుచుకున్నారు. రహత్ తస్లీమ్ సొంత బొటిక్‌ని తెరిచారు. ఆమె జార్ఖండ్‌లో దీనిని ఏర్పాటుచేశారు. సుశీల్ కుమార్ (ఉపాధ్యాయుడు) బీహార్‌కు చెందిన సుశీల్ కుమార్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో రూ.5 కోట్లు గెలుచుకున్నారు. ఈ మొత్తాన్ని సుశీల్ సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు. పైగా మద్యానికి బానిసయ్యారు. డబ్బునంతా పోగొట్టుకుని, ప్రస్తుతం బీహార్‌లోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. సన్మీత్ (దుస్తుల బ్రాండ్ రూపకర్త) ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో రూ.5 కోట్లు గెలుచుకున్న తొలి మహిళగా సన్మీత్ కౌర్ సహానీ నిలిచారు. ప్రస్తుతం ఆమె ముంబైలో ఉంటున్నారు. ఆమె నటుడు మన్మీత్ సింగ్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె 2015లో ఢిల్లీలో దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించారు. మనోజ్ కుమార్(రైల్వే ఉద్యోగి) కేబీసీ సీజన్ 6లో రైల్వే ఉద్యోగి మనోజ్ కుమార్ కోటి రూపాయలు గెలుచుకున్నారు. అతను శ్రీనగర్‌కు చెందినవ్యక్తి. ఉద్యోగం కారణంగా జమ్మూలో ఉంటున్నారు. ఫిరోజ్ ఫాతిమా(వైద్య ఖర్చులు) ఫిరోజ్ ఫాతిమా 2013లో కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఆ డబ్బును తన తండ్రి చికిత్సకు, కుటుంబ రుణం తీర్చడానికి ఉపయోగించారు. తాజ్ మహ్మద్ (ఇద్దరు అనాథ బాలికలకు వివాహం) తాజ్ మహ్మద్ కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్నారు. తన కుమార్తె కళ్లకు చికిత్స చేయించి, గృహం నిర్మించుకున్నారు. ఇద్దరు అనాథ బాలికలకు పెళ్లిళ్లు కూడా చేశాడు. అచిన్-సార్థక్ (వ్యాపారం) కేబీసీ సీజన్ 8లో తొలిసారిగా రూ. 7 కోట్లు గెలుచుకున్న సోదర ద్వయం అచిన్- సార్థక్‌లు తమ తల్లికి క్యాన్సర్‌కు చికిత్స చేయించారు. ఇప్పుడు ఇద్దరూ సొంతంగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. అదే సీజన్లో కోటి రూపాయలు గెలుచుకున్న మేఘా పటేల్ క్యాన్సర్ నుంచి బయటపడ్డారు. అనామిక(సామాజిక సేవ) అనామిక సామాజిక సేవ చేస్తుంటారు. ఆమె తన సంస్థ కోసం నిధులను సేకరించడానికి కేబీసీ 2017 సీజన్‌కు వచ్చారు. కోటి రూపాయలను తన ఎన్జీవో అభివృద్ధికి వినియోగించారు. బినితా జైన్(కోచింగ్ సెంటర్) అదే ఏడాది బినితా జైన్ కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఈ సొమ్ముతో కొంతమంది పిల్లలకు చదువు చెప్పించారు.. ఇప్పుడు కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అజిత్‌కుమార్ (జైలు సూపరింటెండెంట్) బీహార్‌లోని హాజీపూర్‌కు చెందిన అజిత్ కుమార్ 2018లో కోటి రూపాయలు గెలుచుకున్నాడు. షో ద్వారా వచ్చిన డబ్బుతో పునరావాస కేంద్రాన్ని ప్రారంభించాలన్నారు. ప్రస్తుతం జైలు సూపరింటెండెంట్‌గా ఉన్నారు. ఇంజనీర్ గౌతమ్(సీనియర్ సెక్షన్ ఇంజనీర్) అదే ఏడాది రైల్వేలో సీనియర్ ఇంజనీర్ అయిన గౌతమ్ కుమార్ ఝా కూడా కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఆయన భారతీయ రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు బబిత (కుక్) 2019లో కోటీశ్వరురాలు అయిన బబితా తాడే తన స్కూల్లో వంటమనిషిగా పనిచేస్తున్నారు. షోలో గెలిచిన డబ్బును తన పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేశారు. సనోజ్ కుమార్ (యూపీఎస్సీ కోసం సిద్ధం) అదే ఏడాది కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్న సనోజ్ కుమార్ ఇప్పుడు యూపీఎస్సీ కోసం సిద్ధమవుతున్నారు. నజియా నసీమ్(కమ్యూనికేషన్ మేనేజర్) కేబీసీ సీజన్- 12 మొదటి కోటీశ్వరురాలు నజియా నసీమ్. అప్పుడు ఆమె రాయల్ ఎన్ఫీల్డ్లో కమ్యూనికేషన్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మోహిత శర్మ (ఐపీఎస్ అధికారిణి) అదే సీజన్లో జమ్మూ కాశ్మీర్లో ఐపీఎస్ అధికారిణి మోహితా శర్మ కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఆమె భర్త కూడా ఐపీఎస్ అధికారి. హిమానీ బుందేలా, సాహిల్ ఆదిత్య అహిర్వార్, గీతా గౌర్ ఆగ్రాకు చెందిన హిమానీ బుందేలా కేబీసీ సీజన్ 13లో కోటి రూపాయలు గెలుచుకున్న మొదటి పోటీదారుగా నిలిచారు. అదే సీజన్లో సాహిల్ ఆదిత్య అహిర్వార్, గీతా గౌర్ కూడా కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఈ ముగ్గురు ఇప్పుడు ఏం చేస్తున్నానే సమాచారం అందుబాటులో లేదు. కవితా చావ్లా, శశ్వత్ గోయల్ సీజన్ 14లో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కి చెందిన కవితా చావ్లా కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఈ సీజన్లో ఢిల్లీకి చెందిన శశ్వత్ గోయల్ కూడా కోటి రూపాయలు గెలుచుకున్నాడు. అయితే ఆ తర్వాత రూ.7 కోట్లు అందించే ప్రశ్నకు తప్పుడు సమాధానం చెప్పారు. దీంతో చివరికి రూ.75 లక్షలతో ఇంటి ముఖంపట్టారు. ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని వణికించిన 10 భూకంపాలు -
మంచి మాట: వర్తమానమే జీవితం
మనిషి బతకాల్సింది గతంలోనో, భవిష్యత్తులోనో కాదు వర్తమానంలో. కానీ శోచనీయంగా చాలమంది గతంలోనో, భవిష్యత్తులోనో బతుకుతూ ఉంటారు. గతంలో జరిగిన వాటిని తలుచుకుంటూ వర్తమానాన్ని గడిపేస్తూ ఉంటారు. భవిష్యత్తులో ఇవి చేద్దాం, అవి చేద్దాం అనుకుంటూ వర్తమానాన్ని జారవిడుచుకుంటూ ఉంటారు. ఈ తీరు పెనుతప్పు మాత్రమే కాదు, బతుకును గుట్టుగా కాల్చేసే కనిపించని నిప్పు కూడా. ‘మనలో చాలమంది వర్తమానంలో పూర్తిగా ఉండరు. ఎందుకంటే తమకు తెలియకుండానే వాళ్లు ఈ క్షణం కన్నా తరువాతి క్షణం ముఖ్యమైందని నమ్ముతారు. అలా ఉంటే నువ్వు నీ పూర్తి జీవితాన్ని కోల్పోతావు...’ అని జర్మన్ తాత్విక అధ్యాపకుడు ఎక్‌హార్ట్ టోల్ చెబుతారు. ఒక మనిషి వర్తమానం లో బతకక పోవడం అనే మానసిక దోషానికి విశ్వాసం అనేది లేకపోవడం ప్రధాన కారణం. ఏ వ్యక్తికైనా కాలం మీద, ప్రయత్నాల మీద విశ్వాసం ఉండాలి. అష్టావక్రగీత ఒక సందర్భంలో విశ్వాసాన్ని అమృతం అంటూ‘విశ్వాసామృతాన్ని తాగి సుఖివిగా ఉండు’ అని మనిషికి ముఖ్యమైన సూచనను ఇచ్చింది. సుఖంగా ఉండాలంటే మనిషికి విశ్వాసం అనేది ఉండాలి; ముఖ్యంగా ఆత్మవిశ్వాసం ఉండాలి.‘నిన్ను నువ్వు విశ్వసించడం విజయంలోని తొలి రహస్యం‘ అని గౌతమ బుద్ధుడు తెలియజెప్పాడు. దట్టమైన చీకటిలో ఎగిరే లేదా ఎగరగలిగే పక్షికి ఆత్మవిశ్వాసం ఉంటుంది. తనకు ఆత్మవిశ్వాసం ఉంది అనే భావన పక్షికి ఉండకపోవచ్చు. అంతేకాదు, చీకట్లో ఎగిరే పక్షికి గతం గురించి, భవిష్యత్తు గురించి తలపు లు ఉండవు. వర్తమానంలో పక్షి ఎగురుతోంది; వర్తమానంలో ఎంత చీకటి ఉన్నా అంత చీకటిలోనూ పక్షి ఎగర గలుగుతుంది. ఎందుకంటే పక్షి వర్తమానంలో బతుకుతూ ఉంటుంది. పక్షి మనిషికి ఆదర్శం కావాలి. ‘మనిషి బాధపడడం సుఖం అనుకుంటున్నాడు, సుఖపడడానికి బాధపడుతున్నాడు’ కాబట్టే వర్తమానంలో ఉండీ గతంలోకో, భవిష్యత్తులోకో దొర్లిపోతూ ఉంటాడు. మనిషి ఈ స్థితికి బలి అయిపోకూడదు. మనిషి ఈ స్థితిని జయించాలి.‘గతంలోని శోకంతో పనిలేదు; భవిష్యత్తు గురించి చింతన చెయ్యక్కర్లేదు; వర్తమానంలోని పనుల్లో నిమగ్నం అవుతారు వివేకం ఉన్నవాళ్లు’ అని విక్రమార్క చరిత్ర చక్కగా చెప్పింది. గతంలో సంతోషం ఉండి ఉన్నా, శోకం ఉండి ఉన్నా అవి ఇప్పటివి కావు కాబట్టి గతాన్ని తలుచుకుంటూ ఉండిపోతే మన వర్తమానం వృథా అయిపోతుంది. వర్తమానం వృథా అయిపోతే భవిష్యత్తు కూడా వృథా అయిపోతుంది. గతం గడిచిపోయింది కాబట్టి, వర్తమానం వచ్చేసింది కాబట్టి వర్తమానంలో ఉన్న మనిషి గతంలోనో, భవిష్యత్తులోనో కాకుండా వర్తమానంలోనే ఉండాలి. ‘నీ హృదయం ఒక సముద్రం అంతటిది. వెళ్లి నిన్ను నువ్వు కనుక్కో మరుగున ఉన్న దాని లోతుల్లో’ అని ఫార్సీ తాత్విక కవి రూమీ చెప్పారు. గతంలో భవిష్యత్తు ఉండదు. భవిష్యత్తు గతంలా ఉండకూడదు. మనిషి వర్తమానంలో బతకడం నేర్చుకోవాలి. వర్తమానంలో బతకడం నేర్చుకున్న మనిషి భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుంది. ఉన్నతమైన భవిష్యత్తు కోసం, ఉన్నతమైన జీవితం కోసం మనుషులమైన మనం వివేకంతో వర్తమానంలో నిమగ్నమవ్వాలి. వర్తమానంలో ఉన్న మనిషి తన హృదయపు లోతుల్లోకి వెళ్లి తనను తాను కనుక్కోవాలి. అలా తనను తాను కనుక్కోవాలంటే మనిషి గతంలోనో, భవిష్యత్తులోనో పడిపోతూ ఉండకూడదు. మనిషి వర్తమానంలో మసలాలి; మనిషి వర్తమానంతో మెలగాలి. హృదయపు లోతుల్లోకి వెళ్లి తనను తాను కనుక్కోగలిగిన వ్యక్తి మానసిక దోషాలకు అతీతంగా వర్తమానంలో వసిస్తాడు. – శ్రీకాంత్ జయంతి -
కాణిపాకం వినాయకునికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి పెద్దిరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే ఎస్ బాబు, ఆలయ అధికారి వెంకటేష్.. మంత్రికి ఘన స్వాగతం పలికారు. వేదపండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాణిపాకం వినాయక ఆలయంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఇవీ చదవండి: మంచి పనులకు విఘ్నాలు తొలగాలి మహా గణపతిం మనసా స్మరామి... -
‘నవరత్నాల’బడ్జెట్ నేడే
సాక్షి, అమరావతి: తొలిసారిగా శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జనరంజకంగా తీర్చిదిద్దింది. మేనిఫెస్టోలో నవరత్నాల ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే లక్ష్యంగా బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.2.31 లక్షల కోట్ల నుంచి రూ.2.32 లక్షల కోట్ల మధ్య ఉండవచ్చని సమా చారం. అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం వ్యవసాయానికి రూ.28 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. రైతుల పట్ల సీఎం చిత్తశుద్ధికి ఇదిగో నిదర్శనం.. టీడీపీ సర్కారు పెద్ద ఎత్తున బిల్లులను చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టడమే కాకుండా భారీ అప్పులను నూతన ప్రభుత్వానికి అప్పగించింది. ఆర్థిక వ్యవస్థ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్వయంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌తో కలసి బడ్జెట్ రూపకల్పనపై సుదీర్ఘ కసరత్తు చేశారు. గత సర్కారు బకాయిల్లో కొన్నింటిని పరిగణనలోకి తీసుకుని బడ్జెట్లో కేటాయింపులు చేయడం విశేషం. ఇందుకు ఉదాహరణ రైతులకు గత సర్కారు బకాయి పడ్డ ఇన్పుట్ సబ్సిడీని చెల్లించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించడం. కరువు కాటకాలతో పంటలు కోల్పోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా టీడీపీ సర్కారు ఎగనామం పెట్టింది. గత సర్కారు ఎగ్గొట్టిన రూ.2,000 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని రైతులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఆ మేరకు బడ్జెట్లో కేటాయింపులు చేయించడం అన్నదాతల పట్ల ఆయన చిత్తశుద్ధిని రుజువు చేస్తోంది. మరోపక్క వృథా, దుబారా, ఆర్భాటపు వ్యయాలకు తెరదించుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ ఆయా రంగాలకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. అమ్మ ఒడి, వైఎస్ఆర్ రైతు భరోసా, పేదల గృహాలతో పాటు వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించారు. సంక్షేమానికి పెద్దపీట సుదీర్ఘ కసరత్తు అనంతరం రూపొందించిన బడ్జెట్లో అన్ని సంక్షేమ కార్యక్రమాలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తగిన విధంగా కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రాభివృద్ధిపై దూరదృష్టితో ఆలోచించి గోదావరి జలాలను శ్రీశైలానికి తరలింపు ప్రతిపాదనతోపాటు పోలవరం, వంశధార, గాలేరు నగరి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా బడ్జెట్ రూపొందించారు. రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన అన్ని కుటుంబాలకు యూనివర్శల్ హెల్త్ కేర్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో మధ్య తరగతి ప్రజలకు కొండంత ఆరోగ్య భరోసా కల్పించేలా బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నారు. చేనేత, మత్య్సకారులు, ఆటో డ్రైవర్లుతోపాటు అగ్రి గోల్డ్ బాధితులను ఆదుకునేలా కేటాయింపులు ఉంటాయని పేర్కొంటున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువతుల వివాహాల కోసం పెళ్లి కానుక కింద బడ్జెట్లో కేటాయింపులు చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థకు బడ్జెట్లో తగిన కేటాయింపులు ఉండనున్నాయి. అన్ని పథకాలకు తగిన విధంగా కేటాయింపులు.. ప్రధానంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు కేటాయింపులతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లకు ప్రభుత్వం ప్రత్యేక కేటాయింపులు చేయనుంది. ఆత్మహత్యకు పాల్పడటం లేదా ప్రమాదవశాత్తు చనిపోయిన రైతన్నల కుటుంబాలకు రూ. ఏడు లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు బడ్జెట్లో కేటాయింపులు చేస్తున్నారు. సహకార రంగం పునరుద్ధణకు నిధులు కేటాయించనున్నారు. రైతులకు ఉచితంగా బోర్లు వేసేందుకు బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించనున్నారు. కడపలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు కోసం కూడా బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి బడ్జెట్లో రూ.1,740 కోట్లను కేటాయించనున్నారు. రూ.2.31 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్! గత తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాళా తీయించి నూతన సర్కారుకు ఖాళీ ఖజానా అప్పగించినప్పటికీ సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ రూ. 2.31 లక్షల కోట్ల నుంచి రూ.2.32 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టాలని సుదీర్ఘ కసరత్తు అనంతరం ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి నిర్ణయించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర సొంత ఆదాయం రూ.85 వేల కోట్ల నుంచి రూ.86 వేల కోట్ల వరకు ఉంటుందని బడ్జెట్లో అంచనా వేశారు. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.60 వేల కోట్లకుపైగా వస్తాయని భావిస్తున్నారు. కేంద్ర పన్నుల వాటా రూపంలో రూ.34 వేల నుంచి రూ.36 వేల కోట్ల దాకా రాష్ట్రానికి వస్తాయని అంచనా వేశారు. రూ.28 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్! వ్యవసాయ మంత్రి కన్నబాబుకు బదులుగా అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మంత్రి బొత్స సాగుకు ప్రాధాన్యం ఇస్తూ వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేకంగా బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెడుతోంది. అనుబంధ రంగాలతో కలిపి రూ.28,866 కోట్ల వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో కేవలం వ్యవసాయ రంగానికే రూ.12,510 కోట్లను కేటాయించనున్నారు. పశు సంవర్ధక శాఖకు రూ.1,240 కోట్లు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు రూ.3,212 కోట్లు, విద్యుత్ సబ్సిడీకి రూ.5,000 కోట్లను కేటాయించనున్నారు. అన్నదాతల సంక్షేమం కోసం కృషి చేస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్‌ను గత ఏడాది కన్నా 10 – 15 శాతం ఎక్కువ అంచనాలతో రూపొందించినట్లు సమాచారం. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సోదరుడు సురేష్ అకాల మృతి చెందిన నేపథ్యంలో మంత్రులు బొత్స, మోపిదేవి అసెంబ్లీ, శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా వ్యవసాయానికి ప్రత్యేకంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని యోచించారు. 2013–14 నుంచి ఇది ఆచరణలోకి వచ్చింది. వ్యవసాయానికి గతంలో కేటాయింపులు(రూ. కోట్లలో) నేడు ఉదయం బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ శుక్రవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో తొలిసారిగా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇదే సమయానికి శాసన మండలిలో రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్ సమర్పిస్తారు. వ్యవసాయ బడ్జెట్‌ను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో, మంత్రి మోపిదేవి వెంకటరమణ శాసన మండలిలో ప్రవేపెట్టనున్నారు. అంతకు ముందు శుక్రవారం ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమవేశమై బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేయనుంది. -
టాపు లేచిపోతోంది!
సాక్షి,ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు) : బీచ్‌రోడ్డులోని రాజీవ్ స్మృతి వనం పైకప్పు రేకులు ఎగిరిపోతున్నాయి. హుద్‌హుద్ సమయంలో ఈ భవనం పూర్తిస్థాయిలో దెబ్బతింది. అనంతరం దీనికి మరమ్మత్తులు చేశారు. అయితే కథ మొదటికొచ్చింది. భవనంపైన బిగించిన రేకులు ఊడిపోతున్నాయి. బుధవారం సాయంత్రం వీచిన గాలులకు పైన ఉన్న రేకులు ఎగురుతూ దర్శనమిచ్చాయి. ఇవి అటుగా వెళ్లేవారిపై పడితే ప్రమాదం సంభవించే అవకాశం లేకపోలేదు. -
మీ భవిష్యత్.. మాకు వర్తమానం!
ప్రొఫెసర్ ఇల్లు. కిషోర్ తన గ్యాంగ్ మొత్తాన్నీ వెంటేసుకొని వచ్చి గేటు బయట నిలబడ్డాడు. కిషోర్‌తో సహా గ్యాంగ్ అంతా పిల్లలే! ‘‘ఇదే ప్రొఫెసర్ గారిల్లు. గేట్ మూసుందే!?’’ అంటూ అందరినీ గేటెక్కమన్నట్టు సైగ చేశాడు కిషోర్. పిల్లలంతా గేటెక్కి అక్కణ్నుంచి ఇంట్లోకి దూకారు. లోపలకొచ్చి ఓ పెద్ద మెషీన్ వంక చూస్తూ నోరెళ్లబెట్టారు. ఒక చిన్నపాటి గదంత పెద్దగా ఉంది ఆ మెషీన్. కనిపించిన బటన్స్ అన్నీ నొక్కేస్తున్నారు. లైట్లు వెలుగుతున్నాయి. పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయి. పిల్లలు ఆ శబ్దం ఏమై ఉంటుందా అని జోక్స్ చేసుకుంటున్నారు. వీడియో గేమ్స్ ఆడుకున్నట్లు అక్కడున్నకంప్యూటర్స్తో ఆడుకుంటున్నారంతా. మెల్లిగా ఆ మెషీన్ డోర్ మూసుకుపోయింది. పిల్లలు భయపడిపోతున్నారు. ఈలోపే కృష్ణకుమార్‌కు పిల్లలంతా ప్రొఫెసర్ ఇంటికి వెళ్లారన్న విషయం తెలిసింది. అప్పటికి కృష్ణకుమార్ కూడా ప్రొఫెసర్ ఇంట్లోనే ఉన్నాడు. పరుగెత్తుకుంటూ వెళ్లి పిల్లలందరినీ ఆ మెషీన్ నుంచి బయటపడేశాడు. కృష్ణకు తోడుగా అతడి గర్ల్‌ఫ్రెండ్ హేమ కూడా పిల్లల్ని కాపాడుతూ ఓ చెయ్యందించింది. పిల్లలందరూ బయటపడ్డారు. లైట్లు మళ్లీ వెలిగాయి. శబ్దం మరింత పెరిగింది. హేమ కళ్లు తిరిగి పడిపోయింది. అయోమయంలో ఏదో బటన్ నొక్కింది. డోర్ మూసుకుంది. మెషీన్ పనిచేయడం మొదలుపెట్టింది. అది టైమ్ మెషీన్. గతంలోనికైనా, భవిష్యత్లోకైనా తీసుకెళ్లగలిగే మెషీన్. కృష్ణకుమార్, హేమ మాత్రమే చిక్కుకుపోయారా మెషీన్లో. గతంలోకి వెళుతోందా మెషీన్. సంవత్సరాలు సంవత్సరాలు వెనక్కి.. అలా సంవత్సరాలు సంవత్సరాలు వెనక్కి వెళుతోన్న టైమ్ మెషీన్ సరిగ్గా 1526వ సంవత్సరంలోకి వెళ్లి ఆగిపోయింది. డోర్ తెరుచుకుంది. కృష్ణకుమార్, హేమ ఇద్దరూ ఆ మెషీన్ నుంచి బయటపడ్డారు. కృష్ణ అప్పటికే హేమ వాళ్ల నాన్నను తిడుతున్నాడు. హేమ తండ్రే టైమ్ మెషీన్‌ను తయారు చేసిన ప్రొఫెసర్. చుట్టూ గమనించారిద్దరూ. అంతా కొత్తగా ఉంది. ఎక్కడ చూసినా చెట్లే. అడవి. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని మెల్లిగా నడుస్తూ ముందుకు వెళుతున్నారు. ‘‘ఇదంతా అడవిలా ఉంది కృష్ణా!’’ అంది హేమ.‘‘అసలిది ఏ దేశమో.. ఏ కాలమో..’’‘‘తిరిగి వెళ్లిపోదామా?’’ అనుకుంటూ ఇద్దరూ వెనక్కి తిరగ్గానే ఏవో శబ్దాలు వినిపించాయి. అటు దిక్కుగా చూస్తే ఎవరో మనుషులు. అక్కడి మనుషులు, వ్యవహారం చూసి ఇదేదో రాజుల కాలంలా ఉందన్న నిశ్చయానికి వచ్చారిద్దరూ. కృష్ణ, హేమ.. వాళ్లను అలా గమనిస్తూండగానే ఏదో పెద్ద గొడవ మొదలైంది. ఎవరో దుండగులు ఒక యువతిపై దాడి చేస్తున్నారు. కృష్ణ ఒక్క క్షణంలో వారిమీద విరుచుకుపడ్డాడు. అందరినీ చితకబాది ఆ యువతిని కాపాడాడు. ‘‘నా మానప్రాణములను కాపాడిన యువ కిషోరమునకు కృతజ్ఞతలు..’’ అంది ఆ యువతి గట్టిగా ఊపిరి పీల్చుకొని. ‘‘మీరూ?’’ అడిగాడు కృష్ణ. ఆ యువతి నవ్వుతూ.. ‘‘నేను రాజనర్తకిని. సింహనందిని నా నామధేయము. రాయలవారి ఆస్థానమున నర్తించుట నా వృత్తి..’’ అంది. ‘‘రాయలవారంటే?’’ ‘‘శ్రీకృష్ణదేవరాయ ప్రభువులు..’’ కృష్ణ, హేమ ఒక్కసారే ఆశ్చర్యానికి లోనయ్యారు. ‘‘ఓ మై గాడ్! మనం శ్రీకృష్ణదేవరాయల కాలానికి వచ్చామా?’’ అంది హేమ, సంతోషంతో!సింహనందినికి కృష్ణ, హేమ కొత్తగా కనిపించారు. వాళ్లు వేసుకున్న బట్టలు, వారి భాష.. అంతా కొత్తగా ఉంది. వారిపై ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘మేము మీకంటే ఐదు వందల సంవత్సరాల ముందు వాళ్లం!’’ అన్నాడు కృష్ణ, సింహనందిని వరుస ప్రశ్నలకు, చూపులకు సమాధానంగా. ‘‘నాకేమీయూ అవగతం కాకున్నది..’’ అంది సింహనందిని, అమాయకంగా.కృష్ణకుమార్, హేమ ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ నిలబడ్డారు. మళ్లీ సింహనందినే మాట్లాడుతూ, ‘‘నాతో రండి! ప్రభువులను కలసి.. నన్ను కాపాడినందులకు బహుమతులు అందుకొందురు..’’ అంది. ∙∙ కృష్ణ, హేమ శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానానికి విచ్చేశారు. ప్రభువులు సభకు విచ్చేస్తున్నారంటూ అక్కడివారంతా సందడి చేస్తున్నారు. ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. కృష్ణ అందరినీ చూస్తూ కూర్చున్నాడు. హేమ ‘వీళ్లెవరూ? వీళ్లెవరూ?’ అంటూ అమాయకంగా ప్రశ్నలడుగుతోంది. వాళ్లిద్దరి మాటలలా కొనసాగుతుండగానే, వైభవంగా సభకు విచ్చేశాడు కృష్ణదేవరాయలు. ఆయన వస్తూంటే సభలో కూర్చున్నవారంతా గౌరవంగా లేచి నిలబడి నమస్కరించారు. ప్రభువు తన పీఠంపై కూర్చోగానే అందరూ కూర్చున్నారు. తమ పెద్దలకు అంజలి ఘటించి సభను మొదలుపెట్టాడు కృష్ణదేవరాయలు. సభ జరుగుతుండగానే, కృష్ణ, కృష్ణదేవరాయల కంట పడ్డాడు. ‘‘ఎవరీ పరదేశీయుడు?’’ కృష్ణదేవరాయల ప్రశ్నకు..సింహనందిని లేచి, అడవిలో దుండగుల బారినుంచి తనను కాపాడారని చెప్పింది. ‘‘ఓ! అలాగా!! వీరకుమారా? మీరు ఏ దేశ వాసులు?’’ అనడిగాడు కృష్ణదేవరాయలు. ‘‘మేము తెలుగు వారమే మహారాజా?’’ అని సమాధానమిచ్చాడు కృష్ణ. కృష్ణదేవరాయలు వరుసగా ప్రశ్నలు కురిపిస్తూనే ఉన్నారు. ‘‘మహారాజా! మీ భవిష్యత్ కాలం.. మాకు వర్తమాన కాలం. మేం భవిష్యత్ నుంచి వచ్చిన వాళ్లం.’’కృష్ణదేవరాయలకు కృష్ణ చెప్పేది ఏదీ అర్థం కాలేదు. ‘‘అంటే?’’ అనడిగాడు. ‘‘మేము 20వ శతాబ్దకాలం వాళ్లం. మీకంటే 500 సంవత్సరాలు ముందు వాళ్లం. అందుకే మీ విషయాలన్నీ మాకు తెలుసు..’’ నవ్వుతూ సమాధనమిచ్చాడు కృష్ణ. ‘‘వీరి నాన్నగారు..’’ హేమను చూపిస్తూ.. ‘‘కాలంలో ప్రయాణం చేసే యంత్రాన్ని కనిపెట్టారు. అదెక్కి మేము మీ కాలానికి రావడం తటస్థించింది..’’ కృష్ణ చెప్తూ వెళ్తున్నాడు. కృష్ణదేవరాయలకు ఇదంతా కొత్తగా కనిపిస్తూ ఉంటే, అలా వింటూ ఉన్నాడు. -
అడుగడుగునా భంగపాటే!
- ఎంపీ తోటకు చేదు అనుభవాలు - సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే సహాయ నిరాకరణ - బుట్టదాఖలవుతున్న ఆయన సిఫారసులు - నివ్వెరపోతున్న అనుచరులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లా రాజకీయాల్లో అదృష్టవంతులెవరైనా ఉన్నారా అంటేæ అది కాకినాడ ఎంపీ తోట నరసింహం అని చెబుతారు. 15 ఏళ్ల క్రితం వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేసిన ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాక.. అంచెలంచెలుగా పదవుల నిచ్చెన మెట్లు ఎక్కేశారు. డీసీసీ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పదవులు పొందిన ఆయన ఇప్పుడు కాకినాడ ఎంపీగా ఉన్నారు. నరసింహం రాజకీయ వైభవమంతా ఆయన సోదరుడు, అప్పటి డీసీసీ అధ్యక్షుడు తోట వెంకటాచలం మరణానంతరం ఆయన వారసత్వంగా వచ్చినవే. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని వీడి గత సార్వత్రిక ఎన్నికల్లో మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు అల్లుడిగా, ఆయన ఆశీస్సులతో టీడీపీ తరఫున కాకినాడ ఎంపీ అయిన విషయం తెలిసిందే. ఇంతటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న తోట.. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే ప్రస్తుతం సహాయ నిరాకరణ ఎదుర్కొంటున్నారు. పలు నియోజకవర్గాల్లో అయితే ఎంపీ వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్టు కనిపిస్తోంది. అన్నవరం దేవస్థానం పాలక మండలి ఎంపిక వ్యవహారమే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ఆయన సిఫారసు బుట్టదాఖలు అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానం పాలకవర్గాన్ని ఇటీవల నియమించిన విషయం తెలిసిందే. మొదటి నుంచీ తనకు అత్యంత సన్నిహితుడు, బంధువు అయిన కిర్లంపూడి మండలం తామరాడకు చెందిన తోట అయ్యన్న పేరును తోట నాలుగైదు నెలల కిందట సిఫారసు చేశారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. మరోపక్క వైఎస్సార్ సీపీ తరఫున ఎన్నికై, టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. జగ్గంపేటకు చెందిన కొత్త వెంకటేశ్వరరావు (కొండబాబు) పేరును సిఫారసు చేశారు. దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సిఫారసు చేసినవారికి పదవి ఇవ్వలేదనే వివాదానికి, ఎంపీ తోట అనుచరుడికి కూడా ప్రాధాన్యం ఇవ్వకపోవడం తోడై.. చివరకు పాలకవర్గం ఏర్పాటు కోసం అప్పట్లో విడుదల చేసిన జీఓను రద్దు చేశారు. అయితే, తాజాగా నియమించిన పాలకవర్గంలో కూడా ఎంపీ తోట సిఫారసుకు గడ్డిపోచంత విలువ కూడా ఇవ్వలేదు. ఎంపీ ప్రతిపాదించిన అయ్యన్నను కాదని, ఆర్యవైశ్య సామాజికవర్గం నుంచి జ్యోతుల నెహ్రూ ప్రతిపాదించిన కొండబాబుకు ప్రాతినిధ్యం కల్పించారు. తన పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్నవరం దేవస్థానం పాలకవర్గంలో కూడా తన సిఫారసుకు విలువ లేకుండా చేయడంతో.. ప్రమాణ స్వీకారోత్సవానికి ఎంపీ డుమ్మా కొట్టారు. ఎంపీ సిఫారసు చేసినవారిని దేవస్థానం పాలకవర్గ సభ్యుడిగా తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్నదే. ఇదే తోట గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కమ్మ సామాజికవర్గానికి చెందిన కరుటూరి శ్రీనివాస్‌ను పాలకవర్గ సభ్యుడిగా నియమించుకోగలిగారు. ఎంపీ ముద్రగడ పద్మనాభం హయాంలో కూడా అన్నవరం దేవస్థానం పాలకవర్గంలో ఆయన సిఫారసు మేరకు సభ్యుడిని నియమించారు. కానీ, తోట సిఫారసును మాత్రం తుంగలో తొక్కేశారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన నరసింహానికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన వర్గీయులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నవరం పాలకవర్గంలో సభ్యత్వం మాట దేవుడెరుగు.. ఎంపీ వర్గమని అంటేనే పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తమను అంటరానివారిగా చూస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. సొంత నియోజకవర్గంలోనూ అదే తంతు సొంత నియోజకవర్గం జగ్గంపేటలో కూడా ఎంపీ వర్గాన్ని ఎమ్మెల్యే నెహ్రూ వర్గీయులు దూరం పెడుతున్నారు. ఎమ్మెల్యే వర్గం తమను కనీసం పార్టీ నేతలుగా కూడా చూడటం లేదని జగ్గంపేటలో తోట ముఖ్య అనుచరుడైన బండారు రాజా వంటి నేతలు చాలా గుర్రుగా ఉన్నారు. నియోజకవర్గంలో నామినేషన్ పద్ధతిలో నీరు - చెట్టు పథకం కింద చేపడుతున్న అంతర్గత రహదారులు, ఉపాధి హామీ పథకం లింకేజితో ఇచ్చిన గ్రామీణ రహదారులు, పుంత రోడ్లు, చెరువు అభివృద్ధి పనులను ఏకపక్షంగా వారే ఎగురేసుకు పోతున్నారని అంటున్నారు. ఇంకా పలుచోట్ల.. - పిఠాపురం నియోజకవర్గంలో కూడా తోటకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. అక్కడి ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ వర్గం ఎంపీ తోట వర్గాన్ని పూర్తిగా దూరం చేసేసింది. అధికారిక, పార్టీ కార్యక్రమాలు వేటికీ కూడా ఎంపీ వర్గ నేతలను ఆహ్వానించడం లేదు. ఎంపీతో సఖ్యతగా ఉండటమే మున్సిపల్ చైర్మన్ కరణం చిన్నారావు చేసిన పాపమన్నట్టు.. ఆయనకు ప్రాధాన్యం ఇవ్వకుండా వైస్ చైర్మన్ పిల్లి చిన్నాను ప్రోత్సహిస్తున్నారని ఎంపీ తోట వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేకు వెనుక ఉండి పని చేసిన కాపు సామాజికవర్గ నేతలు కొందరు గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (గుడా) డైరెక్టర్ పదవి ఆశించారు. అందులో మెజార్టీ నేతలు తోట వెంట ఉన్నారని పక్కన పెట్టేశారని అంటున్నారు. ఆ మున్సిపాలిటీలో సంక్షేమ పథకాల అమలులో.. చివరకు పింఛన్లలో కూడా ఎంపీ వర్గాన్ని వివక్షకు గురి చేస్తున్నారని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరకు కాపు రుణాల మంజూరులో కూడా అదే సామాజికవర్గానికి చెందిన చైర్మన్ ప్రమేయం లేకుండా ఎమ్మెల్యే వర్మ వర్గం ఏకపక్షంగా చేసుకుపోతోంది. ఈ వ్యవహారాన్ని పలువురు ఆ సామాజికవర్గ ముఖ్య నేతల వద్దకు తీసుకువెళ్లారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. - ఎంపీ తోట స్వగ్రామం జగ్గంపేట నియోజకవర్గమే అయినా నివాసం ఉంటున్నది మాత్రం కాకినాడ నగరంలోనే. అందునా కాకినాడ నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగి, మేయర్ స్థానం జనరల్ మహిళ అయితే ఎంపీ తోట భార్య, కిర్లంపూడి సర్పంచ్ వాణి పోటీ చేస్తారనే ప్రచారం పార్టీలో ఉంది. ఈ నేపథ్యంలో సిటీలో ఎమ్మెల్యే కొండబాబు వర్గం తోట వర్గీయులతో దూరం పాటిస్తోంది. సిటీలో చౌకధరల దుకాణాల కేటాయింపులో ఎంపీ సిఫారసు చేసినవారిని ఎమ్మెల్యే పక్కన పెట్టేశారన్న ప్రచారం ఉంది. అలాగే, ఎంపీతో సఖ్యతగా ఉంటున్నారన్న కారణంతో నున్న దొరబాబును టీడీపీ నగర అధ్యక్ష పదవి నుంచి తప్పించారనే ఆరోపణలు పార్టీలో బలంగా ఉన్నాయి. - ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురంతోపాటు తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో సైతం ఎంపీ వర్గానికి ఇటువంటి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. -
మహిళా మణులదే పైచేయి
ఏలూరు (మెట్రో) : ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 15 నియోజకవర్గాల ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. గత ఏడాది జనవరి 1న తుది జాబితాను ప్రకటించగా.. 2017 సంవత్సరానికి సంబంధించిన జాబితాను సోమవారం ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో 2,30,177 మంది ఓటర్లు పెరిగారు. దీంతోపాటు ఈ ఏడాది 30,426 మంది మహిళా ఓటర్లు పెరిగారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో మహిళలే అగ్రస్థానంలో ఉన్నారు. వ్యత్యాసం ఇలా గత ఏడాది జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 26,12,204 కాగా, అందులో 14,35,582 మంది పురుషులు ఉన్నారు. మహిళా ఓటర్లు 11,76,391 మంది. ఆ ఏడాది ఇతర ఓటర్లు (హిజ్రాలు) 231 మంది. ఈ ఏడాది మొత్తం ఓటర్లు 28,42,381 మంది కాగా, ఇందులో పురుషులు 14,04,958 మంది కాగా, మహిళలు 14,37,162 మంది. ఇతరుల జాబితాలో మరో 30 మంది పెరగ్గా, వారి సంఖ్య 261కు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 30,624 మంది పురుషు ఓటర్లు తగ్గారు. గత ఏడాదితో పోలిస్తే మహిళా ఓటర్ల సంఖ్య 2,60,771 పెరిగింది. చింతలపూడి నియోజకవర్గంలో అత్యధికంగా 2,35,379 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా నరసాపురంలో 1,52,489 మంది ఓటర్లు మాత్రమే నమోదయ్యారు. తణుకు నియోజకవర్గంలో ఇతరుల జాబితాలో ఒక్క ఓటరు కూడా నమోదుకాకపోగా, భీమవరం నియోజకవర్గంలో 103 ఇతరుల జాబితాలో తమ ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలిలా నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం కొవ్వూరు 75,282 77,349 06 1,52,641 నిడదవోలు 89,826 91,794 18 1,81,638 ఆచంట 75,039 76,354 01 1,51,394 పాలకొల్లు 82,201 83,400 09 1,65,610 నరసాపురం 75,985 76,496 08 1,52,489 భీమవరం 1,08,452 1,11,954 103 2,20,509 ఉండి 96,655 97,528 16 1,94,199 తణుకు 1,01,233 1,06,329 00 2,07,562 తాడేపల్లిగూడెం 90,786 93,615 11 1,84,412 ఉంగుటూరు 88,907 89,191 09 1,78,107 దెందులూరు 96,082 97,677 07 1,93,766 ఏలూరు 90,935 97,276 24 1,88,235 గోపాలపురం 1,05,898 1,05,714 13 2,11,625 పోలవరం 1,10,304 1,14,497 14 2,24,815 చింతలపూడి 1,17,369 1,17,988 22 2,35,379 మొత్తం 14,64,958 14,37,162 261 28,42,381 -
రాజోలు బుల్లోడు... కోటలో రాణింపు
శ్రీహరికోట షార్‌లో డీజీఎం స్థాయిలో వెంకటసత్యప్రసాద్ జగ్గంపేట : దేశానికి సేవ చేసే భాగ్యం కొందరికే దక్కుతుంది. అటువంటి భాగ్యాన్ని మన రాజోలుకు చెందిన బిక్కిన వెంకటసత్యప్రసాద్ పొందారు. 12 తరగతి వరకు రాజోలులో విద్యనభ్యసించిన ఆయన కాకినాడలో పాలిటెక్నిక్, జేఎన్టీయూలో బీటెక్ మెకానికల్ ఇంజనీర్ విద్యను అభ్యసించి 1983లో ఇస్రోలో శాస్త్రవేత్తగా చేరారు. అప్పటి నుంచి ఉపగ్రహాల ప్రయోగంలో తనదైన శైలిని కనబరుస్తూ సైంటిస్ట్ జి గ్రేడ్‌కు చేరుకుని వెహికల్ అసెంబ్లీ, లాంచ్ ఫెసిలిటీ విభాగంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ హోదాకు చేరుకున్నారు. ఇస్రో ద్వారా విక్రమ సారాబాయి, ఏఎస్సై అవార్డు, స్పెషల్ ఎచీవ్మెంట్ అవార్డులను సొంతం చేసుకున్నారు. జిల్లాకు చెందిన వెంకటసత్యప్రసాద్ ఇస్రోలో రాణిస్తూ తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. తన తండ్రి వెంకటరత్నం ఉపాధ్యాయుడిగా పని చేశారని, తల్లి గృహిణి అని, సోదరుడు హైదరాబాద్‌లో మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్నాడని చిన్నప్పటి నుంచి లెక్కలు, సైన్స్‌పై ఆసక్తి ఉండడంతోనే ఇస్రోలో టెక్నికల్ అసిస్టెంట్ స్థాయి నుంచి ఉన్నతమైన స్థితికి చేరుకున్నానన్నారు. విద్య ముఖ్యమని డబ్బు ప్రధానం కాదని యువతకు ఆయన సందేశమిచ్చారు. చదువు ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. తనతోపాటు కాకినాడకు చెందిన సత్యనారాయణ, రామచంద్రపురానికి చెందిన వరప్రసాద్‌లు శ్రీహరికోట షార్‌లో సేవలందిస్తున్నారన్నారు. -
జంబ్లింగ్‌కు తాత్కాలికంగా వెనకడుగు
తొలిసారిగా ఉమ్మడి పరీక్షా విధానం పాఠశాల స్థాయిలోనే మూల్యాంకనం రాయవరం : పాఠశాల స్థాయిలో తొలిసారిగా ఉమ్మడి పరీక్షా విధానానికి విద్యాశాఖ తెరతీసింది. సమగ్ర నిరంతర మూల్యాంకనం(సీసీఈ) విధానంలో నిర్వహిస్తున్న ఉమ్మడి పరీక్షా విధానంలో జంబ్లింగ్ తరహాలో మూల్యాంకనం చేయాలని కూడా తలపోసింది. అయితే టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు జంబ్లింగ్ విధానాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. జిల్లా వ్యాప్తంగా సమ్మేటివ్–1 పరీక్షలు విద్యాశాఖ తొలుతగా ప్రాథమిక, ఉన్నత స్థాయి పరీక్షల్లో ఉమ్మడి పరీక్షా విధానం అమలు చేయాలని భావించింది. ప్రైవేటు పాఠశాలలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆరో తరగతి నుంచి అమలు చేసేందుకు నిర్ణయించారు. పరీక్షా పత్రాల మూల్యాంకనాన్ని జంబ్లింగ్ విధానంలో నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు భావించారు. ఈ విధానం అమలులో చోటు చేసుకునే ఇబ్బందులు, నష్టాలు ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి. దీంతో పరీక్షలకు రెండు రోజుల ముందు జంబ్లింగ్ విధానంలో పరీక్షా పేపర్ల మూల్యాంకనంపై సవరణ చేశారు. ఆరు, ఏడు తరగతులకు సమ్మేటివ్–1, 2, 3 పేపర్ల మూల్యాంకనాన్ని మండల స్థాయిలో కాకుండా పాఠశాల స్థాయిలోనే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. 8, 9 తరగతులకు సమ్మేటివ్–1, 2 పరీక్ష పేపర్ల మూల్యాంకనాన్ని జంబ్లింగ్ విధానంలో కాకుండా పాఠశాల స్థాయిలోనే నిర్వహించాలని, సమ్మేటివ్–3 పరీక్షలను మాత్రమే జంబ్లింగ్ తరహాలో మూల్యాంకనం చేయాలని నిర్ణయించారు. ఆరు నుంచి టెన్త్ వరకు సమ్మేటివ్–1, 2, 3 పేపర్లను అన్ని సబ్జెక్టుల్లోనూ ఐదు శాతం జవాబు పత్రాలను ప్రత్యేక బృందం ద్వారా మూల్యాంకనం జరుగుతుంది. ప్రస్తుత సమ్మేటివ్ పరీక్షల్లో టెన్త్ పరీక్షల్లో మాదిరిగా అన్ని పాఠశాలలకూ పర్యవేక్షకులను నియమించారు. బృందాల నియామకం .. జిల్లాలో ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పరిధిలోని 4.03,860 మంది విద్యార్థులు సమ్మేటివ్–1 పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు జరుగుతున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు 2,098 మంది పరిశీలకులను నియమించారు. అన్ని యాజమాన్యాల పరిధిలోని తెలుగు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తుండగా, పరీక్షలను పర్యవేక్షించేందుకు మండల స్థాయిలో మోడరేటివ్ బృందాలను నియమించారు. ఎంఈవో చైర్మన్‌గా స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం, ఒక సీనియర్ హెచ్ఎం, ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు ఈ కమిటీలో ఉంటారు. వేర్వేరు సబ్జెక్టులు బోధించే వారిని టీమ్‌లో నియమించారు. టెన్త్ పబ్లిక్ పరీక్షల మాదిరిగానే జిల్లా వ్యాప్తంగా ఈ బృందాలు సమ్మేటివ్–1 పరీక్షలు జరుగుతున్న కేంద్రాలను సందర్శించాయి. అలాగే డివిజన్ స్థాయిలో ప్రతి డివిజన్‌కు ఒక కమిటీని నియమించారు. జిల్లా వ్యాప్తంగా ఏడు టీమ్‌లు(స్కా్వడ్స్) సమ్మేటివ్–1 పరీక్షలను తనిఖీలు నిర్వహించారు. -
ప్రభుత్వ ఏర్పాటు పై 'ఫరూక్ అబ్దుల్లా'
-
జైళ్లను తలపిస్తున్న కార్పోరేట్ కాలేజీలు.
-
ఇండియాలో దాగిన హిందుస్తాన్ ఆసక్తి రేపే పుస్తకం
తాజా పుస్తకం గతం నుంచి వర్తమానం, వర్తమానం నుంచి భవిష్యత్తు నిర్మితమవుతాయి. చరిత్ర కూడా ఇలాగే అడుగులు వేస్తూ వెళుతుంది. ఒక్కోసారి తప్పటడుగులు కూడా. అయితే తప్పటడుగులు వేసిన వారికి తమ తప్పిదాలు తెలియకపోవచ్చు. ముందు తరాల వారు వాటిని గుర్తిస్తారు. గాంధీలో ఉన్న హిందుత్వ భావనే దేశ విభజనకు కారణమైందని, ఆ తరువాత నెహ్రూ దాన్ని పెంచి పోషించాడని ఈ పుస్తక రచయిత పెరి అండర్సన్ అంటారు. పెరి అండర్సన్ ఆంగ్లో-ఐరిష్ రచయిత. ప్రముఖ మార్క్సిస్టు మేధావి. ఆయన గతంలో ‘ఇండియన్ ఐడియాలజీ’ పేరుతో ఇంగ్లిష్‌లో రాసిన పుస్తకమే ఇప్పుడు ‘ఇండియాలో దాగిన హిందుస్తాన్’ పేరుతో అనువాదమై వెలువడింది. ఈ పుస్తకంలోని అంశాలను మనం సమర్థించవచ్చు. లేదా విమర్శించవచ్చు. కాని చర్చించాల్సిన విషయాలు కొన్ని ఇలా ఉన్నాయి. ఇండియా అన్న భావనే యూరప్ నుంచి సంక్రమించింది. ఎందుకంటే అంతకు ముందు అది చిన్న చిన్న రాజ్యాల సమూహం. అందుకే బ్రిటిష్‌వాళ్లు సులభంగా జయించి ఒక్కటి చేశారు. లౌకికవాదాన్ని అనుసరించే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు గాంధీకి చేతికి వచ్చిన తరువాత పురాణాలు, మత ధర్మశాస్త్రాలను చొప్పించి ఆయనకు తెలియకుండానే హిందుత్వని అమలు చేశారు. గాంధీ పట్ల ముస్లింల అపనమ్మకానికి ఇది బీజం వేసింది. మున్ముందు ఇది దేశవిభజనకు దారి తీసింది. 1922లో చౌరీచౌరాలో పోలీసులపై హింస జరిగినందుకు నిరసనగా దేశవ్యాప్త ఉద్యమాన్ని నిలుపుదల చేయించిన గాంధీ, రెండవ ప్రపంచ యుద్ధాన్ని సమర్థించడమే కాకుండా సైన్యంలో చేరమని కూడా పిలుపునిచ్చారు. ఆయన అహింసాయుధంపై ఆయనకే స్పష్టత లేదు. అంటరానివాళ్లకు ప్రత్యేక నియోజకవర్గాలను మంజూరు చేస్తూ బ్రిటిష్ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకునేలా గాంధీ చేశారు. నిస్సహాయ స్థితిలో అంబేద్కర్ కూడా గాంధీకి లొంగిపోయారు. ఈ విషయమై చనిపోయేవరకూ అంబేద్కర్ బాధ పడుతూనే ఉన్నారు. నెహ్రూకి గాఢమైన మత విశ్వాసాలు లేకపోయినా అనేక అంశాల్లో గాంధీ హిందుత్వనే ఆయన అనుసరించాడు. కాశ్మీర్ విషయంలో నెహ్రూ చేసిన తప్పిదాల వల్లే ఈనాటికీ రక్తం ఏరులై పారుతోంది. వ్యక్తిగత ఇష్టాయిష్టాలను రాజకీయాలకు ముడిపెట్టే అలవాటు నెహ్రూకి ఉంది. బహిరంగ సభలో నాగాలాండ్ ప్రజలు తనకి పిరుదులు చూపించి అవమానించారనే కోపంతో ఆయన నాగాలాండ్‌పై కర్కశంగా ప్రవర్తించారు. (‘గాంధీ అనంతర భారతదేశం’ పుస్తకంలో రామచంద్ర గుహ కూడా ఇదే చెబుతారు) మతతత్వం వల్ల లబ్ది చేకూరుతుందనుకుంటే బిజెపి, కాంగ్రెస్‌లు ఒకేలా వ్యవహరిస్తాయి. 2002లో గుజరాత్లో చనిపోయిన వారి కంటే 1984లో ఢిల్లీలో జరిగిన ఊచకోతలో చనిపోయిన వాళ్ల సంఖ్యే ఎక్కువ.రాజకీయాలపై ఆసక్తి ఉన్న వాళ్లందరూ చదవాల్సిన పుస్తకమిది. - జి.ఆర్.మహర్షి ఇండియాలో దాగిన హిందుస్తాన్- పెరి అండర్సన్; హెచ్.బి.టి ప్రచురణ; వెల: రూ.150; ప్రతులకు: 040- 23521849 -
ఏడు తరాలు తెలిశాయి!
కుటుంబ చరిత్ర వర్తమానం నుంచి చూస్తే భవిష్యత్తే కాదు... భూతకాలమూ ఒక మిస్టరీనే. భూ పరిణామ క్రమం దగ్గర నుంచి మనిషి ఆవిర్భావం, నాగరకతలు అభివృద్ధి చెందడం వరకూ అనేక విషయాల గురించి లెక్కలేనన్ని సిద్ధాంతాలున్నాయి. మరి భూ పరిణామక్రమం అంతటి పెద్ద విషయం గురించి కాకపోయినా, తమ కుటుంబ పరిణామక్రమం గురించి పరిశోధన చేశాడొకాయన. ఆయన పేరు నిరంజన్ లాల్ మిట్టల్. కొచ్చిలో ఉంటారు. దాదాపు 20 సంవత్సరాల పాటు పార్ట్‌టైమ్‌గా పరిశోధన చేసి తమ కుటుంబానికి సంబంధించి 700 సంవత్సరాల చరిత్రను తవ్వితీసి వంశవృక్షాన్ని రూపొందించాడు. ‘‘1994లో ఒకసారి కొచ్చిలోని ఇంటిని శుభ్రం చేస్తుంటే ఓ పాత పుస్తకం దొరికింది. అందులో మా నాన్న, తాతల వివరాలున్నాయి. మా తాత రాసిపెట్టిన వివరాలవి. వాటిని చదివాక వంశ వృక్షం గురించి ఆసక్తి కలిగింది. పరిశోధన మొదలు పెట్టాను’’అని తన ఆలోచనను వివరించారు మిట్టల్. ‘‘పరిశోధనలో హరిద్వార్ కూడా వెళ్లివచ్చాను. కర్మకాండల కోసం వెళ్లిన కుటుంబాల వివరాలు ఉంటాయక్కడ. ఆ వివరాలుచాలా ఉపకరించాయి. నా పరిశోధన 1321లో మా కుటుంబ పెద్ద ‘ధర్ మిట్టల్’ వరకూ వెళ్లింది. ఆయన కోల్‌కతా ప్రాంతంలో నివసించే వారు. వారి వారసులు అనేక ప్రాంతాలకు వలస వెళ్లారు. ఈ ప్రయత్నంలో మా దాయాదులు అనేక మంది గురించి తెలిసింది. వారిలో కొందరు విదేశాలలో వ్యాపారవేత్తలుగా ఎదిగారు...’’ అంటూ తమ వంశపరిణామ క్రమాన్ని వివరించారు మిట్టల్. ఇలా తమ పూర్వీకుల వివరాలు సంపాదించడం తనకు ఎంతో ఉద్వేగాన్ని ఇస్తోందని మిట్టల్ అంటున్నారు.