పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు బంద్
పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు బంద్
Published Fri, Feb 10 2017 10:00 PM | Last Updated on Tue, Sep 5 2017 3:23 AM
రబీ పంటలపై తీవ్ర ప్రభావం
పోతిరెడ్డిపాడు(జూపాడుబంగ్లా): శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గిపోవటంతో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి నీటిసరఫరా బంద్ అయింది. శుక్రవారం సాయంత్రం నాటికి శ్రీశైలం జలాశయంలో 846.80 అడుగుల నీటిమట్టం నమోదైంది. దీంతో పోతిరెడ్డిపాడుగేట్ల వద్ద నీటిమట్టం స్పిల్‌వే స్థాయికి చేరింది. ఇప్పటిదాకా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 67,165 టీఎంసీల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేశారు. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు 35.830టీఎంసీలు, ఎస్సార్భీసీ కాల్వకు 20.720 టీఎంసీలు, కేసీ ఎస్కేప్ కాల్వకు 10.615 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు పర్యవేక్షణ అధికారులు తెలిపారు.
రబీపంటలకు దెబ్బ: పోతిరెడ్డిపాడు నుంచి నీటిసరఫరా నిలిచిపోవటంతో ఎస్సారీ్బసీ, కేసీ ఎస్కేప్, తెలుగుగంగ కాల్వల కింద సాగుచేసిన రబీపంటల పరిస్థితి ప్రశ్నార్థకమైంది. ఓ తడి నీళ్లు పారితే పంటలు చేతికొచ్చే తరుణంలో నీటిసరఫరా నిలిచిపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Advertisement
Advertisement