
పైకప్పు రేకులు ఎగిరిపోతున్న దృశ్యం
సాక్షి,ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు) : బీచ్‌రోడ్డులోని రాజీవ్ స్మృతి వనం పైకప్పు రేకులు ఎగిరిపోతున్నాయి. హుద్‌హుద్ సమయంలో ఈ భవనం పూర్తిస్థాయిలో దెబ్బతింది. అనంతరం దీనికి మరమ్మత్తులు చేశారు. అయితే కథ మొదటికొచ్చింది. భవనంపైన బిగించిన రేకులు ఊడిపోతున్నాయి. బుధవారం సాయంత్రం వీచిన గాలులకు పైన ఉన్న రేకులు ఎగురుతూ దర్శనమిచ్చాయి. ఇవి అటుగా వెళ్లేవారిపై పడితే ప్రమాదం సంభవించే అవకాశం లేకపోలేదు.