మహిళా మణులదే పైచేయి | women in upper hand | Sakshi
Sakshi News home page

మహిళా మణులదే పైచేయి

Published Tue, Jan 17 2017 2:06 AM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM

women in upper hand

 ఏలూరు (మెట్రో) : ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 15 నియోజకవర్గాల ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. గత ఏడాది జనవరి 1న తుది జాబితాను ప్రకటించగా.. 2017 సంవత్సరానికి సంబంధించిన జాబితాను సోమవారం ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో 2,30,177 మంది ఓటర్లు పెరిగారు. దీంతోపాటు ఈ ఏడాది 30,426 మంది మహిళా ఓటర్లు పెరిగారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో మహిళలే అగ్రస్థానంలో ఉన్నారు. 
 
వ్యత్యాసం ఇలా
గత ఏడాది జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 26,12,204 కాగా, అందులో 14,35,582 మంది పురుషులు ఉన్నారు. మహిళా ఓటర్లు 11,76,391 మంది. ఆ ఏడాది ఇతర ఓటర్లు (హిజ్రాలు) 231 మంది. ఈ ఏడాది మొత్తం ఓటర్లు 28,42,381 మంది కాగా, ఇందులో పురుషులు 14,04,958 మంది కాగా, మహిళలు 14,37,162 మంది. ఇతరుల జాబితాలో మరో 30 మంది పెరగ్గా, వారి సంఖ్య 261కు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఈ  ఏడాది 30,624 మంది పురుషు ఓటర్లు తగ్గారు. గత ఏడాదితో పోలిస్తే మహిళా ఓటర్ల సంఖ్య 2,60,771 పెరిగింది. చింతలపూడి నియోజకవర్గంలో అత్యధికంగా 2,35,379 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా నరసాపురంలో 1,52,489 మంది ఓటర్లు మాత్రమే నమోదయ్యారు. తణుకు నియోజకవర్గంలో ఇతరుల జాబితాలో ఒక్క ఓటరు కూడా నమోదుకాకపోగా, భీమవరం నియోజకవర్గంలో 103 ఇతరుల జాబితాలో తమ ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. 
 
నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలిలా 
నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు  మొత్తం
కొవ్వూరు 75,282 77,349 06 1,52,641
నిడదవోలు 89,826 91,794 18 1,81,638
ఆచంట 75,039 76,354 01 1,51,394
పాలకొల్లు 82,201 83,400 09 1,65,610
నరసాపురం 75,985 76,496 08 1,52,489
భీమవరం 1,08,452 1,11,954 103 2,20,509
ఉండి 96,655 97,528 16 1,94,199
తణుకు 1,01,233 1,06,329 00 2,07,562
తాడేపల్లిగూడెం 90,786 93,615 11 1,84,412
ఉంగుటూరు 88,907 89,191 09 1,78,107
దెందులూరు 96,082 97,677 07 1,93,766
ఏలూరు 90,935 97,276 24 1,88,235
గోపాలపురం 1,05,898 1,05,714 13 2,11,625
పోలవరం 1,10,304 1,14,497 14 2,24,815
చింతలపూడి 1,17,369 1,17,988 22 2,35,379
మొత్తం 14,64,958 14,37,162 261 28,42,381
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement