pothireddypadu
-
మేము చేసిన అభివృద్ధి గురించే తెలంగాణ అసెంబ్లీలో చర్చించారు
-
తెలంగాణ ప్రభుత్వంపై చర్యలు తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణకు పాల్పడి రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్ద పనులు చేపడుతున్నామంటూ తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ఆధారాలతో ఎన్జీటీని తప్పుదోవ పట్టిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. సృష్టించిన (ఫ్యాబ్రికేటెడ్) ఆధారాలతో వీడియోలు సమర్పించిన తెలంగాణ ప్రభుత్వంపై ఐపీసీ సెక్షన్ 192 మేరకు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరింది. ఏపీ ప్రభుత్వం కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తూ రాయలసీమ ఎత్తిపోతల వద్ద పనులు చేపడుతోందంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ పిటిషన్లకు సంబంధించిన కేసులో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయిన విషయం విదితమే. కోర్టు ధిక్కరణ చర్యలకు సంబంధించి ఎన్జీటీకి అధికారం ఉందా అనే అంశాన్ని కూడా ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ పిటిషన్లో ప్రస్తావించింది. అనంతరం ఎన్జీటీ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం కౌంటరు దాఖలు చేసింది. ఆయా పిటిషన్లను గురువారం జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వెంకటరమణి, అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ మాధురి దొంతిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్ద చేపడుతున్న పనులు, సర్వే.. కేంద్ర జలసంఘం మార్గదర్శకాల మేరకు రూపొందిస్తున్న డీపీఆర్‌కు సంబంధించినవి మాత్రమేనని తెలిపారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు రాయలసీమ ఎత్తిపోతల వద్ద పరిశీలించిన కృష్ణాబోర్డు గతనెల 13న, కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఈనెల 8న ఎన్జీటీకి సమర్పించిన నివేదికల్లో.. ప్రాజెక్టు పరిసరాల్లో ఎలాంటి పనులు కొనసాగడంలేదని స్పష్టం చేశాయని తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు సంబంధించి జరుగుతున్న పనులను రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్ద జరుగుతున్న పనులుగా వీడియో క్లిప్పింగ్‌లు సమర్పించిన తెలంగాణ ప్రభుత్వంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైలుకు పంపాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేయాలని కోరారు. గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్లో తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ అవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమయంలో కల్పించుకున్న ధర్మాసనం..ట్రిబ్యునల్ తీర్పులు అమలు కాకపోతే చూస్తూ ఉండాలా అని ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణపై చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటీకి ఉందని గవినోళ్ల శ్రీనివాస్ న్యాయవాది శ్రావణ్‌కుమార్, తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావు తెలిపారు. అనంతరం ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
ఏపీ అక్రమ నీటి మళ్లింపు అడ్డుకోండి
సాక్షి, హైదరాబాద్: పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ అక్రమ నీటి తరలింపును అడ్డుకోవాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది. నాగార్జునసాగర్ కింద తాగు, సాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఎదురవకుండా వీలైనంత త్వరగా దీనిపై స్పందించి ఏపీకి ఆదేశాలు జారీ చేయాలని విన్నవించింది. ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌కు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌కుమార్ లేఖ రాశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు, తెలంగాణ ఏర్పాటు తర్వాత పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ తరలించిన నీటి లెక్కలను వివరించారు. కేటాయింపులకు విరుద్ధంగా తరలింపు ‘కృష్ణా బేసిన్‌కు ఆవల ఎలాంటి అనుమతుల్లేని ఆయకట్టుకు పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ నీటిని తరలిస్తోంది. 1976, 1977లో జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందాలు, 1981లో ప్రణాళిక సంఘం అనుమతుల మేరకు ఏపీ కేవలం 15 టీఎంసీల నీటిని చెన్నై తాగునీటి అవసరాలకు తరలించాల్సి ఉంది. మరో 19 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా ఎస్ఆర్బీసీకి తరలించాల్సి ఉంది. అదికూడా జూలై, అక్టోబర్ నెలల మధ్యే తరలించాల్సి ఉంది. కానీ ఏపీ ఏటా కేటాయింపులకు విరుద్ధంగా అధికంగా నీటిని తరలిస్తోంది. గత రెండేళ్లుగా చూసినా.. 2019–20లో 179.3 టీఎంసీలు, 2020–21లో 129.45 టీఎంసీలు తరలించింది. ఈ ఏడాది సైతం ఆగస్టు 7 నాటికి 25 టీఎంసీల మేర తరలించింది. శ్రీశైలం పూర్తిగా విద్యుదుత్పత్తి ప్రాజెక్టే ఏపీ ఒకపక్క అక్రమంగా నీటిని తరలిస్తూనే, మరోపక్క శ్రీశైలంలో తెలంగాణ చేస్తున్న విద్యుదుత్పత్తిని ఆపాలని బోర్డును కోరుతోంది. వాస్తవానికి శ్రీశైలం పూర్తిగా విద్యుదుత్పత్తి ప్రాజెక్టే. విద్యుదుత్పత్తి ద్వారానే సాగర్‌కు నీటిని తరలించాల్సి ఉంటుంది. క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో వ్యవసాయం పూర్తిగా 30 నుంచి 35 లక్షల బోర్వెల్లపై, నదుల నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపడంపైనే ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉధృతంగా సాగుతున్న ఖరీఫ్ అవసరాలకు పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. అదీగాక బచావత్ అవార్డు ప్రకారం నాగార్జునసాగర్ కింద సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు 280 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి విడుదల చేయాల్సి ఉంటుంది. దీనికి అదనంగా మరో 16.50 టీఎంసీల నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు సాగర్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అవసరాలన్నిటి దృష్ట్యా సాగర్‌కు నీటి విడుదల అత్యంతావశ్యకం. అందువల్ల పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమ నీటి తరలింపును ఆపేలా చూడండి..’అని స్పెషల్ సీఎస్ కృష్ణా బోర్డును కోరారు. -
పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
-
సాగర్ వైపు కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/ఆలూరు/జూపాడు బంగ్లా: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 4.61 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండటంతో ప్రాజెక్టు వద్ద నీటిమట్టం 882.1 అడుగులకు చేరింది. నీటి నిల్వ 199.27 టీఎంసీలకు చేరుకుంది. దీంతో బుధవారం సాయంత్రం 7 గంటలకు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి చేతుల మీదుగా ఒక గేటును పది అడుగుల మేర ఎత్తి 30 వేల క్యూసెక్కులను సాగర్‌కు విడుదల చేశారు. ఆ తర్వాత మరో గేటును పది అడుగుల మేర ఎత్తి మరో 30 వేల క్యూసెక్కులను విడుదల చేశారు. ఎడమ గట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 35 వేలు, కుడి గట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 31 వేలు.. వెరసి 1.26 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తుండటంతో నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 884.5 అడుగులకు చేరాక.. అదే నీటి మట్టాన్ని నిర్వహిస్తూ దిగువకు విడుదల చేసే ప్రవాహాన్ని పెంచేందుకు ఒక్కో గేటు తెరుస్తామని సీఈ మురళీనాథ్‌రెడ్డి చెప్పారు. 2007 తర్వాత జూలైలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండటం ఇదే తొలిసారి. జూలై 28న గేట్లను ఎత్తేయడం ఇదే ప్రథమం. 2020లో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఆగస్టు 19న ఎత్తేయగా.. 2019లో ఆగస్టు 9న గేట్లను ఎత్తేశారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది ముందే శ్రీశైలం ప్రాజెక్టు నిండటం గమనార్హం. పోతిరెడ్డిపాడు నుంచి 12 వేల క్యూసెక్కులు విడుదల పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్ద బుధవారం 880.10 అడుగుల నీటిమట్టం నమోదైంది. నీటి విడుదలను 12వేల క్యూసెక్కులకు పెంచినట్టు అధికారులు తెలిపారు. ఆ నీటిని బనకచర్ల నీటి నియంత్రణ సముదాయం నుంచి తెలుగు గంగ కాలువకు మళ్లిస్తున్నారు. -
పోతిరెడ్డిపాడు నుంచి దిగువకు నీటి విడుదల
-
బాబూ.. నాడు ప్రేక్షకపాత్ర, నేడు విద్వేషాలకు కుట్ర!
► 1996లో ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచి నీటి నిల్వను 66 నుంచి 129 టీఎంసీలకు పెంచేస్తుంటే చంద్రబాబు ప్రేక్షకపాత్ర వహించారు. నాడు సీఎంగా ఉన్న ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను అప్పటి ప్రధాని దేవెగౌడకు, కర్ణాటక సర్కార్‌కు తాకట్టు పెట్టేశారు. ► తెలంగాణ సర్కార్ 2015లో అక్రమంగా పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్తరామదాస తదితర ఎనిమిది ప్రాజెక్టులను చేపట్టి 178.93 టీఎంసీలను తరలిస్తుంటే నాటి సీఎం చంద్రబాబు మిన్నకుండిపోయారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణ సర్కార్‌కు తాకట్టు పెట్టేశారు. వైఎస్సార్ ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేయకుండా అంచనాలు పెంచేసి కమీషన్లు వసూలు చేసుకున్నారు. తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నుంచే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌పై ఆధారపడ్డ ప్రాజెక్టులకు నీళ్లందించేందుకు ఇప్పుడు సీఎం జగన్ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల, రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు పనులను నిరసిస్తూ ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలతో ఓ లేఖ రాయించారు. ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోసేందుకు కుట్రకు దిగారు. ఆల్మట్టి ఎత్తు పెంపుతో దిగువకు వచ్చే వరద రోజులు తగ్గడం, ఒకేసారి గరిష్టంగా పోటెత్తడం, ఒడిసి పట్టేలా కాలువలు లేకపోవడంతో ప్రకాశం బ్యారేజీ ద్వారా కృష్ణా జలాలు వృథాగా సముద్రం పాలవుతున్నాయి. ఈ జలాలతో దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలను సుభిక్షం చేసేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచే పనులను 2005లో వైఎస్సార్ చేపట్టారు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం రాజకీయ ఉనికి కోసం ఆ పనులకు అడ్డుపడ్డారు. కోస్తాలో ప్రకాశం బ్యారేజీ వద్ద దేవినేని ఉమా, తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌లో నాగం జనార్ధనరెడ్డితో ధర్నాలు చేయించారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొన్నారు. సాక్షి, అమరావతి: దుర్భిక్ష ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు... ప్రతి జిల్లాకూ మేలు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న భగీరథ యత్నం ఫలిస్తే తన రాజకీయ ఉనికి ప్రశ్నార్థకమవుతుందనే ఆందోళనతో ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలు రగిల్చేందుకు మరోసారి కుట్ర పన్నుతున్నారు. రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపును నిరసిస్తూ ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, డోలా వీరాంజనేయస్వామి, సాంబశివరావులతో లేఖ రాయించి మరోసారి తన నైజాన్ని బహిర్గతం చేసుకున్నారు. దివంగత వైఎస్సార్ చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో మిగిలిపోయిన వాటిని ఐదేళ్లలో పూర్తిచేయకుండా ప్రకాశం జిల్లా ప్రజలకు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు ఈ ఎత్తుగడకు తెరతీసినట్లు సాగునీటి నిపుణులు చెబుతున్నారు. వెలిగొండలో ఇప్పటికే మొదటి సొరంగాన్ని రికార్డు సమయంలో పూర్తిచేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం రెండో సొరంగాన్ని కూడా పూర్తిచేసి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, రాయలసీమ ఎత్తిపోతల ద్వారా తరలించే జలాలను సోమశిల నుంచి నార్త్ ఫీడర్ చానల్ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం ద్వారా దుర్భిక్ష ప్రకాశం జిల్లాలోని రాళ్లపాడు జలాశయాన్ని వేగంగా నింపే పనులను రూ.650 కోట్లతో సీఎం వైఎస్ జగన్ చేపట్టారు. వాటి నుంచి ప్రజల దష్టి మరల్చడం, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా ఉనికి చాటుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు పావులుగా వాడుకుంటున్నారనేది నిపుణుల మాట. చిత్తూరు జిల్లాలో 1500 అడుగుల లోతుకు వెళితే గానీ బోర్లుకూడా పడని తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన పశ్చిమ మండలాల ప్రజలకు తాగునీటిని అందించేందుకు చెరువులను సమ్మర్ స్టోరేజీ ట్యాంకులుగా మారిస్తే... వాటిని రిజర్వాయర్లుగా చిత్రీకరిస్తూ, నిలిపివేయాలని ఎన్జీటీలో టీడీపీ నేతలతో కేసులు వేయించిన ఘనత చంద్రబాబుదని వారు గుర్తు చేస్తున్నారు. సొంత జిల్లా ప్రజలకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు తాజాగా వెలిగొండ ప్రాజెక్టుకు కూడా అడ్డుపడుతున్నారనేది పరిశీలకుల మాట. వెలిగొండతో ప్రకాశం సస్యశ్యామలం... శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల్లోనే 43.5 టీఎంసీలను తరలించి ప్రకాశం జిల్లాలో 3.36 లక్షలు, నెల్లూరు జిల్లాలో 84 వేలు, వైఎస్సార్ కడప జిల్లాలో 27,200 వెరసి 4,47,200 ఎకరాలకు నీళ్లందించే లక్ష్యంతో దివంగత వైఎస్సార్ 2004లో వెలిగొండ ప్రాజెక్టును చేపట్టారు. 2009 నాటికే అధిక శాతం పనులను కొలిక్కి తెచ్చారు. మొదటి సొరంగంలో 3.8 కి.మీ, రెండో సొరంగంలో 8.037 కి.మీ. పనులు మాత్రమే మిగిలాయి. అయితే, 2015లో వాటిని సత్వరమే పూర్తిచేసే ముసుగులో రూ.66.44 కోట్లను కాంట్రాక్టర్లకు చెల్లించేసిన చంద్రబాబు కమీషన్ల రూపంలో వాటిని వసూలు చేసుకున్నారు. ఆ తర్వాత రెండు సొరంగాల కాంట్రాక్టు ఒప్పందాలను రద్దుచేసి అంచనాలు పెంచి కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించారు. మొదటి సొరంగంలో 600 మీటర్లు అంటే.. ఐదేళ్లలో రోజుకు అడుగు చొప్పున, రెండో సొరంగంలో కేవలం 416 మీటర్ల పనులతో సరిపుచ్చి చేతులెత్తేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఖజానాకు రూ.61.76 కోట్లను ఆదా చేసి బాబు సర్కారు అక్రమాలను బహిర్గతం చేశారు. మొదటి సొరంగం పనులను రోజుకు 9.23 మీటర్ల చొప్పున యుద్ధప్రాతిపదికన చేసి జనవరి 13 నాటికి పూర్తిచేశారు. రికార్డు సృష్టించారు. రెండో సొరంగం పనులనూ వేగవంతం చేశారు. నల్లమల రిజర్వాయర్‌లో ముంపునకు గురయ్యే 11 గ్రామాలకు చెందిన 7,511 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు ఏకంగా రూ.1,411.56 కోట్లను విడుదల చేశారు. వచ్చే ఏడాదిలోగా ప్రాజెక్టును పూర్తిచేసి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా చర్యలు చేపట్టారు. హక్కులను పరిరక్షిస్తున్న సీఎం జగన్ విభజన తర్వాత ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలంను ఏపీ... నాగార్జునసాగర్‌ను తెలంగాణ ప్రభుత్వాలు నిర్వహించాలని కేంద్రం పేర్కొంది. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రం తమ భూభాగంలో ఉందనే సాకుతో తెలంగాణ సర్కార్ స్వాధీనం చేసుకుంది. రాష్ట్ర భూభాగంలో ఉన్న సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను కూడా తెలంగాణ సర్కార్ తన స్వాధీనంలోనే ఉంచుకుంది. సాగర్ కుడి కాలువకు కష్ణా బోర్డు కేటాయించిన నీటిని తెలంగాణ సర్కార్ ఫిబ్రవరి 12, 2015న అర్థాంతరంగా ఆపేయడంతో మరుసటి రోజు.. నాడు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్‌దాస్ పోలీసు బలగాలతో సాగర్ వద్దకు వెళ్లారు. అయితే, ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి సాగర్ కుడి కాలువపై ఆధారపడిన గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతుల హక్కులను తెలంగాణ సర్కార్‌కు చంద్రబాబు తాకట్టు పెట్టారు. సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకోకుండానే అధికారులను వెనక్కి రప్పించారు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించాక 2019–20, 2020–21లో కేటాయించిన దానికంటే అధికంగా నీటిని విడుదల చేయించడం ద్వారా రాష్ట్ర హక్కులను పరిరక్షించడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. బీడు భూములు పచ్చబడుతుండంతో.. గత రెండేళ్లుగా సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు, వరద నీటిని ఒడిసి పట్టి మళ్లించడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా బీడు భూములు పచ్చబడుతున్నాయి. పంటలు బాగా పండటం, గిట్టుబాటు ధరలు దక్కవడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రాన్ని కరువన్నదే ఎరుగని ప్రాంతంగా తీర్చిదిద్దడానికి సీఎం వైఎస్ జగన్ భారీఎత్తున ప్రాజెక్టులు చేపట్టారు. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి తరలించిన గోదావరి జలాలను రూ.5వేల కోట్లతో చేపట్టిన వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా సాగర్ కుడి కాలువలోకి పోసి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఆయకట్టును స్థిరీకరించడానికి, దుర్భిక్ష పల్నాడును సుభిక్షం చేయడానికి చర్యలు చేపట్టారు. దీనికోసం రూ.1,200 కోట్లకు రాష్ట్ర ఖజానా నుంచి ఇప్పటికే ఖర్చు చేశారు. దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన వరికపుడిశెల ఎత్తిపోతల పనులు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే రాయలసీమ ఎత్తిపోతల చేపట్టారు. సముద్రంలో వృథాగా కలిసే వరదను ఒడిసి పట్టడానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచే పనులను చేపట్టారు. ఇవన్నీ బాబుకు నిద్రలేకుండా చేస్తున్నాయని, ఈ సమతుల అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్నారని పరిశీలకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే 2005 తరహాలో ప్రాంతీయ విద్వేషాలను రగిల్చే దుస్సాహసానికి ఒడిగట్టారని, రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపువల్ల ప్రకాశం జిల్లా ప్రయోజనాలను దెబ్బతింటాయని దుష్ప్రచారం చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలతో లేఖ రాయించినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. -
ప్రాజెక్టుల వద్ద ఎవరూ గుమికూడరాదు: ఎస్పీ ఫక్కీరప్ప
సాక్షి, కర్నూలు : జిల్లాలోని శ్రీశైలం, పోతిరెడ్డిపాడు,హెడ్ రెగ్యులేటర్, రాజోలు బండ డైవర్షన్ స్కీమ్ ప్రాజెక్టుల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశామని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. ప్రాజెక్టుల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని, అక్కడ ఎవరూ గుమికూడరాదని చెప్పారు. అవసరమైతే ప్రాజెక్టుల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తామన్నారు. శాంతి భద్రతలో భాగంగా ప్రాజెక్టుల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు. కాగా, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పోలీసులు మోహరించారు. మహబూబ్‌నగర్ జూరాల ప్రాజెక్ట్ వంతెనపై తెలంగాణ పోలీసులు రాకపోకలు నిషేధించారు. తెలంగాణ పోలీసుల పర్యవేక్షణలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. అత్యవసరమైతేనే తప్ప అనుమతించటం లేదు. గద్వాల, ఆత్మకూరు, మక్తల్ మధ్య రాకపోకలు బందయ్యాయి. -
ఆ ఏడు ప్రాజెక్టులు ఆపండి..
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర జల్‌శక్తి శాఖ తాజాగా తెలంగాణకు ఓ లేఖ రాసింది. అదిప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ లేఖలో ఏం ఉందంటే? కాళేశ్వరం ఎత్తిపోతల మూడో టీఎంసీ ప్రతిపాదిత ప్రాజెక్టుసహా ఏడు ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టుల నిర్వచనం పరిధిలోకి వస్తున్నందున వాటిపై ముందుకు వెళ్లొద్దని పేర్కొంది. కాళేశ్వరం మూడో టీఎంసీ, సీతారామ ఎత్తిపోతల, జీఎల్ఐఎస్ ఫేజ్–3, తుపాకులగూడెం ప్రాజెక్టు, తెలంగాణ తాగునీరు సరఫరా ప్రాజెక్టు, లోయర్ పెన్‌గంగపై బ్యారేజీ, రామప్ప సరస్సు నుంచి పాకాల లేక్‌కు నీటి మళ్లింపు తదితర ఏడు ప్రాజెక్టులకు గోదావరి నదీజలాల యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) నుంచి మదింపు కానంత వరకు ముందుకు వెళ్లరాదని తెలంగాణకు స్పష్టం చేసింది. నీటి వివాదాలపై అక్టోబర్ 2న పలు అభ్యంతరాలను లేవనెత్తుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాసిన లేఖకు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ బదులిస్తూ నాలుగు పేజీల సమాధానం పంపారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో శుక్రవారం(డిసెంబర్ 11) జల్‌శక్తి మంత్రిని కలిసిన రోజే ఈ లేఖను పంపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు లేఖలోని వివరాలు ఇలా ఉన్నాయి. 1. ‘‘కృష్ణా, గోదావరి నదులలో నీటి వాటా, వినియోగానికి సంబంధించి మీరు అక్టోబర్ 2, 2020న రాసిన లేఖలోని అనేక అంశాలు అక్టోబర్ 6 నాటి అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో చర్చకు వచ్చాయి. అయితే మీరు లేవనెత్తిన అన్ని అంశాలపై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రిగా స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ఇంకా లేఖలో ఏ ఏ అంశాలున్నాయంటే..కృష్ణా, గోదావరి జలాల పునఃపంపిణీపై..‘కృష్ణా నదీజలాల వాటా, నీటి వినియోగంలో ఉమ్మడి ఏపీలో తెలంగాణకు జరిగిన అన్యాయాల గురించి మీరు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటా కోసం మీరు చేసిన ప్రయత్నాలను వివరించారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం–1956 పరిధిలోని సెక్షన్ 3 ద్వారా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని 2014, 2018లో కోరినప్పటికీ కేంద్రం ఏడేళ్లుగా నిష్క్రియాత్మకంగా వ్యవహరించిందని మీరు ఆరోపించారు. ఈ సెక్షన్ పరిధిలో కాకుండా ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ఆధారంగా పరిష్కరించాలని ట్రిబ్యునల్‌కు సూచించారని మీరు నివేదించారు. దీనివల్ల తెలంగాణ ఉపశమనం పొందలేదని మీరు చెప్పారు. అయితే ఈ విషయంలో మీరు 2015లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా అది ఇంకా పెండింగ్‌లో ఉంది. ఇది అక్కడ పరిష్కారమైతేనే కేంద్రం చర్య తీసుకోగలదు. అక్టోబర్ 6 నాటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మీరు ఈ పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అంగీకరించారు. మీరు ఉపసంహరించుకుంటే న్యాయ సలహా తీసుకుని నదీజలాల వివాద పరిష్కార చట్టంలోని సెక్షన్ 3 పరిధిలో కృష్ణానదీ జలాల పునఃపంపిణీ అభ్యర్థనను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర జల్‌శక్తి శాఖ అంగీకరించింది. గోదావరి జలాల విషయంలో కూడా రెండు రాష్ట్రాలు ఈ సెక్షన్ పరిధిలో అభ్యర్థన ఇచ్చేందుకు సమ్మతించాయి. అభ్యర్థన రాగానే సానుకూల నిర్ణయం తీసుకుంటామని నాటి సమావేశంలో జల్‌శక్తి శాఖ అంగీకరించింది’ 2. పోతిరెడ్డి ప్రాజెక్టు విస్తరణపై .. ‘మీరు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్ట్, దాని విస్తరణ గురించి ప్రస్తావించారు. ఇది అనధికార విస్తరణ అని, దీని వల్ల తెలంగాణ హక్కులు కోలుకోలేని విధంగా దెబ్బతింటాయని మీరు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం–2014(ఏపీఆర్ఏ) ప్రకారం కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను మూల్యాంకనం కోసం కేఆర్ఎంబీకి సమర్పించడానికి ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలి. తదుపరి అపెక్స్ కౌన్సిల్ వాటిని అనుమతిస్తుంది. కృష్ణా నదీజలాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1)లో గానీ, ఏపీఆర్‌ఏలో గానీ ప్రస్తావించినవీ లేదా ప్రస్తావన లేనివీ అయినప్పటికీ.. సీడబ్ల్యూసీ ద్వారా సాంకేతిక, ఆర్థిక మదింపు జరగని పక్షంలో, జల వనరుల విభాగం సలహా కమిటీ ఆమోదం పొందని పక్షంలో అవి కొత్త ప్రాజెక్టుగా పరిగణించాల్సి ఉంటుంది. అది ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించినా, తరువాత ప్రతిపాదించినా ఈ షరతు మాత్రం సంతృప్తి పరచాల్సి ఉంటుంది. అలాగే ప్రాజెక్టు స్వభావంలో మార్పు చోటుచేసుకున్నా కొత్త ప్రాజెక్టుగా పరిగణించాల్సి ఉంటుంది. ఈ మేరకు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణకు సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీల సాంకేతిక మదింపు లభించనంతవరకు ముందుకు వెళ్లరాదని కేఆర్ఎంబీ, జల్‌శక్తి శాఖ ఆంధ్రప్రదేశ్‌కు పలుమార్లు లేఖ రాశాయి. ఈమేరకు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చకు రాగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొత్త ప్రాజెక్టులకు డీపీఆర్‌లు పంపేందుకు అంగీకరించారు’ 3. కేఆర్ఎంబీ స్పందించలేదన్న ఆరోపణలపై.. ‘పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ఆపడంలో కేఆర్ఎంబీ విఫలమైందని మీరు పేర్కొన్నారు. అలాగే ఏపీ కృష్ణా బేసిన్ నుంచి ఇతర బేసిన్లకు నీటి తరలించడాన్ని కూడా కేఆర్ఎంబీ ఆపలేకపోయిందని రాశారు. టెండర్ ప్రక్రియను ఆపడంలో కూడా విఫలమైందన్నారు. ఏపీ అక్రమంగా జలాలు వినియోగించడాన్ని పర్యవేక్షించడానికి టెలిమెట్రీ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని 2016లో జల్‌శక్తి శాఖ చేసిన సూచనలు అమలు చేయడంలో కేఆర్ఎంబీ విఫలమైందని రాశారు. అలాగే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ నుంచి విద్యుదుత్పత్తిని ఆపాలని తెలంగాణను కేఆర్ఎంబీ కోరడం తప్పని మీరు రాశారు. కేడబ్ల్యూడీటీ–1 ఆదేశాల మేరకు శ్రీశైలం వద్ద విద్యుత్ ఉత్పత్తికి, నీటిని దిగువకు విడుదల చేయడానికి, తాగునీరు మాత్రమే కాకుండా ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు యొక్క ఆపరేషన్, నియంత్రణను ఇవ్వమని మీరు అభ్యర్థించారు. పోతిరెడ్డిపాడు, రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ డీపీఆర్‌లను మదింపు చేసే వరకు ముందుకు వెళ్లవద్దని కేఆర్‌ఎంబీతోపాటు జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఏపీని నిరంతరం కోరుతూ వచ్చింది. దీనికి ఏపీ స్పందించలేదు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చకు వచ్చింది. పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల సహా రెండు రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు పంపాలని మేం నిర్ణయించిన సంగతి మీకు తెలిసిందే. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిని నోటిఫై చేయాలని నిర్ణయించాం. నోటిఫై చేయడం పూర్తయితే విద్యుదుత్పత్తి సహా శ్రీశైలం నుండి దిగువకు నీటిని విడుదల చేయడం, నియంత్రించడం వంటి అంశాలను కేఆర్ఎంబీ నిర్దేశిస్తుంది. ఇక టెలిమెట్రీ వ్యవస్థల ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు వ్యయం భరించాలని 2016లో జరిగిన 1వ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అంగీకరించారు. దీనిపై పదేపదే అభ్యర్థన చేసినప్పటికీ రెండు రాష్ట్రాలు స్పందించలేదు. రెండు రాష్ట్రాలు ఈ దిశగా వ్యయం భరిస్తే టెలిమెట్రీ వ్యవస్థ స్థాపించడం పూర్తవుతుంది’ 4. సెక్షన్ 89 అంశంపై.. ‘ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89కు సంబంధించిన సమస్యల గురించి మీరు రాశారు. అంతర్రాష్ట్ర నదీజలాల వివాద పరిష్కార చట్టంలోని సెక్షన్ 3 పరిధిలో కేంద్రం రెఫర్ చేయనందున కృష్ణా నదీజలాలను పునఃపంపిణీ చేసే అంశం పరిశీలించలేమని, సెక్షన్ 89 పరిధిలో మాత్రమే పరిశీలన జరుగుతుందని కేడబ్ల్యూడీటీ–2 అభిప్రాయపడ్డట్టు మీరు రాశారు. సెక్షన్ 3 పరిధిలో కొత్త ట్రిబ్యునల్ గానీ, ఉనికిలో ఉన్న ట్రిబ్యునల్‌గానీ కృష్ణా నదీజలాల పునఃపంపిణీ జరిపేలా రెఫర్ చేయాలని మీరు కోరారు. కేంద్రం స్పందించలేదని మీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే మేం మీ అభ్యర్థనను పరిశీలించేందుకు సిద్ధమని చెప్పగా అపెక్స్ కౌన్సిల్లో మీరు కూడా అంగీకరించారు’ 5. ఆ ఏడు ప్రాజెక్టుల్లో ముందుకు వెళ్లొద్దు.. ‘తెలంగాణలో గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలను మీరు మీ లేఖలో ప్రస్తావించారు. మీరు గోదావరిపై చేపట్టిన ఏడు ప్రాజెక్టులు కొత్తవి కావని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించినవని మీరు ప్రస్తావించారు. భారీ ముంపు నష్టం లేకుండా కొన్ని ప్రాజెక్టుల స్థలాన్ని మార్చినట్టు, మెరుగైన సామర్థ్యం కనబరిచేలా కొన్ని ప్రాజెక్టులను రీడిజైన్ చేసినట్టు మీరు చెప్పారు. జల్‌శక్తి మంత్రిత్వ శాఖ కూడా కాళేశ్వరం (2 టీఎంసీ) ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చినట్టు, ఆ స్థలంలో నీటి లభ్యత కారణంగా 3వ టీఎంసీ విస్తరణకు ముందుకు వెళ్లినట్టు మీరు మీ లేఖలో తెలిపారు. అయితే, ఆగస్టు 7న మీకు నేను రాసిన లేఖను గుర్తు చేయాలనుకుంటున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు 2 టీఎంసీల ప్రతిపాదనకు జల్‌శక్తి మంత్రిత్వ శాఖ సలహా కమిటీ 2018 జూన్‌లో అంగీకరించింది. కానీ, ·ఈ ప్రాజెక్ట్ పరిధిని 3 టీఎంసీలకు పెంచుతూ మీరు మార్చారు. అలాంటి మార్పు ఏదైనా ఉన్నప్పుడు కేంద్రం నుంచి హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర, పెట్టుబడులు, పర్యావరణ తదితర అనుమతులను పొందాల్సి ఉంటుందని మీకు రాశాను. ఈ మార్పు కారణంగా ఏపీఆర్ఏ–2014ను అనుసరించి జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ నుంచి మదింపు తప్పనిసరి. ఏపీ అభ్యంతరం చెప్పినట్టుగా ఈ ఏడు ప్రాజెక్టుల డీపీఆర్‌ల మదింపు జరగకుండా ముందుకు వెళ్లరాదని కూడా ఆ లేఖలో చెప్పాం. దీనిపై అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో కూడా చర్చించాం. జీఆర్ఎంబీకి డీపీఆర్‌లు పంపేందుకు మీరు సమ్మతించారు. అందువల్ల మీరు కాళేశ్వరం ఎత్తిపోతల మూడో టీఎంసీ ప్రతిపాదన, సీతారామ ఎత్తిపోతల, జీఎల్ఐఎస్ ఫేజ్–3, తుపాకులగూడెం ప్రాజెక్టు, తెలంగాణ తాగునీరు సరఫరా ప్రాజెక్టు, లోయర్ పెన్‌గంగపై బ్యారేజి, రామప్ప సరస్సు నుంచి పాకాల లేక్‌కు నీటి మళ్లింపు ప్రాజెక్టులకు జీఆర్ఎంబీ మదింపు జరగనంతవరకు ముందుకు వెళ్లరాదని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాను’ 6. గోదావరి జలాల పంపిణీపై.. ‘గోదావరి నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు 967.94 టీఎంసీలు, ఏపీకి 518.2 టీఎంసీలు కేటాయించారని మీరు ప్రస్తావించారు. తెలంగాణకు 1950 టీఎంసీల వాటా దక్కాలని మీరు రాశారు. ఏపీ, తెలంగాణల మధ్య గోదావరి జలాలను పంచుకునే విషయంలో కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు తక్షణం అభ్యర్థన పంపుతామని ఇరు రాష్ట్రాలు అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అంగీకరించాయి. అభ్యర్థన రాగానే ఈ దిశగా కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుంది’అని మంత్రి పేర్కొన్నారు. ‘రెండు రాష్ట్రాల మధ్య నీటి భాగస్వామ్యం, నీటి వినియోగ సమస్యలు పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న అన్ని నిర్ణయాలపై వేగంగా ముందుకు సాగుతున్నామని ఆశిస్తున్నాను. తద్వారా రెండు రాష్ట్రాల చట్టబద్ధమైన నీటి హక్కులు త్వరితగతిన సాకారం అయ్యేలా చూసుకోవచ్చు’అని జల్‌శక్తి మంత్రి షెకావత్ పేర్కొన్నారు. ఆ ఏడు ప్రాజెక్టులు ఇవే.. కాళేశ్వరం మూడో టీఎంసీ సీతారామ ఎత్తిపోతలు జీఎల్ఐఎస్ ఫేజ్–3 తుపాకులగూడెం ప్రాజెక్టు తెలంగాణ తాగునీరు సరఫరా ప్రాజెక్టు లోయర్ పెన్‌గంగపై బ్యారేజీ రామప్ప సరస్సు నుంచి పాకాల లేక్‌కు నీటి మళ్లింపు -
‘పోతిరెడ్డిపాడు–గోరకల్లు’ అభివృద్ధి పనుల్లో రూ.16.5 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్(పీహెచ్ఆర్) నుంచి గోరకల్లు రిజర్వాయర్ బెర్మ్ వరకూ కాలువ లైనింగ్.. ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా అభివృద్ధి చేసే పనుల టెండర్లలో ఖజానాకు రూ.16.504 కోట్లు ఆదా అయ్యాయి. టెండర్ల ప్రక్రియను మంగళవారం స్టేట్ లెవల్ టెక్నికల్ కమిటీ(ఎస్‌ఎల్‌టీసీ) పరిశీలించి, ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత 1.622% తక్కువ ధరలకు పనులను దక్కించుకున్న పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ సంస్థకు వర్క్ ఆర్డర్ జారీ చేయనున్నారు. పీహెచ్ఆర్ నుంచి గోరకల్లు రిజర్వాయర్ బెర్మ్ వరకూ కాలువ అభివృద్ధి పనులకు రూ.1,017.22 కోట్ల అంచనా వ్యయంతో ఎల్ఎస్(లంప్సమ్)–ఓపెన్ విధానంలో జలవనరుల శాఖ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ► ఈ టెండర్లలో ఎన్సీసీ, ఎస్ఆర్సీ ఇన్ఫ్రా, ఓమ్ మెటల్స్ ఇన్ఫ్రా, పీఎన్సీ ఇన్ఫ్రా సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఓమ్ మెటల్ప్ ఇన్ఫ్రాకు పనులు చేసిన అనుభవం లేకపోవడంతో టెక్నికల్ బిడ్‌లో ఆ సంస్థపై అనర్హత వేటు వేశారు. ► మిగిలిన మూడు సంస్థలు ప్రైస్ బిడ్‌కు అర్హత సాధించాయి. ప్రైస్ బిడ్‌లో 0.9% అధిక ధర(రూ.1026.375 కోట్లు)కు కోట్ చేసిన సంస్థ ఎల్–1గా నిలిచింది. ► ఎల్–1గా నిలిచిన సంస్థ కోట్ చేసిన రూ.1026.375 కోట్లను కాంట్రాక్టు విలువగా పరిగణించి.. ఈ–ఆక్షన్(రివర్స్ టెండరింగ్) నిర్వహించారు. రివర్స్ టెండరింగ్ గడువు ముగిసే సమయానికి 1.622% తక్కువ ధర(రూ.1,000.716)కు కోట్ చేసిన పీఎన్సీ ఇన్ఫ్రా సంస్థ ఎల్–1గా నిలిచింది. ► దాంతో ఖజానాకు రూ.16.504 కోట్లు ఆదా అయ్యాయి. ► టెండర్ల ప్రక్రియపై కర్నూలు ప్రాజెక్టŠస్ సీఈ మురళీనాథ్‌రెడ్డి శుక్రవారం ఈఎన్సీ సి.నారాయణరెడ్డికి పంపారు. ఈఎన్సీ నేతృత్వంలో మంగళవారం ఎస్‌ఎల్‌టీసీ సమావేశమై టెండర్‌ను ఆమోదించనుంది. -
తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అర్థంలేని వాదనలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థం పర్థం లేని, నిరాధారమైన, అనవసర రాద్ధాంతం చేస్తోందని.. కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంబిస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నా అంతట నేనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహహస్తం అందించాం. బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని మన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పాం. సహజ సరిహద్దు రాష్ట్రాలు కాబట్టి స్నేహపూర్వకంగా మెలిగి, అంతిమంగా రైతులకు సాగునీరు అందించే లక్ష్యం సాధించాలని ప్రతిపాదించాం. వృథాగా సముద్రం పాలవుతున్న నీటిని రైతుల పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలుచేద్దామని చెప్పాం. అయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటోంది. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అర్థంలేని వాదనలతో, నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తోంది. అపెక్స్ కమిటీ సమావేశంలో ఆం«ద్రప్రదేశ్ ప్రభుత్వం నోరు మూయించేలా, వారి అర్థరహిత వాదనలను తిప్పికొట్టేలా సమాధానం చెబుతాం. తెలంగాణ ప్రాజెక్టుల గురించి మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కల్పిస్తాం’అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిని ఖరారు చేసేందుకు సోమవారం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో జలవనరుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పూర్వాపరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. కేంద్రం, ఏపీ అభిప్రాయాలపై చర్చించారు. కేంద్రానిది కూడా తప్పే.. ‘తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా తప్పే. తెలంగాణ రాష్ట్రానికున్న నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే నీటి కేటాయింపులు జరిగి, అనుమతులు పొంది, ఖర్చు కూడా జరిగిన ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏమాత్రం సరికాదు’అని సీఎం అభిప్రాయపడ్డారు. త్వరలో జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో పూర్తి వాస్తవాలు, సంపూర్ణ సమాచారం ముందు పెట్టి సమర్థవంతంగా వాదనలను వినిపించాలని నిర్ణయించారు. ‘శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే విషయంలో కూడా కేంద్రం అనవసరంగా అభ్యంతరపెడుతోంది. వాస్తవానికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు నింపిన తర్వాతే మిగిలిన ప్రాజెక్టులు నింపాలి. అసలు శ్రీశైలం ప్రాజెక్టు నీటి పారుదల ప్రాజెక్టు కాదు. అది జలవిద్యుత్ ప్రాజెక్టు. ఇన్ని వాస్తవాలు పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడం సమంజసం కాదు. ఈ విషయంలో రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరించడం తగదు. కేంద్ర వైఖరిని కూడా యావత్ దేశానికి తెలిసేలా చేస్తాం’అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. రాష్ట్ర హక్కుల ప్రకారమే ప్రాజెక్టులు.. ‘గోదావరి, కృష్ణా బేసిన్లలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న హక్కుల ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. తెలంగాణ ఏర్పడే నాటికే ఇప్పుడు నిర్మిస్తున్న ప్రాజెక్టులు మంజూరయ్యాయి. వాటికి నీటి కేటాయింపులు కూడా జరిగాయి. సీడబ్ల్యూసీ సహా ఇతర సంస్థల నుంచి అనుమతులు వచ్చాయి. దాదాపు రూ.23వేల కోట్ల మేర నిధుల ఖర్చు చేశారు. 31,500 ఎకరాల భూసేకరణ జరిగింది. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు వీటిని కొత్త ప్రాజెక్టులు అనడం అర్థరహితం, అవివేకం. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో మంజూరైనప్పటికీ వాటిని పూర్తిచేయలేదు. పైగా తక్కువ నీటితో ఎక్కువ ఆయకట్టును ప్రతిపాదించారు. దీనివల్ల సాగునీటి అవసరాలు సంపూర్ణంగా తీరవు. చాలా ప్రాజెక్టుల డిజైన్ తెలంగాణ రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా చేయలేదు. అందువల్ల తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికున్న హక్కులు, అవసరాలు, నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు రీ డిజైన్ చేసి నిర్మిస్తున్నాం. దీన్ని తప్పుబట్టడంలో అర్థంలేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో నీటి కేటాయింపులు జరిపి, ప్రతిపాదించిన ప్రాజెక్టులు కట్టడంలేదనే అసంతృప్తితోనే, నీటి పారుదల రంగంలో జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం వచ్చింది’అని కేసీఆర్ వివరించారు. అవన్నీ రీ డిజైన్ చేసిన ప్రాజెక్టులు.. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ చేసి కాళేశ్వరం, కంతనపల్లి ప్రాజెక్టును రీ డిజైన్ చేసి సమ్మక్క సాగర్, రాజీవ్‌సాగర్–ఇందిరాసాగర్ ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టు, దుమ్ముగూడెం ప్రాజెక్టును రీ డిజైన్ చేసి సీతమ్మసాగర్ నిర్మిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. పెన్‌గంగ ప్రాజెక్టులకు 1975లోనే ఒప్పందం కుదిరిందన్నారు. ఈ ప్రాజెక్టులు ఎప్పుడు మంజూరయ్యాయి? ఏఏ అనుమతులు సాధించారు? తెలంగాణ వచ్చేనాటికే ఎంత ఖర్చు చేశారు? ఎంత భూమి సేకరించారు? విడుదల చేసిన జీవోలు.. తదితర వాస్తవాలను అపెక్స్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా బహిరంగ పరిచి ఫిర్యాదులు చేసినవారికి, సందేహాలు వెలిబుచ్చినవారికి తిరుగులేని సమాధానం చెప్పాలని అధికారులను ఆదేశించారు. ‘గతంలో జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం వ్యక్తంచేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రలో చేపట్టిన ముచ్చుమర్రిని ప్రస్తావించింది. దీంతో ఈ రెండింటినీ కొనసాగించాలని నిర్ణయించారు. మళ్లీ ఆ అంశాన్ని లేవనెత్తడం సరికాదు. పాలమూరు–రంగారెడ్డి విషయంలో కూడా వాస్తవాలను మరోసారి వివరిస్తాం’అని సీఎం పేర్కొన్నారు. మంచినీటి అవసరాల కోసం వాడే నీటిలో 20 శాతాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ట్రిబ్యునల్ చెప్పిందని, దాని ప్రకారం తెలంగాణ మంచినీటి కోసం వాడే 110 టీఎంసీల్లో 22 టీఎంసీలను మాత్రమే లెక్కకు తీసుకోవాలని స్పష్టంచేశారు. సాగునీటిలో తెలంగాణకు అంతులేని అన్యాయం... ‘సాగునీటి రంగంలో తెలంగాణకు మొదటి నుంచీ అన్యాయం జరిగింది. ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన నాగార్జునసాగర్ ప్రాజెక్టును 17 కిలోమీటర్ల దిగువన కట్టడం వల్ల అన్యాయం జరిగింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కారణంగా ఎగువ కృష్ణ, తుంగభద్ర, బీమా ప్రాజెక్టులు పోయాయి. నీటివాటాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని సాక్షాత్తూ బచావత్ ట్రిబ్యునల్ పేర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తన నీటి వాటాను అడిగే సందర్భంలో తెలంగాణను పరిగణనలోకి తీసుకోలేదని స్వయంగా ట్రిబ్యునల్ గ్రహించి, తెలంగాణకు ప్రత్యేకంగా నీటిని కేటాయించింది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన జూరాలతో పాటు నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా, కోయల్‌సాగర్ వంటి ప్రాజెక్టులను తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తి చేసుకోగలిగాం. ఆర్డీఎస్ తూములను ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు బాంబులు పెట్టి పేల్చితే.. గ్రావిటీ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాలేదు. ఆర్డీఎస్ ఆయకట్టును స్థిరీకరించడానికి ఎంతో వ్యయం చేసి తుమ్మిళ్ల లిఫ్టు నిర్మించుకోవాల్సి వచ్చింది. ఇలా సాగునీటి రంగంలో అంతులేని అన్యాయం జరిగింది. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు దక్కిన నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం. వాస్తవానికి ఇంకా తెలంగాణకు నీటి అవసరం ఉంది. గోదావరి మిగులు జలాల్లో మరో వెయ్యి టీఎంసీలు దక్కాల్సి ఉంది. గోదావరికి తెలంగాణలోనే క్యాచ్‌మెంటు ఏరియా ఎక్కువ. నది ప్రవహించేది తెలంగాణలోనే ఎక్కువ. రాష్ట్రానికి అవసరాలు కూడా ఉన్నాయి. సముద్రంలో కలిసే 2వేల టీఎంసీలలో తెలంగాణకు కనీసం వెయ్యి టీఎంసీలు కేటాయించాలి’అని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. -
పోతిరెడ్డిపాడుపై బహిరంగ చర్చకు సిద్ధమా?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని టీఆర్ఎస్ నాయకులకు ఆయన సవాల్ విసిరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థతను, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో చేసిన పొరపాట్లను కప్పిపుచ్చుకునేందుకే అసంబద్ధ, అవాస్తవ వాదనను టీఆర్ఎస్ నేతలు ముందుకు తెస్తున్నారని శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు. దీనిపై బహిరంగ చర్చకు ప్రత్యక్షంగానైనా, వర్చువల్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారానైనా సిద్ధమేనని తెలిపారు. సీఎం కేసీఆర్ కాంట్రాక్టర్లకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్న తీరును బహిర్గతం చేసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెడతానని ఆ ప్రకటనలో వంశీ పేర్కొన్నారు. -
జేబులు నింపుకోవడానికే ప్రాజెక్టులు
స్టేషన్ మహబూబ్‌నగర్: తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తారని కేసీఆర్‌ను సీఎంగా ఎన్నుకుంటే అందుకు భిన్నంగా ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జేబులు నింపుకోవడానికే మిషన్ భగీరథ, కొత్త ప్రాజెక్టులు కడుతున్నారని ఆరోపించారు. ఇంత అవినీతి సీఎం దేశంలో ఎవరూ లేరని ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై బుధవారం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉత్తమ్ మాట్లాడుతూ.. పోతి రెడ్డిపాడు ద్వారా రోజూ 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కుల నీళ్లు ఏపీ తీసుకువెళితే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీళ్లు తీసుకెళుతామని గత డిసెంబర్లో ఏపీ ప్రభుత్వం ప్రకటించిందని, ఈ విషయంపై జనవరి 5న తమ పార్టీ నేత నాగం జనార్దన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తే స్పందించలేదన్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క నూతన ఆయకట్టు కన్నా నీరిచ్చారా అని ప్రశ్నించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడితే 16 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చేదని, కానీ సీఎం పట్టించుకోలేదని విమర్శించారు. మహబూబ్‌నగర్‌ను బొందపెట్టిండు... కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులను 90% పూర్తిచేస్తే, ఈ ఆరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10% పనులను కూడా పూర్తి చేయలేదని ఉత్తమ్ దుయ్యబట్టారు. ఎంపీగా రాజకీయ జీవితాన్ని ఇచ్చిన మహబూబ్‌నగర్‌ను కేసీఆర్ బొందపెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ 30 కిలోమీటర్లు పూర్తి చేస్తే, మిగిలిన 10 కిలోమీటర్ల పనులను టీఆర్ఎస్ పూర్తి చేయలేకపోయిందన్నారు. వచ్చే నెల 2న కృష్ణానది పరివాహక ప్రాజెక్టుల వద్ద జల దీక్ష చేస్తున్నట్లు ఉత్తమ్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు మేరకు చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం, వలస కార్మికులను వారి సొంతూళ్లకు తరలించడం తదితర కార్యక్రమాలపై పార్టీ నేతలు, కార్యకర్తలు నేడు సోషల్ మీడియా క్యాంపెన్ నిర్వహించాలని సూచించారు. సాగర్ ఎండిపోయే ప్రమాదం.. ఉన్న నీళ్లనే వాడుకలోకి తీసుకురాలేని ప్రభుత్వం అదనపు నీళ్లను ఎలా తీసుకువస్తుందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అదనంగా నీళ్లను తీసుకెళ్లాలనే ఆలోచన వచ్చేది కాదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండితేనే నాగార్జునసాగర్‌కు నీళ్లు వస్తాయని, సాగర్ నిండక ఏడేళ్లు అవుతుందని, ఈ పరిస్థితుల్లో సంగమేశ్వర నుంచి నీళ్లను తీసుకువెళితే భవిష్యత్‌లో నాగార్జునసాగర్ ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. దీంతో సాగర్ ఎడమ కాల్వ మీద ఆధారపడిన ఖమ్మం, నల్లగొండ జిల్లాలు ఎడారిగా మారతాయన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, వంశీచంద్రెడ్డిలు సాగునీటి రంగంలో జిల్లాకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. సమావేశంలో మాజీ ఎంపీ మల్లురవి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, సీనియర్ నేతలు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. చిత్రంలో కాంగ్రెస్ నేతలు సంపత్ తదితరులు -
చెడిపోయిన వ్యవస్థలపై కూడా యుద్ధం చేస్తున్నాం
-
మరింత వాటాకు పట్టు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్ల పరిధిలో నెలకొన్న వివాదాలపై బోర్డు జరిపే భేటీలో ఏపీ చేపట్టిన కొత్త ప్రాజెక్టులపైనే చర్చించాలని తెలంగాణ నిర్ణయించింది. శ్రీశైలం నుంచి 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్యం పెంచేలా తీసుకొచ్చిన జీవో 203ను నిలుపుదల చేసే అంశాన్ని బోర్డు ఎజెండాలో చేర్చింది. ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ.. బోర్డుకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపై త్వరలోనే భేటీ నిర్వహిస్తామని, అందులో చర్చించే ఎజెండాను 26వ తేదీలోగా అందించాలని ఆదేశించింది. దీనిపై తెలంగాణ 4 అంశాలతో ఎజెండాను ఖరారు చేసింది. తెలంగాణకు అడ్‌హక్‌గా కేటాయించిన 299 టీఎంసీల నీటికి అదనంగా పోలవరం, పట్టిసీమ ద్వారా గోదావరి మళ్లింపు జలాలతో తెలంగాణకు దక్కే వాటాను రాష్ట్రానికి కేటాయించాలని కోరనుంది. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తూ చేపట్టిన పోలవరం, పట్టిసీమలతో బచావత్ అవార్డు ప్రకారం ఎగువ రాష్ట్రాలకు కనీసంగా 90 టీఎంసీల నీటి వాటాలు దక్కుతాయని, ప్రస్తుతానికి పోలవరం వాటాను పక్కన పెట్టినా, పట్టిసీమ ద్వారా దక్కే 45 టీఎంసీలను కేటాయించి, తమ వాటా పెంచాలని తెలంగాణ కోరనుంది. అలాగే, ఈ వాటర్ ఇయర్లో ఏపీ చేసిన అదనపు వినియోగాన్ని వచ్చే జూన్ నుంచి ఆరంభమయ్యే వాటర్ ఇయర్లో కలపాలని కోరనుంది. తాగునీటి వినియోగ అంశాలను సైతం ఎజెండాలో చేర్చింది. -
పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే విద్యుత్ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచితే రాష్ట్రానికి విద్యుత్ కష్టాలు వస్తాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన 203 జీవో ప్రకారం పోతిరెడ్డిపాడుకు నీటిని తరలిస్తే శ్రీశైలం ప్రాజెక్టులోకి చుక్క నీరు రాదని, విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతుందన్నారు. శ్రీశైలంతోపాటు సాగర్, పులిచింతల విద్యుత్ ప్లాంట్లలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుందని, అప్పుడు తెలంగాణ చీకటి అవుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయే నాటికి తెలంగాణలో 54 శాతం విద్యుత్ వినియోగం ఆధారంగా ప్రాజెక్టుల్లో తెలంగాణకు వాటా ఇచ్చారని, ఇప్పుడు శ్రీశైలం, సాగర్, పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతే రావాల్సిన కరెంటు రాదని చెప్పారు. దీనిపై విద్యుత్ రంగ నిపుణులు మాట్లాడాలని కోరారు. పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా జూన్ 2న సాగునీటి ప్రాజెక్టుల వద్ద నిరసనలు తెలుపుతామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. -
‘పోతిరెడ్డిపాడు’ మీ ఇంటి సమస్య కాదు
సాక్షి, హైదరాబాద్: పోతిరెడ్డిపాడు విషయంలో సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి, ఆయన మాటలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు మండిపడ్డారు. ఇది ఆయన ఇంటి సమస్య కాదని, తెలంగాణ రైతుల సమస్య అని గ్రహించాలని నల్లగొండ, భువనగిరి, మల్కాజ్గిరి ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.రేవంత్‌రెడ్డిలు వ్యాఖ్యానించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్లతో కలిసి వారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, ఈ ప్రాంతానికి చెందిన నీళ్లు, నిధులు కాపాడాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కానీ, కేసీఆర్ ఉద్ధరిస్తాడని కాదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ మాట్లాడే ఏ మాటకూ విలువ ఉండదని అన్నారు. తెలంగాణ హక్కులను కాపాడే బాధ్యత కేసీఆర్‌పై లేదా అని ప్రశ్నించారు. తాము కచ్చితంగా కేసీఆర్‌కు చెప్పేటోళ్లమేనని, అందులో ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరంకంటే రెండింతలు నీరు ఏపీ తరలించుకుపోతుంటే కేసీఆర్ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నాడని, గ్రావిటీ ద్వారా వచ్చే కృష్ణా నీటిని వదిలిపెట్టి లిఫ్ట్ చేయాల్సిన గోదావరి నీళ్లపై మాట్లాడడానికి కేసీఆర్‌కు ఇంగితం ఉండాలని అన్నారు. ఈ అంశాన్ని వదిలిపెట్టేది లేదని, తెలంగాణ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని, ఎస్సెల్బీసీ టన్నెల్ వద్ద దీక్షకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, అదేవిధంగా రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పిలుపు ఇవ్వనున్నట్టు ఉత్తమ్ వెల్లడించారు. తాను చెప్పిన పంటలు వేస్తేనే రైతుబంధు ఇస్తానని కేసీఆర్ ఎప్పుడూ చెప్పలేదని, అలా అంటే రైతులు వ్యతిరేకిస్తారని ఉత్తమ్ చెప్పారు. రైతులు వారి భూములకు అనువైన పంటలనే వేసుకుంటారని వ్యాఖ్యానించారు. ఆ ప్రాజెక్టు ఎలా పూర్తయింది: కోమటిరెడ్డి తెలంగాణను, ముఖ్యంగా దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే జీవో 203ను తాము వ్యతిరేకిస్తున్నామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణను పద్ధ తి ప్రకారం ఎండబెట్టే కుట్ర చేస్తున్న కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని, ఆయన్ను బొంద పెట్టినా పాపం లేదని వ్యాఖ్యానించారు. కాం గ్రెస్ పార్టీ హయాంలో 70% పనులు పూర్తయిన ప్రాజెక్టులను పూర్తి చేయలేని అసమర్థు డు కేసీఆర్ అన్నారు. ఎస్సెల్బీసీ, డిండి, ఉద యసముద్రం ప్రాజెక్టుల చిన్న చిన్న పనులు పూర్తికానప్పుడు అంత పెద్ద కాళేశ్వరం ప్రాజె క్టు ఎలా పూర్తయిందని కోమటిరెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ తన పక్కన బ్రోకర్లను పెట్టు కుని మాట్లాడుతున్నారని, శాసనమండలి చైర్మన్ ఒక రాజకీయ బ్రోకర్ అని, రాజ్యాంగ పదవిలో ఉండి కూడా తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని అన్నారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై ప్రధానిని కలుస్తామని, పార్లమెంటులో పోరాటం చేస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు. అవి వరద జలాలు ఎలా అవుతాయి: రేవంత్ పోతిరెడ్డిపాడుపై వీరోచిత పోరాటం చేసినట్టు కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని, కేసీఆర్ ఎప్పుడూ పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడలేదని మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ సీఎం అయ్యాక కూడా ఏపీ ప్రభుత్వం అదనంగా 11వేల క్యూసెక్కుల నీటిని తరలించినా ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తాము వరద జలాలను తీసుకెళ్తామని ఏపీ ప్రభుత్వం చెప్పినట్టు కేసీఆర్ చెబుతున్నారని, 885 అడుగుల పైనుంచి తీసుకెళితే వరద జలాలు అవుతాయి కానీ, 790 అడుగుల నుంచి తీసుకుంటే వరద జలాలెలా అవుతాయని రేవంత్ ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు జీవోకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు. -
అన్యోన్యంగా కలిసే ఉన్నం
సాక్షి, హైదరాబాద్: ‘ఇప్పుడు కూడా (ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు) కలిసే పనిచేస్తున్నం. మాకు ఏం వివాదాలు లేవు. అన్యోన్యంగా కలిసే ఉన్నం. కలిసే ఉంటం. కొంత మందికి కళ్లు మండుతున్నాయా? వాళ్లు (నీళ్లు) తీసుకుంటామంటే మేము ఊరుకొని ఉన్నమా? కలిసి ఉందామంటే కలిసి ఉంటాం.. లేదు అంటే కొట్లాడుతం’అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సోమవారం ప్రగతిభవన్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ‘వాళ్ల ప్రతిపాదనలు వారిష్టం. వాటి విషయంలో మాకు అధికారం లేదు. రాయలసీమకు నీళ్లు అవసరమున్నప్పుడు గోదావరి నుంచి తీసుకెళ్లండి. మాకు అభ్యంతరం లేదు. మేము తీసుకుంటాం.. మీరు కూడా తీసుకోండి అన్నాం. కాదు మేము వేరే విధంగా తీసుకుంటామంటే, మా రాష్ట్రానికి భంగం కలిగితే ఒక్క క్షణం కూడా ఉపేక్షించం. తెలంగాణ ప్రయోజనాల మీద రాజీపడే ప్రసక్తే లేదు. గోదావరి నీళ్లు ఎవరు వాడుకున్నా మాకు అభ్యంతరం లేదు. చిల్లర పంచాయితీలతో సాధించేది ఏమీ లేదు. ప్రేమతో సాధించుకుందాం అని నేను అప్పుడు అన్న.. ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్న. మాకు రెండు నాలుకలు లేవు’అని కేసీఆర్ స్పష్టంచేశారు. ‘వాళ్లు కూడా ఈ రోజు (కృష్ణా గోదావరి వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకు) లేఖ ఇచ్చినట్టు తెలిసింది. మా పాలసీ మాకు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మనకు జరిపిన కేటాయింపుల మేరకే మనం అన్ని ప్రాజెక్టులను కడుతా ఉన్నం. మిగతావాళ్లు కూడా అలానే ఉండాలని కోరుతున్నం. అంతకు మించి వివాదంలోకి నేను పోదల్చుకోలేదు’అని తొలుత కేసీఆర్ బదులిచ్చారు. అయితే, దీనిపై స్పందించాలని ఓ విలేకరి అడగ్గా.. ఆయన మాట్లాడారు. అప్పుడు బాబు అంగీకరించారు.. ‘నీళ్ల గురించి కేసీఆర్‌ను విపక్షాలు విమర్శించడం నాదాన్ దుష్మన్ లాంటిది. పోతిరెడ్డిపాడు మీద అరవీర భయంకరంగా పోరాడింది ఎవరు? ఆనాడు చెంచాగిరీ చేసి ఆంధ్ర ముఖ్యమంత్రుల సంచులు మోసింది ఎవరు? విషయం నా దృష్టికి వచ్చినప్పుడు ఐదు నిమిషాల్లో సమావేశం ఏర్పాటు చేసి ఫిర్యాదు చేసినం. పాలమూరు ఎత్తిపోతల పథకంపై అప్పట్లో వారు(చంద్రబాబు ప్రభుత్వం) సుప్రీంకోర్టులో కేసు వేశారు. అపెక్స్ కౌన్సిల్‌కు వెళ్లమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నేను కూడా వెళ్లిన.. అప్పుడు వేరే ముఖ్యమంత్రి (చంద్రబాబు) ఉన్నడు. నేను మాట్లాడిన తర్వాత మీది మీరు కట్టుకోండి.. మాది మేము కట్టుకుంటామని చెప్పి ఆయన లేచి వెళ్లిపోయిండు. దాని ప్రకారం ప్రాజెక్టులు కట్టుకుంటున్నం. చట్టం ప్రకారం వాటా పరిధిలో కట్టుకుంటున్నం. కాబట్టి వివాదాలకు పోవట్లేదు. ప్రజలు ఎక్కడి వారైనా బాగా ఉండాలి.. రాయలసీమకు నీళ్లు వెళ్లాలని నువ్వు అనలేదా? అనంటున్నరు.. వంద శాతం అన్నాను. ఇప్పుడు కూడా చెబుతున్న ఎందుకు పోవద్దు రాయలసీమకు నీళ్లు? గోదావరిలో సముద్రంలోకి పోతున్నయి నీళ్లు. వాటిని తీసుకుని రాయలసీమకు పొమ్మని చెప్పిన. తప్పా? మేము పిచ్చి లొల్లి పెట్టం. వీళ్ల గురించి పట్టించుకోవద్దనే ప్రజలు మాకు చెబుతున్నరు’ అని విపక్షాలపై మండిపడ్డారు. చంద్రబాబు బోగస్ పంచాయితీ.. ఏపీ సీఎం జగన్‌కు గతంలో మీరు స్నేహహస్తం ఇచ్చారు కదా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిచి భోజనం పెట్టి సమావేశం ఏర్పాటు చేసి బేసిన్లు లేవు. భేషజాలు లేవు అని నేనే అన్న. బ్రహ్మాండంగా (గోదావరి) నీళ్లు మీరు వాడుకోండి. మేము వాడుకుంటం. ఇరు రాష్ట్రాలు సరిపోగా ఇంకా 1000 టీఎంసీలు మిగిలి ఉంటయి అని నేను అన్న’అని సీఎం కేసీఆర్ బదులిచ్చారు. ‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మాట్లాడితే బస్తీమే సవాల్. ఏం సాధించిన్రు? ఒక టీఎంసీనైనా సాధించిన్రా? మాట్లాడితే పచ్చ జెండాలు(టీడీపీ జెండాలు) పట్టుకుని కర్ణాటక సరిహద్దులోకి పోవడం.. తొడగొట్టి సుప్రీంకోర్టుకు వెళ్లడం.. చంద్రబాబు బాబ్లీ బోగస్ పంచాయితీ పెట్టిండు? ఏమైనా వచ్చిందా? మహారాష్ట్ర ముఖ్యమంత్రి నా కంటే చిన్నవాడైనా ఏడుసార్లు ఆ రాష్ట్రానికి వెళ్లి (కాళేశ్వరం ఒప్పందం) సామరస్యంగా సాధించిన’అని కేసీఆర్ పేర్కొన్నారు. కిరికిరి పెట్టాలని చూస్తున్నరు.. అది జరగదు పోతిరెడ్డిపాడు మీద కేంద్రం జోక్యాన్ని కోరుతారా? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘తమ్ముడు.. నీకు కిరికిరి పంచాయితీ పెట్టాలని ఉన్నట్టుంది.. అదేమీ జరగదు.. దురాశపడకు.. ఇక చాలు. నీ ఉద్దేశం ఏమిటో తెలుస్తుంది. నువ్వు కేసీఆర్‌తో పెట్టుకోలేవు’అని సీఎం బదులిచ్చారు. శ్రీశైలం నుంచి వృథా జలాలను వాడుకోవడానికే కొత్త ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసిందన్న విషయాన్ని మరో విలేకరి ప్రస్తావించగా.. ‘ఎలా నమ్ముతరండి? అందుకే మేము ఫిర్యాదు ఇచ్చినం. వారు ఇవ్వాల్సిన చోట ఆ హామీ అధికారికంగా ఇవ్వాలి కదా? మాకు అనుమానం కలిగించే పద్ధతిలో ఉంటే నిరసపన తెలుపుతాం కదా?’అని కేసీఆర్ పేర్కొన్నారు. ‘గోదావరి మీద ఇంకో కమిటీ వేశాం. గోదావరిలో మా 950 టీఎంసీల వాటా పోను 650 టీఎంసీ సర్ప్లస్ వాటా కావాలని కేంద్రాన్ని కోరుతున్నం. గతంలో కూడా కోరినం. మాట్లాడితే గోదావరి కావేరి అంటున్నరు. మాకు సాగు, తాగు, పరిశ్రమల అవసరాలకు గోదావరి తప్ప మరో దిక్కులేదు’అని కేసీఆర్ స్పష్టంచేశారు. -
'ఆయన చేసిన పనులను చరిత్ర క్షమించదు'
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపుతోనే సీమకు నీటి కష్టాలు పోతాయని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'రాయలసీమ వాసులకు నీటి కష్టాలను పాలద్రోలేలా దివంగత నేత వైఎస్ జలయజ్ఞం ప్రవేశ పెట్టారు. ఆయన హయాంలో తెలంగాణ లో 60 శాతం ప్రాజెక్టులు నిర్మిస్తే 40 శాతం ప్రాజెక్టులు రాయలసీమలో నిర్శించారు. ఎగువ ప్రాంతమైన కర్ణాటకలో అనేక ప్రాజెక్టులు నిర్మించడం వల్ల మనకు నీటి కష్టాలు ఉన్నాయి. చదవండి: ‘31 వరకు దేవాలయాల్లో దర్శనాలు రద్దు’ జాతీయపార్టీలది ద్వంద్వ వైఖరి రాబోయే రోజుల్లోనూ రాయలసీమకు నీటి కష్టాలు తప్పేలా లేవు. మిగులు జలాల విషయంలోనూ రాయలసీమ వెనుకబడి ఉంది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన విధంగా 511 టీఎంసీల కన్నా ఎక్కువ నీటిని వాడుకునే అవకాశం లేదు. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపుతోనే రాయలసీమకు నీటి కష్టాలు పోతాయి. రాయలసీమ ప్రజల సమస్య తీర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవో నెంబర్ 203ను జారీ చేశారు. దీనిని తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఇక్కడి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ జీవోని అమలు చేయాలని అంటుంది. ఇలా జాతీయపార్టీలు ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకోవాలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ విషయమై ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబు హయాంలో కమిషన్లకు కక్కుర్తిపడ్డారు తప్ప నీటి సమస్య తీర్చలేదు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకొని చంద్రబాబు అండ్ కలెక్షన్స్ చేశారు. చంద్రబాబు చేసిన పనులను చరిత్ర క్షమించదు. పార్టీలు ద్వంద రాజకీయాలు మానుకొని రాయలసీమ వాసుల నీటి కష్టాలు పోయేలా ముందుకు రావాలి. తమిళనాడు జల్లికట్టు స్ఫూర్తి మనకెందుకు రావడం లేదు. సీఎం వైఎస్ జగన్ చేస్తున్న పనులకు ప్రతిపక్ష పార్టీలు స్వాగతించి మద్దతు ఇవ్వాలి. ఈ జీవోను అడ్డుకుంటే భవిష్యత్‌లో ప్రజలు ఉద్యమాలు చేయక తప్పదని' అన్నారు. చదవండి: బస్‌లు, క్యాబ్‌లకు గ్రీన్‌సిగ్నల్ -
'ఆ విషయం కృష్ణా జిల్లాలో అందరికీ తెలుసు'
సాక్షి, నెల్లూరు: పోతిరెడ్డిపాడుపై టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఆదివారం రోజున నెల్లూరు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బూతులు మాట్లాడేది టీడీపీ నేతలే. చంద్రబాబు ఎక్కడున్నా పోతిరెడ్డిపాడుపై ఆయన వైఖరేంటో స్పష్టం చేయాలి. దేవినేని ఉమాతో పాటు టీడీపీ నేతలు పోతిరెడ్డిపాడుపై ఎందుకు మాట్లాడటం లేదు. టీడీపీ మౌనం వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో మొట్టమొదటిసారిగా సోమశిల జలాశయంలో 78 టీఎంసీల నీరు నిల్వ చేసిన చరిత్ర మా ప్రభుత్వానిది. ఈ సారి 9 లక్షల ఎకరాలకు మొదటి పంటకు నీరు ఇచ్చాం. 2 లక్షల 70వేల ఎకరాలకు రెండో పంటకు నీరు ఇస్తున్నాం. అందులో అనుమానాలు ఉంటే నెల్లూరు జిల్లాలోని టీడీపీ నేతలను అడిగి తెలుసుకోండి. చదవండి: బాబు వాడకం ఎలా ఉంటుందంటే..! పోలవరం విషయంలో తప్పుడు లెక్కలు మాట్లాడవద్దు. పోలవరం అంటే ప్రాజెక్ట్‌తో పాటు పునరావాసం కూడా ఉంది. వైఎస్సార్ హయాంలోనే పోలవరం ప్రారంభమైంది. టీడీపీ హయాంలో కాంట్రాక్లర్ల నుంచి ఎంత వసూలు చేశారో అందరికీ తెలుసు. ఐదేళ్లు కూడా ఉమా కాంట్రాక్టర్లను, అధికారులను అడ్డగోలుగా వాడుకున్నారు. నేను ఏ కాంట్రాక్టర్‌ను కూడా కలవలేదు. పదవుల కోసం నీవు ఎవరిని చంపావనే విషయం కృష్ణా జిల్లాలో అందరికీ తెలుసు' అంటూ మంత్రి అనిల్ దేవినేని ఉమాపై ధ్వజమెత్తారు. చదవండి: డాక్టర్ సుధాకర్ టీడీపీ మనిషి: ఎంపీ సురేష్ -
గతంలో ‘పోతిరెడ్డిపాడు’పై మాట్లాడలేదే?
సాక్షి, హైదరాబాద్: గతంలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై ఒక్క మాట మాట్లాడని కాంగ్రెస్ నేతలు కొందరు ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేయడం సిగ్గుచేటని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. 2004లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడే తాను పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును వ్యతిరేకించిన విషయాన్ని మండలి చైర్మన్ గుర్తు చేశారు. తెలంగాణ శాసన మండలి కమిటీ హాల్లో శనివారం గుత్తా సుఖేందర్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలు పరిష్కారం కాకముందే ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా 80వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గతంలో పులిచింతలపై సర్వే చేయించిన ఇద్దరు ఎంపీలు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రస్తుతం వ్యతిరేకిస్తున్నారని, కాంట్రాక్టులు తీసుకున్న కొందరు నేతలు ఆంధ్రా నేతలకు వత్తాసు పలికారని గుత్తా విమర్శించారు. పోతిరెడ్డిపాడు అంశంలో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ.. ఏపీ, తెలంగాణలో వేర్వేరు వైఖరి అవలంబిస్తున్నాయన్నారు. ఉపవాస దీక్షలతో ఒరిగేదేమీ లేదు 1969 నాటి తెలంగాణ ఉద్యమం మొదలుకుని మలిదశ తెలంగాణ ఉద్యమం దాకా నీళ్లు, నిధుల కోసమే జరిగిందని, రెండు గంటల ఉపవాస దీక్షలతో ఒరిగేదేమీ లేదని గుత్తా విమర్శించారు. 203 జీవోను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, తెలంగాణ బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు రాజకీయాలను వదిలి పోతిరెడ్డిపాడు పనులను అడ్డుకునేందుకు ప్రభుత్వానికి సహకరించాలని గుత్తా సూచించారు. ఉమ్మడి రాష్ట్రానికి ఏపీ, రాయలసీమ వాళ్లే ముఖ్యమంత్రులుగా ఉండటం వలనే తెలంగాణకు నష్టం కలిగిందని ఆరోపించారు. -
కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు: బండి సంజయ్
కరీంనగర్‌టౌన్: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు విషయంలో ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసినా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న కేసీఆర్ సర్కారు తీరుకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ శనివారం కరీంనగర్‌లోని తన నివాసంపై నల్ల జెండా ఎగరేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని బీజేపీ లేవనెత్తే వరకు సీఎం కేసీఆర్ స్పందించలేదని, అన్ని వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారని విమర్శించారు. బీజేపీ కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాయడం, నిరసన దీక్ష వంటి అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ఇవాళ ఇంటిపై నల్లజెండా ఎగరేసే కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా రాబట్టుకోవడంలో విఫలమైన కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. -
తదుపరి చర్యలు చేపట్టకుండా ఏపీని ఆగమనండి
సాక్షి, హైదరాబాద్: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపున కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసిందని, శ్రీశైలం నుంచి నీటిని తరలించేందుకు ఇతర ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, దీనిని కేంద్రం అడ్డుకోవాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఇటీవల రాసిన లేఖపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పం దించారు. సదరు లేఖ అందిందని, దాన్ని తమ శాఖ పరిశీలిస్తోందని పే ర్కొంటూ శనివారం బండి సంజయ్‌కి కేంద్ర మంత్రి లేఖ రాశారు. వెంటనే సమావేశం ఏర్పాటుచేయాలని, ఆ ప్రాజెక్టుల డీపీఆర్‌లను సాంకేతికంగా పరిశీలించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ను ఆదేశించినట్టు ఆ లేఖలో షెకావత్ పేర్కొన్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014లో పేర్కొన్న కృష్ణా నదీ జలాల నిర్వహణ నియమాలకు అనుగుణంగా ఉన్నాయా అనేది తేలే వరకు ఈ ప్రాజెక్టుల విషయంలో తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్‌కు చెప్పాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. అలాగే, కృష్ణానది నీటి వినియోగానికి సంబంధించి రెండు రాష్ట్రాల చర్యలపై చర్చించేందుకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని తమ శాఖ అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. ఇది తెలంగాణ విజయం: బండి సంజయ్ కేంద్రమంత్రి ఆదేశాలపై సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. తన లేఖకు స్పందించినందుకు కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ.. ఇది శుభపరిణామమని, తెలంగాణ ప్రజల విజయమని పేర్కొన్నారు. -
మౌనీ బాబా నోరు విప్పాలి : విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి : ఇతర పార్టీల్లోకి తాను పంపించిన బానిసల గొలుసులు విప్పి పోతిరెడ్డిపాడు జీఓపై చంద్రబాబు నాయుడు ఉసిగొల్పుతున్నారని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. వాళ్లెంత మొరిగినా న్యాయం అనేది ఒకటుంటుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తన కేటాయింపులకు మించి చుక్క నీటిని కూడా అక్రమంగా తీసుకోదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారని తెలిపారు. మౌనీ బాబా నోరు విప్పాలని ట్విటర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘చంద్రబాబు హైదరాబాద్‌కు పారిపోయి అర్థశత దినోత్సవం పూర్తయింది. కరోనా కష్ట సమయంలో రాష్ట్రాన్ని వదిలి ప్రతిపక్ష నేత ఎక్కడో ఉండటమేమిటని ఎల్లో మీడియా ప్రశ్నించదు. నలుగురు కూర్చుని ప్లకార్డులు పట్టుకుంటే అమరావతి దీక్షలు 150 రోజులకు చేరాయని వార్తలు వడ్డిస్తోంది’ అని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. -
పోతిరెడ్డిపాడుపై కేసీఆర్ ఎందుకు మాట్లాడరు?
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ విస్తరణతో దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, ఈ విషయంలో ఏపీ సీఎంతో మాట్లాడే బాధ్య త తెలంగాణ సీఎం కేసీఆర్ దేనని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్‌కు మంచి సంబం ధాలు ఉన్నాయని, అలాంటప్పుడు అక్కడి ప్రభుత్వం నీళ్లు తీసుకుపోతుంటే కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. శుక్రవారం గాంధీభవన్ నుంచి ఆయన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో ఫేస్‌బుక్‌లైవ్ ద్వారా మాట్లాడారు. పోతిరెడ్డిపాడు విషయంలో రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఇప్పటికే ఈ అంశంపై గాంధీభవన్‌లో దీక్ష నిర్వహించడంతో పాటు కృష్ణా రివర్‌బోర్డు చైర్మన్‌ను కలిశామని, కేంద్రమంత్రి షెకావత్‌తో మాట్లాడి తమ అభ్యంతరాలు చెప్పామని వివరించారు. కానీ, అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ మాత్రం మౌనంగా ఉంటున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో కేసీఆర్ అసమర్థతతో వ్యవహరిస్తున్నారా లేదంటే ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారా.. అనే అనుమానాలు కలుగుతున్నాయని, వెంటనే దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లాక్డౌన్ కారణంగా సాధారణ, మధ్య తరగతి ప్రజల జీవనం అస్తవ్యస్తమయిందని, ఈ క్లిష్ట సమయంలో రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం ఉదారంగా ముందుకు రావాలని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీ నిరుత్సాహపరిచిందని అన్నారు. మధ్య తరహా, చిన్న పరిశ్రమలు అసంతృప్తితో ఉన్నాయని, వాటికి జీఎస్టీ లేదా రుణాల రూపంలో ఉపశమనం కల్పించాలని కోరారు. కరోనా సమయంలో పేదల కష్టాలు తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు వలస కూలీలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. -
దేవినేని ఉమాకు మంత్రి అనిల్ సవాల్
సాక్షి, నెల్లూరు : కృష్ణానదిపై తలపెట్టిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటర్‌పై టీడీపీ వైఖరి ఏంటో చెప్పాలని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు ఎందుకు నోరుమెదపడంలేదని నిలదీశారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్ మాట్లాడుతూ.. టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమా మంత్రిగా ఉన్న సమయంలో పోతిరెడ్డిపాడు ద్వారా ఎంత నీరు తీసుకువచ్చారో తేలుద్దామా అని సవాలు విసిరారు. దేవినేని ఉమా నిత్యం అబద్దాలు చెబుతూనే ఉంటారని, అన్ని ప్రాజెక్టులు తామే కట్టామని గొప్పులు చెబుతున్నారని మండిపడ్డారు. (అక్రమం.. అడ్డుకోండి: సీఎం కేసీఆర్) పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని తొలుత పెంచింది దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, దానిని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 80 వేల క్యూసెక్కులకు పెంచుతున్నారని మంత్రి అనిల్ పేర్కొన్నారు. కృష్ణా నది వరద నీటిని పూర్తిగా ఉపయోగించుకుని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీరు అందిస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును 70 శాతం పూర్తి చేశామని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ నేతలంతా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రలో మొదటిసారిగా వైఎస్ జగన్నేతృత్వంలో సోమశిలలో 78 టీఎంసీల నీటిని నిల్వ చేసి చూపించామని తెలిపారు. టీడీపీ హయాంలో వెలిగొండ ప్రాజెక్ట్ పనులు కనీసం చేయలేదని, నిత్యం మాటలతోనే కాలయాపన చేశారని మండిపడ్డారు. -
రేపు నల్ల జెండాల ఎగురవేత
సాక్షి, హైదరాబాద్: పోతిరెడ్డిపాడు జీవో 203 విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై బీజేపీ కోర్ కమిటీ మండిపడింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం కోర్ కమిటీ సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పోతిరెడ్డిపాడు, రైతుల ఆందోళన తదితర అంశాలపై కోర్ కమిటీ చర్చించింది. పోతిరెడ్డిపాడు విషయంలో నిబంధనలకు వ్యతిరేకంగా జారీ చేసిన జీవో పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ వైఖరికి నిరసనగా ఈనెల 16వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చింది. తాను చెప్పిన పంటలు వేస్తేనే రైతుబంధు డబ్బులు ఇస్తానంటూ సీఎం కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని పేర్కొంది. ఆ పథకాన్ని ఎగ్గొట్టడానికే సీఎం ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, ఇలాంటి ప్రకటనలతో సీఎం రైతులకు శత్రువుగా మారుతున్నారని ఆరోపించింది. రైతులకు, కార్మికులకు, చిరు వ్యాపారులకు, మధ్యతరగతి ప్రజలకు భరోసా నింపేలా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీకి కోర్‌కమిటీ ధన్యవాదాలు తెలిపింది. -
పోతిరెడ్డిపాడుపై తలో వైఖరి
సాక్షి, హైదరాబాద్: పోతిరెడ్డిపాడు అంశంలో కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రానికో వైఖరి అవలంబిస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. రెండు ప్రధాన పార్టీలు ఈ అంశంపై ప్రధాన మంత్రిని కలిసి లేఖలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తో కలిసి గురువారం టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. పోతిరెడ్డి పాడు అంశంపై కాంగ్రెస్ నేతల తీరు హాస్యాస్పదంగా ఉందని, కాంగ్రెస్, బీజేపీలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. పోతిరెడ్డిపాడు అంశంపై మాట్లాడుతున్న విపక్ష నేతలు గతంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేతలు రాయలసీమకు నీటి తరలింపుపై అప్పట్లో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కుమ్మక్కయితే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ కోసం టీఆర్ఎస్ నేతలు పదవీ త్యాగం చేస్తే కాంగ్రెస్ నేతలు దొంగ రాజీనామాలు చేశారని, ఏపీ నేతలతో తాము కుమ్మక్కయి ఉంటే తెలంగాణ వచ్చేదా అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. పదవుల కోసం కుమ్మక్కయ్యే అలవాటు, కాంగ్రెస్ ఇతర విపక్షాలకు ఉందన్నారు. ఏపీలో కలిపిన ఏడు మండలాలను చేతనైతే కాంగ్రెస్ నేతలు తిరిగి ఇప్పించాలని డిమాండు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరు పర్యటనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రకటనలు చేసి. నయా పైసా ఇవ్వలేదన్నారు. కేసీఆర్‌ను విమర్శిస్తే ప్రజల్లో గుర్తింపు వస్తుందనే ఆలోచన మానుకోవాలన్నారు. ప్రతిపక్ష పార్టీలకు సత్తా ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పించాలని శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు చెప్పిన తర్వాతే పోతిరెడ్డిపాడు విస్తరణ జీవో ఇచ్చామని ఏపీ మంత్రులు చేస్తున్న ప్రకటనలు రాజకీయమైనవిగా శ్రీనివాస్‌గౌడ్ కొట్టిపారేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలూ పనిచేస్తున్నారని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. -
ఎలాంటి పోరాటానికైనా సిద్ధం
సాక్షి, హైదరాబాద్: పోతిరెడ్డిపాడు అంశం తెలంగాణకు జీవన్మరణ సమస్య అని, దీనిపై ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధమేనని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 3 టీఎంసీల నీటిని తరలిస్తూ అక్కడి ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బుధవారం గాంధీ భవన్లో టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. దీక్షలో కాంగ్రెస్ నేతలు నల్ల రిబ్బన్లు కటు ్టకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని, కాంగ్రెస్ తరఫున ప్రధాని మోదీని కలుస్తామన్నారు. కేసీఆర్ చేతకానితనం వల్లే పరిస్థితి వచ్చిందని, పోతిరెడ్డిపాడు పనులు ప్రారంభమైన రోజే సీఎం కేసీఆర్ రాజీనామా చే యాలన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దక్షిణ తెలంగాణ జిల్లాలు నష్టపోతాయన్నారు. ఈ జీవోపై కోర్టులను ఆశ్రయిస్తామని, సుప్రీంకోర్టులో కేసు వేస్తామని తెలిపారు. పోతిరెడ్డిపాడుపై అక్కడి ప్రభుత్వం వెనక్కు తగ్గేంత వరకు తమ పోరుసాగుతుందని, అవసరమైతే ‘చలో పోతిరెడ్డిపాడు’కు పిలుపునిచ్చేందుకూవెనుకాడబోమన్నారు.దీక్షలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, వీహెచ్, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్, చిన్నారెడ్డి, వంశీచందర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'బాబు ఆ రోజైనా రాజకీయ సన్యాసం ప్రకటించు'
సాక్షి, విశాఖపట్నం: కేజీహెచ్‌లో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాసరావుల బృందం పర్యటించింది. గ్యాస్ లీకేజీ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారికి చెక్‌లను అందించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, డీఆర్వో శ్రీదేవి, కేజీహెచ్ సూపరిండెంట్ డాక్టర్ అర్జున్, ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ పాల్గొన్నారు. అనంతరం ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరు తీసుకెళ్లడం చంద్రబాబుకు ఇష్టం లేదా అంటూ ప్రశ్నించారు. జీవో నంబర్ 203పై ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు అభిప్రాయం చెప్పాలన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని కావడం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. చదవండి: అసలు చంద్రబాబు రాయలసీమ బిడ్డేనా..! అమరావతిలో తన బినామీల ఆస్తులు కాపాడాలన్నదే చంద్రబాబు తాపత్రయం అన్నారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే ఎల్లో మీడియా విశాఖపై విష ప్రచారం చేస్తోందన్నారు. అధికారం కోసం ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌ను చంద్రబాబు లాక్కున్నారన్నారు. కరోనాను చూసి చంద్రబాబు భయపడటం లేదన్నారు. కరోనానే చంద్రబాబును చూసి భయపడుతుందని ఎద్దేవా చేశారు. రెండు నెలలుగా చంద్రబాబు అనధికారికంగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఈ నెల 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగానైనా అధికారికంగా చంద్రబాబు రాజకీయ సన్యాసం ప్రకటించాలని సూచించారు. కరోనాకు టీకా వచ్చే వరకు హైదరాబాద్ ఇళ్లు వదిలి రారా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఎన్నికల ముందు ప్రధాని, ఆయన కుటుంబ సభ్యులపై ఏం మాట్లాడారో చంద్రబాబు గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. సీబీఐ, ఈడీ, ఐటీని రాష్ట్రానికి రావద్దని చంద్రబాబు అనలేదా' అంటూ నిలదీశారు. చదవండి: ఈ కమిటీలన్నీ చంద్రబాబు చెబితే వేశారా? -
జలయజ్ఞం.. సస్యశ్యామలం
సాక్షి, కర్నూలు: కరువుకు చిరునామా రాయలసీమ. ఏటా దుర్భిక్షం. 19వ శతాబ్దం వరకు సీమ రైతుల గురించి పట్టించుకునే నాథుడే లేరు. ఇందుకు శ్రీశైలం నుంచి సీమ జిల్లాలకు వాడుకున్న నీటి గణాంకాలే సాక్ష్యం. 19వ శతాబ్దంలో కేవలం 119 టీఎంసీల నీరు మాత్రమే వాడుకున్నారు. ఇందులో కూడా సగం వరకు చెన్నైకి తరలించారు. 20 శతాబ్దంలోకి అడుగు పెట్టిన తరువాత మహానేత వైఎస్ఆర్ చేపట్టిన జలయజ్ఞం ఫలాలు వరుణుడు రాసిన కరువు శాసనాన్ని తుడిచి వేస్తున్నాయి. జిల్లాలో రెండు దశబ్దాల కాలంలో కొత్త ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, సాగునీటి కాలువల విస్తరణతో సుమారుగా 4.25 లక్షల ఎకరాల ఆయకట్టు పెరిగినట్లు ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తరలించిన నీటితో రెండు దశాబ్దాల్లో తెలుగుగంగా కింద 95 వేలు, ఎస్ఆర్బీసీ కింద 56 వేలు, హంద్రీనీవాతో 80 వేల ఎకరాలు, జీఆర్పీ కింద 45 వేల ఎకరాలు, లిఫ్ట్‌ల వల్ల 95 వేల ఎకరాలు, సిద్ధాపురం కింద 20 వేలు, పులికనుమ కింద 26 వేలు, పులకుర్తి కింద 9 వేల ఎకరాల ఆయకట్టు అదనంగా పెరిగినట్లు ఇంజినీర్లు అంచనాలు వేస్తున్నారు. 2004లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ఆర్ చొరవతోనే జలయజ్ఞం పనులు శరవేగంగా సాగాయి. పోతిరెడ్డిపాడు, ఎస్ఆర్బీసీ విస్తరణ, గాలేరు–నగరి, అవుకు రిజర్వాయర్, గోరుకల్లు రిజర్వాయర్, సిద్ధాపురం ఎత్తిపోతల పథకంతో పాటు, హంద్రీనీవా సుజల స్రవంతి, గురురాఘవేంద్ర ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన లిఫ్ట్‌లు, పులికనుమ, పులకుర్తి స్కీమ్‌లు, తుంగభద్ర నది తీరంలో ఏర్పాటు చేసిన లిఫ్ట్‌లు, ముచ్చుమర్రి ఎత్తిపోతలతో 20వ శతాబ్దంలో కరువును తరుముతున్నాయి. కొత్త ప్రాజెక్టులతో జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలకు పోతిరెడ్డిపాడు ద్వారా విస్తరణ తరువాత నుంచి ఇప్పటి వరకు 1,245 టీఎంసీలు, హంద్రీనీవా నుంచి 170 టీఎంసీలు, ముచ్చుమర్రి నుంచి 10 టీఎంసీలు, లిఫ్ట్‌ల నుంచి 50 టీఎంసీల నీటిని అదనంగా వినియోగించుకోని జిల్లాలో దాదాపు 5 లక్షల ఎకరాల ఆయకట్టు అభివృద్ధి చెందింది. అవుకు టన్నెల్ శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను వినియోగించుకునేందుకు 2006లో పోతిరెడ్డిపాటు హెడ్ రెగ్యులేటర్‌ను విస్తర్ణను 44 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. దీని ద్వారా 30 రోజుల్లో 102 టీఎంసీల నీరు తీసుకోవాలని లక్ష్యంగా పనులు మొద లు పెట్టారు. ఇందులో ఎస్ఆర్ఎంసీ (శ్రీశైలం కుడి ప్రధాన కాలువ విస్తరణ)ని బానకచర్ల కాంప్లెక్స్ వరకు విస్తరించడంతో సీమలోని ప్రాజెక్టులకు నీటి తరలింపునకు మార్గం సుగమమైంది. అవుకు రిజర్వాయర్ లో నీటి నిల్వ సామర్థ్యం పెంచారు. కృష్ణానీటిని కేసీ కాలువకు ప్రత్యామ్నాయంగా అందించేందుకు 2008లో ముచ్చుమర్రి ఎత్తిపోతలకు శ్రీకారం చూట్టారు. గతేడాది నుంచి ఆయకట్టు రైతులకు అందుబాటులోకి వచ్చింది. హంద్రీ –నీవాతో పెరిగిన భూగర్భ జలాలు రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీరు అందించే హంద్రీనీవా సుజల స్రవంతిని 2005లో ప్రారంభించారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగు, 40 లక్షల మందికి తాగు నీటి అవసరాలు తీర్చాలి. జిల్లాలో 80 వేల ఎకరాలకు సాగు నీరు అందిచాల్సి ఉంది. ఆ కాల్వతో జిల్లాలో చాలా చోట్ల భూగర్భ జలాలు పెరిగి ఎండిన బోర్లలోకి నీరొచ్చింది. పంట కాల్వల పనులు పూర్తి కావాల్సి ఉంది. 68 చెరువులకు నీరు ఇచ్చేందుకు చేపట్టిన పనులు జరుగుతున్నాయి. కొత్త ప్రాజెక్టులకు ప్రణాళిక జిల్లాలో తుంగభద్ర జలాలను వినియోగించి పశ్చిమ పల్లెను సస్యశ్యామం చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తుంగభద్రనదిపై గుండ్రేవుల ప్రాజెక్టు, ఆర్డీఎస్ కుడి కాలువ, హగేరి నదిపై వేదావతి ప్రాజెక్ట్ నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఆయకట్టుకు జీవం తెలుగుగంగ ప్రాజెక్టులో అసంపూర్తిగా ఉన్న ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీలను, లైనింగ్ పనులు చేసేందుకు 2006లో 4460.64 కోట్లు అంచనా వ్యయాన్ని 2007లో ఖరారు చేస్తూ వైఎస్ఆర్ అనుమతులు ఇచ్చారు. 2018 మార్చి నాటికి 95 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన 5 శాతం పనులను పూర్తి చేసేందుకు అంచనాలను 6671.62 కోట్లకు పెంచేసి 2018 మార్చి9న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కాల్వ కింద ఆయకట్టు స్థీరికరించడంతో జిల్లాలో లక్ష ఎకరాలు అదనంగా ఆయకట్టు పెరిగింది. ఆత్మకూరు మండలంలో సిద్ధాపురం ఎత్తిపోతలకు 2006 ఏప్రిల్ 20న మహానేత శంకుస్థాపన చేయగా, గత ఏడాది పూర్తయింది. కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం ప్రాంతాల్లోని 50 వేల ఎకరాలకు సాగు నీరు ఇచ్చేందుకు 2004లో వైఎస్ఆర్ గురురాఘవేంద్ర లిఫ్ట్‌తో పాటు, మరో ఆరు ఎత్తిపోతల పథకాలను, సుగూరు చెరువును పూర్తి చేశారు. 261.19 కోట్లతో పులికనుమ రిజర్వాయర్‌కు శ్రీకారం చూట్టారు. ఇది పూర్తయితే గూడూరు, కోడుమూరు, సి. బెళగల్, కల్లూరు, మండలాల్లో 9823 ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. -
సాగు.. ఇక బాగు!
