చూసేందుకు పాల నురగలా తళతళా మెరిసిపోతూ కని్పస్తోంది కదూ! కానీ ఇదంతా దేశ రాజధానిలో యమునా నదిని నిలువెల్లా కబళించిన కాలుష్యం తాలూకు నురగ! ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ నురగలో అమోనియా, పాస్పేట్ వంటివి ప్రమాదకర పాళ్లలో ఉన్నట్టు నిపుణులు తేల్చారు. ఇది శ్వాసతో పాటు పలురకాలైన చర్మ సమస్యలకు దారి తీస్తుందని వివరించారు.
యమునలో కాలుష్యం కొంతకాలంగా ప్రమాదకర స్థాయికి పెరిగిపోతున్నా వర్షాకాలంలో ఈ స్థాయి నురగను ఎప్పుడూ చూడలేదంటూ స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఢిల్లీ పొడవునా యమునలో కాలుష్యానికి ప్రధాన కారకాలుగా నిలుస్తున్న 13 హాట్‌స్పాట్లను గుర్తించినట్టు రాష్ట్ర పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు. దుమ్ము, ధూళితో పాటు నురగను నియంత్రించేందుకు 80 చోట్ల యాంటీ స్మాగ్ గన్స్ మోహరిస్తామన్నారు. కానీ మాటలే తప్ప యమునలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ఆప్ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment