భద్రాచలం, కూనవరం వద్ద ప్రమాదకర స్థాయిలో గోదావరి
దవళేశ్వరం బ్యారేజ్ నుంచి 10.04 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి
ప్రకాశం బ్యారేజ్ నుంచి 1.39 లక్షల క్యూసెక్కుల కృష్ణా జలాలు కడలిలోకి
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/ధవళేశ్వరం: ప్రశాంతంగా ఉన్న గోదావరి ఉగ్రరూపం దాలి్చతే.. మహోగ్ర రూపం దాలి్చన కృష్ణ శాంతిస్తోంది. పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండం, ప్రధాన పాయతోపాటు ఉప నదులు పరవళ్లు తొక్కుతుండటంతో గోదావరి ఉగ్రరూపం దాలి్చంది. గురువారం రాత్రి 9 గంటలకు భద్రాచలం వద్దకు 8.27 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. నీటి మట్టం 46.06 అడుగులకు చేరుకుంది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. గోదావరి వరదకు శబరి తోడవడంతో కూనవరం వద్ద ప్రవాహం ప్రమాదకర స్థాయిని దాటింది. పోలవరం ప్రాజెక్టులోకి వచి్చన వరదను వచి్చనట్లుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు.
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్దకు గురువారం రాత్రి 10 గంటల సమయానికి 10,06,328 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నీటి మట్టం 11.75 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజీ నుంచి 10,04,528 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. భద్రాచలం ఎగువన దుమ్ముగూడెం వద్ద ఉన్న సీతమ్మసాగర్‌లోకి 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. అంతే స్థాయిలో దిగువకు వదలేస్తుండటంతో శుక్రవారం ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి వరద ఉద్ధృతి మరింత పెరగనుంది.
మరింత తగ్గిన కృష్ణా వరద
కృష్ణా నదిలో వరద మరింత తగ్గింది. ప్రకాశం బ్యారేజ్‌లోకి 1,39,744 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 500 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 1,39,244 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. శ్రీశైలంలోకి వచ్చే వరద 1.36 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. శ్రీశైలం నుంచి దిగువకు వదిలేస్తున్న జలాల్లో సాగర్‌లోకి 1.26 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. సాగర్‌లో ఖాళీ ప్రదేశాన్ని భర్తీ చేస్తూ దిగువకు 38 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్‌లోకి చేరే వరద శుక్రవారం మరింతగా తగ్గనుంది.
Comments
Please login to add a commentAdd a comment