గుంటూరు : విజయవాడలోని కృష్ణానదిపై ఉన్న కనకదుర్గ వారధిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్ మృతి చెందాడు. మృతుడిని విజయవాడకు చెందిన బంగారునాయుడుగా పోలీసులు గుర్తించారు. ఆటోలో దినపత్రికలను తీసుకుని తాడేపల్లి నుంచి విజయవాడకు వస్తుండగా... వారధిపై గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొంది.
ఈ ప్రమాదంలో బంగారునాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో వారధిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
(తాడేపల్లి)