krishna rivar
-
ఉగ్ర గోదావరి.. శాంతించిన కృష్ణ
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/ధవళేశ్వరం: ప్రశాంతంగా ఉన్న గోదావరి ఉగ్రరూపం దాలి్చతే.. మహోగ్ర రూపం దాలి్చన కృష్ణ శాంతిస్తోంది. పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండం, ప్రధాన పాయతోపాటు ఉప నదులు పరవళ్లు తొక్కుతుండటంతో గోదావరి ఉగ్రరూపం దాలి్చంది. గురువారం రాత్రి 9 గంటలకు భద్రాచలం వద్దకు 8.27 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. నీటి మట్టం 46.06 అడుగులకు చేరుకుంది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. గోదావరి వరదకు శబరి తోడవడంతో కూనవరం వద్ద ప్రవాహం ప్రమాదకర స్థాయిని దాటింది. పోలవరం ప్రాజెక్టులోకి వచి్చన వరదను వచి్చనట్లుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు.ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్దకు గురువారం రాత్రి 10 గంటల సమయానికి 10,06,328 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నీటి మట్టం 11.75 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజీ నుంచి 10,04,528 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. భద్రాచలం ఎగువన దుమ్ముగూడెం వద్ద ఉన్న సీతమ్మసాగర్‌లోకి 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. అంతే స్థాయిలో దిగువకు వదలేస్తుండటంతో శుక్రవారం ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి వరద ఉద్ధృతి మరింత పెరగనుంది. మరింత తగ్గిన కృష్ణా వరద కృష్ణా నదిలో వరద మరింత తగ్గింది. ప్రకాశం బ్యారేజ్‌లోకి 1,39,744 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 500 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 1,39,244 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. శ్రీశైలంలోకి వచ్చే వరద 1.36 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. శ్రీశైలం నుంచి దిగువకు వదిలేస్తున్న జలాల్లో సాగర్‌లోకి 1.26 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. సాగర్‌లో ఖాళీ ప్రదేశాన్ని భర్తీ చేస్తూ దిగువకు 38 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్‌లోకి చేరే వరద శుక్రవారం మరింతగా తగ్గనుంది. -
కృష్ణా జలాలపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు సరికాదు: అంబటి
సాక్షి, విజయవాడ: కృష్ణా జలాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇది చాలా సున్నితమైన అంశం..పరస్పరం సహకరించుకోవాలని తెలిపారు. మంగళవారం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతారు. ‘నాగార్జుసాగర్ ప్రాజెక్ట్ రెండు రాష్ట్రాలకి సగం సగంగా ఉంది. ప్రాజెక్టులు అప్పగించమని అసెంబ్లీలో తీర్మానం చేయడం ఎంతవరకు ధర్మం. విభజన చట్టాన్ని అంగీకరించి.. ఒక సెక్షన్ మాత్రం అంగీకరించం అంటే ఎలా?. ఏపీ కూడా విభజన చట్టాన్ని అంగీకరించం అంటే కుదురుతుందా. విభజన సమయంలో నదీజలాల పంపిణీపై చట్టంలో పొందుపరిచారు. విభజన చట్టం అంగీకరించమని చెప్పడం మొండివాదన. తెలంగాణ వాటాలో ఒక్క నీటి బొట్డు కూడా మాకు అవసరం లేదు. ...ఆంధ్రా, రాయలసీమకి కేటాయించిన నీటి జలాలపైనే మా సీఎం వైఎస్ జగన్ చట్టబద్దంగా తీసుకెళ్లడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. కేఆర్ఎంబీని విభజన చట్టంలో పొందుపరిచారు. టీఆర్ఎస్కు, కాంగ్రెస్‌కు వివాదాలు ఉండవచ్చు. కృష్ణా జలాల పంపకాలు ఇప్పటివి కాదు. బచావత్ ట్రిబ్యునల్ ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించింది. ఒకసారి అవార్డు అయిన అంశాలని వివాదం ఎలా చేస్తారు.. చట్టాన్ని గౌరవించాలి. హైదరాబాద్‌ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న వాదనలపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి’ అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. -
కరకట్ట నుంచి ఖాళీ చేయండి : మంత్రి అనిల్
సాక్షి, కర్నూలు : కృష్ణానదికి ప్రమాదకర స్థాయిలో వరద వస్తున్న నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కరకట్టపై నిర్మించిన అక్రమ నివాసాన్ని వదిలివెళ్లాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కోరారు. అక్రమంగా కరకట మీద ఇళ్ళు కట్టుకుని, ప్రభుత్వం ఏలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించడం సరైనది కాదని అన్నారు. వరదలు, వర్షాలపై ఈ ప్రభుత్వంలో అప్రమత్తంగా పని చేస్తోందని స్పష్టం చేశారు. లోకేష్, చంద్రబాబు, పర్యాటకుల మాదిరిగా రాష్ట్రానికి వస్తూ పోతున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడు కూడా వర్షాలు కురవలేదని, ఆయన పాలనలో కరువు తాండవించిందని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో తుఫాన్లు వచ్చి రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని గుర్తుచేశారు. (ప్రజలు సహాయక చర్యల్లో సహకరించాలి) శుక్రవారం కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి అనిల్ మాట్లాడారు. ‘చంద్రబాబు పాలనలో శ్రీశైలం పవర్ ప్రాజెక్టును వరద నీటితో ముంచేశారు. చంద్రబాబు తప్పిదాల కారణంగా హైదరాబాద్‌లో కూడా వరదలు వచ్చాయి. బాబు, లోకేష్ ఎప్పుడూ అబద్దాలు, అసత్య ఆరోపణలు చేస్తున్నారు. 23 ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేకపోతున్నారు. వరదల నివారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. తమది రైతు పక్షపాతి ప్రభుత్వం కాబట్టి దేవుడు కూడా సహకరిస్తున్నారు. తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాం. 210 కోట్ల రూపాయల నిధులను తుంగభద్ర పుష్కరాలకు విడుదల చేశాం. కోవిడ్ నిబంధనల ప్రకారం తుంగభద్ర పుష్కరాలను నిర్వహిస్తాం. రాయలసీమ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రెడ్డి కృషి చేశారు. అదే రీతిలో ముందుకు సాగుతున్నారు. 40 వేల కోట్ల రూపాయల నిధులను రాయలసీమ ప్రాజెక్టులకు ప్రణాళికలను సిద్ధం చేశాం’ అని పేర్కొన్నారు. -
కృష్ణాకు భారీ వరద.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత
ఎగువన కురుస్తున్న వర్షాలకు మళ్లీ వరద పోటెత్తుతోంది. జలాశయాలు నిండుకుండలా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి దృష్ట్యా అధికారులు మంగళవారం ఉదయం సాగర్ రేడియల్ క్రస్ట్ గేట్ల నుంచి పులిచింతలకు.. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటిని విడుదల చేశారు. గత వరద ముంపును దృష్టిలో పెట్టుకుని అధికారులు నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రధాన ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్, ప్రకాశం బ్యారేజీల వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీ సాక్షి, శ్రీశైలం: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. సోమవారం సాయంత్రం నుంచి మొదలైన వరద మంగళవారం ఉదయానికి భారీగా పెరిగింది. ఈ క్రమంలో శ్రీశైలం ప్రాజెక్టులో 6 గేట్లను పది అడుగుల మేర ఎత్తి 3.39 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జున సాగర్ రిజర్వాయర్‌లోకి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో సాగర్ నిండుకుండలా దర్శనమిస్తోంది. వరద ఉధృతిని దృష్ట్యా అధికారులు సోమవారం సాయంత్రం నాగార్జున సాగర్ 16 రేడియల్ క్రాస్ట్‌గేట్లు ఎత్తి 2,94,300 క్యూసెక్కులు నీటిని దిగువ పులిచింతల ప్రాజెక్టులోకి విడుదల చేశారు. ఈ క్రమంలో పులిచింతల ప్రాజెక్టులో గరిష్ట నీటి మట్టం 45.77 టీఎంసీలకు చేరడంతో దిగువ ప్రకాశం బ్యారేజీకి 50 వేలు క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీలో గరిష్ట నీటిమట్టం నమోదుకావడంతో.. కాలువలకు విడుదల చేసే నీరు పోను, దిగువకు 18,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోని 45 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం లంక గ్రామాల ప్రజల అప్రమత్తం.. కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండటంతో నదీ పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఆగస్టు 15 నాటికే నాగార్జున సాగర్ రిజర్వాయర్ నిండింది. జిల్లాలోని అన్ని జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉండటంతో వచ్చిన వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గత వరద ముంపు నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాగార్జున సాగర్ కాలువలకు పుష్కలంగా నీరు విడుదల.. జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉండటంతో నాగార్జున సాగర్ కుడికాలువకు 10,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే తాగునీటి చెరువులను పూర్తిగా నింపారు. సాగునీటి అవసరాలకు సరిపోను నీరు మిగులు ఉండటంతో 1500 క్యూసెక్కుల నీటిని గుండ్లకమ్మ వాగులోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులు పూర్తిగా నిండటంతో జిల్లాలో పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. (చదవండి: ఉధృతంగా గోదావరి) -
కృష్ణా ఉగ్రరూపం.. సాగర్ గేట్ల ఎత్తివేత
సాక్షి, నల్గొండ: ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. ఆల్మట్టి, నారాయణ్‌పూర్ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ కళకళలాడుతున్నాయి. వరద ఉద్ధృతి కొనసాగుతున్నందున సోమవారం సాగర్‌లో 26 గేట్లను పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి వరద ప్రవాహం అధికంగా ఉండటంతో నాగార్జునసాగర్ జలకళ సంతరించుకుంటోంది. ఆదివారం శ్రీశైలంలో 10 గేట్లను ఎత్తి నీటిని దిగువన నాగార్జున సాగర్‌లోకి వదిలారు. నిన్నటి నుంచి భారీ ప్రవాహం సాగర్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. సాగర్‌కు 8.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో అధికారులు 24 గేట్లను పైకెత్తారు. ఒక్కోగేటును 5 అడుగుల మేర పెకెత్తి 65,105 క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు వదులుతున్నారు. నిండునున్న పులిచింతల.. ప్రవాహం మరికొంత పెరిగితే ప్రాజెక్టులోని మొత్తం గేట్లను ఎత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ రాత్రికే దిగువనున్న పులిచింతల ప్రాజెక్టు కూడా నిండే అవకాశం ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 559.20 అడుగులు నమోదైంది. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 225 టీఎంసీలు నమోదైంది. దీంతో సాగర్ పరివాహాక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి భారీగా వరద నీరు పోటెత్తడంతో జూరాల, శ్రీశైలం జలాశయాలు నిండుకుండలా మారియి. కాగా ప్రాజెక్టుల ఆయకట్టుకు ఏపీ, తెలంగాణ మంత్రులు ఇదివరకే కాలువల ద్వారా నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో శ్రీశైలం, సాగర్ ఆయనకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిండుకుండలా శ్రీశైలం ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీశైలం నిండుకుండలా మారింది. ప్రస్తుతం 7.53లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 8.51 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. జలాశయం 10 గేట్లను 42 అడుగుల మేర పైకెత్తి నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలద్వారా 8,20,162 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడుకి 28వేల క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2,363 క్యూసెక్కులు, ముచ్చుమర్రికి 735క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 878.60 అడుగులు నమోదైంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 180.26 టీఎంసీలు ఉంది. సాగర్‌కు పర్యాటకుల తాకిడి నాగార్జునసాగర్‌కు జలకళ సంతరించుకోవడంతో అక్కడికి పర్యాటకుల తాకిడి పెరిగింది. మాచర్ల వైపు నుంచి సాగర్‌కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వెళతున్నారు. బక్రీద్ సెలవుతో పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు శ్రీశైలం వద్ద కూడా పర్యాటకులు సందడి నెలకొంది. ప్రాజెక్టు అందాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో డ్యాం వద్ద అధికారులు భద్రతను మరింత పటిష్టం చేశారు. -
తెలుగువారంతా కలిసికట్టుగా ఉండాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి మంచి జరగాలనే ఆరాటంతోనే తాము నిర్ణయాలు తీసుకుంటున్నామని, మన రాష్ట్రానికి మంచి జరగదు అనుకుంటే.. అలాంటి నిర్ణయాన్ని కచ్చితంగా తీసుకుబోమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. గోదావరి జలాల వినియోగంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా వైఎస్ జగన్ సుదీర్ఘంగా ప్రసంగించారు. గోదావరి జలాల తీరుతెన్నులు, గోదావరి నీళ్లు రాష్ట్రంలోకి ఎలా ప్రవేశిస్తాయి? ఎన్ని వస్తున్నాయి? అందులో ఎన్ని ఉపయోగపడుతున్నాయి? అన్నది సీఎం వివరించారు. గోదావరి జలాలను రోజుకు నాలుగు టీఎంసీల చొప్పున 120 రోజులపాటు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు తరలించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 480 టీఎంసీల నీళ్లు అందుబాటులోకి వస్తాయని, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రైతులూ, ప్రజలూ బాగుపడతారని, సాగునీటి, తాగునీటి ఇబ్బందులు తీరుతాయని వివరించారు. నది జలాల పంపిణీ విషయంలో నీళ్లురావు అనుకుంటే ఇద్దరు సీఎంలు ఎందుకు ముందడుగు వేస్తారని ఆయన అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షం ఇచ్చిన సలహాలు కూడా తీసుకుంటామని చెప్పారు. భావితరాల కోసం ఆలోచించే తాము అవసరమైన నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. గోదావరి నదిలో నాలుగు పాయలుంటే.. అందులో మూడు పాయలు తెలంగాణను దాటుకొని.. ఆంధ్రలోకి ప్రవేశిస్తాయని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. గోదావరి నదికి చెందిన ఒక పాయ నాసిక్ నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తుందని, ఈ పాయ ద్వారా గోదావరి మొత్తం ప్రవాహంలో 22.23శాతం తెలంగాణకు వస్తాయని వివరించారు. అయితే, ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక చిన్న, చిన్న డ్యాములు కట్టుకుంటూ పోతుండటంతో ఈ పాయ మీద ఆధారపడిన తెలంగాణలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు నీళ్లు రాని పరిస్థితి నెలకొందని, ఈ ప్రాజెక్టు కోసం కాళేశ్వరం నుంచి రివర్స్ పద్ధతిలో నీళ్లు తరలించుకొని పోతున్నారని సీఎం వైఎస్ జగన్ వివరించారు. గోదావరి నదిలోని రెండో పాయ ప్రాణహిత నది అని.. ఇది కూడా తెలంగాణలోకి ప్రవేశిస్తోందని వివరించారు. ఈ ప్రాణహిత సబ్ బేసిన్ ద్వారా గోదావరి మొత్తం ప్రవాహంలోని 35.46శాతం నీళ్లు వస్తాయని, గోదావరి పూర్తి నీటిలో దాదాపు 36శాతం ఈ పాయ నుంచే ప్రవహిస్తాయని వివరించారు. ఇక మూడో పాయ అయిన ఇంద్రావతి సబ్‌బేసిన్ కూడా తెలంగాణలోకే ప్రవేశిస్తుందని, అది మొత్తం ప్రవాహంలో దాదాపు 23శాతం ఉంటుందని వివరించారు. గోదావరి నదిలోని నాలుగు పాయల్లో మూడు పాయలు తెలంగాణను దాటిన తర్వాతే ఆంధ్రప్రదేశ్‌లోకి వస్తాయని వివరించారు. ఇక, శబరి సబ్ బేసిన్ నుంచి మాత్రమే మనకు నేరుగా ఆంధ్రప్రదేశ్‌లోకి నీళ్లు వస్తాయని, ఎగువన ఉన్న ఛత్తీస్గడ్, ఒడిశా మీదుగా వచ్చే ఈ పాయ.. గోదావరి మొత్తం ప్రవాహంలో కేవలం 12శాతం మాత్రమే ఉంటుందని వివరించారు. తెలంగాణలో ఆశ్చర్యకరమైన పరిస్థితులు.. ‘44 ఏళ్ల సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్) డాటా ప్రకారం సగటు చూసుకుంటే ప్రాణహిత నది.. ప్రాణహిత సంగమం దాటిన తర్వాత కాళేశ్వరం వద్ద 1709 టీఎంసీల గోదావరి నీళ్లు ఉంటాయి. ఇక, ఇంద్రావతి నది సంగమమైన తెలంగాణలోని పేరూరు వద్దకు వచ్చేసరికి గోదావరి ఉధృతి 2,489 టీఎంసీలకు చేరుకుంటుంది. మన రాష్ట్రం విషయానికి వస్తే.. శబరి నది దాటి శబరి నది సంగమమైన పోలవరం వద్ద 3,082 టీఎంసీలు గోదావరి నీళ్లు వస్తున్నాయి. ఇందులో కిందకు వచ్చేవి కేవలం ఐదారు వందల టీఎంసీల నీళ్లు మాత్రమే. ఈ ఐదారు వందల టీఎంసీల నీళ్లు మాత్రమే మన రాష్ట్రం ఆధీనంలో ఉన్నాయి. మిగిలిన గోదావరి నీళ్లు తెలంగాణ భూభాగం దాటుకొని మన ప్రాంతంలోకి ప్రవేశిస్తాయి. ఇదీ వాస్తవ పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 450 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసుకొని వెళ్లిపోతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై.. పూర్తి కూడా అయింది. ఇక, కర్ణాకటలో ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 514నుంచి 524 మీటర్ల ఎత్తుకు పెంచబోతున్నారు. ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతున్నా.. ఎవరు ఆపగలుతున్నారు?’ కృష్ణానది ఎండమావి అయ్యే పరిస్థితి.. ఒకవైపు పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు కృష్ణా నది ఆయకట్టు పూర్తిగా ఎండమావి అయ్యే అవకాశం కనిపిస్తోంది. గత 47 ఏళ్ల సగటు చూసుకుంటే కృష్ణా నుంచి శ్రీశైలానికి 1200 టీఎంసీల నీళ్లు వచ్చేవి. కానీ, గత పది సంవత్సరాల్లో చూసుకుంటే అది 600 టీఎంసీలకు పడిపోయింది. ఇక, గత ఐదు సంవత్సరాలు చూసుకుంటే శ్రీశైలానికి కృష్ణా ప్రవాహం 400 టీఎంసీలకు పడిపోయింది. ఇక, ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 524 మీటర్లకు పెంచితే.. కర్ణాటక మరో 100కుపైగా టీఎంసీలను నిల్వ చేసుకోగలుగుతుంది. ఈ పరిస్థితుల్లో శ్రీశైలానికి 200 టీఎంసీల నీళ్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఈ పరిస్థితుల్లో శ్రీశైలం ఎప్పుడు నిండుతుంది? ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీళ్లు ఎప్పుడు వెళుతాయి? నాగార్జున సాగర్‌కు ఎప్పుడు వస్తాయి? ఇది ఇది ఆలోచన చేసుకోవాలి. వాస్తవ పరిస్థితులను గమనించాలి’ అని సీఎం వైఎస్ జగన్ కోరారు. గోదావరి నదిలోని 2480 టీఎంసీలు తెలంగాణను దాటుకొని మన ఆంధ్రలోకి రావాలి. మన అధీనంలోని శబరినది ద్వారా ఐదారు వందల టీఎంసీలు మాత్రమే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పట్టిసీమ ద్వారా, పోలవరం కుడి కాలువ ద్వారా రాయలసీమకు నీళ్లు అందిద్దామంటే.. గోదావరి జిల్లాల్లో ఆందోళనలు చేసే పరిస్థితి ఉందని చంద్రబాబే చెబుతున్నారు. మరోవైఊపు మహారాష్ట్ర, కర్ణాటక మాదిరి తెలంగాణ కూడా ప్రాజెక్టులకు కట్టుకుంటుపోయి.. 2,500 టీఎంసీల గోదావరి నీళ్లను మళ్లించుకొనిపోతే.. మన భూభాగంలోకి వచ్చే నీళ్లు ఎక్కడ ఉన్నాయి? ఒక్క శబరి నది నుంచి తప్ప? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ వాళ్లు ఇంకా డ్యాములు కట్టే పరిస్థితి లేదని అంటున్నారు. కానీ, కాళేశ్వరం పేరిట 17టీఎంసీలకు ఒక బ్యారేజీ చొప్పున బ్యారేజీ కట్టుకుంటూపోయారు. ఇకముందు కూడా తెలంగాణలో ఇలా చిన్న చిన్న బ్యారేజ్‌లతో నీళ్లు నింపుకుంటూ పోలేరా? చంద్రబాబు ఇక్కడ సీఎం ఉండగానే.. కాళేశ్వరం ద్వారా 450 టీఎంసీలు అక్కడివారు తరలించుకొని పోయారు? అదే కాళేశ్వరంలో ఇంకా లిఫ్టులు పెట్టుకొనిపోతే 150 టీఎంసీలు తీసుకుపోయే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో వాళ్లు డ్యాములు కట్టలేరు, నీళ్లు తరలించుకుపోలేరు అని గుండెల మీద చేయి వేసుకొని నిబ్బరంగా ఎలా ఉండగలం? ఇప్పటి నుంచి పది సంవత్సరాల తర్వాత భవిష్యత్తును ఆలోచిస్తే.. ఎలా ఉంటుందో ఊహించడానికి భయం అవుతోంది? కారణం ఒకవైపు నీటి వినియోగం పెరిగిపోతోంది. మరోవైపు నీటి మీద ఆధారపడే పరిస్థితి పెరుగుతోంది. నీటి లభ్యత తగ్గిపోతోంది. నీటి యుద్ధాలు జరిగే పరిస్థితి నెలకొంది. కృష్ణనదిలో సగటు నీటి లభ్యత గణనీయంగా తగ్గిపోయిన విషయాన్ని చూశాం. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వంతో సఖ్యతతో ఉండటం ఎంత అవసరమో మనం అంతా ఆలోచించుకోవాలి. తెలుగువాళ్లు అంతా ఒక్కటిగా ఉండాలి.. కలిసి పనిచేసుకోవాలి.. ఒకరికి తోడు ఒకరు ఉండాలన్న వాతావరణం అవసరమని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో ఉండాలన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌పై మన రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలు ఆధారపడి ఉండగా.. తెలంగాణలోని నాలుగు జిల్లాలు ఈ ప్రాజెక్టులపై ఆధారపడ్డాయి. ఈ రెండు ప్రాజెక్టులు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తి అని పేర్కొన్నారు. ఈ సమయంలో టీడీపీ సభ్యులు అల్లరి చేస్తూ.. సీఎం వైఎస్ జగన్ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఈర్ష్య తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని మండిపడ్డారు. -
అక్రమ నిర్మాణదారులకు షోకాజ్ నోటీసులు!
సాక్షి, అమరావతి: కృష్ణానది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇలాంటి నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. చట్టాలను ఉల్లంఘిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా కరకట్ట లోపల నిర్మించిన నిర్మాణాలన్నింటికీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) నోటీసులను సిద్ధం చేసింది. ఏ క్షణమైనా అక్రమ నిర్మాణదారులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇల్లు కూడా అక్రమంగా నిర్మించిందేనని సీఆర్డీఏ నిర్ధారించింది. చంద్రబాబు సహా ఆ భవన యజమాని లింగమనేని రమేష్‌కు సైతం నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. కరకట్ట లోపల నిర్మించిన మిగిలిన అన్ని భవనాల యజమానులకు నోటీసులు ఇవ్వనున్నారు. అక్రమ కట్టడమైన ప్రజావేదికను జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే తొలగించారు. దీనికి కొనసాగింపుగా అన్ని అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు సీఆర్డీఏ నడుం బిగించింది. అక్రమ నిర్మాణానికి ప్రజల సొమ్ముతో హంగులు కృష్ణా నదీ తీరంలో లింగమనేని రమేష్ కొన్నేళ్ల క్రితం నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి అతిథిగృహం నిర్మించగా, 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని లీజుకు తీసుకుని అందులో నివసిస్తున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే అక్రమ కట్టడంలో నివాసం ఉండడం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నించినా చంద్రబాబు