
సాక్షి, హైదరాబాద్: పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచితే రాష్ట్రానికి విద్యుత్ కష్టాలు వస్తాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన 203 జీవో ప్రకారం పోతిరెడ్డిపాడుకు నీటిని తరలిస్తే శ్రీశైలం ప్రాజెక్టులోకి చుక్క నీరు రాదని, విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతుందన్నారు. శ్రీశైలంతోపాటు సాగర్, పులిచింతల విద్యుత్ ప్లాంట్లలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుందని, అప్పుడు తెలంగాణ చీకటి అవుతుందన్నారు.
ఉమ్మడి రాష్ట్రం విడిపోయే నాటికి తెలంగాణలో 54 శాతం విద్యుత్ వినియోగం ఆధారంగా ప్రాజెక్టుల్లో తెలంగాణకు వాటా ఇచ్చారని, ఇప్పుడు శ్రీశైలం, సాగర్, పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతే రావాల్సిన కరెంటు రాదని చెప్పారు. దీనిపై విద్యుత్ రంగ నిపుణులు మాట్లాడాలని కోరారు. పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా జూన్ 2న సాగునీటి ప్రాజెక్టుల వద్ద నిరసనలు తెలుపుతామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment