
టెల్‌అవీవ్:ఇజ్రాయెల్,హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు హమాస్‌పై చేసిన వ్యాఖ్యలు గాజాలో పరిస్థితిని మళ్లీ మొదటికి తెచ్చేలా ఉన్నాయి. బందీలుగా ఉన్న తమ పౌరులను విడుదల చేయకపోతే హమాస్‌ను లేకుండా చేస్తామని,హమాస్ ఉగ్రవాదులకు నరకం గేట్లు తెరుస్తామని నెతన్యాహు తాజాగా వార్నింగ్ ఇచ్చారు.్హ
హమాస్‌ను పూర్తిగా నిర్మూలించడంపై తమ వద్ద ఉన్న వ్యూహాన్ని ఇప్పుడే వెల్లడించలేమన్నారు. అమెరికా కూడా ఇందుకు సహకరిస్తుందన్నారు. ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చిన అమెరికా స్టేట్ సెక్రటరీ మార్కో రుబియోతో కలిసి ఆదివారం నెతన్యాహు మీడియాతో మాట్లాడారు.
గాజాలో హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు దాని ప్రభుత్వాన్ని లేకుండా చేస్తామని రుబియో చెప్పారు. హమాస్ వద్ద బందీలుగా ఉన్న తమ వారిని సురక్షితంగా తీసుకువస్తామని నెతన్యాహు అన్నారు. అయితే తాజాగా రఫాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ముగ్గురు హమాస్ ప్రతినిధులు చనిపోయారు. దీనిపై హమాస్ ఆగ్రహంగా ఉంది.
రెండో దశ కాల్పుల విరమణకుగాను మళ్లీ చర్చలు జరగాలని, కాల్పుల విరమణతో పాటు గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెళ్లిపోవాలని హమాస్ అంటోంది.ఇప్పటికే కుదిరిన తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ ఇప్పటికే పలువురు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment