వాషింగ్టన్: పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థకు అమెరికా అధ్యకక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. తాను అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసే జనవరి 20కి ముందే హమాస్ తన వద్ద బందీలుగా ఉంచుకున్న ఇజ్రాయెల్ పౌరులను విడుదల చేయాలని కోరారు. లేదంటే హమాస్‌కు నరకం చూపిస్తానని సంచలన హెచ్చరిక చేశారు.
ఈ మేరకు ట్రంప్ తన సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌లో ఒక పోస్టు చేశారు.‘బందీల విడుదలవకపోతే అందుకు బాధ్యులపై చరిత్రలో ఇంతకుముందెన్నడు చూడని రీతిలో ఉక్కుపాదం మోపుతాం. వారిని వెంటనే విడుదల చేయండి’అని ట్రంప్ తన పోస్టులో హమాస్‌ను కోరారు.
గతేడాది అక్టోబర్7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులు వందల మందిని అత్యంత క్రూరంగా చంపారు. కొంత మందిని బందీలుగా తీసుకెళ్లారు.వారిలో ఇప్పటికి 100 మందిదాకా హమాస్ వద్దే ఉన్నారు. అక్కడ బందీగా ఉన్న అలెగ్జాండర్ అనే యువకుడు ఏడుస్తున్న వీడియోను హమాస్ తాజాగా రిలీజ్ చేసింది.ఈ వీడియో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment