participants
-
విశ్వసుందరి పోటీల్లో సౌదీ ముద్దుగుమ్మ! ఇంతకీ ఎవరీమె..?
ఇస్లాం సంప్రదాయవాదానికి చిరునామాగా నిలిచే సౌదీ అరేబియా నుంచి ఒక ముద్దుగుమ్మ మిస్ యూనివర్స్ పోటీలకు సిద్ధమైంది. సౌదీ నుంచి ఇలా ఒక అమ్మాయి అంతర్జాతీయ అందాల పోటీలకు ప్రాతినిధ్యం వహించడం చరిత్రలో ఇదే తొలిసారి. మలేసియాలో జరగనున్న విశ్వసుందరి పోటీల్లో సౌదీ తరఫున 27 ఏళ్ల మోడల్ రూబీ అల్ఖాతానీ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ అందాల రాశికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. తొలి పార్టిసిపెంట్‌గా ఆమె.. సౌదీ అరేబియాలో మహిళలపై ఎలాంటి ఆంక్షలుంటాయో అందరికి తెలిసిందే. కఠిన ఆంక్షలతో ఫక్తు సంప్రదాయవాదిగా పేరుమోసిన 38 ఏళ్ల సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఇటీవలి కాలంలో సౌదీని సంస్కరణల బాటలో పయనింపజేస్తున్నారు. ఇటీవలి కాలంలో పలు ఆంక్షల్ని సడలించి వార్తల్లో నిలిచారు. ఈ మేరకు ఆయన మహిళా డ్రైవర్లపై నిషేధం ఎత్తివేయడం, ఆహార్యం విషయంలో పెట్టిన నిబంధనల్ని సడలించడం, పురుషుల తోడు లేకుండా బయటికి వెళ్లే స్వేచ్ఛను అక్కడి మహిళలకు కల్పించడం.. వంటి పలు మార్పులు తీసుకొచ్చారు. అయితే అందాల పోటీల్లో పాల్గొనే విషయంలో కూడా నియమాల్ని సడలించడం విశేషం. ఎందుకంటే..ఇప్పటిదాకా అంతర్గతంగా జరిగే అందాల పోటీల్లో పాల్గొనేందుకు అక్కడి మహిళలకు అనుమతిచ్చిన ఈ దేశం.. తొలిసారి అంతర్జాతీయంగా జరిగే అందాల పోటీల్లో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేగాదు ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగబోయే ‘మిస్ యూనివర్స్’ పోటీల్లో ఈ దేశం కూడా పాలుపంచుకుంటోంది. విశ్వ సుందరి పోటీల్లో సౌదీ తరఫున 27 ఏళ్ల రుమీ అల్ ఖతానీ పోటీ పడనుంది. దీంతో ‘మిస్ యూనివర్స్’ పోటీల్లో పాల్గొననున్న తొలి సౌదీ అరేబియన్ మహిళగా రుమీ చరిత్ర సృష్టించనుంది. రుమీ రియాద్‌లో పుట్టి పెరిగింది. చిన్నతనం నుంచి ఎంతో ముద్దుగా, క్యూట్‌గా ఉండే ఆమెకు అందాల పోటీల్లో పాల్గొనాలన్నది చిరకాల కోరిక. అందువల్లే టీనేజ్ దశ నుంచే ఇటువైపుగా అడుగులు వేసి మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. కంటెంట్ క్రియోటర్గా.. అందాల పోటీలపై ఎంత మక్కువ ఉన్నా చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు రుమీ. దంత వైద్యంలో డిగ్రీ పట్టా పుచ్చుకుంది. కొత్త విషయాలు తెలుసుకోవడమన్నా, కొత్త భాషలు నేర్చుకోవడమన్నా ఈ ముద్దుగుమ్మకు చాలా ఇష్టమట! ఈ మక్కువతోనే అరబ్, ఫ్రెంచ్, ఇంగ్లిష్ భాషల్ని అనర్గళంగా మాట్లాడడం నేర్చుకున్న రుమీ.. మరిన్ని భాషలు నేర్చుకునే పనిలో ఉన్నానంటోంది. తన వ్యక్తిగత, కెరీర్ అనుభవాల్ని నలుగురితో పంచుకోవడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది రుమీ. ఈ క్రమంలోనే మోడల్‌గా తాను సాధించిన ఘనతల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ నెటిజన్ల ప్రశంసలందుకుంది ఈ సౌదీ భామ. ఫ్యాషన్, అందం, లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై అందరిలో అవగాహన కల్పిస్తూ పోస్టులు పెడుతూ.. కంటెంట్ క్రియేటర్‌గా మంచి పేరు కూడా తెచ్చుకుంది. అంతేగాదు ఇన్‌స్టాలో కూడా ఆమెను 10 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. కుటుంబమే నా బలం.. ప్రయాణాలంటే ఈ అందాల ముద్దుగుమ్మకు మహా ఇష్టమట. తాను సందర్శించే దేశాలు, అక్కడి ప్రత్యేకతల్ని ఫొటోలు, రీల్స్ రూపంలో ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. విభిన్న ఫ్యాషన్స్‌ని ఫాలో అవడం, కొత్త ఫ్యాషన్లను ట్రై చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది రుమీ. ఫ్యాషనబుల్ దుస్తుల్లో మెరిసిపోతూ రుమీ తీయించుకున్న ఫొటోషూట్స్‌ని ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా.. అవన్నీ వైరల్ అవుతుంటాయి. ఇలా ‘ఫ్యాషన్ క్వీన్’గానూ పేరు తెచ్చుకుందీ ఈ బ్యూటీ. తన వద్ద ఉన్న ఖరీదైన వస్తువులు, యాక్సెసరీస్, వాటికి సంబంధించిన ఫొటోల్నీ అందరితో పంచుకోవడానికి ఇష్టపడతుంది రుమీ. అంతేగాదు ఆమె వద్ద ఉన్న లగ్జరీ జ్యుయలరీ కలెక్షన్లను చూసి నెటిజన్లు ఫిదా అవుతుంటారు. తన కుటుంబమే తన బలం అని రుమీ తరచుగా చెబుతుంటుంది. అంతేగాదు తన కుటుంబ సభ్యులు, సోదరీమణులతో దిగిన ఫొటోల్ని కూడా సోషల్‌మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఇక రుమీ ఇప్పటికే పలు అందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. అలా ఆమె ‘మిస్ సౌదీ అరేబియా’, ‘మిస్ అరబ్ పీస్’, ‘మిస్ ఉమన్ సౌదీ అరేబియా’, ‘మిస్ యూరప్ సౌదీ అరేబియా’, ‘మిస్ ప్లానెట్ సౌదీ అరేబియా’, ‘మిస్ మిడిల్ ఈస్ట్ సౌదీ అరేబియా’, ‘మిస్ అరబ్ యునిటీ సౌదీ అరేబియా’, ‘మిస్ ఆసియా సౌదీ అరేబియా’.. వంటి ఎన్నో టైటిళ్లు దక్కించుకుంది. "ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సమానత్వంతో జీవించే హక్కు ఉంది. వయసు, స్త్రీ-పురుష భేదాలు, శక్తి సామర్థ్యాలు, ఆహార్యం/శరీరాకృతి పరంగా ఎవరూ వివక్షకు గురికాకూడదు. అప్పుడే వాళ్లు తామేంటో చూపించుకోగలరు.." అంటూ సోషల్ మీడియాలో స్ఫూర్తినింపే పోస్టులను పెడుతుంటుంది. కాగా, ఈ ఏడాది జరగబోయే ‘మిస్ యూనివర్స్’ పోటీల్లో తన దేశం తరఫున పాల్గొంటున్నందుకు ఆనందంలో మునిగితేలుతోంది ఈ ముద్దుగుమ్మ. అంతేగాదు ఈ ఏడాది మిస్ యూనివర్స్-2024 పోటీల్లో తన దేశానికి ప్రాతినిథ్యం వహించడం గర్వంగానూ సంతోషంగానూ ఉందని చెబుతోంది. ఈ ఏడాది తొలిసారిగా నా దేశం ఈ పోటీల్లో పోటీ పడుతుండడం, పైగా అందులో తానే తొలి పార్టిసిపెంట్‌ని కావడం ఎంతో సంతోషంగా అనిపించిందని సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చింది రుమీ. (చదవండి: హీరోయిన్లా కనిపించాలని వందకు పైగా సర్జరీలు! అందుకోసం..) -
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ విజేతలు ఏం చేస్తున్నారు?
టీవీ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో పాల్గొన్న పలువురు పోటీదారులు తమ పరిజ్ఞానం ఆధారంగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా కోటీశ్వరులుగా మారారు. ఈ షో గత రెండు దశాబ్దాలుగా ప్రసారమవుతోంది. శతాబ్దపు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్టింగ్ అన్ని వయసుల ప్రేక్షకులను కట్టిపడేస్తుంటుంది. ఈ షోలో పాల్గొనేందుకు దేశంలోని నలుమూలల నుంచి పలువురు వస్తుంటారు. ప్రస్తుతం ఈ షో సీజన్ 15.. 2023 ఆగస్టు 14 నుండి ప్రారంభమై, విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఈ షోలో కోటీశ్వరులుగా మారిన వారు ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. మొదటి పార్టిసిపెంట్ హర్షవర్ధన్ నవాతే(మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో ఉద్యోగం) ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో కోటి రూపాయలు గెలుచుకున్న మొదటి పార్టిసిపెంట్ హర్షవర్ధన్ నవాతే. అతను 2000 సంవత్సరంలో కేబీసీ మొదటి సీజన్‌కు వచ్చినప్పుడు, ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్నారు. కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్న తర్వాత, అతను యూపీఎస్సీ ప్రిపరేషన్ నుంచి తప్పుకున్నారు. దీని తర్వాత నవాతే ఎబీఏ డిగ్రీ చేసేందుకు బ్రిటన్‌లోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయానికి వెళ్లారు. ప్రస్తుతం హర్షవర్థన్ నవాతే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో పనిచేస్తున్నారు. రవిమోహన్ సైనీ (ఐపీఎస్ అధికారి) ‘కేబీసీ జూనియర్’ 2001లో ప్రసారమయ్యింది. ఇందులో 11వ తరగతి విద్యార్థి రవిమోహన్ సైనీ కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఆ తర్వాత ఆయన ఎంబీబీఎస్ చేశారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గుజరాత్ కేడర్‌లో ఐపీఎస్ అధికారి అయ్యారు. రవి మోహన్ యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. అనిల్ కుమార్ (కేబీసీ ట్రైనర్) కేబీసీలో అనిల్ కుమార్ సిన్హా కోటి రూపాయల మొత్తాన్ని గెలుచుకున్నారు. అనిల్ వృత్తిరీత్యా బ్యాంకు ఉద్యోగి. ప్రస్తుతం అనిల్ యూట్యూబ్‌లో సొంత ఛానల్ నడుపుతున్నారు. ఈ ఛానల్ ద్వారా కౌన్ బనేగా కరోడ్‌పతి కోసం సిద్ధం అవుతున్న ఔత్సాహికులకు సాయం చేస్తున్నారు. రహత్ తస్లీమ్(బోటిక్ నిర్వాహకురాలు) బ్రజేష్ ద్వివేది, మనోజ్ కుమార్ 2005లో కేబీసీలో ఒక్కొక్కరు కోటి రూపాయలు గెలుచుకున్నారు. రహత్ తస్లీమ్ సొంత బొటిక్‌ని తెరిచారు. ఆమె జార్ఖండ్‌లో దీనిని ఏర్పాటుచేశారు. సుశీల్ కుమార్ (ఉపాధ్యాయుడు) బీహార్‌కు చెందిన సుశీల్ కుమార్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో రూ.5 కోట్లు గెలుచుకున్నారు. ఈ మొత్తాన్ని సుశీల్ సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు. పైగా మద్యానికి బానిసయ్యారు. డబ్బునంతా పోగొట్టుకుని, ప్రస్తుతం బీహార్‌లోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. సన్మీత్ (దుస్తుల బ్రాండ్ రూపకర్త) ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో రూ.5 కోట్లు గెలుచుకున్న తొలి మహిళగా సన్మీత్ కౌర్ సహానీ నిలిచారు. ప్రస్తుతం ఆమె ముంబైలో ఉంటున్నారు. ఆమె నటుడు మన్మీత్ సింగ్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె 2015లో ఢిల్లీలో దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించారు. మనోజ్ కుమార్(రైల్వే ఉద్యోగి) కేబీసీ సీజన్ 6లో రైల్వే ఉద్యోగి మనోజ్ కుమార్ కోటి రూపాయలు గెలుచుకున్నారు. అతను శ్రీనగర్‌కు చెందినవ్యక్తి. ఉద్యోగం కారణంగా జమ్మూలో ఉంటున్నారు. ఫిరోజ్ ఫాతిమా(వైద్య ఖర్చులు) ఫిరోజ్ ఫాతిమా 2013లో కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఆ డబ్బును తన తండ్రి చికిత్సకు, కుటుంబ రుణం తీర్చడానికి ఉపయోగించారు. తాజ్ మహ్మద్ (ఇద్దరు అనాథ బాలికలకు వివాహం) తాజ్ మహ్మద్ కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్నారు. తన కుమార్తె కళ్లకు చికిత్స చేయించి, గృహం నిర్మించుకున్నారు. ఇద్దరు అనాథ బాలికలకు పెళ్లిళ్లు కూడా చేశాడు. అచిన్-సార్థక్ (వ్యాపారం) కేబీసీ సీజన్ 8లో తొలిసారిగా రూ. 7 కోట్లు గెలుచుకున్న సోదర ద్వయం అచిన్- సార్థక్‌లు తమ తల్లికి క్యాన్సర్‌కు చికిత్స చేయించారు. ఇప్పుడు ఇద్దరూ సొంతంగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. అదే సీజన్లో కోటి రూపాయలు గెలుచుకున్న మేఘా పటేల్ క్యాన్సర్ నుంచి బయటపడ్డారు. అనామిక(సామాజిక సేవ) అనామిక సామాజిక సేవ చేస్తుంటారు. ఆమె తన సంస్థ కోసం నిధులను సేకరించడానికి కేబీసీ 2017 సీజన్‌కు వచ్చారు. కోటి రూపాయలను తన ఎన్జీవో అభివృద్ధికి వినియోగించారు. బినితా జైన్(కోచింగ్ సెంటర్) అదే ఏడాది బినితా జైన్ కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఈ సొమ్ముతో కొంతమంది పిల్లలకు చదువు చెప్పించారు.. ఇప్పుడు కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అజిత్‌కుమార్ (జైలు సూపరింటెండెంట్) బీహార్‌లోని హాజీపూర్‌కు చెందిన అజిత్ కుమార్ 2018లో కోటి రూపాయలు గెలుచుకున్నాడు. షో ద్వారా వచ్చిన డబ్బుతో పునరావాస కేంద్రాన్ని ప్రారంభించాలన్నారు. ప్రస్తుతం జైలు సూపరింటెండెంట్‌గా ఉన్నారు. ఇంజనీర్ గౌతమ్(సీనియర్ సెక్షన్ ఇంజనీర్) అదే ఏడాది రైల్వేలో సీనియర్ ఇంజనీర్ అయిన గౌతమ్ కుమార్ ఝా కూడా కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఆయన భారతీయ రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు బబిత (కుక్) 2019లో కోటీశ్వరురాలు అయిన బబితా తాడే తన స్కూల్లో వంటమనిషిగా పనిచేస్తున్నారు. షోలో గెలిచిన డబ్బును తన పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేశారు. సనోజ్ కుమార్ (యూపీఎస్సీ కోసం సిద్ధం) అదే ఏడాది కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్న సనోజ్ కుమార్ ఇప్పుడు యూపీఎస్సీ కోసం సిద్ధమవుతున్నారు. నజియా నసీమ్(కమ్యూనికేషన్ మేనేజర్) కేబీసీ సీజన్- 12 మొదటి కోటీశ్వరురాలు నజియా నసీమ్. అప్పుడు ఆమె రాయల్ ఎన్ఫీల్డ్లో కమ్యూనికేషన్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మోహిత శర్మ (ఐపీఎస్ అధికారిణి) అదే సీజన్లో జమ్మూ కాశ్మీర్లో ఐపీఎస్ అధికారిణి మోహితా శర్మ కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఆమె భర్త కూడా ఐపీఎస్ అధికారి. హిమానీ బుందేలా, సాహిల్ ఆదిత్య అహిర్వార్, గీతా గౌర్ ఆగ్రాకు చెందిన హిమానీ బుందేలా కేబీసీ సీజన్ 13లో కోటి రూపాయలు గెలుచుకున్న మొదటి పోటీదారుగా నిలిచారు. అదే సీజన్లో సాహిల్ ఆదిత్య అహిర్వార్, గీతా గౌర్ కూడా కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఈ ముగ్గురు ఇప్పుడు ఏం చేస్తున్నానే సమాచారం అందుబాటులో లేదు. కవితా చావ్లా, శశ్వత్ గోయల్ సీజన్ 14లో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కి చెందిన కవితా చావ్లా కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఈ సీజన్లో ఢిల్లీకి చెందిన శశ్వత్ గోయల్ కూడా కోటి రూపాయలు గెలుచుకున్నాడు. అయితే ఆ తర్వాత రూ.7 కోట్లు అందించే ప్రశ్నకు తప్పుడు సమాధానం చెప్పారు. దీంతో చివరికి రూ.75 లక్షలతో ఇంటి ముఖంపట్టారు. ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని వణికించిన 10 భూకంపాలు -
సైబర్ దాడులు: సెబీ తాజా ఆదేశాలు
న్యూఢిల్లీ: అన్ని రకాల సైబర్ దాడులపై స్టాక్ బ్రోకర్లు, డిపాజిటరీ పార్టిసిపెంట్లు ఆరు గంటల్లోగా నివేదించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఆదేశించింది. సైబర్ దాడులు, బెదిరింపులు, అతిక్రమణల సంబంధిత సంఘటనలను గుర్తించిన ఆరు గంటల్లోగా సమాచారం అందించ వలసి ఉంటుందని తెలియజేసింది. ఇలాంటి ఘటనలపై నిర్దేశిత సమయంలోగా స్టాక్ ఎక్స్చేంజీలు, డిపాజిటరీలు, సెబీకి తెలియజేయవలసిందిగా ఆదేశించింది. అంతేకాకుండా ఇలాంటి అంశాలపై ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ–ఇన్)కు సంబంధిత మార్గదర్శకాలకు అనుగుణంగా సమయానుగుణంగా వెల్లడించవలసి ఉంటుందని తాజాగా జారీ చేసిన సర్క్యులర్‌లో సెబీ పేర్కొంది. వీటికి అదనంగా నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్(ఎన్సీఐఐపీసీ) రక్షణాత్మక వ్యవస్థగా గుర్తించిన స్టాక్ బ్రోకర్లు, డిపాజిటరీ పారి్టసిపెంట్లు సైతం సైబర్ దాడులు జరిగినప్పుడు వెంటనే స్పందించవలసి ఉంటుంది. ఎన్‌సీఐఐపీసీకి నివేదించవలసిందిగా సెబీ వివరించింది. పార్శ్వనాథ్‌కు చెక్ లిస్టింగ్ నిబంధనలు ఉల్లంఘించడంతో సెక్యూరిటీ మార్కెట్ల నుంచి రియల్టీ రంగ కంపెనీ పార్శ్వనాథ్ డెవలపర్స్‌ను సెబీ ఆరు నెలలపాటు నిషేధించింది. అంతేకాకుండా రూ. 15 లక్షల జరిమానా సైతం విధించింది. 45 రోజుల్లోగా పెనాల్టీని చెల్లించాల్సింది ఆదేశించింది. కాంట్రాక్టర్లు, సబ్‌కాంట్రాక్టర్ల లెడ్జర్ ఖాతాలలో ఔట్‌స్టాండింగ్ మొత్తాలపై ప్రొవిజన్లు చేపట్టడంలో వైఫల్యానికి సెబీ చర్యలు చేపట్టింది. కన్స్ట్రక్షన్ కాంట్రాక్టుల విషయంలో అకౌంటింగ్ ప్రమాణాలను పాటించకపోవడంపై కొరడా ఝళిపించింది. కోటక్ ఏఎంసీకి సెబీ జరిమానా ఎస్సెల్ గ్రూపు కంపెనీల పెట్టుబడుల కేసు ఎస్సెల్ గ్రూపు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో మ్యూచువల్ ఫండ్స్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కోటక్ ఏఎంసీ, సంస్థ ఉద్యోగులకు సెబీ రూ.1.6 కోట్ల పెనాల్టీలను విధించింది. కోటక్ ఏఎంసీ ఎండీ నీలేష్ షా, కోటక్ ఏఎంసీ ఫండ్ మేనేజర్లు లక్ష్మీ అయ్యర్, దీపక్ అగర్వాల్, అభిషేక్ బిసేన్, కాంప్లియన్స్ ఆఫీసర్ జాలీభట్, నాడు పెట్టుబడుల నిర్ణయాలను ఆమోదించిన ఇన్వెస్ట్ కమిటీ సభ్యుడు గౌరంగ్‌షాలను 45 రోజుల్లోగా పెనాల్టీ చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది. కోటక్ ఏఎంసీ ఆరు డెట్ పథకాల తరఫున ఎస్సెల్ గ్రూపు రుణ పత్రాల్లో పెట్టుబడులు పెట్టింది. వాటి గడువు 2019 ఏప్రిల్, మే నెలల్లో ముగిసింది. ఎస్సెల్ గ్రూపు పీకల్లోతు రుణ సంక్షోభంలో జారిపోవడంతో, ఆ గ్రూపు ప్రమోటర్లు, సంస్థలతో కోటక్ ఏఎంసీ ఒక ఒప్పందం చేసుకుంది. ఆయా సంస్థల రుణ పత్రాలకు 2019 సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. అప్పటివరకు ఆరు కోటక్ డెట్ పథకాల ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేయకపోవడాన్ని నిబంధనల ఉల్లంఘనగా సెబీ పరిగణించింది. -
‘అతన్ని ప్రేమిస్తే.. అందరికి చెప్తాను’
అతగాడితో ప్రేమలో పడితే తనే అందరికి చెబుతానని అంటోంది తమిళ నటి ఓవియ. ‘బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో’ ద్వారా బాగా ప్రచారం పొందిన నటి ఈ అమ్మడేనని చెప్పవచ్చు. తొలి చిత్రం ‘కలవాని’ విజయం సాధించినా ఆ తరువాత నటించిన చిత్రాలేవీ ఓవియ కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. అలాంటి తరుణంలో ‘బిగ్‌బాస్ గేమ్ షో’కు పిలుపొచ్చింది. అందులో పాల్గొన్న మరో నటుడు ఆరవ్తో ప్రేమ, వివాదం అంటూ వార్తల్లోకెక్కి బాగా ప్రచారం పొందింది ఓవియా. షో నుంచి బయటకు వచ్చిన తరువాత నటిగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. నటుడు, దర్శకుడు రాఘవలారెన్స్ తెరకెక్కిస్తున్న ‘కాంచన–3’లో ఓవియా, ఆయనతో జతకట్టింది. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా మార్చిలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ‘90 ఎంఎల్’ అనే మరో చిత్రంలోనూ ఓవియ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఓవియా నటుడు ఆరవ్తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందనే ప్రచారం జోరందుకుంది. ఈ సందర్భంగా ఓవియ ఒక ఆంగ్లపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఓవియా మాట్లాడుతూ.. ‘‘బిగ్‌బాస్ గేమ్ షో’లో పాల్గొనడం సంతోషకరం. ఆ తరువాత పలు సినీ అవకాశాలు వస్తున్నాయి. అందులో నచ్చిన కథలనే అంగీకరిస్తున్నాను. నా సినీ పయనాన్ని ఇతరులతో పోల్చడం నాకిష్టం లేదు. నేను తీసుకున్న నిర్ణయాలు నాకు సంతృప్తినిస్తున్నాయి. నటుడు ఆరవ్తో నన్ను కలిపి చాలా వదంతులు ప్రచారం అవుతున్న విషయం తెలుసు. అయితే మా ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి’ అన్నారు. అంతేకాక ‘మా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి చాలా అభిమానం ఉంది. దీన్ని స్నేహం అని చెప్పలేను. అందరూ అనుకున్నట్లు మా మధ్య ప్రేమ లాంటిది ఏమైనా పుడితే నేనే ఆ విషయం స్వయంగా అందరికీ చెబుతాను. ప్రస్తుతం మేం సినిమాల మీద దృష్టిపెడుతున్నాం. నేను ప్రస్తుతం ‘కలవాని–2’, ‘కాంచన–3’, ‘90 ఎంఎల్’ చిత్రాల్లో నటిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు ఓవియా. -
ప్రశ్నిస్తే పోలీసులతో దాడులు చేయిస్తారా?
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై అభ్యంతరాల గురించి మాట్లాడిన మాజీమంత్రి శ్రీధర్‌బాబుపై పోలీసులతో దాడులు చేయించారని, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి సమంజసమేనా.. అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రజాభిప్రాయ సేకరణలో టీఆర్ఎస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. రైతుల తరపున ప్రశ్నించడం చట్ట వ్యతిరేకమా, నేరమా.. అని భట్టి ప్రశ్నించారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ప్రజాస్వామికంగా ప్రశ్నించిన శ్రీధర్‌బాబును అరెస్టు చేయడం సరికాదని, దీనిని ఖండిస్తున్నామని భట్టి అన్నారు. శ్రీధర్‌బాబుకు టీఆర్ఎస్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
హరిత హారంలో పాల్గొన్న వెంకటేష్
-
చైనా నృత్యానికి గిన్నిస్ రికార్డు!
బీజింగ్ః వినూత్న కార్యక్రమాలు చేపట్టడంలోనూ, అందర్నీ ప్రత్యేకంగా ఆకర్షించడంలోనూ చైనా వాసులు ముందుంటారు. ప్రపంచ రికార్డులను సృష్టించడంలోనూ వారికి వారే సాటి. అదే నేపథ్యంలో ఇప్పుడు ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టి అందరినీ తమవైపు తిప్పుకున్నారు. కొన్ని వేలమంది ఒకే వేదికపై చేరి, నృత్య ప్రదర్శన చేసి ఏకంగా గిన్నిస్ రికార్డును సాధించారు. చైనా వాసుల దృష్టి ఈసారి నృత్యం వైపు మళ్ళింది. బీజింగ్, షాంఘైతోపాటు మరో నాలుగు నగరాలను ఎంచుకొని, ఒకేవేదికపైకి చేరడమే కాదు.... ఏకంగా 31,697 మంది ఒకేసారి నృత్య కార్యక్రమంలో పాల్గొని దాదాపు ఐదు నిమిషాల పాటు అడుగులు కలిపి అందర్నీ ముగ్ధుల్ని చేయడంతోపాటు ప్రపంచ రికార్డును సైతం సాధించారు. నగరంలోని ప్రముఖ బర్డ్స్ నెస్ట్ స్టేడియం ముందు చేరి పెద్దా చిన్నా వయోబేధం లేకుండా అంతా ఉత్సాహంగా పాల్గొన్న కార్యక్రమంలో సమయానికి వర్షం నేనున్నానంటూ వచ్చి చేరింది. దీంతో నృత్యకారులంతా రెయిన్ కోట్లు ధరించి మరీ డ్యాన్స్ చేయడం ప్రత్యేకాకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని దగ్గరే ఉండి పర్యవేక్షించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అధికారులు ధృవీకరణ పత్రాన్ని అందించారు. సాధారణంగా మధ్యవయసు, వయసు మళ్ళిన మహిళలు పార్కులు, ప్లాజాల వంటి పబ్లిక్ ప్లేసుల్లో నృత్యం చేస్తుండటం చైనాలో చూస్తాం. అయితే ఆరోగ్యానికి సహకరించేదిగా భావించి పబ్లిక్ ప్లేసుల్లో చేసే డ్యాన్స్... దానితో పాటు పెట్టే భారీగ మ్యూజిక్ సౌండ్ ఒక్కోసారి చుట్టుపక్కల వారిని ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఇప్పుడు వేలమంది స్థానికులు కలసి ఒకేచోట చేపట్టిన నృత్య కార్యక్రమం మాత్రం అందర్నీ ఆకట్టుకోవడమే కాక రికార్డును కూడ తెచ్చి పెట్టింది.