పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల
పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల
Published Sat, Aug 6 2016 10:54 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
– ట్రయల్‌రన్ నిర్వహించామన్న అధికారులు
పోతిరెడ్డిపాడు(జూపాడుబంగ్లా): పోతిరెడ్డిపాడు పాత, కొత్త హెడ్‌రెగ్యులేటర్ల 8 గేట్లను శనివారం మధ్యాహ్నం ఎత్తి అధికారులు దిగువ ప్రాంతాలకు వెయ్యి క్యూసెక్కుల కృష్ణా జలాలను విడుదల చేశారు. శ్రీశైలం జలాశయంలో శనివారం మధ్యాహ్ననికి 848 అడుగుల నీటిమట్టం నమోదవడంతో అధికారులు ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడకుండానే పోతిరెడ్డిపాడు పాతహెడ్‌రెగ్యులేటరు 2, 3 గేట్లు, కొత్తహెడ్‌రెగ్యులేటర్ 3 నుంచి 8గేట్లను ఎత్తి దిగువ ప్రాంతాలకు నీరు విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటివిడుదల విషయమై ఎస్‌ఈ రామచంద్రయ్యను విలేకరులు ప్రశ్నించగా.. నీటివిడుదల విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదన్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరుగుతున్నందున పోతిరెడ్డిపాడు పాత, కొత్త హెడ్‌రెగ్యులేటర్లు గేట్లు ఎత్తి ట్రయల్‌రన్ నిర్వహించామన్నారు. అప్రోచ్‌కాల్వను విస్తరించి ఉంటే నీటి ప్రవాహం పెరిగి ఉండేదని, ప్రభుత్వం సకాలంలో నిధులు మంజూరు చేయకపోవటంతో కాల్వ విస్తరించలేకపోయామని ఎస్‌ఈ తెలిపారు. పోతిరెడ్డిపాడు వద్ద శనివారం సాయంత్రానికి 849.50 అడుగుల నీటిమట్టం నమోదైనట్లు ఏఈ విష్ణు తెలిపారు. నీటి మట్టం 854 అడుగులు నమోదైతే నీటిని విడుదల చేసుకునే అవకాశాలుంటాయని ఆయన స్పష్టం చేశారు.
Advertisement
Advertisement