
బాబు సీమ ప్రాజెక్టులను విస్మరించారు: వైఎస్ జగన్
కర్నూలు: పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా రాయలసీమకు నీళ్లు ఎలా ఇస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాయుడు గతంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ ప్రాజెక్టులు గుర్తుకురాలేదని వైఎస్ జగన్ అన్నారు.
ప్రాజెక్టుల కోసం చేపట్టిన బస్సుయాత్రలో భాగంగా మూడో రోజు శుక్రవారం వైఎస్ జగన్ బృందం పోతిరెడ్డిపాడు చేరుకుంది. వైఎస్ జగన్ పోతిరెడ్డి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం వైఎస్ జగన్ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతులు తమ సమస్యలను వైఎస్ జగన్తో మొరపెట్టుకున్నారు. చంద్రబాబు ఎన్నికల సందర్భంగా రైతు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చి, గెలిచిన తర్వాత మోసం చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.