hostages
-
హమాస్‌కు ట్రంప్ సీరియస్ వార్నింగ్
వాషింగ్టన్: పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థకు అమెరికా అధ్యకక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. తాను అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసే జనవరి 20కి ముందే హమాస్ తన వద్ద బందీలుగా ఉంచుకున్న ఇజ్రాయెల్ పౌరులను విడుదల చేయాలని కోరారు. లేదంటే హమాస్‌కు నరకం చూపిస్తానని సంచలన హెచ్చరిక చేశారు.ఈ మేరకు ట్రంప్ తన సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌లో ఒక పోస్టు చేశారు.‘బందీల విడుదలవకపోతే అందుకు బాధ్యులపై చరిత్రలో ఇంతకుముందెన్నడు చూడని రీతిలో ఉక్కుపాదం మోపుతాం. వారిని వెంటనే విడుదల చేయండి’అని ట్రంప్ తన పోస్టులో హమాస్‌ను కోరారు. గతేడాది అక్టోబర్7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులు వందల మందిని అత్యంత క్రూరంగా చంపారు. కొంత మందిని బందీలుగా తీసుకెళ్లారు.వారిలో ఇప్పటికి 100 మందిదాకా హమాస్ వద్దే ఉన్నారు. అక్కడ బందీగా ఉన్న అలెగ్జాండర్ అనే యువకుడు ఏడుస్తున్న వీడియోను హమాస్ తాజాగా రిలీజ్ చేసింది.ఈ వీడియో వైరల్‌గా మారింది. -
ఉగ్రవాదానికి చోటు లేదు: నెతన్యాహుతో ఫోన్లో ప్రధాని మోదీ
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో ఇటీవల పరిణామాలతో నెలకొన్న ఉద్రిక్త వాతావరణంపై నెతన్యాహుతో చర్చించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.‘పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఇటీవలి పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడాను. ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటులేదు. స్థానికంగా ఉద్రిక్తతలు తీవ్రతరం కాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు బందీలందరిని సురక్షితంగా విడుదల చేయడం చాలా ముఖ్యం. వీలైనంత త్వరగా శాంతి, స్థిరత్వాల పునరుద్ధరణ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి భారత్ కట్టుబడి ఉంది.’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.Spoke to Prime Minister @netanyahu about recent developments in West Asia. Terrorism has no place in our world. It is crucial to prevent regional escalation and ensure the safe release of all hostages. India is committed to supporting efforts for an early restoration of peace and…— Narendra Modi (@narendramodi) September 30, 2024ఇటీవల ఇజ్రాయెల్ లెబనాన్, హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా దాడులు తీవ్రతరం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లెబనాన్ రాజధాని బీరూట్‌పై జరిపిన దాడిలో హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా సహా కీలక కమాండర్లను హతమార్చింది.దాంతో హెజ్బొల్లాలో నాయకత్వ సంక్షోభం తలెత్తింది. మూడు దశాబ్దాల పైచిలుకు సారథ్యంలో సంస్థను తిరుగులేని సాయుధ శక్తిగా మార్చిన ఘనత నస్రల్లాది. ఆయన మృతితో ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఎదురవుతున్న పెను దాడులను కాచుకుంటూ కష్టకాలంలో సంస్థను ముందుండి నడిపేది ఎవరన్నది పెద్ద ప్రశ్నగా మారింది. కొత్త సారథిగా నస్రల్లాకు వరుసకు సోదరుడయ్యే హషీం సైఫుద్దీన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. -
భగ్గుమన్న ఇజ్రాయెల్.. ప్రధాని నెతన్యాహూ క్షమాపణలు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. గాజాలోని సొరంగంలో లభ్యమైన ఆరుగురు ఇజ్రాయెల్ బందీలను సురక్షితంగా తిరిగి తీసుకురావడంలో విఫలమైనందుకు బెంజమిన్ సోమవారం క్షమాపణలు కోరారు. ‘బందీలను సజీవంగా తిరిగి తీసుకురానందుకు నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. మేము ప్రయత్నించాం కానీవిజయం సాధించలేదు. దీనికి హమాస్ చాలా భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది.’ అని నెతన్యాహు విలేకరుల సమావేశంలో చెప్పారు.కాగా శనివారం గాజాలోని రఫా ప్రాతంలోని భూగర్భ సొరంగంలో ఆరుగురు ఇజ్రాయిల్ బందీల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు ఆదేశ సైన్యం ప్రకటించిన విషయం తెలిసిందే.మృతదేహాలు గాజా సరిహద్దు సమీపంలోని కిబ్బట్జ్ కమ్యూనిటీకి చెందిన కార్మెల్ గాట్, ఈడెన్ యెరుషల్మి, అల్మోగ్ సరుసి, ఒరి డానినో, యుఎస్-ఇజ్రాయెలీ హెర్ష్ గోల్డ్బెర్గ్-పోలిన్, రష్యన్-ఇజ్రాయెలీ అలెగ్జాండర్ లోబనోవ్గా గుర్తించారు. వీరిని అక్టోబర్ 7న మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి కిడ్నాప్ చేసిన హమాస్ ఉగ్రవాదులు బందీలుగా చేశారు.హమాస్ చెరలోని ఆరుగురు బందీల మృతదేహాలు రఫాలోని ఓ సొరంగంలో లభ్యం కావడంతో నెతన్యాహు ప్రభుత్వంపై ఇజ్రాయెల్ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది. ప్రధానికి వ్యతిరేకంగా సోమవారం ఇజ్రాయెల్‌లో భారీ ప్రదర్శనలు జరిగాయి. కాల్పుల విరమణకు అంగీకరించాలని, హమాస్ చెరలోని బందీలను సురక్షితంగా రప్పించాలని డిమాండ్ చేస్తూ టెల్ అవీవ్ వీధుల్లో ఆందోళనకారులు కదం తొక్కారు. తమ ఆప్తులు 11నెలల నుంచి బందీలుగా ఉన్నప్పటికీ వారిని వెనక్కు తేవడంలో నెతన్యాహు విఫలమయ్యారంటూ ఆరోపించారు.ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలకు బదులుగా హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారిని విడుదల చేసేలా కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా, ఈజిప్ట్, ఖతార్‌కు చెందిన మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోవడానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుయే కారణమన్న కోణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ.. హమాస్‌తో బందీల విడుదల ఒప్పందం, కాల్పుల విరమణ కోసం నెతన్యాహు తగినంతగా పనిచేయడం లేదని అన్నారు. -
ఇజ్రాయెల్‌లో సార్వత్రిక సమ్మె
టెల్ అవీవ్: హమాస్ చెరలో ఉన్న ఆరుగురు బందీల దారుణ హత్యపై ఇజ్రాయెలీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బందీలను సురక్షితంగా విడిపించడంలో బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం విఫలమైందంటూ సోమవారం ఇజ్రాయెల్ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరిగింది. కారి్మక సంఘాల పిలుపు మేరకు బ్యాంకులు, ఆరోగ్య విభాగాలు, రవాణా సంస్థలు సహా చాలా వరకు మూతబడ్డాయి. కొన్ని ప్రాంతాల్లోని స్కూళ్లు కొద్దిసేపు మాత్రమే పనిచేశాయి. ప్రధానమైన బెన్ గురియెన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 8–10 గంటల మధ్య టేకాఫ్ సేవలు నిలిచిపోయాయి. వేలాదిగా పౌరులు వీధుల్లోకి వచ్చారు. టెల్అవీవ్తోపాటు దేశవ్యాప్తంగా జరిగిన ర్యాలీల్లో కనీసం 5 లక్షల మంది పాలుపంచుకున్నారు. హమాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్న పక్షంలో వారంతా సురక్షితంగా వెనక్కి వచ్చి ఉండేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ బందీలుగా ఉన్న 100 మందిని వెనక్కి తీసుకువచ్చేందుకు వెంటనే హమాస్‌తో ఒప్పందం చేసుకోవాలన్నారు. అయితే, సమ్మె రాజకీయ ప్రేరేపితమంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై కారి్మక న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. సమ్మెను మధ్యాహ్నం 2.30 గంటలకల్లా ముగించాలని స్పష్టం చేసింది. కోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తామని దేశంలోని అతిపెద్ద కారి్మక సంఘం హిస్ట్రాదుట్ నేత అర్నాన్ బ్రార్ డేవిడ్ తెలిపారు. తమ వారిని వెంటనే విధుల్లోకి చేరాలని కోరారు. సమ్మె కారణంగా ప్రధాన సేవలకు అంతరాయం ఏర్పడలేదని వివరించారు. ఒప్పందానికి నెతన్యాహు సానుకూలంగా లేరు: బైడెన్ ఇజ్రాయెల్‌లో పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హమాస్‌తో ఒప్పందం కుదుర్చుకుని, బందీలను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆసక్తి చూపడం లేదన్నారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై సలహాదారులతో వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశానికి హాజరైన అధ్యక్షుడు బైడెన్ మీడియాతో మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందానికి అతి చేరువలో ఉన్నామన్నారు. -
గాజా సొరంగంలో ఇజ్రాయెల్ బంధీల మృతదేహాలు
దక్షిణ గాజాలోని రఫా ప్రాంతంలో ఓ సొరంగంలో ఆరుగురి బంధీల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. గతేడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు వీరిని బంధీలు గాజా తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. కార్మెల్ గాట్, ఈడెన్ యెరుషల్మి, హెర్ష్ గోల్డ్బెర్గ్-పోలిన్, అలెగ్జాండర్ లోబనోవ్, అల్మోగ్ సరుసి, ఒరి డానినో మృతదేహాలను ఇజ్రాయెల్‌కు తీసుకువచ్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది. వీరు తాము స్వాధీనం చేసుకునే కొంత సమయం ముందు హమాస్ మిలిటెంట్ల చేతిలో దారుణంగా హత్యకు గురైనట్లు ఆర్మీ ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు. దక్షిణ గాజాలోని భూగర్భ సొరంగం నుంచి 52 ఏళ్ల ఇజ్రాయెల్ బంధీ ఖైద్ ఫర్హాన్ అల్కాడిని సైన్యం రక్షించి వారం రోజులు గడవక ముందే ఒకేసారి ఆరుగురి మృతి దేహాలను స్వాధీనం చేసుకోవటం గమనార్హం. ఈ ఆరుగురిలో ఇజ్రాయెలీ-అమెరికన్ హెర్ష్ గోల్డ్బెర్గ్-పోలిన్ అన్నారు. గోల్డ్బెర్గ్ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు రోజు.. గాజా యుద్ధాన్ని ముగించాలని బైడెన్ పిలుపునిచ్చారు. బందీల విడుదల, విధ్వంసమైన గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణ కోసం పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్‌తో కొనసాగుతున్న చర్చలపై ఆశాభావం వ్యక్తం చేశారు.‘ గాజా ఒప్పందాన్ని ముగించగలమని భావిస్తున్నాం. ఇరువురు సంబంధిత ఒప్పందాలను అంగీకరిస్తున్నట్లు చెప్పారాయన.ఇదిలాఉండగా.. గతేడాది అక్టోబర్ 7 నుంచి గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో 40,691 మంది మరణించగా.. 94,060 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇజ్రాయెల్ లెక్కల ప్రకారం.. హమాస్ మిలిటెంట్ గ్రూప్ చేసిన 1,200 మందిని మృతి చెందగా.. 250 మందిని బందీలుగా గాజాకు తీసుకువెళ్లారు. -
ఇజ్రాయెల్ హీరో? ఎవరీ అర్నాన్ జమోరా
హమాస్ చెరలో బంధీలుగా ఉన్న నలుగురు ఇజ్రాయెల్ పౌరులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ కఠినమైన ఆపరేషన్‌ను విజయవంతం చేసేందుకు ఐడీఎఫ్ కమాండర్ అర్నాన్ జమోరా ప్రాణాల్ని ఫణంగా పెట్టారు. హమాస్ మెరుపు దాడుల నుంచి విరోచిత పోరాటం చేసి ప్రాణాలొదిన అర్నాన్ జమెరాను ఇజ్రాయెల్ ప్రభుత్వంతో పాటు ఆ దేశ పౌరులు హీరోగా కీర్తిస్తున్నారు. శనివారం హమాస్ చెరలో బందీలుగా ఉన్న నావో అర్గమణి, అల్మోగ్ మీర్ జాన్, ఆండ్రీ కోజ్లోవ్, ష్లోమి జివ్‌లను ఇజ్రాయెల్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం యూనిట్ (యమమ్)కమాండర్, టాటికల్ ఆపరేటర్ అర్నాన్ జమోరా నుసిరత్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టి వారిని రక్షించారు. ఈ తరుణంలో ప్రత్యర్ధుల దాడిలో కమాండర్ అర్నాన్ జమెరా ప్రాణాలొదారు. తాజాగా, ఆయన మరణంపై ఇజ్రాయెల్ మరణంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ విచారం వ్యక్తం చేసింది.Behind every rescue mission, are Israeli men and women who risk their lives. We are devastated to share that Chief Inspector Arnon Zamora, commander and tactical operator in the Yamam (National Police Counter-Terrorism Unit), who was critically wounded in the operation to… pic.twitter.com/4P3qRre7Ia— Israel Foreign Ministry (@IsraelMFA) June 8, 2024బాధకలిగించిందిప్రతి రెస్క్యూ ఆపరేషన్‌లో ఇజ్రాయెల్ సైనికులు తమ ప్రాణాల్ని ఫణంగా పెడుతున్నారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల్ని రక్షించే క్రమంలో తీవ్రంగా గాయపడిన యమమ్ (నేషనల్ పోలీస్ కౌంటర్-టెర్రరిజం యూనిట్)లో కమాండర్,టాక్టికల్ ఆపరేటర్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆర్నాన్ జమోరా ప్రాణాలొదలడం బాధకలిగించిందని ఇజ్రాయెల్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్వీట్లో పేర్కొంది.అర్నాన్ జమోరా ఎవరు?ఇజ్రాయెల్ మీడియా సంస్థ హారెట్జ్ ప్రకారం..ఇజ్రాయెల్ నగరం స్డెరోట్ సమీపంలో జమోరా స్డే డేవిడ్ గ్రామానికి చెందిన వారు. ఆయనకు భార్య మిచాల్ ఇద్దరు పిల్లలు, అతని తల్లిదండ్రులు రూవెన్ రూతీలతో కలిసి ఉంటున్నారు.ఇక జమెరా గతేడాది అక్టోబర్ 7 న యాద్ మొర్దెచాయ్ ప్రాంతంలో అనేక మంది హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ జామెరా ధైర్య సహాసాల్ని గుర్తు చేసుకున్నారు. గాజాలో హమాస్ చేతిలో ఉన్న 4 మంది బందీలను రక్షించడానికి సాహసోపేతమైన ఆపరేషన్‌కు నాయకత్వం వహించిన అర్నాన్ జమోరా మృతిపై విచారం వ్యక్తం చేశారు. -
హమాస్ చెరలో ఇజ్రాయెల్ మహిళా సైనికులు! వీడియో విడుదల
హమాస్ మిలిటెంట్లు గతేడాడి అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించగా.. హమాస్ మిలిటెంట్లు 250 ఇజ్రాయల్ పౌరులను బంధీలుగా తీసుకువెళ్లారు. అయితే దాడి అనంతరం హమాస్ మిలిటెంట్లు సరిహద్దులో ఉన్న ఐదుగురు ఇజ్రాయల్ మహిళా సైనికులను బంధీలుగా తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియోను ‘బంధీల కుటుంబ ఫోరం’ విడుదల చేసింది.ఆ వీడియోలో నహల్ ఓజ్ బేస్ వద్ద విధలు నిర్వహిస్తున్న ఇజ్రాయెల్ మహిళా సైనికులు.. లిరి అల్బాగ్, కరీనా అరివ్, అగామ్ బెర్గర్, డానియెల్లా గిల్బోవా, నామా లెవీ తెలుస్తోంది. మహిళా సైనికులు గాయాలతో, వారి చేతులు కట్టేసి ఉండటం ఆ వీడియో దృశ్యాల్లో కనిపిస్తోంది. అందులో ఒక హమాస్ మిలిటెంట్.. ఇజ్రాయెల్ మహిళా సైనికులను ఉద్దేశిస్తూ మీరంతా అమ్మాయిలు, మహిళలు. మీరు గర్భవతులు అవుతారు’అని అన్నాడు. మరో మిలిటెంట్ ‘నువ్వు ఎంతో అందంగా ఉన్నావు’అని అన్నాడు."No You're NOT beautiful" Hamas taunts female IDF terrorists. Here's the part of the video Israel miss-translate to claim he said she was "So beautiful" God their desperation is CRINGE. pic.twitter.com/Iv3U1W3Jbi— Syrian Girl 🇸🇾 (@Partisangirl) May 23, 2024 అందులో ఓ సైనికురాలు మాట్లాడుతూ.. ‘నాకు పాలస్తీనాలో స్నేహితులు ఉన్నారు’అని అన్నారు. దీంతో వెంటనే స్పందించిన ఓ మిలిటెంట్.. ‘ మా సోదరులు ప్రాణాలు కోల్పోడానికి కారణం మీరే. మిమ్మల్ని మేము కాల్చేస్తాం’అని అన్నాడు. ఈ వీడియోను విడుదల చేసిన ‘బంధీల కుటుంబ ఫోరం’ హమాస్ చెరలో ఉన్న బంధీలను వెంటెనే విడిపించాలని ప్రధాని బెంజమిన్ నెతన్యాహును డిమాండ్ చేస్తున్నారు.ఇజ్రాయెల్ మహిళా సైనికులు ఇంకా హమాస్ చెరలోనే ఉన్నారు. వారిలో చెరలో ఉన్న బంధీలను స్వదేశానికి రప్పించటంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలవండని ప్రభుత్వ అధికార ప్రతినిధి డేవిడ్ మెన్సెర్ అన్నారు. ఇక.. ఈ వీడియోపై హమాస్ మిలిటెంట్లు స్పందించారు. ‘ఇజ్రాయెల్ విడుదల చేసిన వీడియో నిజం కాదు. ఇజ్రాయెల్ కల్పిత కథనాల ప్రచారం. మహిళా సైనికులతో తప్పుగా ప్రవర్తించలేదు’అని వివరణ ఇచ్చారు. -
గాజాలో ముగ్గురి ఇజ్రాయెల్ బంధీల మృతదేహాలు స్వాధీనం
గాజాలో హమాస్ మిలిటెంట్లలను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తోంది. తాజాగా శుక్రవారం అర్ధరాత్రి వరకు ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో ముగ్గురు బంధీల మృత దేహాలను స్వాధీనం చేసుకుంది. ఈ విషయన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఆర్మీ(ఐడీఎఫ్) ఓ ప్రకటనలో వెల్లడించింది.‘అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడిన చేసిన సమయంలో షానీ లౌక్, అమిత్ బుస్కిలా , ఇత్జాక్ గెలెరెంటర్ సూపర్నోవా మ్యూజిక్ ఫెస్టివల్ పాల్గోన్నారు. ఆ సమయంలో దాడికి దిగిన హమాస్ మిలిటెంట్లు వారిని చంపేసి.. మృతదేహాను తమతో పాటు గాజాకు తీసుకెళ్లారు’ అని ఐడీఎప్ అధికార ప్రతినిధి అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు.‘గాజా స్ట్రిప్‌లో భీకరమైన దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల బంధీలను తిరిగి తీసుకురావటమే ప్రధానమైన లక్ష్యంగా ప్రతి ఐడీఎఫ్ ప్రతి కమాండర్, సైనికుడు యుద్ధరంగంలో పోరాడుతున్నారు. ఇజ్రాయెల్ సేనలు సురక్షితంగానే ఉన్నాయి. ఆర్మీపై పుకార్లు వ్యాప్తి చేయవద్దని ప్రజలను కోరారు. నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మేము బంధీల కుటుంబాలకు సమాచారం అందిస్తాం. అర్వాత ప్రజలకు తెలియజేస్తాం’ అని డేనియల్ హగారి పేర్కొన్నారు. ఇక.. ఇజ్రాయెల్ సైన్యం గాజాపై చేస్తున్న దాడిలో ఇప్పటివరకు 35, 272 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. -
ఐదు గంటలపాటు విమానంలోనే..
ముంబై: సాంకేతిక సమస్యతో ముంబై ఎయిర్‌పోర్టులో నిలిచిపోయిన ఎయిర్ మారిషస్ విమానంలో సుమారు 200 మంది ప్రయాణికులు ఐదు గంటల పాటు బందీలుగా మారారు. చివరికి ఆ విమానాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎయిర్ మారిషస్‌కు చెందిన ఎంకే 749 విమానం శనివారం ఉదయం 4.30 గంటలకు ముంబై విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకోవాల్సి ఉంది. బయలుదేరాల్సిన సమయానికి విమానంలో సమస్య గుర్తించారు. నిపుణులొచ్చి లోపాన్ని సరిచేసినా, ఫలితం లేకపోయింది. చివరికి ఉదయం 10 గంటల సమయంలో సర్వీసును రద్దు చేస్తున్నట్లు పైలట్ ప్రకటించారని బాధిత ప్రయాణికులు చెప్పారు. ఐదు గంటలపాటు తమను కిందికి కూడా దిగనివ్వలేదన్నారు. ఏసీ సరిగ్గా పనిచేయక ఆరోగ్య సమస్యలున్న వారు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని చెప్పారు. ఈ ఘటనపై ఎయిర్ మారిషస్ స్పందించలేదు. -
ఫలించిన నిరీక్షణ
సిరిసిల్ల: 18 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. దుబాయ్ జైల్లో బందీలుగా ఉన్న ఇద్దరు విడుదలై ఇల్లు చేరా రు. చాలాకాలానికి ఇల్లు చేరిన వారిని చూసి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. 2005 లో దుబాయ్ వెళ్లిన వలసజీవులు.. అక్కడ హత్య కేసులో ఇరు క్కుని 18 ఏళ్లపాటు శిక్ష అనుభవించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా సిరిసిల్ల శివారులోని పెద్దూరు ఒడ్డెరకాలనీకి చెందిన శివరాత్రి మల్లేశం(48), శివరాత్రి రవి (45) బుధవారం ఇంటికి వచ్చారు. వీరు దుబాయ్‌లో కల్లీవెల్లి వీసా(కంపెనీ వీసా కాదు)పై పనిచేశారు. 2006లో దుబాయ్‌లో నేపాల్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు హత్య కేసులో నలుగురు పాకిస్తానీయులు, ఆరుగురు తెలంగాణవాసులకు అక్కడి కోర్టు శిక్ష విధించింది. జైలు శిక్ష పూర్తి చేసుకున్న నలుగురు పాకిస్తానీయు లు, కరీంనగర్ జిల్లాకు చెందిన సయ్యద్ కరీం ఇప్పటికే విడుదలయ్యారు. సిరిసిల్లకు చెందిన మల్లేశం, రవి, కోనరావుపేటకు చెందిన లక్ష్మణ్, జగిత్యాల జిల్లాకు చెందిన శివరాత్రి హన్మంతు, చందుర్తి మండలం మల్యాలకు చెందిన నాంపల్లి వెంకటి జైలు శిక్షను పొడిగించడంతో బందీలుగా ఉన్నారు. వీరిలో లక్ష్మణ్, హన్మంతు ఇటీవల విడుదలకాగా.. తాజాగా మల్లేశం, రవి విడుదలయ్యారు. వెంకటి మరో నెల రోజుల్లో విడుదల కానున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ వీరి విడుదల కోసం ఎంతో కృషిచేశారు. మ ల్లేశం, రవికి విమాన టికెట్లు, హైదరాబాద్ నుంచి పెద్దూ రు చేరేందుకు వాహనాన్ని కేటీఆర్ ఏర్పాటు చేశారు. మల్లేశం, రవి కుటుంబ సభ్యులతో అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ ఫోన్లో మాట్లా డారు. బాధితుల కుటుంబ సభ్యులు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
Israel-Hamas war: 25,000 దాటిన గాజా మృతులు
రఫా(గాజా స్ట్రిప్): తమతమ మతసంబంధ పవిత్ర ప్రాంతాలపై పట్టు కోసం ఘర్షణలతో మొదలై మెరుపు దాడులతో తీవ్రతరమై మహోగ్రరూపం దాలి్చన హమాస్– ఇజ్రాయెల్ పోరు పాతికవేల ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. మరోవైపు వంద మందికిపైగా బందీలను విడిపించుకున్నాసరే అందర్నీ విడిపిస్తామని, హమాస్ సభ్యులందర్నీ హతమారుస్తామని ఇజ్రాయెల్ సేనల ప్రతినబూనడం చూస్తుంటే యుద్ధ బాధితులు, మరణాల సంఖ్య ఇక్కడితో ఆగేలా లేదు. యుద్ధం ఇంకొన్ని నెలలపాటు కొనసాగుతుందని ఇజ్రాయెల్ సైన్యాధికారులు తాజాగా ప్రకటించారు. ఇన్ని నెలలు గడుస్తున్నా ఇంకా బందీలను విడిపించలేకపోవడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వంపై స్థానికంగా పెద్ద ఎత్తున విమర్శలు, నిరసనలు ప్రదర్శలు పెరిగాయి. -
పార్లమెంట్లో నెతన్యాహుకి చేదు అనుభవం!
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజిమన్ నెతన్యాహూకి పార్లమెంట్ సాక్షిగా చేదు అనుభవం ఎదురైంది. నెతన్యాహూ ప్రసంగిస్తున్న వేళ.. గాజాలో హమాస్ బందీలుగా ఉన్న వాళ్ల కుటుంబీకులు తమ నిరసన గళాలతో పార్లమెంట్‌ను హోరెత్తించారు. తమ వాళ్లను భద్రంగా తీసుకొస్తామని ఇచ్చిన వాగ్దానం ఏమైందని నిలదీశారు వాళ్లు. సోమవారం ఇజ్రాయెల్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశం జరిగింది. ప్రధాని నెతన్యాహు ప్రసంగం జరుగుతున్న టైంలో.. కుటుంబ సభ్యులు ఫ్లకార్డులపై బందీల ఫొటోలు, పేర్లను చూపిస్తూ నినాదాలు చేశారు. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను వెనక్కి రప్పించిన నెతన్యాహూ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశారు వాళ్లు. నెతన్యాహు ప్రసంగిస్తూ సమయంలో నెస్సెట్ గ్యాలరీలో కూర్చున్న బందీల కుటుంబీకులు లేని నిలబడ్డారు .. ‘‘ సమయం లేదు.. ఇప్పుడే, ఇప్పుడే.. అంటూ గట్టిగా గట్టిగా నినాదాలు చేశారు. అయితే నెతన్యాహూ వాళ్లకు సున్నితంగా సర్దిచెప్పే యత్నం చేశారు. మన బిడ్డలు ఊరికనే చనిపోవడం లేదు. మన దేశ నాశనం కోరుకుంటున్న శత్రువులపై విజయం సాధించేంతవరకు ఈ ప్రయత్నం ఆపకూడదంటూ వ్యాఖ్యానించారు. الأمور مولعة خالص داخل كيان العدو الصهيوني.. - عائلات الأسرى الإسرائيليين تقاطع نتنياهو خلال جلسة الكنيست صارخة "لا وقت.. الآن الآن" - إقالة قائد الكتيبة 51 من لواء غولاني بعد تعريضه جنودا للخطر في الشجاعية. - وأخر شي وأسخن شي.. نتنياهو يمنع غالانت من إجراء مباحثات فردية مع… pic.twitter.com/MeQoH3d8Xt — أجيج (@1b2_r) December 25, 2023 అయితే అప్పటికీ బందీల కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గలేదు. ఇంకా గట్టిగా నినాదాలు చేశారు. మా వాళ్లను సురక్షితంగా వెనక్కి మీరు తీసుకొస్తారని నమ్మాం. 80 రోజులు.. ప్రతీ క్షణం నరకంగా గడిపాం. ఇదే మీ కూతురో, కొడుకుకో అయి ఉంటే ఇలాగే ఉంటారా? అంటూ ప్రశ్నించారు. దానికి ప్రధాని నెతన్యాహూ స్పందిస్తూ.. బందీల విడుదల కోసమంటూ చేయని ప్రయత్నమేదీ లేదని వివరించే యత్నం చేశారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి బందీల కుటుంబాలతో తాను వ్యక్తిగతంగా మాట్లాడనంటూ గుర్తు చేశారాయన. అందరినీ సురక్షితంగా విడిపించేంతవరకు సంయమనం పాటించాలని కోరారాయన. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం గాజాలో హమాస్ చెరలో 129 మంది బందీలుగా ఉన్నారు. ఇందులో 22 మంది మరణించగా.. వాళ్ల మృతదేహాలు కూడా బంధువుల్ని చేరలేదు. అక్టోబర్ 7వ తేదీన ఇరు దేశాల మధ్య మొదలైన యుద్ధం.. వేల మందిని బలి తీసుకుంది. ఇజ్రాయెల్ తరఫున 1,200 మంది మరణించగా, హమాస్ ఆధీనంలో ఉన్న గాజాలో 20 వేల మంది దాకా మరణించినట్లు తెలుస్తోంది. -
హమాస్ టన్నెల్లో మృతదేహాలు.. బయటకు తీసిన ఐడీఎఫ్
హమాస్ మిలిటెంట్ల భరతం పట్టడమే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై వైమానిక, భూతల దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం. ఆదివారం హమాస్ చేతిలో బంధించబడి చంపబడిన ఐదు ఇజ్రాయెల్ బంధీల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) పేర్కొంది. హమాస్ ఏర్పాటు చేసుకున్న సొరంగాల నుంచి ఇజ్రాయెల్ బంధీల మృతదేహాలను ఐడీఎఫ్ సేనలు వెలికి తీశాయి. దీనికి సంబంధించిన వీడియోను ఐడీఎఫ్ ఎక్స్( ట్వీటర్)లో పోస్ట్ చేసింది. ‘ఇంటలిజెన్స్ సాయంతో ఐడీఎఫ్ బలగాలు ఆక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు బంధీలుగా తీసుకువెళ్లిన ఐదుగురు ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలను హమాస్ సొరంగం నుంచి బయటకు తీశామని’ అని ఐడీఎఫ్ వెల్లడించింది. బయటకు తీసిన మృతదేహాలు.. జివ్ దాడో, ఎస్జీటీ రాన్ షెర్మాన్, సీపీఎల్ నిక్ బీజర్,ఈడెన్ జకారియా, ఎలియా తోలెడానోగా ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. జివ్ దాదో(36) ఇజ్రాయెల్ సైనికుడని, ఈడెన్ జకారియా(27) సౌత్ ఇజ్రాయెల్‌లో జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్‌కు హాజరైన ప్రేక్షుడని తెలిపారు. In a centralized intelligence effort, IDF troops located and recovered the bodies of 5 hostages—abducted during the October 7 Massacre—and brought them back to Israel: 🕯️WO Ziv Dado 🕯️SGT Ron Sherman 🕯️CPL Nik Beizer 🕯️Eden Zacharia 🕯️Elia Toledano May their memory be a… pic.twitter.com/tq1UlLo8Z2 — Israel Defense Forces (@IDF) December 24, 2023 శుక్రవారం, శనివారం హమాస్ మిలిటెంట్ల ఎదురుదాడిలో 14 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఈ యుద్ధంలో ఇప్పటివరకు మృతిచెందిన ఇజ్రాయెల్ సైనికుల సంఖ్య 153కు చేరింది. -
బందీలపై కాల్పులు!
రఫా(గాజా స్ట్రిప్): కదనరంగంలో తమను దీటుగా ఎదిరించే సత్తా హమాస్ సాయుధులకు లేదని అతివిశ్వాసంతో ఉన్న ఇజ్రాయెల్ సేనలు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో ముగ్గురు అమాయక బందీలు బలైపోయారు. హమాస్ మిలిటెంట్లుగా భావించి వారిని హతమార్చామని ఇజ్రాయెల్ సైన్యం తర్వాత తీరిగ్గా చెప్పింది. ఉత్తరగాజాలోని షెజాయా పట్టణంలో హమాస్ మిలిటెంట్లుగా భావించి వారిపై కాల్పులు జరిపామని ఇజ్రాయెల్ సైన్యం(ఐడీఎఫ్) అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ చెప్పారు. దాడి వివరాలను మరో ఉన్నతాధికారి వెల్లడించారు. ‘ ఇజ్రాయెల్ దాడికి భయపడి ఈ ముగ్గురినీ బంధించిన హమాస్ మిలిటెంట్లు అక్కడి నుంచి పారిపోయారు. దీంతో ఈ ముగ్గురు బందీలు చొక్కాలు విప్పేసి తెల్ల జెండాలు ఊపుతూ భవనం బయటకు వచ్చారు. అయినాసరే సైన్యం వీరిపైకి తుపాకీ గుళ్ల వర్షం కురిపించింది. దీంతో ఇద్దరు మరణించారు. మూడో వ్యక్తి ప్రాణభయంతో మళ్లీ భవంతిలోపలికి ఏడుస్తూ పరుగెత్తాడు. అయినాసరే సైన్యం కాల్పులు జరపడంతో అతనూ మరణించాడు’’ అని సైన్యాధికారి ఒకరు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని ఇజ్రాయెల్‌కు చెందిన యోటమ్ హైమ్(28), సమీర్ తలాల్కా(22), అలోన్ షామ్రిజ్(26)గా గుర్తించారు. ఈ ఘటనపై దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. -
పొరపాటున ముగ్గురు బందీలను చంపిన ఇజ్రాయెల్ సైన్యం
టెల్ అవీవ్: హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తోంది. ఇదే వరసలో ఉగ్రవాదులుగా భావించి హమాస్ చెరలో బందీలుగా ఉన్న ముగ్గురు వ్యక్తులను ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) కాల్చి చంపింది. షజయాలో జరుగుతున్న దాడుల్లో పొరపాటున ముగ్గురు బందీలపై కాల్పులు జరిపగా.. వారు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైనికాధికారులు తెలిపారు. ఈ ఘటనపై తాము కూడా విచారం వ్యక్తం చేస్తున్నట్లు సైన్యం పేర్కొంది. మరోమారు ఈ తప్పిదం జరగకుండా జాగ్రత్త పడతామని తెలిపింది. ప్రాణాలు కోల్పోయినవారిలో ఒకరు ఇజ్రాయెల్‌లోని కెఫర్ అజా ప్రాంతం వ్యక్తిగా గుర్తించగా.. మరో వ్యక్తి యోటమ్ హైమ్ ప్రాంతవారని పేర్కొన్నారు. మూడో వ్యక్తి వివరాలను బాధితుని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు గోప్యంగా ఉంచింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభం అయింది. నాటి నుంచి యుద్ధం భీకరంగా నడుస్తోంది. ఇరువైపుల నుంచి భారీ స్థాయిలో నష్టం జరిగింది. హమాస్‌ను అంతం చేసే దిశగా ఇజ్రాయెల్ ముందుకు వెళుతోంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ వైపు 1200 మంది బలయ్యారు. అటు.. హమాస్ వైపు 18,700 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. రెండు మెట్రో రైళ్లు ఢీ -
ఇజ్రాయెల్-హమాస్ సంధిపై బైడెన్ కీలక వ్యాఖ్యలు
న్యూయార్క్: హమాస్-ఇజ్రాయెల్ మధ్య సంధి కుదరడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అంగీకరించిన కాల్పుల విరమణను పొడిగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. హమాస్ చెరలో ఉన్న బందీలు విడదల కావడంపై స్పందిస్తూ.. ఇది ప్రారంభం మాత్రమే అని అన్నారు. తమ చెరలో ఉన్న 24 మంది బందీలను హమాస్ విడిచిపెట్టింది. వీరిలో 13 మంది ఇజ్రాయెల్ పౌరులు, 10 మంది థాయ్‌లాండ్ పౌరులు, ఒకరు ఫిలిప్పైన్స్ పౌరుడు ఉన్నారు. విడుదలైన బందీలంతా ఆరోగ్యంగానే కనిపిస్తున్నారని ఇజ్రాయెల్ వైద్య శాఖ తెలియజేసింది. కాగా.. నేడు మరో దఫా బందీలను హమాస్ విడుదల చేయనున్నట్లు సమాచారం. హమాస్ డిమాండ్‌ను నెరవేరుస్తూ ఇజ్రాయెల్ కూడా మొదటి దశలో 39 పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిందని సమాచారం. ఇజ్రాయెల్-హమాస్ మధ్య అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభం అయింది. హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ గాజాపై దూకుడుగా ప్రవర్తించింది. గాజాను ఖాలీ చేయించింది. స్వతంత్ర్య పాలస్తీనాను నినదిస్తూ పశ్చిమాసియా దేశాలు ఏకమయ్యాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ రంగంలోకి దిగారు. ఇరుదేశాలు కాల్పుల విరమణ అంగీకారానికి రావాలని కోరారు. ఈ డిమాండ్ల తర్వాత నాలుగు రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఇందుకు బదులుగా హమాస్ తమ చెరలో ఉన్న 50 మందిని విడుదల చేయడానికి ఒప్పుకుంది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో గాజా వైపు 15,000 మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1,200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: Israel-Hamas war: 24 మంది బందీలకు స్వేచ్ఛ -
హమాస్‌తో డీల్.. ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం
టెల్ అవీవ్: ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందం కుదిరింది. 50 మంది బందీలను కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ నాలుగు రోజుల కాల్పుల విరమణకు అంగీకరించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ కేబినెట్ తీర్మాణాన్ని ఆమోదించింది. హమాస్‌తో యుద్ధం ప్రారంభమైన నాటినుంచి కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించడం ఇదే మొదటిసారి. ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారిలో మహిళలు, పిల్లలను కాపాడుకోవడానికి ఈ ఒప్పందం ఉపయోగపడనుంది. ప్రతి రోజూ 12 మంది చొప్పున విడుదల చేసేలా అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇందుకు అంగీకరించింది. తమ చెరలో ఉన్న పాలస్తీనా మహిళలు, పిల్లలను విడుదల చేయడానికి కూడా ఇజ్రాయెల్ ఒప్పుకుంది. గాజాకు అధిక మొత్తంలో ఇంధన, మానవతా సాయం అందడానికి కూడా అనుమతించింది. అటు.. హమాస్ చెరలో దాదాపు 240 మంది ఇజ్రాయెల్ వాసులు బందీలుగా ఉన్నారు. ఇందులో 40 మంది చిన్నారులు కూడా ఉన్నారని హమాస్ పేర్కొంది. ఒప్పందం ప్రకారం గాజాపై దాడులు తాత్కాలికంగా నిలిపివేస్తామని ఇజ్రాయెల్ అధికారి తెలిపారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభం అయింది. హమాస్‌ను అంతమొందించాలనే ధ్యేయంతో ఇజ్రాయెల్ పాలస్తీనాపై ఎడతెరిపిలేని యుద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఉత్తర గాజాను పూర్తిగా ఖాలీ చేయించింది. ప్రస్తుతం దక్షిణ గాజాపై యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఇజ్రాయెల్‌వైపు 1200 మంది మరణించారు. పాలస్తీనా వైపు 12,700 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: బందీలకు ఇక విముక్తి! -
Gaza: హమాస్ కీలక ప్రకటన
ఇజ్రాయెల్‌తో యుద్ధంలో.. హమాస్ కీలక ప్రకటన చేసింది. తమ చెరలో ఉన్న బందీల్లో కొందరు విదేశీయులను వదిలిపెట్టేందుకు అంగీకరించింది. అంతర్జాతీయ సమాజం నుంచి వస్తోన్న ఒత్తిళ్ల మేరకే హమాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ బలగాలను మాత్రం వదిలే ప్రసక్తే లేదని హమాస్ స్పష్టం చేసింది. హమాస్ సైనిక విభాగం ప్రతినిధి అబు ఒబీదా మంగళవారం ఓ మీడియా సంస్థ ద్వారా మాట్లాడుతూ.. ‘‘రానున్న రోజుల్లో కొందరు విదేశీయులను విడిచిపెడతాం. ఈ విషయాన్ని మధ్యవర్తిత్వం వహిస్తున్న వారికి తెలియజేశాం. మాపై దాడులు చేస్తోన్న ఇజ్రాయెల్ సైన్యాన్ని విడిచిపెట్టేది లేదు. గాజా ప్రాంతాన్ని వాళ్లు నాశనం చేశారు. కాబట్టి, ఇజ్రాయెలీ సైనికులు, సైన్యాధికారుల్ని చంపి అక్కడే పాతేస్తాం. వాళ్ల మృతదేహాలతో గాజా అతిత్వరలో శ్మశానంగా మారబోతోంది’’ అని అన్నారు. అక్టోబర్ 7న హమాస్ బలగాలు రాకెట్ లాంఛర్లతో ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేశాయి. సరిహద్దులోని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని.. దాదాపు 240 మందిని అపహరించి గాజాలో తమ బందీలుగా చేసుకుంది. వాళ్లలో ఇజ్రాయెల్ పౌరులు, సైనికులతో పాటు విదేశీయులు కూడా ఉన్నారు. వీళ్లను విడిపించాలని ఇజ్రాయెల్‌లో నిరసనలను తారాస్థాయికి చేరాయి. శాంతియుతంగా బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో హమాస్‌ను సర్వనాశనం చేసి మరీ బంధీలను విడిపిస్తామని ఇజ్రాయెల్ ప్రతిన బూనింది. గాజా స్ట్రిప్‌పై విరుచుకుపడుతోంది. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దాడి కారణంగా ఇప్పటి వరకు 8,525 మంది మృతి చెందినట్లు హమాస్ ఆధీనంలోని గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. మృతి చెందిన వారిలో 3,500 మంది చిన్నారులే ఉన్నట్లు పేర్కొంది. పలు దేశాల మధ్యవర్తిత్వం వల్ల ఇప్పటి వరకు హమాస్ నలుగురిని విడిచిపెట్టగా.. ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన గ్రౌండ్ ఎటాక్స్‌లో మరొకరు హమాస్ చెర నుంచి విముక్తి పొందారు. -
ఇద్దరు అమెరికన్లను విడుదల చేసిన హమాస్.. త్వరలోని మరికొందరు!
తమ వద్ద బందీగా ఉన్న ఇద్దరు అమెరికన్లను హమాస్ మిలిటెంట్లు విడుదల చేశారు. తమ అధీనంలో ఉన్న బందీలుగా ఉన్న ఇద్దరు అమెరికన్లను విడుదల చేశామని హమాస్ సైనిక విభాగం అధికార ప్రతినిధి ఒకరు శుక్రవారం ప్రకటించారు. మానవతా దృక్పథంతో అమెరికాలోని చికాగో ప్రాంతానికి చెందిన తల్లీకూతుళ్లు జుడిత్ తై రానన్(59), నటాలీ శోషనా రానన్ను(17) వదిలేసినట్లు ఆయన తెలిపారు. అయితే వారిని ఎప్పుడు, ఎక్కడ విడుదల చేశారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు రెండు వారాల తర్వాత విడుదల హమాస్ మిలిటెంట్ల స్థావరం నుంచి వీరిద్దరూ శుక్రవారం రాత్రికి ఇజ్రాయెల్‌కు చేరుకున్నట్లు ఒట్టావా ప్రభుత్వం తెలిపింది. కాగా అక్టోబర్ 7న ఇజ్రాయెల్-గాజా సరిహద్దు సమీపంలోనినహాల్ ఓజ్ కిబ్బట్స్నుంచి తల్లి కూతుళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో వారిద్దరూ ఇజ్రాయెల్‌లో హాలీడ్ నిమిత్తం ఉన్నట్లు తెలిసింది. దాదాపు రెండు వారాలపాటు మహాస్ చెరలో ఉన్న ఇద్దరు అమెరికన్లు విడుదలైన అనంతరం గాజా సరిహద్దులో ఇజ్రాయెల్ రాయబారి కలుసుకున్నారు. సెంట్రల్ ఇజ్రాయ్లోని సైనిక స్థావరానికి తీసుకెళ్లి వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. చాలా సంతోషం: బైడెన్ ఇద్దరు అమెరికన్ల విడుదలపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ ఈ వార్త తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. విడుదలైన తర్వాత ఇద్దరు మహిళలతో బిడెన్ ఫోన్లో మాట్లాడారు. తల్లీకూతుళ్లు సురక్షితంగా విడుదలపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నటాలీ రానన్ చాలా బాగుందని, చాలా సంతోషంగా కనిపిస్తుందని ఇల్లినాయిస్లోని ఆమె తండ్రి యురి రానన్ పేర్కొన్నారు. కుమార్తెతో ఫోన్లో మాట్లాడినట్లు ఆయన చెప్పారు. హమాస్ వద్ద బందీలుగా ఇంకా అనేకమంది ఉన్నారని, వారి విడుదల కోసం తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్పారు. చదవండి: భారత్‌లో దౌత్యవేత్తల తొలగింపు.. కెనడాకు మద్దతుగా అమెరికా, బ్రిటన్ ఇదిలా ఉండగా హమాస్ మరింతమంది బందీలను విడిపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాళ్ల పౌరులను వదిలిపెట్టేందుకు ఖతార్, ఈజిస్ట్తో కలిసి పనిచేస్తున్నట్లు హమాస్ పేర్కొంది. అయితే హమాస్ అధీనంలో దాదాపు 200 మంది ఇజ్రాయెల్ పౌరులు బందీలు ఉన్నారు. కాగా హమాస్ మిలిటెంట్లు ఈ నెల 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. 20 నిమిషాల్లోనే అయిదు వేల రాకేట్లతో విరుచుపడింది. వెంటనే ఇజ్రాయెల్ కూడా హమాస్‌పై యుద్ధం ప్రకటించింది. గత 15 రోజులుగా ఇరువర్గాల మధ్య ఆధిపత్యపోరు తీవ్రంగా సాగుతోంది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజాలో 4,137 మంది మృతిచెందగా.. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా బలయ్యారు. -
Israel-Hamas war: హమాస్ రాక్షసత్వం
టెల్ అవీవ్: ప్రఖ్యాత రచయిత్రి జేకే రౌలింగ్ రచించిన హ్యారీ పోట్టర్ పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందాయి. చిన్నపిల్లలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇజ్రాయెల్‌కు చెందిన 12 ఏళ్ల బాలిక నోయా డాన్ ఆటిజం బాధితురాలు. ఆమెకు హ్యారీ పోట్టర్ సాహసాలంటే చెప్పలేనంత ఇష్టం. ఈ సిరీస్‌లో వచ్చిన పుస్తకాలన్నీ చదివేసింది. ఈ నెల 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు నోయా డాన్‌ను అపహరించారు. ఆమె నాన్నమ్మతోపాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులు బందీలుగా గాజాకు చేరారు. వారంతా ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో తెలియరాలేదు. అసలు బతికున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. ఆటిజం బాధితురాలైన నోయా డాన్‌ను విడుదల చేయాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం హమాస్‌ను కోరింది. హ్యారీపోట్టర్ పాత్రధారి ఆహార్యంతో ఉన్న నోయా డాన్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ పోస్టును ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది షేర్ చేశారు. హమాస్ చెర నుంచి నోయా డాన్‌ను విడిపించేందుకు చొరవ చూపాలంటూ జేకే రౌలింగ్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. జేకే రౌలింగ్ వెంటనే స్పందించారు. హ్యారీ పోట్టర్ అభిమాని కిడ్నాప్ అయ్యారని తెలుసుకొని చలించిపోయారు. ఆమెకు విముక్తి కలి్పంచాలని హమాస్‌ను అభ్యరి్థంచారు. నోడా డాన్ క్షేమంగా తిరిగిరావాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రౌలింగ్ ప్రతిస్పందన తర్వాత ఇజ్రాయెల్ వ్య«థకు నోయా డాన్ ఒక ప్రతీకగా మారిపోయారు. ఇజ్రాయెల్ పౌరులంతా ఆమె గురించి చర్చించుకున్నారు. క్షేమంగా తిరిగిరావాలని ఆకాంక్షించారు. కానీ, ఇంతలోనే దుర్వార్త వినాల్సి వచ్చింది. నోయా డాన్తోపాటు ఆమె నాన్నమ్మ కార్మెలా మృతదేహాన్ని బుధవారం గాజాలో గుర్తించినట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. నోయా డాన్ ఇక లేదని తెలిసి ఇజ్రాయెల్ ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు. బాలికను హమాస్ మిలిటెంట్లు హత్య చేసినట్లు తెలుస్తోంది. ‘‘అమ్మా, నాకు చాలా భయమేస్తోంది. ఎవరో బూచాళ్లు మన ఇంట్లోకి వచ్చారు. వెంటనే వచ్చి నన్ను నీతో తీసుకెళ్లు’’.. బయటకు వెళ్లిన తన తల్లితో ఫోన్లో నోయా డాన్ చివరి సంభాషణ ఇది. -
ఇజ్రాయెల్ దాడుల్లో బందీల మృతి
గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో తమ ఆధీనంలో ఉన్న బందీలు మరణించినట్లు హమాస్ ప్రకటించింది. గడచిన 24 గంటల్లో గాజా స్ట్రిప్ ఉత్తర భాగంలో ఈ దాడులు జరగ్గా వేర్వేరు ప్రాంతాల్లోని మొత్తం 13 మంది బందీలు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. వీరిలో ఇజ్రాయెల్ పౌరులతోపాటు విదేశీయులు కూడా ఉన్నట్లు వెల్లడించింది. హమాస్ గత శనివారం ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేసి సుమారు 150 మందిని బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. ఈ బందీల్లో సాధారణ పౌరులు, విదేశాలకు చెందిన వారూ ఉన్నారు. బందీలను హమాస్ చెర నుంచి తప్పించేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సైనికులు కృషి చేస్తూనే హమాస్ బలగాలను మట్టుబెట్టేందుకూ తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గాజా మొత్తంపై బాంబుల వర్షం కురిపిస్తోంది. గాజా స్ట్రిప్ జనాభా దాదాపు 24 లక్షలు. ఇజ్రాయెల్ బాంబు, క్షిపణి దాడులు విపరీతమైన ఆస్తినష్టాన్ని మిగులుస్తున్నాయి. భవనాలు నేలమట్టం అవుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. ఇజ్రాయెల్ ఇప్పటివరకూ గాజాపై జరిపిన దాడుల్లో 1500 మంది మృతి చెందారు. అందులో 500 మంది చిన్నారులే ఉన్నట్లు హమాస్ మీడియా కార్యాలయం ప్రకటించింది. మరోవైపు గాజా పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిపే దాడులకు.. ప్రతిగా బందీలను హతమారుస్తామంటూ హమాస్ ప్రకటించినప్పటికీ.. ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో.. నీటి, కరెంట్ సరఫరాను నిలిపివేసింది. తాజాగా గాజాను ఖాళీ చేయాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఐక్యరాజ్య సమితి మాత్రం ఇజ్రాయెల్ రక్షణ దళం ఆదేశాలు ఆచరణ సాధ్యం కాదని.. అది కల్లోలానికి దారి తీస్తుందని చెబుతోంది. -
పాకిస్తాన్లో రెచ్చిపోయిన తాలిబన్లు.. పోలీస్ స్టేషన్‌ను సీజ్ చేసి..
ఇస్లామాబాద్: తాలిబన్ మిలిటెంట్లు పాకిస్తాన్లో రెచ్చిపోయారు. ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని ఓ పోలీస్ స్టేషన్‌ను నిర్భంధించారు. అంతేకాదు ఉగ్రవాద వ్యతిరేక శాఖ భద్రతా సిబ్బందిని స్టేషన్లో బంధించారు. ఆదివారం ఈ ఘటన జరిగింది. అయితే స్టేషన్లో ఉన్న తమవాళ్లను విడిపించుకునేందుకే తాలిబన్లు ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌ను పూర్తిగా తమ నియంత్రణలో ఉందని, 9 మంది సిబ్బందిని బంధించినట్లు తాలిబన్లు ఓ వీడియో విడుదల చేశారు. వాళ్లను విడిచిపెట్టాలంటే తమను క్షేమంగా దేశం దాటించి అఫ్గానిస్తాన్ చేరుకునేందుకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తాలిబన్లు స్టేషన్‌ను తమ నియంత్రణలోకి తీసుకున్న అనంతరం పాకిస్తాన్ సైన్యం రంగంలోకి దిగింది. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. తాలిబన్లు బయటి నుంచి దాడి చేశారా? లేక స్టేషన్ లోపలికి వెళ్లి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారా? అనే విషయంలో స్పష్టత లేదు. వారి చెర నుంచి అధికారులను విడిపించేందుకు పాక్ సైన్యం ప్రయత్నిస్తోంది. చదవండి: ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి.. ఫ్యాన్స్ ఆగ్రహం.. ఫ్రాన్స్‌లో ఘర్షణలు.. -
పేదరికమే ఓ భస్మాసుర హస్తం
తల తాకట్టు పెట్టుకోవడమంటే ఇదేనేమో! ఆ తలకే విలువ లేకపోతే? ఆ తల పేదరికంలో మునిగి ఉంటే? ఆ తల మీద పేదరికమే భస్మాసుర హస్తమైతే? సంతలో మనిషికి విలువ లేనప్పుడు ఏం అమ్ముకోవాలి? తనను నమ్మిన ప్రేమనే తాకట్టు పెట్టుకోవాలి.పేదరికాన్ని మించిన భస్మాసుర హస్తం ఉంటుందా! రాజస్తాన్‌లోని మారుమూల పల్లెటూరు. మట్టి గోడలు.. ఎర్రమన్ను నేల.. రెల్లు గడ్డి పైకప్పు.. పేదరికం ఆక్రమించుకున్న ఆ గుడిసెలో ఓ మూల సర్దుకొని ఉంటుంటాడు ధాను. తన ఇద్దరు పిల్లలు, వితంతు చెల్లెలితో కలిసి. ధానుకి భార్య ఉండదు. చనిపోతుంది. కొడుకు టీపు. పదేళ్లుంటాయి. ఏడేళ్ల కూతురు గున్ని. ఆ పిల్లల మంచీ చెడూ బాధ్యత వితంతు చెల్లెలిది. వీళ్లతో పాటు ఇంకో కుటుంబ సభ్యుడూ ఉంటాడు. భస్మాసుర్. వాడంటే ధానూ కొడుక్కి ప్రాణం. తండ్రి దగ్గర లేని చనువు భస్మాసుర్ దగ్గర ఉంటుంది. తన కష్టం, సుఖం, స్నేహితులు.. అల్లరి అంతా భస్మాసుర్తో చెప్పుకుంటుంటాడు టీపు. దొర.. దొంగ ఇంటి అవసరాల కోసం ధాను భూస్వామి దగ్గర అప్పు తీసుకుంటాడు. చెప్పిన టైమ్‌కి అప్పు తీర్చడు. భూస్వామి కంట పడకుండా తప్పించుకు తిరుగుతుంటాడు. ఊరు నిద్రపోయాక ఇంటికొస్తాడు. ఊరు నిద్రలేవక ముందే బయటకు వెళ్లిపోతుంటాడు. బలాదూర్‌గా తిరుగుతుంటాడు కాబట్టి.. ఊళ్లో ఏది పోయినా.. అది ధాను పనే అంటూ అతనిని దొంగగా చిత్రీకరిస్తారు. ఇంకా అప్పు చెల్లించలేదని ధాను మీద దొంగతనం మోపి పోలీసులకు పట్టిస్తాడు భూస్వామి. పూచీకత్తు మీద ఆ తెల్లవారి ఇంటికి వస్తాడు ధాను. చేతిలో పైసా ఉండదు. అప్పు తీర్చాలి. చెల్లెలితో గోడు వెళ్లబోసుకుంటాడు. అన్నకు సలహా ఇవ్వడానిక్కూడా ఆమెకు దారీతెన్నూ కనిపించదు. ఇంట్లో విలువైన వస్తువులున్నా తాకట్టు పెట్టొచ్చు. తన ఒంటిమీద వీసం బంగారం ఉన్నా.. అమ్మి ఎంతోకొంత సహాయ పడొచ్చు. భర్త ఆత్మహత్య చేసుకుంటే వచ్చి అన్న ఇంట్లో ఉంటోంది. తనదే ఒకరి మీద ఆధారపడ్డ బతుకు. అండగా ఎలా నిలబడగలదు? కుమిలిపోతుంటుంది. అటు ధానుకీ ఏమీ తోచదు. దిక్కులు చూస్తున్న అతనికి ఇంటి ముందున్న భస్మాసుర్ కనిపిస్తాడు. ‘‘భస్మాసుర్‌ను అమ్మేద్దాం’’ అంటాడు. విస్తుపోతుంది అతని చెల్లెలు. ‘‘టీపు ఒప్పుకుంటాడా?’’ ఆమె సందేహం. ‘‘తప్పదు.. ఒప్పించాలి’’ అవసరం అతనిది. భస్మాసుర్.. టీపు మాటే వింటాడు కాబట్టి తెల్లవారి టీపుని వెంట బెట్టుకుని మరీ పట్నానికి వెళ్లాలనుకుంటాడు ధాను. ఈ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ధాను కూతురు గున్నీ అక్కడే ఉంటుంది. ఫ్రెండ్స్‌తో ఆడుకుని దీపాలు పెట్టాక ఇల్లు చేరిన కొడుకుతో చెప్తాడు ధాను.. ‘‘ఉదయాన్నే పట్నం బయలుదేరుతున్నాం. త్వరగా పడుకో’’ అని. అనుబంధం పెంచిన దారి ఇంకా సూర్యుడు రాకముందే పట్నానికి బయలుదేరుతారు ధాను, టీపు.. భస్మాసుర్‌ను తీసుకొని. మేనత్త చపాతీలు చేసి మూట కట్టిస్తుంది. తల్లి కట్టుకున్న చీరల చిరుగు ముక్కలతో తయారుచేసుకున్న జెండా కర్రను వెంట పెట్టుకుంటాడు టీపు. అమ్మ జ్ఞాపకంగా. ఎప్పుడో తన ఫ్రెండ్ ఇచ్చిన నల్ల కళ్లద్దాలను కూడా. టాటా చెప్పడానికి అత్తతో పాటు బయటకు వచ్చిన చెల్లి.. టీపుకి సైగ చేస్తుంది.. ‘‘భస్మాసుర్ని అమ్మేస్తున్నాడు నాన్న’’ అంటూ. ఒక్కసారిగా దిగులు టీపూలో. అన్న బాధ గున్నీకి అర్థమవుతుంది. మౌనంగా తండ్రిని అనుసరిస్తాడు టీపు. మొహంలో భావాలేవీ బయటపడనివ్వకుండా. కాలి నడకన ప్రయాణం. అసలు కథంతా ఇక్కడే. మధ్యాహ్నం వేళ.. తెచ్చుకున్న తిండి తింటారు. భస్మాసుర్కి కొసరి కొసరి తినిపిస్తుంటాడు టీపు. వాడలా భస్మాసుర్‌ను ముద్దు చేయడం.. గోముగా హత్తుకోవడం.. అన్నీ చూస్తుంటాడు ధాను. భోజనం అయ్యాక మళ్లీ నడక మొదలుపెడ్తారు. మధ్య మధ్యలో కొడుకు కర్రకున్న చీరల చిరుగులను ఆప్యాయంగా తడుముకోవడమూ గమనిస్తుంటాడు తండ్రి. అంతా కొత్తగా అనిపిస్తుంటుంది ధానూకి. అసలు కొడుకును ఎప్పుడూ అంత దగ్గరగా.. అంత పరిశీలనగా చూడలేదు అతను. వాడితో అదే మొదటి పరిచయంగా తోస్తుంది. చీకటి పడ్తుంది. ఓ చోట సేద తీరుతారు. తెల్లవారుతుంది. మళ్లీ నడక. అలసట.. ధానులో ఓపికను చంపేస్తుంది. కోపాన్ని పుట్టిస్తుంది. కొడుకును కొడ్తాడు. వాడు భస్మాసుర్‌ను పట్టుకొని ఏడుస్తాడు. భస్మాసుర్ కళ్లతోనే వాడిని ఓదారుస్తాడు. కోపం తగ్గాక పశ్చాత్తాప్పడ్తాడు ధాను. కొడుకును దగ్గరకు తీసుకుంటాడు. భయంగా.. బెరుకుగానే ఉంటాడు టీపు. ఆకలివేళ అవుతుంది. కిందటి రోజు తెచ్చుకున్న భోజనం ఎండవేడికి పాడైపోతుంది. ఖాళీ కడుపుతోనే నడకసాగిస్తారు. దాహంతో నోరు పిడచకట్టుకు పోతుంటుంది. గొంతు తడుపుకోవడానికి చుక్క నీరుండదు. ఉసూరుమంటూ ఓ నీడకు చేరుతారు. ప్రేమగా కొడుకు తలను నిమురుతాడు ధాను. శ్రమ తెలియనివ్వకుండా తన చిన్నప్పటి సంగతులను కొడుకుతో పంచుకుంటాడు. తన అల్లరి.. తండ్రి చీవాట్లు.. చేసిన బోధ.. అన్నీ కొడుకుతో చెప్తాడు. వాడు ఆసక్తిగా వింటాడు. ఈసారి కొడుక్కి తండ్రి కొత్తగా కనపడటం మొదలుపెడ్తాడు. అప్పటిదాకా వాడి మెదడులో కోపిష్టి.. దొంగ.. సోమరిపోతుగా ఉన్న తండ్రి ఇమేజ్ మెల్లగా కరగడం మొదలౌతుంది. ఆశ కూడా మొలకెత్తుతుంది.. తండ్రి మనసు మారి భస్మాసుర్‌ను అమ్మబోడేమోనని. మొత్తానికి తండ్రీ కొడుకులు అపార్థాలు తొలగించుకుంటూ.. అసలైన అనుబంధాన్ని ఆస్వాదిస్తూ.. కొత్త ఊహలకు రెక్కలు తొడుగుతూ పట్నానికి చేరుకుంటారు. పట్నంలో ప్రతి మలుపునూ.. ప్రతి దారినీ వింతగా చూస్తున్న కొడుకు సంబరం.. తండ్రికి ముచ్చటగా ఉంటుంది. బజారుకు తీసుకెళ్తాడు. దుకాణాలు.. మిఠాయీలు.. రంగుల రాట్నం.. ఒంటెల బండీ.. పిల్లల ఆటలు.. అన్నీ టీపుకు ఉత్సాహాన్నిస్తుంటాయి. కుతూహలాన్ని కలుగజేస్తుంటాయి. కొడుకు కోసం తినడానికి ఏదైనా తేవాలనుకుంటాడు ధాను. టీపుని ఓ అరుగు మీద కూర్చోబెట్టి ఓ దుకాణానికి వెళ్తాడు. అక్కడున్న చాక్లెట్ డబ్బా చూపిస్తూ నాలుగు చాక్లెట్లు ఇవ్వమంటాడు. డబ్బులివ్వమంటాడు దుకాణదారు. ‘‘పల్లె నుంచి వచ్చాం.. డబ్బుల్లేవు. నా పిల్లాడు ఆకలిగా ఉన్నాడు.. దయచేసి ఇవ్వండి’’ అని బతిమాలుతాడు ధాను. చీదరించుకుంటాడు యజమాని. అటూ ఇటూ చూసి.. డబ్బాలోని చాక్లెట్లు తీసుకొని పరిగెడ్తాడు ధాను. అతని వెంట పడ్తాడు యజమాని. ధానూని పట్టుకోబోతుంటే అతని చేతిలో ఉన్నవి కిందపడ్తాయి.. చాక్లేట్లు కావు చాక్లేట్ రాపర్స్ అవి. వెనక్కి తిరిగి వెళ్లిపోతాడు దుకాణదారు. వీడ్కోలు భస్మాసుర్‌ను అమ్మేస్తాడు ధాను. వచ్చిన డబ్బులోంచి కొంత తీసి కొడుక్కి షూ కొంటాడు. లాడ్జ్‌కి తీసుకెళ్తాడు. ‘‘స్నానం చేసి రెడీ అయ్యి.. షూ వేసుకో.. బయటకు వెళ్దాం’’అని షూ ఇస్తాడు. వాటిని చూసి వాడి కళ్లలో మెరుపు. ఆత్రంగా వేసుకుంటాడు. మంచి హోటల్‌కి తీసుకెళ్లి వాడికి ఇష్టమైనవి తినిపిస్తాడు తండ్రి. కొడుకును దగ్గర కూర్చోబెట్టుకుని భస్మాసుర్‌ను గుర్తు చేసుకుంటూ ‘‘మన కుటుంబపు పెద్దలా ఆదుకున్నాడు. మనల్ని తండ్రిలా చూసుకున్నాడు కదా..’’ అంటాడు కొడుకుతో. కళ్లనిండా బాధతో అవునన్నట్టుగా తలూపుతాడు టీపు. ‘‘నిన్నూ వాళ్లు బాగా చూసుకుంటారు. నీకే లోటూ రానివ్వరు’’ చెప్తాడు ధాను! అంటే.. భస్మాసుర్‌ను అమ్మేసినట్టుగా తననూ ఎవరింట్లోనో పెడ్తున్నాడన్నమాట. తండ్రి పరిస్థితి అర్థమవుతుంది టీపుకి. దీనంగానే వీడ్కోలు పలికి ట్రాలీలో తన కొత్త చిరునామాకు బయలుదేరుతాడు టీపు. కొడుకు వదిలేసిన చీర చెరుగుల కర్ర ఊతంతో ఊరి దారి పడ్తాడు ధాను. పేదరికాన్ని జయించే శక్తి ఈ సినిమాలో భస్మాసుర్.. పెంపుడు గాడిద. పేదరికంలో మనుషులు దరి చేరరు. జంతువులే మచ్చికవుతాయి. ఆ చెలిమే పేదరికాన్ని జయించే శక్తినిస్తుంది. మనుషుల్లో ఆ స్థయిర్యం నింపడం కోసం త్యాగానికీ సిద్ధపడ్తాయి. ఇదే భస్మాసుర్ కథ. దానివల్లే ఆ కుటుంబం నిలబడుతుంది. తండ్రి కొడుక్కి, కొడుకు తండ్రికీ అర్థమవుతాడు. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై పలువురి ప్రశంసలూ అందుకుంది భస్మాసుర్. – సరస్వతి రమ -
ఐఎస్ అపహరించిన 39 మందిని చంపేశారు
-
ఆ 39 మందిని చంపేశారు
న్యూఢిల్లీ: ఇరాక్‌లో నాలుగేళ్ల క్రితం ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు అపహరించిన భారతీయుల కథ విషాదాంతమైంది. ఆ 39 మంది భారతీయులు చనిపోయారని, వారి మృతదేహాలను గుర్తించామని కేంద్రం ప్రకటించింది. వారిని ఉగ్రవాదులు ఊచకోత కోసి మోసుల్ పట్టణం సమీపంలోని బదోష్ అనే గ్రామంలో పూడ్చిపెట్టినట్లు గుర్తించామని తెలిపింది. డీఎన్ఏ పరీక్షల అనంతరం వారు అపహరణకు గురైన భారతీయులేనని నిర్ధారణకు వచ్చినట్లు మంగళవారం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రాజ్యసభకు తెలిపారు. లోక్‌సభలోనూ సుష్మ ఈ విషయం ప్రకటించాల్సి ఉన్నా ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య సభ వాయిదా పడింది. అయితే, ఈ విషయాన్ని ముందుగా బాధిత కుటుంబ సభ్యులకు తెలపకుండా, సభలో ప్రకటించడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. బాధిత కుటుంబాల పట్ల ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తించిందని విమర్శించాయి. భారతీయుల అపహరణ విషయంలో ప్రభుత్వం ఇన్నాళ్లూ వారిని తప్పుదోవ పట్టించిందని ఆరోపించాయి. బాధిత కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 2014లో మోసుల్ పట్టణం ఐఎస్ ఉగ్రవాదుల అధీనంలో ఉండగా.. మొత్తం 40 మంది భారతీయులు అపహరణకు గురవగా, వారిలో ఒకరు బంగ్లాదేశ్‌కు చెందిన ముస్లింనని చెప్పుకుని సురక్షితంగా బయటపడ్డాడు. లాంఛనాలు పూర్తిచేసి 39 మంది భారతీయుల మృతదేహాలను స్వదేశం తీసుకురావడానికి 10 రోజులు పట్టొచ్చని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ చెప్పారు. మట్టి దిబ్బ కింద మృతదేహాలు.. ‘విస్పష్ట ఆధారాలు లభించే వరకూ ఎవరూ చనిపోయారని ప్రకటించనని ఇదివరకే చెప్పా. కచ్చితమైన నిర్ధారణ అనంతరమే ఈ ప్రకటన చేస్తున్నా. కార్మికుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించి, ఇక వారి నిరీక్షణకు ముగింపు పలకబోతున్నామని భారమైన హృదయంతో చెబుతున్నా’ అని సుష్మ భావోద్వేగంతో పేర్కొన్నారు. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ ఎలా జరిగిందో సుష్మ వివరించారు. ‘ఐఎస్ చెర నుంచి మోసుల్ విముక్తమైన తరువాత స్థానిక అధికారుల సాయంతో గాలింపును విస్తృతం చేశాం. మోసుల్ దగ్గర్లోని బదోష్ గ్రామంలోని ఒక మట్టిదిబ్బ కింద చాలా మంది మృతదేహాలను ఉగ్రవాదులు పూడ్చిపెట్టినట్లు మాకు సమాచారం అందింది. రాడార్ సాంకేతికతతో అది నిజమేనని గుర్తించాం. ఆ మృతదేహాలను వెలికితీశాం. ఆ మృతదేహాలు గల్లంతైన భారతీయులవేనని ధ్రువీకరించడం చాలా కష్టమైంది. మట్టి దిబ్బ కింద ఒకరి శరీరంపై మరో శరీరాన్ని పూడ్చి ఉగ్రవాదులు క్రూరత్వం ప్రదర్శించారు. మృతదేహాల వద్ద లభించిన ఆధారాల సాయంతో వారు భారతీయులేనని ప్రాథమికంగా నిర్ధారించాం. అనంతరం డీఎన్ఏ పరీక్షల కోసం బాగ్దాద్ తరలించాం. ఆ పరీక్షల్లో 38 మంది డీఎన్ఏలు సరిపోలగా, ఒక వ్యక్తివి 70% వరకు సరిపోయాయి’ అని సుష్మ వివరించారు. మృతుల్లో 27 మంది పంజాబీలు, నలుగురు హిమాచల్ ప్రదేశ్, ఆరుగురు బిహార్, ఇద్దరు పశ్చిమ బెంగాల్ వాసులున్నారు. నేనేమీ దాయలేదు: సుష్మ మోసుల్‌లో భారత కార్మికుల అపహరణ వ్యవహారంలో తానేమీ దాయలేదని, ఎవరికీ కల్పిత హామీలు ఇవ్వలేదని సుష్మ తెలిపారు. ఉగ్రవాదుల చెర నుంచి తెలివిగా బయటపడ్డ హర్జీత్‌ను ప్రభుత్వం వేధించిందన్న ఆరోపణలను ఖండించారు. చావు విషయాల్లో కూడా కాంగ్రెస్ రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. డీఎన్ఏ సరిపోలిన మొదటి వ్యక్తి సందీప్ అని, చివరి, 39వ వ్యక్తి డీఎన్ఏ 70 శాతమే సరిపోలిందని, అతని తల్లిదండ్రులు చనిపోవడంతో ఇతర కుటుంబ సభ్యుల డీఎన్ఏతో ఆయన డీఎన్ఏను పోల్చినట్లు తెలిపారు. ఆ ఒక్కడు తప్పించుకున్నాడిలా.. 2014లో ఇరాక్‌లోని రెండో పెద్ద పట్టణమైన మోసుల్‌లో నిర్మాణరంగంలో కార్మికులుగా పనిచేస్తున్న మొత్తం 40 మంది భారతీయులు, మరికొందరు బంగ్లాదేశీయులను ఐఎస్ అపహరించింది. అందులో గురుదాస్‌పూర్‌కు చెందిన హర్జీత్ మాసిహ్ మాత్రం తాను బంగ్లాదేశీ ముస్లింనని చెప్పి తప్పించుకున్నాడు. మిగతా 39 మందిని ఐఎస్ ఉగ్రవాదులు చంపుతుండగా చూశానన్న హర్జీత్ మాటలను ప్రభుత్వం కొట్టిపారేసింది. ఆయనవి కట్టుకథలని ప్రకటించింది. బందీలను తొలుత ఓ వస్త్ర కర్మాగారంలో ఉంచి ఆ తరువాత బాదోశ్ గ్రామంలోని చెరసాలకు తరలించారు. ఓ కేటరింగ్ వ్యాపారి వెల్లడించిన వివరాల ప్రకారం..భోజనం చేసి తిరిగొస్తుండగా 40 మంది భారతీయులతో పాటు కొందరు బంగ్లాదేశ్ కార్మికులను ఐఎస్ ఉగ్రవాదులు బందీలుగా తీసుకున్నారు. వస్త్ర కర్మాగారంలో భారతీయులు, బంగ్లాదేశీయులను వేరుచేశారు. ఆ తరువాత బంగ్లాదేశీ కార్మికులను ప్రత్యేక వాహనంలో ఎర్బిల్‌కు తరలించారు. బంగ్లాదేశీయుడినని చెప్పుకున్న హర్జీత్..తన పేరు అలీ అని మార్చుకుని ఎర్బిల్ వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ నాలుగేళ్లలో.... ♦ జూన్ 15, 2014: ఇరాక్‌లోని మోసుల్‌లో 40 మంది భారతీయుల కిడ్నాప్.. బంగ్లాదేశీ ముస్లింనని చెప్పి ఐఎస్ నుంచి తప్పించుకున్న హర్జీత్ మాసిహ్ ♦ మే 15, 2015: అపహరించిన 5 రోజుల అనంతరం 39 మందిని ఒక కొండపైకి తీసుకెళ్లి వరుసగా నిలబెట్టి కాల్చి చంపారని చెప్పిన హర్జీత్.. ఇరాక్ నుంచి వచ్చాక తాను భారత్ దర్యాప్తు సంస్థల కస్టడీలో ఉన్నానని వెల్లడి. ♦ జూన్ 20, 2016: కిడ్నాపైన 39 మంది భారతీయులు సజీవంగా ఉన్నారన్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ♦ జూలై 2017: మోసుల్కు ఐఎస్ నుంచి విముక్తి. బదోష్ జైల్లో 39 మంది బందీలుగా ఉన్నారన్న సమాచారంతో ఇరాక్‌కు వెళ్లిన విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్. ♦ అక్టోబర్ 28, 2017: కిడ్నాపైన భారతీయుల బంధువుల నుంచి డీఎన్ఏ శాంపిల్స్ సేకరించిన అధికారులు ♦ మార్చి 20, 2018: ఆ 39 మంది భారతీయుల్ని ఉగ్రవాదులు ఊచకోత కోసి బదోష్ గ్రామంలో పూడ్చిపెట్టినట్లు పార్లమెంటులో ప్రకటన చేసిన సుష్మాస్వరాజ్. ఎందుకు దాచారు? చండీగఢ్: ఇరాక్‌లో భారతీయ కార్మికులు చనిపోయారని సుష్మా స్వరాజ్ రాజ్యసభలో చేసిన ప్రకటనను విన్న వెంటనే బాధిత కుటుంబాలు విషాదంలో మునిగాయి. ఇన్నాళ్లూ ఈ విషయాన్ని తమ వద్ద ఎందుకు దాచిపెట్టారని కేంద్రాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. తమవారు చనిపోయారని ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని పంజాబ్‌లోని బాధిత కుటుంబాల సభ్యులు తెలిపారు. ‘సుష్మా స్వరాజ్‌ను 12 సార్లు కలుసుకున్నాం. జాడ తెలియకుండా పోయిన భారతీయులంతా బతికే ఉన్నారని ఆమె ధైర్యం చెప్పారు. హర్జీత్ మాసిహ్ అబద్ధాలాడుతున్నాడని అన్నారు. ప్రభుత్వం తప్పుడు వివరాలు ఇవ్వడం కన్నా అసలు వారి వద్ద విశ్వసనీయ సమాచారం లేదని చెబితే బాగుండేది’ అని అమృత్‌సర్‌కు చెందిన ఓ మృతుడి సోదరుడు సార్వాన్ వాపోయాడు. యెమెన్‌లో కేరళ నర్సులను కాపాడిన ప్రభుత్వం పంజాబ్‌కు చెందిన కార్మికులను రక్షించడంలో విఫలమైందని ఆక్రోశం వెళ్లగక్కాడు. గల్లంతైన 27 ఏళ్ల మజీందర్ సింగ్ సోదరి గుర్పీందర్ కౌర్ కూడా ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. తొలుత వారంతా బతికే ఉన్నారన్న ప్రభుత్వం హఠాత్తుగా ఇలాంటి ప్రకటన చేయడమేంటని ఆవేదన చెందింది. ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వండి: హర్జీత్ తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు తనపై పెట్టిన మానవ అక్రమ రవాణా కేసును ఉపసంహరించుకోవాలని హర్జీత్ డిమాండ్ చేశారు. ఐఎస్ నిర్బంధంలోని కార్మికులు ఆనాడే చనిపోయారని నాలుగేళ్లుగా చెబుతున్నానన్నారు. పోలీసులు తనపై అక్రమంగా పెట్టిన కేసు వల్ల ఆరు నెలలు జైలులో గడిపి బెయిల్‌పై బయటికి వచ్చినట్లు తెలిపారు.