సాక్షి, చాపాడు(కడప) : అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అనాసక్తి కారణంగా గత కొన్నేళ్లుగా జిల్లాలోని చెరువులను నింపకపోవటంతో ఏటా 79, 976.495 ఎకరాల ఆయకట్టులో సాగునీరు ప్రశ్నార్థకంగా మారుతూ వచ్చింది. అయితే ఈ ఏడాది మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాలోని ప్రాజెక్టులతో పాటు అన్ని చెరువులను నింపి రైతులకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఏడాది ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వలన ప్రాజెక్టుల్లో వరద నీరు సమృద్ధిగా చేరటం, వరద నీటిని సాగునీరుగా అందించేందుకు సీఎం చర్యలు తీసుకోవటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులతో పాటు చెరువులకు జలకళ.. కరువు నేల వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయికి చేరుకోవటంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44వేల క్యూసెక్కులు, హంద్రీనీవా ద్వారా 2,022 క్యూసెక్కులు, ముచ్చిమర్రి ఎత్తిపోతల ద్వారా 927 క్యూసెక్కుల నీటిని రాయలసీమ, నెల్లూరు జిల్లాలోని ప్రాజెక్టులకు తరలిస్తున్నారు. మరో 50 రోజుల పాటు కృష్ణానదిలోకి వరద జలాలు వచ్చే అవకాశం ఉండటంతో రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాల్లోని ప్రాజెక్టులు, చెరువులను నింపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జల వనరుల శాఖకు దిశానిర్దేశం చేశారు. వెలుగోడు నుంచి జిల్లాలోని తెలుగుగంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్, ఎస్సార్–1, 2 ప్రాజెక్టులకు, గోరకల్లు, అవుకు ప్రాజెక్టుల నుంచి గండికోట, వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం, చిత్రావతి, మైలవరం ప్రాజెక్టులకు వరద నీరు అందనుంది. వరద నీటి ఉధృతి మేరకు ఈ ప్రాజెక్టులను నింపే క్రమంలోనే చెరువులను పూర్తి స్థాయిలో నింపేందుకు సాగునీటి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చెరువు ఆయకట్టు రైతులకు మహర్దశ.. కొన్నేళ్లుగా జిల్లాలోని అధిక భాగం ప్రాజెక్టులకు సాగునీరు చేరని పరిస్థితుల్లో ఆయా ప్రాజెక్టుల పరిధిలోని చెరువు ఆయకట్టు రైతులు సాగునీరు లేక సాగుకు దూరమయ్యేవారు. ఈ ఏడాది మాత్రం పూర్తి స్థాయిలో సాగునీరు అందనుండటంతో కేసీ కెనాల్ రైతాంగంతో పాటు చెరువు ఆయకట్టు రైతులు పంటలను సాగు చేసుకోవచ్చు. జిల్లాలోని 9 జలాశయాల కింద 16,987.481 ఎకరాల విస్తీర్ణంలో 216 చెరువులు ఉన్నాయి. ప్రతి మండలంలో ఈ చెరువుల కింద 79,976.495 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడి వేలాది మంది రైతులు చెరువు నీటితోనే పంటలు సాగు చేసుకోవాలి. ఈ ఏడాది సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం వలన సాగునీరు ప్రతి ఎకరాకు పుష్కలంగా అందనుండటంతో రైతుల్లో ఆనందం కనిపిస్తోంది. చెరువు నింపితే రెండు కార్లలో పంటల సాగు వర్షాలు వస్తేనే చెరువులు నిండుతాయి. ఈ సారి వర్షాలు పడకపోయినా ప్రాజెక్టులు నిండాయి. గ్రామ పరిధిలోని చెరువును నింపితే ఏటా వరితో పాటు వేసవి కాలంలో మరో పంట సాగు చేస్తాము. చెరువులను త్వరగా నింపితే వరి సాగు చేసుకుంటాము. చెరువులను నింపాలని సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో రైతులకు మేలు జరుగుతుంది. – వడ్ల నాయబ్‌రసూల్, రైతు, ఖాదర్‌పల్లె, చాపాడు మండలం -
నేడు పోతిరెడ్డిపాడు టెలిమెట్రీ పరిశీలన
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న గందరగోళానికి తెరదించేం దుకు ఏర్పాటు చేసిన టెలిమెట్రీ పాయింట్ల పరిశీలన సోమవారం ప్రారంభం కానుంది. కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టుల వద్ద ఏర్పా టు చేసిన టెలిమెట్రీలను పరిశీలించేందుకు సెంట్రల్ వాటర్, పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్)కు చెందిన ముగ్గురు శాస్త్రవేత్త లు హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లారు. మంగళవారం పోతిరెడ్డిపాడు టెలిమెట్రీపై వారు పరిశీలన చేయనున్నారు. గతంలో హెడ్‌రెగ్యులేటర్ దిగువన 12.264 కి.మీ వద్ద ఉన్న పరికరంతో కచ్చితమైన లెక్కలు రావని తేలడంతో హెడ్‌రెగ్యులేటర్ దిగువన 1–3 కి.మీ. పరిధిలోనే పరి కరాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఆ ప్రదేశంలో సైడ్ లుకింగ్ డాప్లర్ కరెంటు ప్రొఫైలర్ (ఎస్ఎల్డీసీపీ)ని ఎక్కడ ఏర్పాటు చేస్తే పోతిరెడ్డిపాడు నీటి విడుదలపై కచ్చితమైన లెక్కలు వస్తాయనే దానిపై సర్వే చేయనున్నా రు. అనంతరం సుంకేశుల బ్యారేజీ వద్ద కేసీ కెనాల్‌ను పరిశీలించి, అక్కడ ఏ ప్రదేశంలో టెలిమెట్రీ ఏర్పాటు చేయాలనే దానిపై సర్వే చేస్తారు. బుధవారం నాగార్జునసాగర్ పరిధిలో టెలి మెట్రీ పాయింట్లకు అనువైన ప్రదేశాలపై సర్వే చేయనున్నారు. బ్రిజేశ్ విచారణ మళ్లీ వాయిదా.. తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణాజలాల పంపిణీ కోసం బ్రిజేశ్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణలో భాగంగా ఏపీ క్రాస్ ఎగ్జామినేషన్ మొదలు కాకముందే వాయిదా పడింది. ఈ నెల 9–11 తేదీల్లో జరగాల్సిన క్రాస్ ఎగ్జామినేషన్ ఈ నెల 29–31 తేదీలకు వాయిదా పడింది. ఈ తేదీల్లో తమ తరఫు న్యాయవాది విదేశీ పర్యటనలో ఉంటారని ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను కోరింది. దీంతో విచారణను వాయిదా వేస్తూ ట్రిబ్యునల్ అధికారికంగా సోమవారం 2 రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. -
పోతిరెడ్డి‘పాడు’
జూపాడుబంగ్లా: ప్రాజెక్టుల వద్ద నిద్రించైనా పెండింగ్ పనులు పూర్తి చేయిస్తానని సీఎం చంద్రబాబునాయుడు 2015 మే 12న భానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ వద్ద రైతాంగానికి హామీనిచ్చారు. అదేవిధంగా 2015 మార్చి 5న పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరును పరిశీలించినభారీ నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సైతం 100 రోజుల్లోగా పెండింగ్ పనులు పూర్తి చేయిస్తామని, 2015 జూన్ నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 44వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయిస్తానని వాగ్దానం చేశారు. సీఎం, మంత్రి.. తప్పుడు హామీలతో రైతులను మభ్యపెట్టేందుకు యత్నించారే తప్ప, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి రాయలసీమను సస్యశ్యామలం చేయలేకపోయారు. దీంతో ప్రాజెక్టుల నిర్మాణం పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ పనులే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం... పోతిరెడ్డిపాడు నూతన హెడ్‌రెగ్యులేటరు నిర్మాణం పనులు 2006 డిసెంబర్లో రూ.201.347కోట్ల వ్యయంతో ప్రారంభమయ్యాయి. ఆరేళ్ల క్రితం 85 శాతం పనులు పూర్తయ్యాయి. పెండింగ్‌లో ఉన్న 15శాతం పనులను పూర్తిచేయించటంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దీంతో పోతిరెడ్డిపాడు నుంచి 44వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకోలేని దుస్థితి నెలకొంది. దీనికితోడు పనుల నిర్మాణం సమయంలో అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో డిజైన్‌లో లోపం ఉన్నట్లు ఈఎన్సీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా నాసిరకంగా పనులు చేయటం వల్ల నూతన హెడ్‌రెగ్యులేటరు అప్‌స్టీం సేఫ్టీవాల్‌గోడలు పగుళ్లు ఇచ్చాయి. పూర్తికాని పనులు, వంతెనలు ఎస్సారెమ్సీ(శ్రీశైలం రిజర్వాయర్ కుడి ప్రధాన కాల్వ)ని బానకచర్ల వద్ద విస్తరించాల్సి ఉంది. అలాగే కాల్వలోని పూడికను తొలగించాల్సి ఉంది. 0 నుంచి 9కిలోమీటర్ల మేర ఎస్సారెమ్సీ ఎడమగట్టును పటిష్టంచేసి స్టాండర్డు బ్యాంకును నిర్మించాల్సి ఉంది. కుడిగట్టు వెంట 16.325 కిలోమీటర్ల మేర బీటీ రహదారిని నిర్మించాల్సి ఉంది. కాల్వ వెంట వంతెనల నిర్మాణం పెండింగ్‌లో ఉన్నాయి. అధికారుల నివాస గృహాలు, కంట్రోల్‌రూంను నిర్మించాల్సి ఉండగా.. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలన పూర్తికావొస్తున్నా నేటికీ పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. పూర్తికాని ఎస్సార్బీసీ పోతిరెడ్డిపాడు ద్వారా విడుదల చేసే 44వేల క్యూసెక్కుల నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ, కేసీ ఎస్కేప్ కాల్వలు 11వేల క్యూసెక్కులు, ఎస్సార్బీసీకి 22వేల క్యూసెక్కులు ఇవ్వాల్సి ఉంది. ఎస్సార్బీసీ విస్తరణ పనులు నత్తను తలపిస్తుండటంతో 22వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకోలేని దుస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎస్సార్బీసీకి 6వేల క్యూసెక్కులను మించి సరఫరా చేయలేకపోతున్నారు. ఆగస్టు 19 వరకు పనులుపొడిగించారు పోతిరెడ్డిపాడు పనులు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమే. వాటిని పూర్తిచేసేందుకు ఈ ఏడాది ఆగస్టు 19 వరకు గడువును పొడిగించాం. త్వరలో పనులు పూర్తి చేయిస్తాయిం. దిగువ నున్న కాల్వలు పూరైతేనే పోతిరెడ్డిపాడు నుంచి 44వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకొనే అవకాశం ఉంటుంది. – మనోహర్‌రాజు, ఈఈ, పోతిరెడ్డిపాడు మొరాయిస్తున్న గేట్లు పోతిరెడ్డిపాడు పాత, కొత్త హెడ్‌రెగ్యులేటర్ల గేట్లు తుప్పుపట్టి ఎత్తితే దించలేం, దించితే ఎత్తలేం అన్నట్లుగా మారాయి. కొత్త హెడ్‌రెగ్యులేటరుకు ఉన్న పదిగేట్లలో ఆరింటికి ఉన్న రబ్బర్‌షీల్స్ ఊడిపోవటంతో ప్రారంభానికి ముందే లీకేజీ అవుతున్నాయి. అలాగే 3వగేటు సక్రమంగా పనిచేయట్లేదు. పాత హెడ్‌రెగ్యులేటరుకు ఉన్న నాలుగు గేట్లలో కేవలం 2, 3 మాత్రమే సక్రమంగా పనిచేస్తున్నాయి. ఒకటోగేటు స్టాండ్‌భైగా ఉండగా 4వగేటు సక్రమంగా పనిచేయట్లేదు. -
పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణమ్మ పరుగులు
- పోతిరెడ్డిపాడు, ఎన్సీఎల్ గేట్లు ఎత్తిన సీఈ, ఎస్ఈ - ఎన్సీఎల్ విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 1500 క్యూసెక్కులు జూపాడుబంగ్లా: శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం నిర్దేశించిన స్థాయి(859 అడుగులు)కి చేరుకోవడంతో మంగళవారం పోతిరెడ్డిపాడు ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. మంగళవారం సీఈ, ఎస్ఈ, ఈఈలు నారాయణరెడ్డి, రాఘవరెడ్డి, శ్రీనివాసరెడ్డి మంగళవారం పోతిరెడ్డిపాడు నూతన హెడ్‌రెగ్యులేటర్, నాగార్జున విద్యుదుత్పత్తికేంద్రం గేట్లను ఎత్తడంతో కృష్ణాజలాలు దిగువకు పరుగులు తీశాయి. ముందుగా పోతిరెడ్డిపాడు మూడు గేట్లను మూడు అంగుళాల మేరకు ఎత్తి నీటిని విడుదల చేశారు. అనంతరం మరో నాలుగు గేట్లను ట్రయల్‌రన్ నిర్వహించి చెక్‌చేశారు. అనంతరం పక్కన్నే ఉన్న నాగార్జున విద్యుదుత్పత్తి కేంద్రంలో ఈఈ శ్రీనివాసరెడ్డి పూజలు చేసి మూడు జనరేటర్లను ఆన్ చేశారు. కేంద్రంలో విద్యుదుత్పత్తి అనంతరం 1,500క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అనంతరం సీఈ నారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ శ్రీశైలం జలాశయంలో 859 అడుగుల నీటిమట్టం వద్ద 103 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి 5టీఎంసీల నీటి విడుదలకోసం కృష్ణాబోర్డుకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పిన సీఈ.. ఇంకా అనుమతి లభించలేదన్నారు. అయితే రాయలసీమ ప్రాంతంలో తలెత్తిన తాగునీటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసినట్లు చెప్పారు. అడపా దడపా కురుస్తున్న వర్షాల వల్ల ఎస్సార్బీసీ, తెలుగుగంగ కాల్వల్లో కొద్ది మేర నీరున్న నేపథ్యంలో పోతిరెడ్డిపాడు నుంచి విడుదలచేసే నీటితో వెలుగోడు రిజర్వాయర్ నింపనున్నట్లు తెలిపారు. గత ఏడాది మొత్తంగా పోతిరెడ్డిపాడు ద్వారా 67 టీఎంసీల నీటిని డ్రా చేసుకున్నామని, ఈ ఏడాది కూడా అదే స్థాయిలో డ్రా చేసుకునే వీలుందని సీఈ తెలిపారు. కాల్వలకు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా నీటిని విడుదల చేస్తారనే విషయంపై నీటిలభ్యతను బట్టి ఐఏబీ సమావేశంలో నిర్ణయిస్తారన్నారు. కార్యక్రమంలో నంద్యాల ఈఈ పురుషోత్తంరెడ్డి, ట్రైనీ ఈఈ విశ్వనాథ్, డీఈ వెంకటరమేష్బాపూజీ, ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి, ట్రైనీ ఇంజినీర్లు, ఎన్సీఎల్ మేనేజర్ రమణ, సిబ్బంది పాల్గొన్నారు. -
పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు బంద్