లెక్కచేయలేదు. పైగా ప్రభుత్వ నిధులతో ఆ భవనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జీ+1 భవనంలో అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు అక్రమ కట్టడాలను ప్రోత్సహించడంతో కరకట్ట లోపల చాలామంది అక్రమ నిర్మాణాలు చేశారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సామాన్యుడికి ఒక నిబంధన, పెద్దలకు ఒక నిబంధన ఉండదని, అన్ని అక్రమ నిర్మాణాలను తొలగించేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు నివాసంలో అన్నీ అతిక్రమణలే చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ అతిథి గృహంలో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన జీ+1 భవనం, ఇతర నిర్మాణాలను వారం రోజుల్లో తొలగించాల్సి ఉందని, వాటిని ఎందుకు నిర్మించారో వివరణ ఇవ్వాలని సీఆర్డీఏ నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. సీఆర్డీఏ నుంచి అనుమతి తీసుకోకపోవడం, ఏపీ బిల్డింగ్ రూల్స్–2012, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2015లో జారీ చేసిన ఉత్తర్వులు, అమరావతి క్యాపిటల్ సిటీ జోనింగ్ రెగ్యులేషన్–2016కి విరుద్ధంగా ఈ నిర్మాణాలు ఉన్నట్లు సీఆర్డీఏ గుర్తించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలోని డి.నెం.250, 254, 272, 274, 790/1లో ఎకరం ఆరు సెంట్ల స్థలంలో అనుమతి లేని ఈ నిర్మాణాలను గుర్తించారు. తమ నోటీసులపై వారం రోజుల్లో స్పందించి వివరణ ఇవ్వాలని, లేకపోతే సంబంధిత భవనాన్ని తొలగిస్తామని నోటీసుల్లో స్పష్టం చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ సంజాయిషీ ఇచ్చినా, అది సంతృప్తికరంగా లేకపోయినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. కృష్ణానది కరకట్టపై వంద మీటర్ల లోపు 50కి పైగా భవనాలను అక్రమంగా నిర్మించినట్లు సీఆర్డీఏ అధికారులు గుర్తించారు. వాటన్నింటికీ నోటీసులు అందజేయనున్నారు. నోటీసుల్లో ఇచ్చిన గడువులోపు భవన యజమానులు, అద్దెదారులు వివరణ ఇవ్వకపోయినా, అది సరిగ్గా లేకపోయినా నిబంధనలకు అనుగుణంగా వాటిని కూల్చివేసేందుకు సిద్ధమవుతున్నారు. -
నేడు పోతిరెడ్డిపాడు టెలిమెట్రీ పరిశీలన
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న గందరగోళానికి తెరదించేం దుకు ఏర్పాటు చేసిన టెలిమెట్రీ పాయింట్ల పరిశీలన సోమవారం ప్రారంభం కానుంది. కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టుల వద్ద ఏర్పా టు చేసిన టెలిమెట్రీలను పరిశీలించేందుకు సెంట్రల్ వాటర్, పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్)కు చెందిన ముగ్గురు శాస్త్రవేత్త లు హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లారు. మంగళవారం పోతిరెడ్డిపాడు టెలిమెట్రీపై వారు పరిశీలన చేయనున్నారు. గతంలో హెడ్‌రెగ్యులేటర్ దిగువన 12.264 కి.మీ వద్ద ఉన్న పరికరంతో కచ్చితమైన లెక్కలు రావని తేలడంతో హెడ్‌రెగ్యులేటర్ దిగువన 1–3 కి.మీ. పరిధిలోనే పరి కరాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఆ ప్రదేశంలో సైడ్ లుకింగ్ డాప్లర్ కరెంటు ప్రొఫైలర్ (ఎస్ఎల్డీసీపీ)ని ఎక్కడ ఏర్పాటు చేస్తే పోతిరెడ్డిపాడు నీటి విడుదలపై కచ్చితమైన లెక్కలు వస్తాయనే దానిపై సర్వే చేయనున్నా రు. అనంతరం సుంకేశుల బ్యారేజీ వద్ద కేసీ కెనాల్‌ను పరిశీలించి, అక్కడ ఏ ప్రదేశంలో టెలిమెట్రీ ఏర్పాటు చేయాలనే దానిపై సర్వే చేస్తారు. బుధవారం నాగార్జునసాగర్ పరిధిలో టెలి మెట్రీ పాయింట్లకు అనువైన ప్రదేశాలపై సర్వే చేయనున్నారు. బ్రిజేశ్ విచారణ మళ్లీ వాయిదా.. తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణాజలాల పంపిణీ కోసం బ్రిజేశ్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణలో భాగంగా ఏపీ క్రాస్ ఎగ్జామినేషన్ మొదలు కాకముందే వాయిదా పడింది. ఈ నెల 9–11 తేదీల్లో జరగాల్సిన క్రాస్ ఎగ్జామినేషన్ ఈ నెల 29–31 తేదీలకు వాయిదా పడింది. ఈ తేదీల్లో తమ తరఫు న్యాయవాది విదేశీ పర్యటనలో ఉంటారని ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను కోరింది. దీంతో విచారణను వాయిదా వేస్తూ ట్రిబ్యునల్ అధికారికంగా సోమవారం 2 రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. -
కృష్ణా, గోదావరి నదులకు పెరుగుతున్న వరద నీరు
-
కృష్ణాలో తగ్గిన వరద ప్రవాహం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిలో వరద ప్రవాహం ఒక్క సారిగా తగ్గిపోయింది. శ్రీశైలం జలాశయంలోకి శుక్రవారం ఉదయం 9 గంటలకు 1,47,856 క్యూసెక్కుల ప్రవాహం రాగా.. సాయంత్రం ఐదు గంటలకు 49,479 క్యూసెక్కులకు తగ్గిపోయింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 884.3 అడుగుల్లో 211.476 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. వరద తగ్గుముఖం పట్టడంతో క్రస్ట్ గేట్లను మూసివేశారు. కుడి, ఎడమగట్టు కేంద్రాల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 11 వేల క్యూసెక్కులు, హంద్రీ–నీవా ద్వారా 1,300 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2,053 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మొత్తంగా నాగార్జునసాగర్‌కు 56,373 క్యూసెక్కులు చేరుతున్నాయి. హైదరాబాద్, నల్లగొండ జిల్లాల తాగునీటి అవసరాల కోసం 1,800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 570.4 అడుగుల్లో 257.579 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. నాగార్జునసాగర్ నిండాలంటే ఇంకా 55 టీఎంసీలు అవసరం. నదీ పరీవాహక ప్రాంతంలో మళ్లీ వర్షాలు కురిస్తే నాగార్జునసాగర్‌కు ప్రవాహాలు పెరగనున్నాయి. మున్నేరు, మూసీ, వాగుల ద్వారా వస్తున్న జలాలతో నాగార్జునసాగర్‌కు దిగువన కృష్ణా నదిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టులోకి 3,395 క్యూసెక్కులు చేరడంతో నీటి నిల్వ 16.44 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 29.33 టీఎంసీలు అవసరం. తుంగభద్ర నదిలో వరద ప్రవాహం కనిష్ట స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో 90.51 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. ఇంకో పది టీఎంసీలు చేరితే జలాశయం పూర్తిగా నిండిపోతుంది. విద్యుదుత్పత్తి ఆపండి: కాగా శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ పరిధిలో తెలంగాణ చేస్తున్న విద్యుదుత్పత్తిని తక్షణం నిలిపివేయించాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు కృష్ణా బోర్డును కోరింది. ఈ మేరకు ప్రాజెక్టు అధికారులు బోర్డుకు శుక్రవారం లేఖ రాశారు. ఇప్పటికే బోర్డు కేటాయించిన వాటా కన్నా తెలంగాణ అధిక నీటిని వినియోగం చేసిందని, ఇన్‌ఫ్లో తగ్గిన దృష్ట్యా, విద్యుదుత్పత్తి నిలిపివేయించాలని ఏపీ అధికారులు కోరారు. -
కనకదుర్గ వారధిపై ప్రమాదం: వ్యక్తి మృతి
గుంటూరు : విజయవాడలోని కృష్ణానదిపై ఉన్న కనకదుర్గ వారధిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్ మృతి చెందాడు. మృతుడిని విజయవాడకు చెందిన బంగారునాయుడుగా పోలీసులు గుర్తించారు. ఆటోలో దినపత్రికలను తీసుకుని తాడేపల్లి నుంచి విజయవాడకు వస్తుండగా... వారధిపై గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో బంగారునాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో వారధిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. (తాడేపల్లి)