‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ విజేతలు ఏం చేస్తున్నారు? | What are the Winners of Kaun Banega Crorepati Doing Now | Sakshi
Sakshi News home page

‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ విజేతలు ఏం చేస్తున్నారు?

Published Wed, Sep 13 2023 1:03 PM | Last Updated on Wed, Sep 13 2023 1:17 PM

What are the Winners of Kaun Banega Crorepati Doing Now - Sakshi

టీవీ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో పాల్గొన్న పలువురు పోటీదారులు తమ పరిజ్ఞానం ఆధారంగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా కోటీశ్వరులుగా మారారు. ఈ షో గత రెండు దశాబ్దాలుగా ప్రసారమవుతోంది. శతాబ్దపు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్టింగ్‌ అన్ని వయసుల ప్రేక్షకులను కట్టిపడేస్తుంటుంది. ఈ షోలో పాల్గొనేందుకు దేశంలోని నలుమూలల నుంచి పలువురు వస్తుంటారు. ప్రస్తుతం ఈ షో సీజన్ 15.. 2023 ఆగస్టు 14 నుండి ప్రారంభమై, విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఈ షోలో కోటీశ్వరులుగా మారిన వారు ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసుకుందాం.



మొదటి పార్టిసిపెంట్ హర్షవర్ధన్ నవాతే(మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో ఉద్యోగం)
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో కోటి రూపాయలు గెలుచుకున్న మొదటి పార్టిసిపెంట్ హర్షవర్ధన్ నవాతే. అతను 2000 సంవత్సరంలో కేబీసీ మొదటి సీజన్‌కు వచ్చినప్పుడు, ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్నారు. కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్న తర్వాత, అతను యూపీఎస్‌సీ ప్రిపరేషన్ నుంచి తప్పుకున్నారు. దీని తర్వాత నవాతే ఎబీఏ డిగ్రీ చేసేందుకు బ్రిటన్‌లోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయానికి వెళ్లారు. ప్రస్తుతం హర్షవర్థన్‌ నవాతే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో పనిచేస్తున్నారు.

రవిమోహన్ సైనీ (ఐపీఎస్ అధికారి)
‘కేబీసీ జూనియర్’ 2001లో ప్రసారమయ్యింది. ఇందులో 11వ తరగతి విద్యార్థి రవిమోహన్ సైనీ కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఆ తర్వాత ఆయన ఎంబీబీఎస్‌ చేశారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గుజరాత్ కేడర్‌లో ఐపీఎస్ అధికారి అయ్యారు. రవి మోహన్‌ యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచారు.

అనిల్ కుమార్ (కేబీసీ ట్రైనర్‌)
కేబీసీలో అనిల్ కుమార్ సిన్హా కోటి రూపాయల మొత్తాన్ని  గెలుచుకున్నారు. అనిల్‌ వృత్తిరీత్యా బ్యాంకు ఉద్యోగి. ప్రస్తుతం అనిల్‌ యూట్యూబ్‌లో సొంత ఛానల్‌ నడుపుతున్నారు. ఈ ఛానల్ ద్వారా కౌన్ బనేగా కరోడ్‌పతి కోసం సిద్ధం అవుతున్న ఔత్సాహికులకు సాయం చేస్తున్నారు.

రహత్ తస్లీమ్(బోటిక్ నిర్వాహకురాలు)
బ్రజేష్ ద్వివేది, మనోజ్ కుమార్ 2005లో కేబీసీలో ఒక్కొక్కరు కోటి రూపాయలు గెలుచుకున్నారు. రహత్ తస్లీమ్ సొంత బొటిక్‌ని తెరిచారు. ఆమె జార్ఖండ్‌లో దీనిని ఏర్పాటుచేశారు.

సుశీల్ కుమార్ (ఉపాధ్యాయుడు)
బీహార్‌కు చెందిన సుశీల్ కుమార్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో రూ.5 కోట్లు గెలుచుకున్నారు. ఈ మొత్తాన్ని సుశీల్ సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు. పైగా మద్యానికి బానిసయ్యారు. డబ్బునంతా పోగొట్టుకుని, ప్రస్తుతం బీహార్‌లోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.

సన్మీత్ (దుస్తుల బ్రాండ్‌ రూపకర్త)
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో రూ.5 కోట్లు గెలుచుకున్న తొలి మహిళగా సన్మీత్ కౌర్ సహానీ నిలిచారు. ప్రస్తుతం ఆమె ముంబైలో ఉంటున్నారు. ఆమె నటుడు మన్మీత్ సింగ్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె 2015లో ఢిల్లీలో దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించారు.
 
మనోజ్ కుమార్(రైల్వే ఉద్యోగి)
కేబీసీ సీజన్ 6లో రైల్వే ఉద్యోగి మనోజ్ కుమార్ కోటి రూపాయలు గెలుచుకున్నారు. అతను శ్రీనగర్‌కు చెందినవ్యక్తి. ఉద్యోగం కారణంగా జమ్మూలో  ఉంటున్నారు.

ఫిరోజ్ ఫాతిమా(వైద్య ఖర్చులు)
ఫిరోజ్ ఫాతిమా 2013లో కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఆ డబ్బును తన తండ్రి చికిత్సకు, కుటుంబ రుణం తీర్చడానికి ఉపయోగించారు.
 
తాజ్ మహ్మద్ (ఇద్దరు అనాథ బాలికలకు వివాహం)
తాజ్ మహ్మద్ కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్నారు. తన కుమార్తె కళ్లకు చికిత్స చేయించి, గృహం నిర్మించుకున్నారు. ఇద్దరు అనాథ బాలికలకు పెళ్లిళ్లు కూడా చేశాడు.

అచిన్-సార్థక్ (వ్యాపారం)
కేబీసీ సీజన్ 8లో తొలిసారిగా రూ. 7 కోట్లు గెలుచుకున్న సోదర ద్వయం అచిన్- సార్థక్‌లు తమ తల్లికి క్యాన్సర్‌కు చికిత్స చేయించారు. ఇప్పుడు ఇద్దరూ సొంతంగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. అదే సీజన్‌లో కోటి రూపాయలు గెలుచుకున్న మేఘా పటేల్ క్యాన్సర్‌ నుంచి బయటపడ్డారు.

అనామిక(సామాజిక సేవ)
అనామిక సామాజిక సేవ చేస్తుంటారు. ఆమె తన సంస్థ కోసం నిధులను సేకరించడానికి కేబీసీ 2017 సీజన్‌కు వచ్చారు. కోటి రూపాయలను తన ఎన్జీవో అభివృద్ధికి వినియోగించారు. 

బినితా జైన్(కోచింగ్‌ సెంటర్‌)
అదే ఏడాది బినితా జైన్ కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఈ సొమ్ముతో కొంతమంది పిల్లలకు చదువు చెప్పించారు.. ఇప్పుడు కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు.

అజిత్‌కుమార్‌ (జైలు సూపరింటెండెంట్‌) 
బీహార్‌లోని హాజీపూర్‌కు చెందిన అజిత్ కుమార్ 2018లో కోటి రూపాయలు గెలుచుకున్నాడు. షో ద్వారా వచ్చిన డబ్బుతో పునరావాస కేంద్రాన్ని ప్రారంభించాలన్నారు. ప్రస్తుతం జైలు సూపరింటెండెంట్‌గా ఉన్నారు. 

ఇంజనీర్ గౌతమ్(సీనియర్ సెక్షన్ ఇంజనీర్) 
అదే ఏడాది రైల్వేలో సీనియర్ ఇంజనీర్ అయిన గౌతమ్ కుమార్ ఝా కూడా కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఆయన భారతీయ రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు

బబిత (కుక్‌)
2019లో కోటీశ్వరురాలు అయిన బబితా తాడే తన స్కూల్‌లో వంటమనిషిగా పనిచేస్తున్నారు. షోలో గెలిచిన డబ్బును తన పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేశారు.

సనోజ్ కుమార్ (యూపీఎస్‌సీ కోసం సిద్ధం)
అదే ఏడాది కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్న సనోజ్ కుమార్ ఇప్పుడు యూపీఎస్‌సీ కోసం సిద్ధమవుతున్నారు.

నజియా నసీమ్(కమ్యూనికేషన్ మేనేజర్‌)
కేబీసీ సీజన్- 12 మొదటి కోటీశ్వరురాలు నజియా నసీమ్. అప్పుడు ఆమె రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో కమ్యూనికేషన్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
 
మోహిత శర్మ (ఐపీఎస్ అధికారిణి)
అదే సీజన్‌లో జమ్మూ కాశ్మీర్‌లో ఐపీఎస్ అధికారిణి మోహితా శర్మ కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఆమె భర్త కూడా ఐపీఎస్ అధికారి.

హిమానీ బుందేలా, సాహిల్ ఆదిత్య అహిర్వార్, గీతా గౌర్
ఆగ్రాకు చెందిన హిమానీ బుందేలా కేబీసీ సీజన్ 13లో కోటి రూపాయలు గెలుచుకున్న మొదటి పోటీదారుగా నిలిచారు. అదే సీజన్‌లో సాహిల్ ఆదిత్య అహిర్వార్, గీతా గౌర్ కూడా కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఈ ముగ్గురు ఇప్పుడు ఏం చేస్తున్నానే సమాచారం  అందుబాటులో లేదు. 

కవితా చావ్లా, శశ్వత్ గోయల్ 
సీజన్ 14లో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కి చెందిన కవితా చావ్లా  కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఈ సీజన్‌లో ఢిల్లీకి చెందిన శశ్వత్ గోయల్ కూడా కోటి రూపాయలు గెలుచుకున్నాడు. అయితే ఆ తర్వాత రూ.7 కోట్లు అందించే ప్రశ్నకు తప్పుడు సమాధానం చెప్పారు. దీంతో చివరికి రూ.75 లక్షలతో ఇంటి ముఖంపట్టారు.
ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని వణికించిన 10 భూకంపాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement