సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్లు, ప్రైవేటు సంస్థలకు చెల్లిస్తున్న ధరలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యుదుత్పత్తి సంస్థలిచ్చే కమీషన్ల కోసమే ప్రభుత్వ విద్యుత్ సంస్థలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం, పొరుగు రాష్ట్రాలు తక్కువ ధరలకు విద్యుత్ ఇస్తామన్నా వినని రాష్ట్ర ప్రభుత్వం.. ఎక్కువ ధర పెట్టి ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తోందన్నారు. ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి ఎంత విద్యుత్ కొంటున్నారో, ఎంత ధర పెడుతున్నారో, దేశవ్యాప్తంగా విద్యుత్ ఎంత ధరకు దొరుకుతుందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు విద్యుత్‌పై అన్నీ అబద్ధాలు చెబుతున్నారని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment