Danger level
-
హస్తినలో యమునా తీరం... కాలుష్య కాసారం!
చూసేందుకు పాల నురగలా తళతళా మెరిసిపోతూ కని్పస్తోంది కదూ! కానీ ఇదంతా దేశ రాజధానిలో యమునా నదిని నిలువెల్లా కబళించిన కాలుష్యం తాలూకు నురగ! ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ నురగలో అమోనియా, పాస్పేట్ వంటివి ప్రమాదకర పాళ్లలో ఉన్నట్టు నిపుణులు తేల్చారు. ఇది శ్వాసతో పాటు పలురకాలైన చర్మ సమస్యలకు దారి తీస్తుందని వివరించారు. యమునలో కాలుష్యం కొంతకాలంగా ప్రమాదకర స్థాయికి పెరిగిపోతున్నా వర్షాకాలంలో ఈ స్థాయి నురగను ఎప్పుడూ చూడలేదంటూ స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఢిల్లీ పొడవునా యమునలో కాలుష్యానికి ప్రధాన కారకాలుగా నిలుస్తున్న 13 హాట్స్పాట్లను గుర్తించినట్టు రాష్ట్ర పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు. దుమ్ము, ధూళితో పాటు నురగను నియంత్రించేందుకు 80 చోట్ల యాంటీ స్మాగ్ గన్స్ మోహరిస్తామన్నారు. కానీ మాటలే తప్ప యమునలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ఆప్ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. -
ఉగ్ర గోదావరి.. శాంతించిన కృష్ణ
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/ధవళేశ్వరం: ప్రశాంతంగా ఉన్న గోదావరి ఉగ్రరూపం దాలి్చతే.. మహోగ్ర రూపం దాలి్చన కృష్ణ శాంతిస్తోంది. పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండం, ప్రధాన పాయతోపాటు ఉప నదులు పరవళ్లు తొక్కుతుండటంతో గోదావరి ఉగ్రరూపం దాలి్చంది. గురువారం రాత్రి 9 గంటలకు భద్రాచలం వద్దకు 8.27 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. నీటి మట్టం 46.06 అడుగులకు చేరుకుంది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. గోదావరి వరదకు శబరి తోడవడంతో కూనవరం వద్ద ప్రవాహం ప్రమాదకర స్థాయిని దాటింది. పోలవరం ప్రాజెక్టులోకి వచి్చన వరదను వచి్చనట్లుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు.ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్దకు గురువారం రాత్రి 10 గంటల సమయానికి 10,06,328 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నీటి మట్టం 11.75 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజీ నుంచి 10,04,528 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. భద్రాచలం ఎగువన దుమ్ముగూడెం వద్ద ఉన్న సీతమ్మసాగర్‌లోకి 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. అంతే స్థాయిలో దిగువకు వదలేస్తుండటంతో శుక్రవారం ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి వరద ఉద్ధృతి మరింత పెరగనుంది. మరింత తగ్గిన కృష్ణా వరద కృష్ణా నదిలో వరద మరింత తగ్గింది. ప్రకాశం బ్యారేజ్‌లోకి 1,39,744 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 500 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 1,39,244 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. శ్రీశైలంలోకి వచ్చే వరద 1.36 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. శ్రీశైలం నుంచి దిగువకు వదిలేస్తున్న జలాల్లో సాగర్‌లోకి 1.26 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. సాగర్‌లో ఖాళీ ప్రదేశాన్ని భర్తీ చేస్తూ దిగువకు 38 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్‌లోకి చేరే వరద శుక్రవారం మరింతగా తగ్గనుంది. -
భావి ఒలింపిక్స్‌కు వడదెబ్బ!
ఇదీ పారిస్ ఒలింపిక్స్‌తో వాతావరణం ఆటాడుకున్న తీరు. నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్ క్రీడా వేడుకల నిర్వహణను దేశాలన్నీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి. కానీ 2050 నాటికి చాలా దేశాలకు ఒలింపిక్స్ నిర్వహణ కలగానే మిగలనుంది. ఆయా దేశాల్లో ఎండలు ఇప్పటికే ఠారెత్తిస్తుండటం, 2050కల్లా ప్రమాదకర స్థాయిని దాటేలా ఉండటమే ఇందుకు కారణం. ఒలింపిక్స్ జరిగేదే ప్రధానంగా వేసవిలోనే. కనుక ఉష్ణోగ్రతలు 27.8 డిగ్రీల సెల్సియస్ దాటితే వాటి నిర్వహణను రద్దు చేయాలన్నది అంతర్జాతీయ క్రీడా నిపుణుల సిఫార్సు. ఆ లెక్కన గతంలో ఒలింపిక్ వేడుకలను విజయవంతంగా నిర్వహించిన అట్లాంటా (అమెరికా), బీజింగ్ (చైనా), ఏథెన్స్ (గ్రీస్), టోక్యో (జపాన్) వంటి పలు నగరాలకు ఇంకెప్పటికీ ఆ అవకాశం దక్కబోదు. ఆ నగరాల్లో వేసవిలో ఎండలు మండిపోవడం పరిపాటిగా మారింది. అంతేకాదు, వచ్చే (2028) ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వబోయే అమెరికాలోని లాస్ ఏంజెలెస్ ఎండలపరంగా చూసుకుంటే ఏ మేరకు సురక్షితమన్న ఆందోళన ఇప్పట్నుంచే మొదలైంది. ఆదివారం అక్కడ ఉష్ణోగ్రతలు ఏకంగా 34 డిగ్రీలు దాటేయడమే ఇందుకు కారణం! పారిస్‌లో ఒలింపిక్స్ ముగింపు వేడుకల సందర్భంగా ఆదివారం ఏకంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి! వాతావరణ మార్పులు ప్రపంచాన్ని ఎంతగా అతలాకుతలం చేస్తున్నాయో, రోజురోజుకూ ప్రమాదం అంచులకు నెడుతున్నాయో చెప్పేందుకు ఈ పరిణామం మరో తార్కాణమని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో చాలావరకు 2050 నాటికి ఒలింపిక్స్ నిర్వహించేందుకు అనువైన పరిస్థితులు ఉండబోవని ప్రఖ్యాత క్లైమేట్ సైన్స్, అనలిటిక్స్ స్వచ్ఛంద సంస్థ ‘కార్బన్ప్లాన్’ హెచ్చరించింది. వాటిలో ఉష్ణోగ్రతలు భరించలేనంతగా పెరిగిపోతాయని పేర్కొంది. వాతావరణ మార్పుల ధోరణి ఆధారంగా రూపొందించిన గణాంకాలతో విడుదల చేసిన తాజా నివేదికలో సంస్థ ఈ మేరకు పేర్కొంది.ఎన్నో సమస్యలు... ఎండలు సురక్షితమైన ఉష్ణోగ్రత పరిధిని దాటితే ఒలింపిక్స్ నిర్వహణకు ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కావు... → ప్రఖ్యాత అథ్లెట్లు చాలా మంది ప్రధానంగా చలి దేశాల నుంచే వస్తారు. ఈ స్థాయి ఎండలను వాళ్లు అస్సలు తట్టుకోలేరు → దాంతో క్రీడాకారులు ఎండకు సొమ్మసిల్లిపోవడం, వడదెబ్బ బారిన పడటం వంటి సమస్యలు పొంచి ఉంటాయి → ఇవి వారిలో తీవ్ర అనారోగ్యానికి, కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా దారితీసే ప్రమాదం ఉంటుంది. → 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ప్రతి 100 మంది అథ్లెట్లలో ఒకరు ఎండలకు తాళలేక కళ్లు తేలేశారు! → దాంతో మారథాన్, వాకింగ్ వంటి ఈవెంట్లను పర్వతప్రాంత నగరమైన సపోరోకు మార్చినా లాభం లేకపోయింది. ఆరుగురు వాకర్లు, రన్నర్లు వడదెబ్బ బారిన పడ్డారు.ఇలా కొలుస్తారు... సమస్యలకు దారితీసే స్థాయి ఎండ వేడిమిని వెట్ బల్బ్ గ్లోబ్ టెంపరేచర్‌గా పిలుస్తారు. వేడి, తేమ, గాలి వేగం, సూర్యుని కోణం, మేఘావరణం వంటి పలు అంశాల ప్రాతిపదికన దీన్ని నిర్ణయిస్తారు. ఆ లెక్కన ఒలింపిక్స్ నిర్వహణకు సురక్షితమైన ఉష్ణోగ్రత పరిధి 27.8 డిగ్రీ సెల్సియస్‌గా నిర్ణయించారు. ఎండలు అంతకు మించితే పోటీల వాయిదా, అవసరమైతే రద్దు తప్పనిసరని అంతర్జాతీయ క్రీడా నిపుణులు చెబుతారు. వచ్చే ఒలింపిక్స్ సంగతి ఏమిటీ?2028 ఒలింపిక్స్‌కు వేదిక అమెరికాలోని లాస్ ఏంజెలెస్. అక్కడ పసిఫిక్ గాలుల కారణంగా వాతావరణం సాధారణంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. కనుక పెద్దగా సమస్య ఉండదని భావించారు. కానీ ఒకట్రెండేళ్లుగా లాస్ ఏంజెలెస్‌లో ఎండలు గట్టిగానే ప్రతాపం చూపుతున్నాయి. తాజాగా ఆదివారం 34 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ స్థాయి ఉష్ణోగ్రతలు అక్కడ క్రమంగా పరిపాటిగా మారుతుండటం ఒలింపిక్ కమిటీని ఇప్పటినుంచే ఆందోళనపరుస్తోంది. 2032 ఒలింపిక్స్‌కు ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్ వేదిక కానుంది. వేసవిలో అక్కడ కూడా ఎండలు ఠారెత్తిస్తాయి. కానీ ఒలింపిక్స్ నిర్వహించే జూలై చివరి నాటికి శీతాకాలమే ఉంటుంది. కనుక పెద్దగా సమస్య ఉండబోదని భావిస్తున్నారు. మనకు కష్టమే! 2036 ఒలింపిక్స్ వేదిక ఎంపిక మాత్రం నిర్వాహకులకు పెద్ద పరీక్షగానే మారనుంది. అందుకు బిడ్స్ వేసిన ఆరు దేశాల్లో భారత్ కూడా ఉండటం విశేషం. అహ్మదాబాద్‌లో ఈ విశ్వ క్రీడా సంరంభాన్ని నిర్వహించాలని కేంద్రం పట్టుదలగా ఉంది. ఇండొనేసియా నూతనంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక రాజధాని నుసంతర, దోహా (ఖతర్), ఇస్తాంబుల్ (తుర్కియే), వార్సా (పోలండ్), శాంటియాగో (చిలీ) కూడా బరిలో ఉన్నాయి. కానీ ఉష్ణోగ్రతల కోణంలో చూస్తే అహ్మదాబాద్, çనుసంతర, దోహాల్లో ఒలింపిక్స్ నిర్వహణ అస్సలు సాధ్యపడకపోవచ్చు. ఇది అంతిమంగా వార్సా, శాంటియాగోలకు అడ్వాంటేజ్‌గా మారొచ్చు. వాటి తర్వాత ఇస్తాంబుల్ కూడా ఉష్ణోగ్రతపరంగా కాస్త అనువుగానే ఉండనుంది. నవంబర్, డిసెంబర్ మాసాల్లో అనుమతించే పక్షంలో అహ్మదాబాద్‌కు చాన్సుంటుంది. -
టాపు లేచిపోతోంది!
సాక్షి,ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు) : బీచ్‌రోడ్డులోని రాజీవ్ స్మృతి వనం పైకప్పు రేకులు ఎగిరిపోతున్నాయి. హుద్‌హుద్ సమయంలో ఈ భవనం పూర్తిస్థాయిలో దెబ్బతింది. అనంతరం దీనికి మరమ్మత్తులు చేశారు. అయితే కథ మొదటికొచ్చింది. భవనంపైన బిగించిన రేకులు ఊడిపోతున్నాయి. బుధవారం సాయంత్రం వీచిన గాలులకు పైన ఉన్న రేకులు ఎగురుతూ దర్శనమిచ్చాయి. ఇవి అటుగా వెళ్లేవారిపై పడితే ప్రమాదం సంభవించే అవకాశం లేకపోలేదు. -
గోదావరి వరదతో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్
* మేడిపల్లి ఓసీపీలో నిలిచిన పనులు * పవర్‌హౌస్‌లో విద్యుదుత్పత్తి బంద్ గోదావరిఖని: ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి దిగువకు లక్షల క్యూసెక్కుల వరద నీటిని వదులుతుండడంతో నది ఒడ్డున గల సింగరేణి మేడిపల్లి ఓపెన్‌కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి పనులను అధికారులు సోమవారం నిలిపివేశారు. ప్రాజెక్టులో నడిచే యంత్రాలు, వాహనాలను ఉపరితలానికి తీసుకువచ్చారు. గోదావరినదిలో వరద ఉధృతి సముద్రమట్టానికి 831.40 మీటర్లకు చేరుకుంటే ‘డేంజర్ లెవల్ ’గా గుర్తించి పనులన్నీ నిలిపివేస్తారు. అయితే, సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో నదిలో వరద ప్రవాహం 831.70 మీటర్లకు చేరుకోవడంతో డేంజర్ లెవల్‌గా గుర్తించి పనులను నిలిపివేశారు. దీంతో సుమారు 13 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి పనులతో పాటు 40 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు బ్రేక్ పడింది. అయితే, గతంలో తొలగించిన బొగ్గును మాత్రం కొంతవరకు ఉపరితలానికి చేరవేసే చర్యలు తీసుకున్నారు. అలాగే, జీడీకే 1వ గనికి సమీపం నుంచి గోదావరినది వరద ప్రవాహం కొనసాగుతుండడంతో గని అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక్కడ సముద్రమట్టానికి 830 మీటర్ల ఎత్తులో వరద ప్రవాహం ఉంటే ‘వార్నింగ్ లెవల్’గా భావిస్తారు. ఉదయం 9 గంటల సమయంలో 830.40 మీటర్లుగా నమోదు అయింది. గోదావరిఖనిలోని సింగరేణి పవర్‌హౌస్‌లో నీరు లేక ఆదివారం నుంచి విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. నదిలో ఉన్న రెండు మోటార్లను పైకి తీసుకురావడంతో నీటిని అందించే వీలు లేకుండా పోయింది. నీటమునిగిన గుళ్లు గోదావ రినదిలో నీటి మట్టం పెరగడంవల్ల గోదావరిఖనిలోని ఇంటెక్వెల్, బ్రిడ్జి, పుష్కరఘాట్ వద్ద గల గంగాదేవి, శివాలయాలు పూర్తిగా నీట మునిగాయి. కాగా సింగరేణి ఇంటెక్వెల్నుంచి పుష్కరఘాట్‌కు వెళ్ళే రహదారిలో వచ్చిన వరద నీటిలోనే భక్తులు స్నానమాచరించారు.