రబీ పంటలపై తీవ్ర ప్రభావం పోతిరెడ్డిపాడు(జూపాడుబంగ్లా): శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గిపోవటంతో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి నీటిసరఫరా బంద్ అయింది. శుక్రవారం సాయంత్రం నాటికి శ్రీశైలం జలాశయంలో 846.80 అడుగుల నీటిమట్టం నమోదైంది. దీంతో పోతిరెడ్డిపాడుగేట్ల వద్ద నీటిమట్టం స్పిల్‌వే స్థాయికి చేరింది. ఇప్పటిదాకా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 67,165 టీఎంసీల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేశారు. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు 35.830టీఎంసీలు, ఎస్సార్భీసీ కాల్వకు 20.720 టీఎంసీలు, కేసీ ఎస్కేప్ కాల్వకు 10.615 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు పర్యవేక్షణ అధికారులు తెలిపారు. రబీపంటలకు దెబ్బ: పోతిరెడ్డిపాడు నుంచి నీటిసరఫరా నిలిచిపోవటంతో ఎస్సారీ్బసీ, కేసీ ఎస్కేప్, తెలుగుగంగ కాల్వల కింద సాగుచేసిన రబీపంటల పరిస్థితి ప్రశ్నార్థకమైంది. ఓ తడి నీళ్లు పారితే పంటలు చేతికొచ్చే తరుణంలో నీటిసరఫరా నిలిచిపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
పోతిరెడ్డిపాడుకు నీటి విడుదల తగ్గింపు
శ్రీశైలం ప్రాజెక్టు: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా విడుదల చేసే నీటిపరిమాణాన్ని అధికారులు తగ్గించారు. శుక్రవారం నీటివిడుదల 800 క్యూసెక్కులు ఉండగా, శనివారం 600 క్యూసెక్కులను విడుదల చేశారు. గత నాలుగు రోజుల క్రితం నుంచి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి నీటివిడుదలను నిలిపివేసిన విషయం తెలిసిందే. హంద్రీనివా సుజలస్రవంతికి విడుదల చేసే 2,025 క్యూసెక్కుల నీటిని యథావిథిగా కొనసాగిస్తున్నారు. శ్రీశైలంకుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదన కొనసాగుతుంది. శుక్రవారం నుంచి శనివారం వరకు కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 1.444 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 5.842 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం 14,694 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 91.6176 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 854.90 అడుగులు నమోదైంది. -
ముచ్చుమర్రికి శ్రీశైలం జలాలు విడుదల
శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైలం జలాశయం నుంచి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం 420 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి నీటిని విడుదల ప్రారంభించినప్పటికీ బుధవారం నుంచి పూర్తిస్థాయిలో ఎత్తిపోతల పథకానికి నీటిని అందిస్తున్నారు. జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా విడుదల చేసే 2వేల క్యూసెక్కుల నుంచి 500 క్యూసెక్కులను తగ్గించి 1500 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. తగ్గించిన స్థానంలో ముచ్చుమర్రి ఎత్తి పోతలకు 420 క్యూసెక్కులను వదులుతున్నారు. హంద్రీనివా సుజలస్రవంతికి యథావిథిగా 2025 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. మంగళవారం నుంచి బుధవారం వరకు ఆంధ్ర ప్రాంతంలోని కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 1.664 మిలియన్ యూనిట్లు, తెలంగాణా ప్రాంతంలోని ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 1.392 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు 5,849 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 102.4060 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 858.80 అడుగులకు చేరుకుంది. -
బానకచెర్ల నుంచి 4వేల క్యూసెక్కులు విడుదల
పాములపాడు : మండల పరిధిలోని బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి సోమవారం 4వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు సీఈ శివరామ్‌ప్రసాద్ తెలిపారు. అలాగే ఎస్సార్బీసీకి 1800 క్యూసెక్కులు, కెసీసీకి 700, టీజీపీకి 1500 క్యూసెక్కుల చొప్పున దిగువకు వదిలామన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి ఎస్సార్‌ఎంసీ దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. -
పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల
పోతిరెడ్డిపాడు(జూపాడుబంగ్లా): పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులెటర్ నుంచి 6,500క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి మంగళవారం తెలిపారు. విడుదల చేసిన నీటిలో తెలుగుగంగ కాల్వకు 3,800 క్యూసెక్కులు, ఎస్సార్బీసీ కాల్వకు 1,700, కేసీ ఎస్కేప్ కాల్వకు 1,000 క్యూసెక్కుల చొప్పున పంపుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు వద్ద 878.48 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. -
పోతిరెడ్డిపాడు వద్ద 880.80 అడుగుల నీటిమట్టం
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్ద మంగళవారం సాయంత్రం 7గంటల సమయంలో 880.80 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ విష్ణు తెలిపారు. శ్రీశైలం జలాశయంలోకి 1,20,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 881.80అడుగుల నీటిమట్టం వద్ద 197.20 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు గేజింగ్ అధికారులు తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 1500క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీకి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ వద్ద ఎస్సార్బీసీ, తెలుగుగంగ, కేసీ ఎస్కేప్ కాల్వకు 500 క్యూసెక్కుల ప్రకారం విడుదల చేస్తున్నట్లు డీఈ శివరాంప్రసాద్ తెలిపారు. హంద్రీనీవాసుజలస్రవంతి కాల్వకు 2,025 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. విద్యుదుత్పత్తి అనంతరం 73,840 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. -
పోతిరెడ్డిపాడు వద్ద 873.10 అడుగుల నీటిమట్టం
పోతిరెడ్డిపాడు(జూపాడుబంగ్లా): పోతిరెడ్డిపాడు వద్ద 873.10అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ విష్ణు తెలిపారు. ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయంలోకి 16వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చిచేరుతుండగా శ్రీశైలం జలాశయంలో 874.10 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు తెలిపారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఎస్సారెమ్సీ కాల్వలోకి 2,000క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా హంద్రీనీవా సుజలశ్రవంతి పథకం ద్వారా 1680క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు 1,000క్యూసెక్కులు, కేసీ కాల్వకు 500, ఎస్సార్బీసీకి 500క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు డీఈ శివరాంప్రసాద్ తెలిపారు. శ్రీశైలం విద్యుత్తు కేంద్రంలో విద్యుత్తు ఉత్పత్తిచేస్తూ 7,416 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు గేజింగ్ అధికారులు తెలిపారు. -
బాధితులకు భరోసా కల్పించండి
– ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన డీఐజీ – పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సందర్శన – జూపాడుబంగ్లా పోలీసు స్టేషన్ పరిశీలన జూపాడుబంగ్లా: పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం అందుతుందనే భరోసా కల్పించేలా సిబ్బంది వ్యహరించాలని డీఐజీ రమణకుమార్ అన్నారు. పారుమంచాల గ్రామానికి చెందిన ఇండియన్ డిఫెన్స్ సర్వీసు అధికారి ధర్మారెడ్డి తండ్రి ఆర్లపాటి సుబ్బారెడ్డి గత నెల 24న మతి చెందారు. ఈ సందర్భంగా డీఐజీ రమణకుమార్ శనివారం పారుమంచాల గ్రామానికి చేరుకొని «ధర్మారెడ్డి, అతని తల్లి వెంకటలక్ష్మమ్మను పరామర్శించారు. అనంతరం ధర్మారెడ్డితో కాసేపు మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం డీఐజీ పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను సందర్శించి పాత, కొత్త గేట్లను పరిశీలించారు. నీటి విడుదల వివరాలను ఎన్సీఎల్ సిబ్బంది రమణ వివరించారు. అనంతరం ఆయన జూపాడుబంగ్లా పోలీసుస్టేషన్‌కు చేరుకొని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది వివరాలు, కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసుస్టేషన్‌కు వచ్చిన బాధితులపట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించటంతోపాటు వారిచ్చే ఫిర్యాదుల పట్ల వెంటనే స్పందించాలన్నారు. న్యాయ, అన్యాయాలను విచారించి తగిన చర్యలు తీసుకోవడంతోపాటు వెంటనే కేసులు నమోదు చేయాలన్నారు. ఆయన వెంట ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ, న ందికొట్కూరు సీఐ శ్రీనాథ్‌రెడ్డి, ఎస్ఐలు సుబ్రమణ్యం, శివాంజల్, లక్ష్మీనారాయణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
పోతిరెడ్డిపాడు టు శ్రీశైలం పాదయాత్ర
– కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ప్రకటన – సాగునీటి సాధన కోసమేనని వెల్లడి కర్నూలు(ఓల్డ్‌సిటీ): జిల్లా రైతుల కోసం త్వరలో పోతిరెడ్డిపాడు నుంచి శ్రీశైలం వరకు 140 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తానని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి ప్రకటించారు. స్థానిక కళావెంకట్రావ్ భవనంలో మంగళవారం నిర్వహించిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో కోట్లతో పాటు 20 సూత్రాల అమలు కమిటీ మాజీ చైర్మన్ తులసీరెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం కోట్ల విలేకరులతో మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం జిల్లా ప్రజలు విలువైన భూములు, ఇళ్లు త్యాగం చేశారని, అయితే ప్రస్తుత పాలకులు నీటిమట్టం తగ్గించడం ద్వారా ఆ నీటిని రాయలసీమకు రాకుండా చేశారని ఆరోపించారు. చివరికి డెడ్ స్టోరేజీ దశలోనూ దిగువకు వదిలారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు జిల్లాల సాగునీటి సాధన కోసమే పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. పాలకులకు రాయలసీమపై ఏమాత్రం ప్రేమ ఉన్నా గుండ్రేవుల, సిద్ధేశ్వరం ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. సీఎం చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని తులసీరెడ్డి అన్నారు. రాజధాని, హైకోర్టూ కోస్తాకే (గుంటూరుకు) రాయలసీమ ప్రజలను మోసగించడమేనని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు, డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, పీసీసీ కార్యదర్శి సర్దార్ బుచ్చిబాబు, మైనారిటీ సెల్ రాష్ట్ర చైర్మన్ అహ్మద్‌అలీఖాన్, జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల
– ట్రయల్‌రన్ నిర్వహించామన్న అధికారులు పోతిరెడ్డిపాడు(జూపాడుబంగ్లా): పోతిరెడ్డిపాడు పాత, కొత్త హెడ్‌రెగ్యులేటర్ల 8 గేట్లను శనివారం మధ్యాహ్నం ఎత్తి అధికారులు దిగువ ప్రాంతాలకు వెయ్యి క్యూసెక్కుల కృష్ణా జలాలను విడుదల చేశారు. శ్రీశైలం జలాశయంలో శనివారం మధ్యాహ్ననికి 848 అడుగుల నీటిమట్టం నమోదవడంతో అధికారులు ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడకుండానే పోతిరెడ్డిపాడు పాతహెడ్రెగ్యులేటరు 2, 3 గేట్లు, కొత్తహెడ్రెగ్యులేటర్ 3 నుంచి 8గేట్లను ఎత్తి దిగువ ప్రాంతాలకు నీరు విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటివిడుదల విషయమై ఎస్ఈ రామచంద్రయ్యను విలేకరులు ప్రశ్నించగా.. నీటివిడుదల విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదన్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరుగుతున్నందున పోతిరెడ్డిపాడు పాత, కొత్త హెడ్‌రెగ్యులేటర్లు గేట్లు ఎత్తి ట్రయల్‌రన్ నిర్వహించామన్నారు. అప్రోచ్కాల్వను విస్తరించి ఉంటే నీటి ప్రవాహం పెరిగి ఉండేదని, ప్రభుత్వం సకాలంలో నిధులు మంజూరు చేయకపోవటంతో కాల్వ విస్తరించలేకపోయామని ఎస్ఈ తెలిపారు. పోతిరెడ్డిపాడు వద్ద శనివారం సాయంత్రానికి 849.50 అడుగుల నీటిమట్టం నమోదైనట్లు ఏఈ విష్ణు తెలిపారు. నీటి మట్టం 854 అడుగులు నమోదైతే నీటిని విడుదల చేసుకునే అవకాశాలుంటాయని ఆయన స్పష్టం చేశారు. -
బాబుకు 300కోట్ల ముడుపులు - జగన్
-
బాబు సీమ ప్రాజెక్టులను విస్మరించారు: వైఎస్ జగన్
కర్నూలు: పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా రాయలసీమకు నీళ్లు ఎలా ఇస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాయుడు గతంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ ప్రాజెక్టులు గుర్తుకురాలేదని వైఎస్ జగన్ అన్నారు. ప్రాజెక్టుల కోసం చేపట్టిన బస్సుయాత్రలో భాగంగా మూడో రోజు శుక్రవారం వైఎస్ జగన్ బృందం పోతిరెడ్డిపాడు చేరుకుంది. వైఎస్ జగన్ పోతిరెడ్డి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం వైఎస్ జగన్ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతులు తమ సమస్యలను వైఎస్ జగన్‌తో మొరపెట్టుకున్నారు. చంద్రబాబు ఎన్నికల సందర్భంగా రైతు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చి, గెలిచిన తర్వాత మోసం చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.