సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న గందరగోళానికి తెరదించేం దుకు ఏర్పాటు చేసిన టెలిమెట్రీ పాయింట్ల పరిశీలన సోమవారం ప్రారంభం కానుంది. కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టుల వద్ద ఏర్పా టు చేసిన టెలిమెట్రీలను పరిశీలించేందుకు సెంట్రల్ వాటర్, పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్)కు చెందిన ముగ్గురు శాస్త్రవేత్త లు హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లారు. మంగళవారం పోతిరెడ్డిపాడు టెలిమెట్రీపై వారు పరిశీలన చేయనున్నారు.
గతంలో హెడ్‌రెగ్యులేటర్ దిగువన 12.264 కి.మీ వద్ద ఉన్న పరికరంతో కచ్చితమైన లెక్కలు రావని తేలడంతో హెడ్‌రెగ్యులేటర్ దిగువన 1–3 కి.మీ. పరిధిలోనే పరి కరాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఆ ప్రదేశంలో సైడ్ లుకింగ్ డాప్లర్ కరెంటు ప్రొఫైలర్ (ఎస్‌ఎల్‌డీసీపీ)ని ఎక్కడ ఏర్పాటు చేస్తే పోతిరెడ్డిపాడు నీటి విడుదలపై కచ్చితమైన లెక్కలు వస్తాయనే దానిపై సర్వే చేయనున్నా రు. అనంతరం సుంకేశుల బ్యారేజీ వద్ద కేసీ కెనాల్‌ను పరిశీలించి, అక్కడ ఏ ప్రదేశంలో టెలిమెట్రీ ఏర్పాటు చేయాలనే దానిపై సర్వే చేస్తారు. బుధవారం నాగార్జునసాగర్ పరిధిలో టెలి మెట్రీ పాయింట్లకు అనువైన ప్రదేశాలపై సర్వే చేయనున్నారు.
బ్రిజేశ్ విచారణ మళ్లీ వాయిదా..
తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణాజలాల పంపిణీ కోసం బ్రిజేశ్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణలో భాగంగా ఏపీ క్రాస్ ఎగ్జామినేషన్ మొదలు కాకముందే వాయిదా పడింది. ఈ నెల 9–11 తేదీల్లో జరగాల్సిన క్రాస్ ఎగ్జామినేషన్ ఈ నెల 29–31 తేదీలకు వాయిదా పడింది. ఈ తేదీల్లో తమ తరఫు న్యాయవాది విదేశీ పర్యటనలో ఉంటారని ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను కోరింది. దీంతో విచారణను వాయిదా వేస్తూ ట్రిబ్యునల్ అధికారికంగా సోమవారం 2 రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది.
నేడు పోతిరెడ్డిపాడు టెలిమెట్రీ పరిశీలన
Published Tue, Jan 22 2019 5:18 AM | Last Updated on Tue, Jan 22 2019 5:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment