
సాక్షి, అమరావతి : ఇతర పార్టీల్లోకి తాను పంపించిన బానిసల గొలుసులు విప్పి పోతిరెడ్డిపాడు జీఓపై చంద్రబాబు నాయుడు ఉసిగొల్పుతున్నారని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. వాళ్లెంత మొరిగినా న్యాయం అనేది ఒకటుంటుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తన కేటాయింపులకు మించి చుక్క నీటిని కూడా అక్రమంగా తీసుకోదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారని తెలిపారు. మౌనీ బాబా నోరు విప్పాలని ట్విటర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘చంద్రబాబు హైదరాబాద్‌కు పారిపోయి అర్థశత దినోత్సవం పూర్తయింది. కరోనా కష్ట సమయంలో రాష్ట్రాన్ని వదిలి ప్రతిపక్ష నేత ఎక్కడో ఉండటమేమిటని ఎల్లో మీడియా ప్రశ్నించదు. నలుగురు కూర్చుని ప్లకార్డులు పట్టుకుంటే అమరావతి దీక్షలు 150 రోజులకు చేరాయని వార్తలు వడ్డిస్తోంది’ అని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment