![Hamas Released 3 More Israelis Part Of Gaza Ceasefire Agreement](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/hamas.jpg.webp?itok=5PFDLscE)
గాజా: ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్‌కు చెందిన మరో ముగ్గురు బందీలను ఉగ్రవాద సంస్థ హమాస్ శనివారం(ఫిబ్రవరి15) విడుదల చేసింది. ముగ్గురు బందీలను రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. సాగుయ్ డెకెల్ చెన్ (36),అలెగ్జాండర్ ట్రుఫనోవ్ (29), యైర్ హార్న్(46)బందీలు హమాస్ చెర నుంచి బయటికి వచ్చారు. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ బందీల విడుదలను ఆలస్యం చేస్తున్నట్లు ఇటీవల హమాస్ ప్రకటించింది.
దీనిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా ఇజ్రాయెల్ సీరియస్‌గా తీసుకుంది.తమ బందీలను విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.ఈ బెదిరింపులకు భయపడ్డ హమాస్ బందీల విడుదలకు అంగీకరించింది. ముగ్గురు బందీల విడుదలకు ప్రతిగా ఇజ్రాయెల్ 369 మంది పాలస్తీనియన్ ఖైదీలను విడుదల చేసింది.
ఖతర్,ఈజిప్టు మధ్యవర్తిత్వంతో గత నెల ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా.. హమాస్ తమ చెరలోని 94 మంది బందీల్లో 33 మంది బందీలను విడుదల చేయనుంది.ప్రతిగా దాదాపు 1700 మందికిపైగా పాలస్తీనీయులను ఇజ్రాయెల్ విడిచిపెట్టనుంది. ఈ ఒప్పందంలో భాగంగా హమాస్ ఇప్పటివరకు 21 మంది ఖైదీలకు విముక్తి కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment